ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్శిటీ
శ్రీ అడివి బాపిరాజు 90వ జయంతుత్సవ కమిటి,
చీఫ్ ఆర్గనైజర్ అండ్ కో అర్డినేటర్.
శ్రీమతి డాక్టరు శ్యామలాదేవిగారికి,
అడివి బాపిరాజుగారి జయంతి సందర్భంగా మీరు ప్రత్యేక సంచికను వెలువరిస్తున్నందుకు సంతోషం. సంచిక పేరు కూడా బాపిరాజుగారి కవితాత్మకు ప్రతిబింబంగా వుంది.
బాపిరాజుగారు బహుముఖ ప్రతిభావంతులు. నవల, కథ, గేయం, పద్యం, చిత్రకళ, శిల్పం, పత్రికా రచన, సంగీతం, నాట్యం మొదలైన విభన్న రంగాల్లో ఆయన అందెవేసిన చేయి. బాపిరాజుగారి ప్రతిభా వైవిధ్యం మీ సంచికలోని రచనలలో ప్రతిఫలిస్తుందని ఆశిస్తున్నాను.
సి.నారాయణరెడ్డి.
|