ధన్యవాదములు....
కైలాసం నుండి కైలాసందాకా అనే ఈ ఆధ్యాత్మిక నవలను పరిశీలించి ఆశీఃపూర్వక శ్రీముఖలేఖను అందింపజేసిన దక్షిణామ్నాయ శ్రీశృంగేరీ శారదా పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వాములకు సహస్రానేక వందన శతాలు.
శ్రీ స్వామివారి ఆదేశానుసారం శ్రీముఖలేఖను పంపిన శ్రీ దక్షిణామూర్తికిగారికి ధన్యవాదములు.
శ్రీశంకర భగవత్పాదుల గురించి పుస్తకం వ్రాయాలనే ఉత్సాహం కల్గించిన విజయవాడ వాస్తవ్యులు శ్రీ నిమ్మగడ్డ సుబ్రహ్మణ్యం (ధర్మాధికారి, శృంగేరీ శంకరమఠం, విజయవాడ) దంపతులకు నా నమస్కృతులు.
వ్రాసిన నవలను మొదటగా చదివి నాకు ధైర్యం కల్గించిన శృంగేరీ పీఠ రాష్ట్ర ప్రతినిధి శ్రీ ఆకెళ్ల సత్య నారాయణమూర్తి గారికి నా నమస్కృతులు. వారి అభినందనలకు నా ధన్యవాదములు.
నవలలోని తప్పొప్పులను చూచించి అమూల్యమైన తమ అభిప్రాయాలను వ్రాసిన శ్రీ ముదిగొండ శంకరశర్మగారికి నా నమస్కృతులు. శ్రీముదిగొండ శంకర శర్మగారివద్దకు నా నవలను తీసుకువెళ్ళి శంకరశర్మగారి పరిచయ భాగ్యం కల్పించిన శ్రీనివాస బంగారయ్యగార్కి ధన్యవాదములు.
నా రచనా వ్యాసంగాన్ని అడుగడుగునా ప్రోత్సహించే మా శ్రీవారు శ్రీ దిట్టకవి దత్తాత్రేయులుగారికి నా నమస్కృతులు.
ఈ గ్రంథాన్ని అందంగా ముద్రించిన మహతీప్రింట్ క్రియేషన్స్ శ్రీ రామమూర్తి దంపతులకు, ముఖచిత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దిన శ్రీ దయానంద్ గారికి నా నమోవాకాలు.
ప్రచురణకి ఆర్థిక హస్తాన్ని అందించిన మా చిరంజీవులు కోట శ్రీనివాస్ హేమమాలిని, సుసర్ల సూర్యనారాయణ వైజయంతిమాల, దిట్టకవి సాయిమిత్రలకు నా శుభాశీస్సులు. శంకరుని కథను ఆసక్తిగా విన్న ప్రథమశ్రోతలైన నా మనుమడు మనుమరాండ్రు చిరంజీవులు విశ్వశివభావన, విశ్వశివసాయి, విశ్వభాస్కర్, అపరాజితలకు నా దీవెనలు.
క్షమాపణలు
నవలికలో ఎక్కడైనా భావ, అక్షర దోషాలు కన్పించినట్లయితే పెద్ద హృదయం చేసుకుని క్షమింపమని వేడుకోలు. నా ఈ ప్రయత్నం ఆదిశంకరులు జీవితాన్ని రేఖామాత్రంగా పరిచయం చేయడమే కనుక సుదీర్ఘ శాస్త్ర చర్చలు చేయలేదు.
- శ్యామలాదేవి |