మ‌ధుమ‌య‌మూర్తి

 

డాక్ట‌ర్ చిలుకూరి సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి
తెలుగు శాఖాధ్య‌క్షులు - ఆంధ్ర విశ్వ‌విద్యాల‌యం

శ్రీ అడివి బాపిరాజుగారు స‌క‌ల క‌ళా విభూషితులు, ఇటు సాహిత్యంగాని, అటు సంగీతంగాని, ఇటు చిత్ర‌లేఖ‌నం గాని, అటు శిల్పంగాని, ఇటు నృత్యంగాని, అటు వ్య‌క్తిత్వంగాని, ఎందులోనైనా వారిది అందెవేసిన చెయ్యే. వారిది క‌ళాహృద‌యం, పార‌శ్యం - స‌హృద‌య‌త - వారి సొత్తు.


శ్రీ బాపిరాజుగారి మ‌నసు న‌వ్య‌స‌వ‌నీత‌స‌మానం. ప‌లుకు కండ చెక్క‌ర‌. మాయ మ‌ర్మంలేని మ‌న‌స్సుకు సొగ‌సులు దిద్దేవాక్కు.


బారిరాజుగారు జ‌న్మ‌తః ఆచార్యులు, ప‌త్రికా సంపాద‌క‌త్వంలోకూడా వ‌న్నెకెక్కిన‌వారు.


ఏ ప‌రిస్థితుల్లోనూ ఇత‌రుల‌ను నొప్పించ‌ని ప‌ద్ధ‌తివారిది. అయితే మొర‌మ‌చ్చుల‌కొర‌కు త‌న ప‌ద్ధ‌తిని విడ‌నాడ‌ని మ‌న‌స్థ‌త్వం వారిది. విభేదించిన విష‌యాల్లో కూడా, విభేదించిన‌వారితో విరోధించన వ్య‌క్తి శ్రీ బాపిరాజుగారు,  వైమ‌న‌స్యం ఎరుగ‌ని త‌త్వం వారిది. వారు ఆజాత‌శ‌త్రువు విశ్వ‌నాధ‌వారిచేత బాపిబావ అనిపించుకొనే చెలిమి వారిది, అందరితోనూ అటువంటి చెలిమి ఉండేది వారికి.


ర‌చ‌యిత‌గా శ్రీ బాపిరాజుగారికి చిర‌స్థాయియైన కీర్తిఉంది. తాను ర‌చించిన న‌వ‌ల‌లోని ఒక పాత్ర తీరు తెన్నులు, ప్ర‌జ‌ల‌మ‌న‌స్సుల‌మీద చెర‌గ‌ని ముద్ర‌వేసినాయి అంటే, అది ర‌చ‌యిత ప్ర‌తిభ‌కు తిరుగులేని నిద‌ర్శ‌నం. హిమ‌బిందు పేరుతో త‌మ‌సంతానాన్ని పిలుచుకోవాల‌నే సంక‌ల్పం త‌ల్లిదండ్రుల‌కు అనిపించిందంటే అది ర‌చయిత ప్ర‌తిభ‌కు ఎగ‌రవేసిన కీర్తిప‌తాకఅవుతుంది,.  ఆపాప‌లు శ్రీ బాపిరాజుగారి కీర్తివెన్నెల్లో అడుకొనే ప‌సిడి బొమ్మ‌లు. ఈ విష‌యంలో శ్రీ బాపిరాజుగారు శ్రీ వేదంవారితో స‌రిగద్దెనున్నారు.

శ్రీ బాపిరాజు గారి మధుమ‌య‌మూర్తికి న‌మ‌స్సులు.