జ‌గ‌న్మోహినీ మందుల షాపు

 

ఈ క‌థ కేవ‌లం క‌ల్పితం ఎవ‌ర్నీ ఉద్దేశించి వ్రాసింది కాదు.

అదివొక మందుల షాపు. పెద్ద అక్ష‌రాల‌తో జ‌గ‌న్మోహినీ మందుల షాపు అనే బోర్డు ఉంటుంది. మాధ‌వ‌య్య కూర్చుని ప్రిస్ర్కిప్ష‌న్ చూసి కుర్రాడికి చెప్పి మందులు ఇప్పిస్తూ ఉంటాడు. ప‌క్క‌నే ఒక చిన్న డిస్పెన్న‌రీ. గోళ్ళ‌మూడి కేశ‌వ‌రావు అనే డాక్ట‌ర్ బోర్డు మీద ఉన్న త‌న పేరుని చూస్తూ కూర్చుంటాడు. కాసేపు గోళ్ళుగిల్లుకుని కాసేపు కాగితం ముక్క‌లు చింపీ అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉంటాడు. ఇంత‌లో ఒకత‌ను అటుగా వ‌చ్చాడు. కేశ‌వ‌రావు ఆనందంగా లేచి అత‌న్ని రెండు చేతులూ ప‌ట్టుకుని ఆహ్వానిస్తాడు.

డాక్ట‌రు  -  రండి.  రండి స్వాగ‌తం స్వాగతం. ఎవ‌రికి జ‌బ్బు మీకా, మీ ఆవిడ‌కా ? ఇక్క‌డే చూపించు కుంటారా ఇంటికి ర‌మ్మంటారా ?
అని కంగారుగా ప్ర‌శ్నించాడు. అత‌నికి కొంచెం చెవుడు. ఇదేం ప‌ట్టించుకోడు. తాపీగా వ‌చ్చి కుర్చీలో కూర్చుంటాడు.

అత‌ను  -  ఊ  - ఇంకీ నీ పేరేమిటి ?

డాక్ట‌ర్ ఉలిక్కిప‌డ‌తాడు. ఏక‌వ‌చ‌నంతో సంబోధిస్తున్నందుకు కోపం వ‌స్తుంది

డాక్ట‌రు  -  డా || కేశ‌వ‌రావు

అత‌ను -   (న‌వ్వి)  మీ నాన్న‌కి ముందే తెలుసుల్లే వుంది కేసుల్రావ‌ని పేరు పెట్టాడు.

డాక్ట‌రుకి కోపం హెచ్చి మెల్ల‌గా అత‌నిక్క‌నిపించ‌కుండా జుట్టు పీక్కుంటాడు. వ‌చ్చిన‌త‌ను ఇత‌ణ్ణి ప‌ట్టిప‌ట్టి చూస్తాడు.

అత‌ను  -  ఊ అవే ల‌క్ష‌ణాలు

డాక్ట‌రు   -  ఏం ల‌క్ష‌ణాలు....

అత‌ను  -  ఇవ‌న్నీ నీకు చెప్ప‌కూడ‌దుగాని ఏం మాట్లాడినా కాస్త గ‌ట్టిగా మాట్లాడు. నాక్కాస్త చెవుడు....

డాక్ట‌రు గ‌ట్టిగా అరుస్తాడు.

డాక్ట‌రు  -  ఇంత‌కీ మీ జ‌బ్బేమిటీ ?

అత‌ను  -  (న‌వ్వి)  నీలాంటివాళ్ళ జ‌బ్బులు కుద‌ర్చ‌టం....?

డాక్ట‌రు నీర‌సంగా కుర్చీలో కూల‌బ‌డ‌తాడు.

అత‌ను  -   ఇంత‌కీ ప్రాక్టీసు పెట్టి ఎన్నాళ్ళ‌య్యింది.

డాక్ట‌రు  -  మూడుళ్ళు.

అత‌ను  -   నెల‌కెన్ని కేసులు వ‌స్తాయి ?

డాక్ట‌రు  -  మూణ్ణెల్ల‌కి రెండు.

అత‌నేదో ఆలోచిస్తాడు త‌లూపుతాడు.

అత‌ను  -   ఆ ..... ఇంకా ముద‌ర లేదు. ప‌ర‌వాలే ! నే త‌గ్గిస్తాగా !

డాక్ట‌రు కంగారు ప‌డిపోతాడు త‌న ఒంటిని చూసుకుంటాడు. నాడి చూసుకుంటాడు.

డాక్ట‌రు   -   బాబోయ్ నేను బాగానే ఉన్నా నాకేం కాలేదు.

అత‌ను   -   కాలేదు క‌నక‌నే న‌యం చేస్తానంటున్నా. ఇప్పుడే ప్రారంభ ద‌శ‌లో వుంది.

డాక్ట‌ర్‌కి బాగా ఇరిటేష‌న్ వ‌స్తుంది. అరుస్తాడు, ఏడుస్తాడు.

డాక్ట‌రు   -  ఏమిటి ఏం వుంది. ఏం వ‌చ్చింది. ఏం ముద‌ర‌బోతోంది.

అత‌ను వ‌చ్చి జేబులోంచి ఏదో ఇంజ‌క్ష‌న్ తీసి చెయ్య‌బోతాడు. డాక్ట‌ర్ కంగారుగా బ‌య‌టికి ప‌రిగెత్తు కొచ్చి మందుల షాపులో దూర‌తాడు.

డాక్ట‌రు   -   మాధ‌వ‌య్య‌గారూ న‌న్ను మీరే ర‌క్షించాలి....

అత‌ను వెన‌కాల ప‌రిగెత్తుకొస్తాడు. ఇంజ‌క్ష‌న్ పుచ్చుకొని

అత‌ను -   ఇదుగో మాధ‌వ‌య్యా నా కేసులో నువ్వు క‌ల్పించుకోకు నేను చూసుకుంటాను.

డాక్ట‌రు గోల‌పెడ్తూ వుంటాడు.

మాధ‌వ‌య్య ఇద్ద‌రికీ మ‌ధ్య నుంచుంటాడు. అత‌నితో ఇలా అంటాడు.

మాధ‌వ‌య్య   -  ఏమండీ డాక్ట‌రు ప్ర‌జ్ఞామూర్తిగారు మీరిల్లా వ‌చ్చారేమిటి నేనిప్పుడే రెండు ఆప‌రేష‌న్ కేసుల్ని పంపిచాను.

డాక్ట‌రు కేశ‌వ‌రావు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతాడు.

డాక్ట‌రు   -  ఆ... అత‌ని పేరు ప్ర‌జ్ఞా మూర్తా. మంచి ప్ర‌జ్ఞానంతుడే...

ప్ర‌జ్ఞామూర్తి క‌ళ్ళల్లో ఆనందం

ప్ర‌జ్ఞా   -   ఆప‌రేష‌ను కేసులే అయితే నును వెంట‌నే వెళ్ళాలి ! వెధ‌వ ఇంజ‌క్ష‌న్ కేసునాకెందుకు ?  అయినా కేసుల్రావు ఇలా నాలుగ్గోడ‌ల మ‌ధ్య న‌ల్లుల్ని చంపుతూ కూర్చోకు. నాలాగా సంచార వైద్యుడివి అయి న‌లుగిరికీ మేలు చెయ్యి...

ప్ర‌జ్ఞామూర్తి వెళ్ళిపోతాడు.

మాధ‌వ‌య్య డాక్ట‌ర్ని ఓదారుస్తాడు.

మాధ‌వ‌య్య   -   ఏం ఫ‌ర్వాలేదు డాక్ట‌రుగారూ...ఇత‌నికి కాస్త మ‌తిస్థిమితం లేదు. డాక్ట‌రై కూడా న‌యాపైసా సంపాదించ‌టంలేద‌ని బాధ‌ప‌డీ ప‌డీ ఇలా అయ్యాడు. అందుకే ఖాళీగా కూర్చున్న డాక్ట‌ర్ల ద‌గ్గ‌రికి వ‌చ్చి వైద్యం చేస్తానంటాడు.

డాక్ట‌ర్ కేశ‌వ‌రావు ఉలిక్కిప‌డ్డాడు. మాధ‌వ‌రావుని బ్ర‌తిమిలాడాడు.

పండు  -  ఇవ్వాళా...ఇవ్వాళా  బంద్ తాత‌య్యా

మాధ‌వ‌య్య   -   బందేం లేదే... నిన్న‌క‌దా బందు. మా షాపు తీసే వుంచాంగా...

పండు ధీమాగా త‌లఊపి...

పండు  -    నిన్నా ఆంధ్రా బంద్‌. ఇవాళ భార‌త్ బంద్‌... రేపూ మా టీచ‌ర్సు క్లాసులు తీసుకోరంట‌.

అంతా న‌వ్వారు.

మాధ‌వ‌య్య  -  ఇంతున్నాడో లేదో రోజూ బంద్ బంద్ అంటూ పేర్లు చెప్తాడు. ఎన్ని ప్లాన్లో....

మందుల కోసం కొంద‌రు వ‌చ్చి ప్రిస్కిప్ష‌న్ ప‌ట్ట‌కుని అడుగుతున్నారు. కుర్రాడు మందులు తెచ్చి ఇస్తున్నాడు.

మాధ‌వ‌య్య  -  అందుకింకా ప్లానులున్నాయ్‌. వీడి పొట్ట‌లో. ఒక రోజు క‌డుపునెప్పి. ఓ రోసు గుండెల్లో నెప్పి అంటాడు. ఓసారి డొక్క‌ల్లో నొప్పి అన్నాడు. డొక్కంటే ఎక్క‌డో చూపించ‌మంటే మెడ చూపించాడు.

అంద‌రూ న‌వ్వుతారు.

ఒక‌డు   -   గ్లూకోజ్ బాట‌ల్స్ కావాలి.

డాక్ట‌రు  -  ప్రిస్కిప్ష‌న్ ఏది ?  నేనివ్వ‌నా ?

మాధ‌వ‌య్య  -  మా ద‌గ్గ‌ర బాటిల్స్ లేవు పాకెట్లున్నాయి.

వ‌చ్చిన‌త‌ను వెళ్ళిపోతాడు.

పండు  -  తాతయ్యా తాత‌య్యా పుల్ల‌మాత్రివ్వ‌వా
డాక్ట‌ర్ కేశ‌వ‌రావు పండు నెత్తిమీద చిన్న‌గా కొడ‌తాడు.

డాక్ట‌రు  -   పుల్ల‌మాత్త‌రంటే సి.విట‌మిన్ నువ్వు ప‌ల‌హారం చెయ్య‌కూడ‌దు.

పండు  -  సి . విట‌మిన్ పిల్ల‌ల‌కి చాలా అవ‌స‌ర‌మ‌ని మా టీచ‌రు చెప్పింది.

మాధ‌వ‌రావు న‌వ్వుతాడు.

మాధ‌వ‌య్య -   ఎప్పుడు చెప్పిందోయ్ నువ్వస‌లు స్కూలికెప్పుడూ డుమ్మాకాగా !

పండు  -   నే వెళ్ళిన‌ప్పుడు చెప్పింది.

మాధ‌వ‌య్య వాడికో సి విట‌మిన్ మాత్ర ఇస్తే చ‌ప్ప‌రిస్తాడు. మాధ‌వ‌య్య నాలుక క‌రుచుకున్నాడు.

మాధ‌వ‌య్య  -  అయ్యో పండూ.  ఇంత‌కీ అమ్మ ఏం మందు తెమ్మంది ?  ఆ చీటీ ఇలా ఇయ్యి.

పండు చీటీ ఇస్తాడు దాన్ని చూసి మాధ‌వ‌య్య కళ్ళు చిట్లించాడు. డాక్ట‌ర్ గ‌భాల్న ఆ చీటీ తీసుకుని గ‌ట్టిగా చ‌దివాడు.

డాక్ట‌రు  -   గార్డినాల్ ట్వెంటీ !  ఇది డాక్ట‌ర్స్ ప్రిస్క‌ప్ష‌న్ కాదు. నేను రాయ‌నా ?

మాధ‌వ‌రావు విసుగ్గా చూశాడు.

మాధ‌వ‌య్య  -  పంటూ మ‌మ్మీనే ర‌మ్మ‌ను ఇలాంటి మందులు చిన్న పిల్ల‌కివ్వ‌కూడ‌దు...

పండు  -  నేను పారెయ్య‌కుండా జాగ్ర‌త్త‌గా తీసుకువెడ‌తా...

మాధ‌వ‌య్య   -   వ‌ద్ద‌మ్మా  ....  మ‌మ్మీనే ర‌మ్మ‌ను.

పండు కాల్షియం శాండ‌జ్‌ అన్న డబ్బా చూసి ఆశ‌గా నాలుక బ‌య‌ట‌పెట్టి న‌వ్వుతాడు.

పండు   -  తాత‌య్యా మ‌మ్మీతో వ‌చ్చిన‌ప్పుడూ నాకు కాల్షియం శాండ‌జివ్వాలి మ‌రి...

కేశ‌వ‌రావు క‌ల్పించుకుంటాడు.

డాక్ట‌రు   -   అది కూడా సి విట‌మినే ఇప్పుడు తిన్నావ్‌గా ....

పండు త‌ల అడ్డంగా ఊపాడు.

పండు   -  ఊహు.  అందులో కాల్షియం ఉంటుంది. అది బోన్స్‌కి మంచిద‌నీ...మా

మాధ‌వ‌య్య    -   టీచ‌ర్ చెప్పిందిలే. వెళ్ళు అమ్మ‌తో నువ్వు రావొద్దులే. నేనే ఇంటికొచ్చేప్పుడు మాత్త‌ర్లు తెస్తాన‌ని చెప్పు...

కొంద‌రు మందులు కొన‌డానికి వ‌చ్చారు. పూల‌పిల్ల త‌ట్ట‌నిండా రోజాలు చామంతులూ పెట్టుకుని వ‌చ్చి బుట్ట‌దింపి కూర్చుంది. మాధ‌వ‌రావు  ఆ పూల‌వాస‌న‌ని ఆఘ్రాగిస్తూ ఆహా ఎంత బావున్నాయో రోజాలు, అని రోజాల‌ని చేతిలోకి తీసుకుని ప‌రీక్ష‌గా చూశాడు. ఒక పువ్వు ప‌ట్టుకుని.

మాధ‌వ‌య్య  -  ఇదుగో ఈ పువ్వు ఏమంటుందో తెలుసా.. ఈ వీధి చివ‌రున్న వెంక‌టేశ్వ‌రుడి పాదాల మీద వాలుతుందిట‌.

ఇలా అంటూ ఆ పువ్వుని టేబ‌ల్ మీద పెట్టారు.

పూల‌మ్మాయి న‌వ్వింది. డాక్ట‌రు న‌వ్వాడు. ప‌క్క‌వాళ్ళు ఏవో మందులడుగుతున్నారు.

ఏమండో క్లోరోస్ట్రెప్ ఇవ్వ‌రూ.

నాకు అర్జంటుగా లాక్టోలేట్ కావాలి.

కుర్రాడు  -   ఎల‌క్ట్రాల్ పౌడ‌రా సిర‌సా ?

అత‌ను   -    లాక్టోలేట‌య్యా లాక్టోలేట్‌.

మాధ‌వ‌రావు విసుక్కుంటూ కుర్రాడి వంకా క‌స్ట‌మ‌ర్ వంకా చూసి

మాధ‌వ‌య్య  -   ఏద‌య్యా ప్రిస్కిప్ష‌నూ

అత‌ను   -   ప్రిస్కిప్ష‌న్ ఎందుకూ ప‌సిపిల్ల‌లు పాలుతాగే డబ్బాకి !

అత‌ను తెల్ల మొహం వేస్తాడు.

డాక్ట‌ర్ కుర్చీలోంచి లేవ‌బోతూ

డాక్ట‌రు  -  నేనిస్తానండీ మాధ‌వ‌రావుగారూ ప్రిస్కిప్ష‌న్‌...?
మాధ‌వ‌య్య డాక్ట‌ర్ని కుర్చీలో కూర్చోబెట్టి

మాధ‌వ‌య్య  -  పాల‌డ‌బ్బానా అంటే లాక్టోడెక్సా

క‌స్ట‌మ‌ర్ కళ్ళు ఆనందంగా వెలుగుతాయి.

క‌స్ట‌మ‌ర్    -   ఆ....అదే...లాక్టో...

కుర్రాడు  -   డెక్స్‌....

పూల‌మ్మాయి అంద‌రి వంకా చూస్తూ బొమ్మ‌ల‌వంక చూస్తూ వుంటుంది. (టానిక్ సీసాల మీద‌వి)

పూల‌మ్మాయి   -    బాబుగారూ పూలెన్నియ్య‌ను. ఇయ్యాల బోణీ మీదే.

మాధ‌వ‌య్య డ‌బ్బు డ్రాయ‌ర్లోవేసి న‌వ్వుతూ చేమంతి పూవుని చేతులో తీసుకుని

మాధ‌వ‌య్య   -  ఇదిగో అమ్మాయ్ నువ్వు అంద‌రిళ్ళల్లో ఇల్లాగే చెప్తావుట ఈ పువ్వు చెప్తోంది.

పూల‌మ్మి తెల్ల‌బోతుంది.

పూల‌మ్మాయి  -   అస‌ల‌య్య‌గోరూ నాకు తెలియ‌క అడుగుతాను మీకు నిజంగానే పూల మాట‌లు తెలుసా ?  ఒక్కొక్క‌ప్పుడు మీరెంచెపితే అది నిజ‌మ‌వ్వుద్ది ?

మాధ‌వ‌రావు గ‌ర్వంతో న‌వ్వుతాడు.

మాధ‌వ‌య్య  -  పూల‌బాస తెలుసు ఎంకికీ మ‌ల్లెపూల బాస తెలుసు ఎంకికీ