బాపిరాజు సాహిత్యం - జాతీయోద్యమము
- ఘనశ్యామల ప్రసాద్
అడవి కాచిన వెన్నెల కడలిదాగిన అమృతము, పుడమితల్లికి పులకింత అడవి బాపిరాజుగారి సాహిత్యము. లౌకికార్థముననే గారు పరమార్థమునగూడ అది విలువలేనిదే సౌందర్య దృష్టిలేని వారికి, దాని విలువ ఏ మాత్రమూ నుండదు. అయితే ఓషధులను పండించి పృకృతిన కాచిన వెన్నెల యొక్క విలువను కట్టగలమా ? అట్లే, జీవన రస పిపాసువులకు అది వివేచనా దృష్టితో తరచి వెలికి తీయవలసిన విజ్ఞానామృతము స్వేదేశ స్వధర్మాభి రతులకు అది కడిమిపూత. అసలు ఆయనపేరే ఒక విశిష్ట సంకేతము.
అడవి యనునది ఈ అనంత ప్రకృతి మహత్తకొక ప్రతీక. తాత్వికముగా వెన్నెల శబ్ధము మనోవికాసమునకు గుర్తు. వికసించిన ఒక మనస్సు, నిత్యపరిణాయ శీలమైన ఈ ప్రకృతి తత్వము నెరుంగుటకు, చిరంతనముగా కొనసాగించుచున్న అనంతాన్వేషణములో కాలమే దానికి తోడు దేశ మే దానికి గూడు. ఆనందాభి నివేశమేదానికి కూడు, భారతమైన భారతమున, జీవుని అనంతానందాభిసరణ స్రవంతికి, తెలుగు తటమున వెండి వెన్నెల పావంచాలు తీర్చిన తీర్థ రాజము బాపిరాజు సాహిత్యము. కవితాశక్తి, కళాభివృత్తి దేశభక్తియను త్రివేణీ సంగమము బాపిరాజు. పారతంత్య్ర విషప్రభావము మృతప్రాయమై పడియున్న పవిత్ర భారతదేశమున, స్వాభిమాన భావమును అమృత వర్షముగా కురిపించి, అస్తవ్యస్తమైన చీకాకులు పడుచున్న జనమానస కీకారణ్యమున, జడత్వమును బాపి న రాజు గా తెలుగు అడవి ని, వెలుగులు నింపిన వెన్నెల రేడాయన జాతీయ నేతయైన బిపినచంద్రుని వీరావేశను పా లూ బాపూజీ శాంతి సందేశాలూ. తెలుగు మాగాణమున పండించిన క్రొత్త పంట ఆయన. నిజముగా బాపిరాజు ప్రతిభ బాపురే యనిపించునంతటి ఉన్నతమూ, ఉజ్వలమూ, ఉత్తమము, భారత జాతీయోద్యమ పధికుడుగా సాహితీ రంగమున బాపిరాజు నంచనా వేయుటకు మాత్రమే ప్రస్తుత వ్యాస ప్రయత్నము.
సాహిత్యాను శీలనము రెండు దశలలో కొనసాగుట సహజ మనిపించును. మొదటిది పాఠక దృష్టి రెండవది పరిశోధనా దృష్టి. మొదటి దశలో సర్వ సామాన్య పాఠకునిది ఆనంద పిపాస. రెండవదశ పరిశోధకుని లోని, తనివి తీరని తత్వాన్వేషణా మనిషి. ఉన్నదానినీ, తన కన్నులకు కట్టిన దానినీ, సాహిత్యముగా నాస్వాదించుట పాఠక ప్రత్యయము, ఉన్నదానివెనుక నున్నదానినీ, కన్నులు మూసి కనుకొన్న దానినీ అవగాహన మొనర్చుకొనుట పరిశోధక ధ్యేయము.
బాపిరాజు రచనలలోని అక్షరరమ్యతను అర్థసంగతినీ, ఆంధ్ర సాహిత్యప్రియు లందరెరింగినదే కాన ఆ రచనల వెనుకనున్న ఆయన వ్యక్తిత్వము, జీవన తత్వము, దానిని తీర్చిదిద్దిన దేశ, కాల భావముల మహత్యములను పరిశీలించుట ఇందు సముచితము.
కొంగజపాలు వల్లిస్తూనే, వంగ భూమిని ఆంగ్లేయులు భంగపరిచిన పాడుకాలమది. వంగభూమిలో వల్లమాలిన వీరావేఫములు ఎల్లప్పుడూ వెల్లివిరియుట ఒక చారిత్రిక సత్యము. వంగభూమి విభజనము, జాతీయులలోని దేశాభిమాన స్తోతద్వినుల నుప్పొంగించినది. అది రాజకీయముగానేగాక సాహిత్యరూపమున గూడ ప్రతిఘటనోద్యమును నిర్మించినది. బంకిం చంద్రుని వందేమాతరం గీతం అప్పుడే ఆవిర్భవించింది. అది మనిషికీ, అతడు పుట్టిన మట్టికీగల అవినాభావము, ఆత్మీమయునైన అనుబంధమును అనన్య సామాన్యముగా ఆవిష్కరించినది. దానితో దేశమే దేవతయైనది. సర్వప్రజానీకమాయె సంతానముగా మాత్రమేగాక సమష్టి సమాజదేవతా రూపమునకాకృతి కల్పించిన అవయవములైనవి. దేశమాత. కోటికోటికంఠ కలకల నినాద కరాళ శతకోటి భుజైర్ధృతఖరకరవాల యై విజృభించినది. ఆమె పిలుపు, స్వాతంత్య కాహళీస్వనమై ఎందరో జాతీయ వీరుల వాణిగా బాపిరాజుగారి అడవి శాంతిశ్రీ నవలలోని ఉపక్రమణిలోని ప్రతిశబ్దమూ, ఇట్టి భావములతో మారుమ్రోగుచున్నది. వివిధ ప్రాంతముల నినదించినది. 1906 తర్వాత శ్రీ బిపిన్‌చంద్రపాల్ మహాశయుడు దేశభక్త్యావేళజంఝూమారుతమై ఆంధ్రతీరమున అనేక నగరముల సందర్శించి, జాతీయులనందరినీ ఉర్రూతలూపినాడు. బాపిరాజుగారప్పటికి బాలుడుగా బిపినచంద్రుని వీరతా ప్రబోధమున ప్రభావితుడైనాడు. రాజమండ్రిలో ఆస్వాల్డ్ కూల్డ్రే గారి శిష్యుడిగా, లలితకళాభినివేళమున ఆర్ధ్రమైన ఆయన హృదయమున జాతీయ భావబీజముల స్థిరములుగా నాటుకొన్నవి. అట్లే బాపిరాజు జీవితముపై ప్రభావము చూపిన రెండవ జాతీయ నాయకుడు మహాత్మాగాంధీ, ఆయన ప్రబోధమునంది 1921లో బాపిరాజు సత్యాగ్రహోద్యమంలో కారాగార శిక్షను కోరి స్వీకరించాడు. అంతేగాదు ఆయనలోని కళాభినివేశము గూడ శ్రీ వీరంద్రనాధ ఛటోపాద్యాయుని అంతేవాసిత్వమున, జాతీయతా భావసౌరభాలను సంతరించుకున్నది. తత్ఫలితమే ఆయన అడ్వొకేట్ వృత్తిని విడచి, పిదప బందరు లోని జాతీయ కళాశాలలో ప్రధానాచార్య పదవీ స్వీకారము. అటుపై ఆయన జీవితమంతయూ సాహిత్యము, కళలు, సాదనములుగా సమాజపురుషుని ఆరాధనమే యైపోయింది. ఆయన సాహిత్యమున ప్రత్యక్షరమూ ఇందుకు నిదర్శనమే కాగలదు.
దేశీయులలో స్వాభిమానమూ, స్వజాతీయతా విష్కారములకొరకు ఆయన అనుక్షణం కృషిచేశారు. ఇట్టి కృషి ఆయనలో ఆరంభమైనదిగాదు. వైదిక ఋషుల పృధ్వీసూక్తముతో ఆరంభమైనదే. ఆధునిక యుగమున అది ఆంగ్లేయుల ఆధిపత్యమును ప్రతిఘటించునదిగా రూపొందినది. కవితాలోకమున ఈ పాట పాతదే. చరణములు, మాత్రము కొత్తవి. చరిత్రనుబట్టి రూపొందింపబడినవి. అందుకనే పాతపాట యను పేరున ఈ క్రింద గీతం వ్రాసిరి బాపిరాజుగారు.
ఆకటార్వులజోలలా, మా
కాక యూష్పల డోలలా, మన
బానిసల చెడుబ్రతుకులే. ఈ
ప్రభుల పానువులా ?
తెల్ల ప్రభువుల పాలనలో బానిసలైన స్వదేశీయుల దయనీయమైన ఆకలి అలమటింపులూ, ప్రతీకారము చేయనెంచు. రోషాగ్నుల నిట్టూర్పులూ - అక్షర విస్ఫులింగాలుగా స్వదేశ బంధువులలో స్వాతంత్య్ర జ్వాలను రగుల్కొల్పుతూ ఈ పాట ప్రారంభింపంబడింది.
దేశీయ సంపద దోచుకోబడింది. బ్రతుకుతెరువుకై బాసిన భారతీయులకు, గత్యంతరం లేక తెల్ల ప్రభువుల దయాధర్మాలనాశ్రయించవలసి వచ్చింది. పొట్టకూటి చదువులు, ప్రజల్ని కూలీలుగా, గుమస్తాలుగా మార్చేసాయి. స్వాతంత్ర్యోద్యమం గూడా మనవులు చేసుకుంటూ అర్జీల మహజరు ల బాటను పట్టేసింది. కొందరు అలాకాక, కోపంతో అతివాదులై విప్లవాగ్నిని రగిలించారు. ఫలితం ఎందరో కొరతపడి ఉరి కంబాలెక్కారు. క్రమంగా ఉద్యమంబలిసినకొలదీ దేశ పరిపానలో పాలు పంచుకోండని స్వదేశీయులకు పిలుపులొచ్చాయి. దాంతో అధికారం, పదవులూ, దానాలు, ధర్మాలు, భిక్షుక విషయాలై పోయాయి. ఇంతటి జాతీయోద్యమ చరిత్రను రెండో చరణంలో ఇమిడ్చి బాపిరాజు ఇలా అంటారు :-
కూలినాలీ, బ్రతుకు, మనువులు,
కొలువులు, కోపాలు, కొర్రులు
చాలు మీ దానాలు ధర్మాల్
చాలు మీ భిక్షల్
|