128
 

నాటి స‌భ‌న‌లంక‌రించిన మువ్వురు వృధ్ధ‌పండితులు, భీష్మ ద్రోణ‌, కృపాచార్యుల‌ను త‌ల‌పిస్తూ ఉండిరి. జింజి ఆస్థాన‌క‌వులైన ర‌త్న‌భేట శ్రీ‌నివాస దీక్షితుల వారున్నూ, ఏ ఒక్క ఆస్థాన‌మునూ అలంకిరంచవ స‌ర్వ‌రాజా స్థానాల‌నూ త‌మ అపూర్వ క‌వితా పాండిత్య వైదుష్య‌దీధితుల‌చే దుర్నిరీక్ష్యం గావిస్తూ ఉన్న అప్ప‌య్య దీక్షితుల వారున్నూ, మ‌ధ్వ మ‌తాచార్యుల‌యిన సుధీంద్రుల‌వారున్నూ ఆశీనులై ఉండిరి. త్రేతాగ్నుల‌వ‌లెనున్న మ‌హామ‌హుల‌ను క‌నులార కాంచి ధ‌న్యుల‌గుట‌కుగాను ప్ర‌జ‌లు అసంఖ్యాక‌ముగ చేరి యుండిరి.

శ్రీ ప‌ద‌వాక్య ప్ర‌మాణ పార‌వార‌పారీణులు అద్వైత విద్యాచార్యులున్నూ స‌ర్వ‌తంత్ర స్వ‌తంత్ర సాగ్ని చిత్య స‌ర్వ‌తోముఖ‌యాజి గోవింద దీక్షిత సోయ‌మాజ‌లువారు, దేవేంద్ర‌స‌భ‌కు బృహ‌స్ప‌తుల‌వ‌లె, శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ మ‌హారాజుల వారికి కుడిభుజ‌మై ఒప్పియున్నారు. స‌భ అంత‌యు ఒక్క మొగ‌మై అప్ప‌య్య దీక్షితుల వారిని త‌దేక‌దీక్ష‌తో వీక్షిస్తూ ఉండెను.

అప్ప‌య్య దీక్షితుల‌వారిది ద‌క్షిణ ఆర్కాటు సీమ‌లోని న‌డియ‌పాలియ‌ము. శ్రౌత‌క‌ర్మ‌ల యంద‌త్యంతాస‌క్తి క‌లిగిన మ‌హావిద్వ‌త్కుటుంబ‌మున ఈ మ‌హనీయుడు జ‌న్మించెను. ప‌దారువ‌ర్ష‌ములు నిండ‌క పూర్వ‌మే ద‌క్షిణ భార‌త‌దేశ‌మంత‌టినీ త‌న సంస్కృత వాజ్ఞ్మ‌య జ‌య ఘంటానినాద‌ముతో దద్ద‌దిల్ల‌జేసిన ఘ‌నుడు. అప్ప‌య దీక్షితుల‌కు గోవిందామాత్యుల‌కు విడ‌దీయ‌దాని బాంధ‌వ్య‌ముండెను. వీరిరువురు గ్రంధ‌ర‌చ‌న‌ల‌కు ఒక‌రినొక‌రు ప్రేరేపించుకొనుచు భాషా స‌ర‌స్వ‌తికి అపూర్వాలంకార ముల‌న‌మ‌ర్చిరి.

అపృయ్య‌దీక్షితులు ఇరువ‌ది యైదేండ్ల ప్రాయ‌మున్న‌పుడు జింజి ఆస్థాన పండితులైన ర‌త్న‌భేట శ్రీ‌నివాస దీక్షితుల‌తో శాస్త్ర చ‌ర్చ చేసి యుండిరి. శ్రీ‌నివాస దీక్షితులు మ‌హాపండితుడు. త‌న‌ను మించిన పండితుడు లేడ‌ని ఆయ‌న‌కు అతిశ‌య‌ము. అప్ప‌య్య దీక్షితుని శాస్త్ర చ‌ర్చ‌లో ఓడించి న‌మ‌స్కార‌ము చేయించు కొందున‌ని శ్రీ‌నివాస పండితుడు ప్ర‌తిన బూనెను.

రామ‌రాయ‌విఠ‌ల చిన‌త‌మ్మ నాయ‌కుల ఆస్థాన‌మున శ్రీ‌నివాస దీక్షితులు అప్ప‌య్య దీక్షితుల పండిత వాగ్వాద‌ము మొద‌లైన‌ది. అయిదు దిన‌ములు వాద‌ములు జ‌రిగినప్ప‌టికిన్నీ శ్రీ‌నివాస దీక్షితున‌కు జ‌యావ‌కాశ‌ము క‌లుగు సూచ‌న‌లు కాన‌రాకుండెను. కాగా, అప్ప‌య్య‌దీక్షితుల వాద‌మున‌కే ప్ర‌భువులు మొగ్గు చూపించుచుండిర‌న్న అనుమాన‌ము శ్రీ‌నివాస దీక్షితుల‌కు క‌లిగి మోము చిన్న బుచ్చుకొనెను. మ‌హారాజులు ర‌త్న‌భేట‌వారిని చూచి జాలిచెంది అప్ప‌య్య దీక్షితుల‌చే న‌మ‌స్కార‌ము గొనుట‌కు మార్గాంత‌ర‌మును శెల‌విచ్చిరి. శ్రీ‌నివాసుల మోమున ఆనందరేఖ‌లు తాండ‌వించ‌గా స‌భ‌ను త‌మ‌గృహాన కొన‌సాగింతుమ‌ని చెప్పి ఇంటికి వెడ‌లిపోయిరి.

శ్రీ‌నివాస దీక్షితుల గృహాన‌కు పండిత వాదమున‌కు వెడ‌లిన అప్ప‌య్య దీక్ష‌తుల‌వారి కాళ్ళు క‌డిగి శ్రీ‌నివాస దీక్షితుల త‌మ‌క‌న్న బిడ్డ‌నిచ్చి వివాహ‌ము చేయ‌గా, అప్ప‌య్య దీక్షితులు భార్యాస‌మేతుడై శ్రీ‌నివాస దీక్షితుల‌కు న‌మ‌స్క‌రించెను. ఇట్లు అప్ప‌య్య‌దీక్షితునిచే న‌మ‌స్కార‌ము నందుకొన్న ర‌త్న‌బేట శ్రీ‌నివాస దీక్షితుల నెగ్గిన పంత‌ము. మ‌హాపండితుని అల్లునిగా చేసికొన‌టంతోఆనందాంత‌మైన‌ది.

ఈ ఉందత‌మును గాధ‌లుగా చెప్పుకొంటూ ఉంటారు.

ఆ ఆప్ప‌య్య దీక్షితుల‌వారు, ఎన్నో వ‌త్స‌రాల ఉత్త‌ర‌భార‌త‌దేశాన్ని త‌న విద్వ‌త్తుతో ఉఱ్ఱూత‌లూగించి, మ‌హావృద్ధులైన త‌దుపని శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాద భూజాని స‌భామండ‌పంలో స‌ర‌స్వ‌తిదేవి ఆనంద‌తాండ‌వాన్ని స్వ‌యంగా తిల‌కించే నిమిత్త‌ము విచ్చేసిన‌వారాయెను. శుక‌వాణి దేవి మ‌ధుర మ‌నోజ్ఞ మంజుల వీణావాద‌నం చేస్తూనే అష్టావ‌ధాన శ‌తావ‌ధాన‌ముల‌న‌ల‌వోక‌గా నిర్వ‌ర్తించిడాన్ని, అప్ప‌య్య దీక్షితుల‌వారు నెర‌సిన న‌కుబొమ‌ల‌నెత్తి అచ్చెరువుతో చూచిరి.

బాలా ! నీవు ఘ‌టికార్ధ నిర్మిత శ‌త‌శ్లోకివ‌నీ, ష‌డ్భాషార‌చ‌నా విశేష బ‌హుధా విఖ్యాత కీర్తివ‌నిన్నీ, మాధుర్యైక్య దురంధ‌రాంద్ర క‌వితా నిర్మాణ ధురీణ‌వ‌నిన్నీ మిత్రులు గోవిందామాత్యుల‌వారు చెప్పియున్నారు ప్రాకృతాన నీ బాణిని విన‌పింప‌గ‌ల‌వా అనిరి.

శుక‌వాణి శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ మ‌హారాజుల అనుజ్ఞ‌కై చూచిన‌ది. మ‌హారాజుల వారు చిరున‌గ‌వుతో మోమును పంకించి అనుమ‌తించిరి. ఆమె వీణియ‌పై రెండు ఋగ్వేద మంత్ర‌ముల‌ను మీటిన‌ది. అదే స్థాయిలో ప్రాకృతంలో ఒక శ్లోక‌మును వినిపించి, అదే శ్లోక‌మును సంస్కృత‌ములో వినిపించిన‌ది. దీనిని వెంట‌నే రామ‌భ‌ద్రాంమ గ్రంధ‌మున పొందుప‌ర‌చిన‌ది.