నారాయణరావు నవలా - అడవి బాపిరాజు వ్యక్తిత్వం
- డాక్టరు కలిదిండి వెంకటరాామరాజు
ఉప్పొంగి పోయింది గోదావరి ! తాను
తెప్పున్న ఎగిసింది గోదావరి !
కొండల్లొ ఉరికింది
కోనల్లు నిండింది
ఆకాశగంగతో
హస్తాలు కలిపింది || ఉప్పొంగి ||
అడవి చెట్లన్నీని
జడలలో తురిమింది,
ఊళ్లు దండలగుచ్చి
మెళ్లోన తాల్చింది || ఉప్పొంగి ||
వడులలో గర్వాన
నడలలో సుడులలో
పరవళ్ళు తొక్కుతూ
ప్రవహించి వచ్చింది || ఉప్పొంగి ||
శంఖాలు పూరించి
కిన్నెరలు మీటించి
శంకరాభరణరా
గాలాప కంఠియై || ఉప్పొంగి ||
నరమానవుని పనులు
శిరమొగ్గి వణికాయి
కరమెత్తి దీవించి
కడలికే నడచింది || ఉప్పొంగి ||
వరద సమంలో సుడుల వడులతో నుడిగళ్ళు త్రొక్కే గోదావరీ నదీమ తల్ఇ యొక్క గతి విశేషాలను తలపింపజేసే ఈ ముగ్థ సుకుమార సుందర పర సమంచిత గేయాన్ని చదివినా, విన్నా, అడివి బాపిరాజుగారు సరప సాహితీ సంస్కార సమ పేతుల స్మృతి పథాలకు ఆ ప్రయత్నంగా వచ్చి, సహృదయ హృదయకేరాదాలలో ప్రతిభా పూర్వక విన్యాసాలు సాగిస్తారు. ఆయన అకలుషజీవితం చాలావరకు ఆ పావన గోదావరీ జలప్రవాహముతో పెనవేసుకొని పునీతమైనది. ఆయన ఉత్సాహ శక్తికి, కళామయ భావనలకు, శారీరక మానసిక పటిమలకు, విద్యా వివేక సంపత్తికి రమణీయ రచనాపాటవానికి, ఆ నదీమాతయే ముఖ్యావలంబమైనది. ఆయన కమనీయ కవితావిన్యాసాలకు చైతన్యాత్మక చిత్రకళా వైదగ్థ్యానికి, శ్రావ్వగాన పణితులకు ఆపావనవాహినియే ప్రేరకమైనది. ఆ చల్లని జలముచే తడిసిన అడవి ఒకనాడు వారి వంశానికి ఆటపట్టైంది.
కొందరికి కవితాశక్తి వుంటుంది.కొందరికి రచనా పాటవం వుంటుంది. కొందరికి పాండిత పటిమ వుంటుంది. మరికొందరు సంగీతకళా కోవిదులుగా రాణిస్తారు. కొందరు చిత్రకాళాకారులుగా ప్రఖ్యాతి నొందుతారు. కాని అడివిబాపిరాజుగారిలో లలితకళ లన్నియు సరస సమ్మేశనాన్ని పొందాయి. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సర్వతోముఖ ప్రతిభా సంపన్నుడు, ఆయన కవి, రచయిత, రమ్యచిత్రకారుడు, నాటకవేత్త కళాదర్శకుడు, పత్రికాసంపాదకుడు, దేశికోత్తముడు, దేశభక్తుడు, న్యాయవాది, సకలశాస్త్ర కోవిదుడు, రసజ్ఞశిఖామణి, సంస్కార సమంచిత హృదయుడు, ఇన్ని శక్తులు ఒకనిలో వుండుట చాలా అరుదు. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాః అని కాశిదాస కవీంద్రుడు అన్నట్లు జన్మాంతర సంస్కార ప్రాబల్య ము చేతనే యిన్ని విద్యలు సంపూర్ణముగా ఆయనకు అలవడ్డాయి. కళలో పుట్టి, కళలో పెరిగి, కళకు జీవితాన్ని అంకింతచేసిన కళాతపస్వి ! ఆయన ప్రజ్ఞాపాటవాలను, సువిశాల హృదయాన్ని భవ్యభావ భంగిమలను, పరిశీలనాత్మకంగా గుర్తించిన సుప్రసిద్ధ విమర్శకులు శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు ఆయనకు కులపతి అను సార్థక బిరుదాన్ని ప్రసాదించారు. కనుకనే గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్యగారు ఆచంట వేంకట సాఖ్యాయన శర్మగారి తరువాత ఆంధ్రులలో యిన్ని ప్రజ్ఞలు కలవారు లేరని చెప్పుట అతిశయోక్తి కాదు అని, విశ్వనాథవారు కవియు, చిత్రకారుడే కాదు, ఆనందమూర్తి కూడ. అతనికి గల భావనాపటిమ నేటి కవులెవ్వరికిని లేదని నిస్సందేహముగా చెప్పవచ్చును. అనియు ఆయనను ప్రశంసించారు. ఆంధ్ర దేశమున అనేక సాంస్కృతిక కేంద్రాలలో సదాశయ సంపత్తితో కళాపీఠాలను స్థాపించి కళాపతియై కళాసేవ చేశాడు.
మీయమ్మ ఏతార ఛాయలో నినుగాంచె
ఏయోషధుల పాలపాయ సంబిడి పెంచె
లేకున్న నీ శిల్ప లీలాభిరుచి రాదు
కాకున్న నీ స్వాదు కంఠ మబ్బగ బోదు
అడివోరి చిన్నాడ !
అమృతధారల ! వాడ అని ఆధునిక కవివర్యులు రాయ, ప్రోలు సుబ్బారావు గారు ఆయన యొక్క బహుముఖ కళా ప్రౌఢిమకు రసవత్కత పత్రాన్ని అందించారు.
అడివి బాపిరాజుగారు 08-10-1895 తేదీన పుణ్య దంపతులైన సుబ్బమ్మ, కృష్ణయ్యగారలకు పశ్చిమ గోదావరీ మండలంలో గణపవరానికి ప్రక్కనేయున్న సరిపల్లె గ్రామంలో పుట్టి, సోమేశ్వరాధి ష్టిత భీమవర పట్టణంలో బాగా ఎదిగినారు. ఉన్నత విద్యాభ్యాసం చేసే సమయంలో రాజమండ్రీ ప్రభుత్వ కళాశాల యందలి కూల్డ్రే దొరగారి శిష్యులై, సంగీత, చిత్ర కళాభిమానములను పెంపొందించుకొనినారు. మచిలీపట్టణంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో ప్రమోద కుమార ఛటర్జీగారి శిష్యులుగా వుంటూ అనేక చిత్రకళారహస్యాలను పరిగ్రహించారు. మద్రాసు నగరంలో బి.యల్. పట్టాన్ని స్వీకరించి, భీమవరంలో న్యామవాద వృత్తి చేపట్టినా, అది ఆయన సహజ కళాసాసకు తగనిదగుటచే, దానిని పరిత్యజించినారు. చిన్న తనంలోనే జాతీయభావాలను ఏర్పరుచుకొని, జాతీయోద్యమంలో పాల్గొని, ఒక సంవత్సరం కారగార శిక్షను అనుభవించిన గాంధేయవాది. కొంత కాలము అధ్యాపక వృత్తిని కూడ నిర్వహించినారు.
నాట్య, చిత్రలేఖన, సంగీత, జ్యోతిష్య, వైద్య ఖగోళాది శాస్త్రములలో బాపిరాజుగారు అపారపాండిత్యాన్ని గడించారు. సహపాఠకులలో శ్రీ కవికొండల వేంకటరావుగారు కలం పట్టి కావ్యసృష్టి చేయగా, దామర్ల రామారావుగారు కుంచెపట్టి, చిత్ర సృష్టిచేయగా బాపిరాజుగారు కలం, కుంచె రెండూ ధరించి, శ్రవణానందమూ, నేత్రానందమూ గావించారు. ఆధ్యాత్మిక కళాస్రష్టమై, కళాధిదేవత ప్రాంగణంలో పాటలు పాడుతూ నాట్యం చేశారు. ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం (సమాలోచన - అడివిబాపిరాజుగారి జీవిత చరిత్ర (వ్యాసం) - శ్రీ.వి.సిమ్మన్న, పుట.23) అని, శ్రీ.వి.సిమ్మన్న గారు ఆయన వ్యక్తిత్వాన్ని చలా చక్కగా పేర్కొన్నారు.
|