కథానిక యొక్క స్వరూప స్వభావములనుకూడ నాలంకారికులు పేర్కొనుటచే నీ ప్రక్రియ విస్తృతముగనుండెనని చెప్పవచ్చును. భయానకము, సుఖతరము, కరుణరసపూరితము, అద్భుతాంతము, ఉదాత్తము, సుబోధకమునై యర్ధవంతమై కథయుండవలెనని లక్షణము చెప్పబడినది. ఆలంకారికులింత విపులముగా చర్చించిన కథానికా ప్రక్రియ నేటి నవల యేయేల కారాదను సంశయము పొడయుచున్నది. నేటి కథానిక ఒక సంఘటనము నాధారముగ జేసికొని, అయిదారు పుటలకే పరిమతమైనది. ఆలంకారికులు చెప్పిన పై లక్షణము లీనాడు ప్రకటింపబడుచున్న చిన్న కథ ప్రక్రియకుగాక విస్తృత గాథయైన నవల కే సంబంధించి యుండవచ్చును.
నవలకున్న పరిధి పెద్దది గావున రసము నుప్పతిల్లజేయుటకుగాని భయానకాద్భుత రసప్రస్తారమునకుగనా ఉదాత్త వస్తువునకుగాని తావు కలదు. నేటి కథానికకిట్టి సౌకర్యములేదు. మరియునీ వాదము భామహుని పంచవిధకావ్య విభజనపద్దతిని బలపరుచుచున్నది. భామహునిపంచవిధ కావ్య విభాగములో నాఖ్యాయికా, కథలు తృతీయ చతుర్థ స్థానములా క్రమించినవి.
సర్గబంధో భినేయార్థం తదై వాఖ్యాయికా కథే
అనిబద్ధంచ కావ్యాతత్పునః పంచధోచ్యతే
ఆఖ్యాయికలోని వస్తువు నాయకునిచే ననుభూతము కావలెననుటచేనీ ప్రక్రియ రచయితచేత ఉత్తమ పురుషలో చెప్పబడు స్వీయచరిత్రము వంటిది. ఆఖ్యాయిక కేవలము నాయకునిచే మాత్రమే చెప్పబడు వృత్తము గలది నాయకేతరునిచేగూడ చెప్పబడునది కథ కవి తాను స్వయముగా చూచినదానిని చెప్పుట యాఖ్యానము. ఆఖ్యాయికలో యదార్ధముగ భూతకాలమున ప్రవర్తిల్లిన యంశములతోడనే బ్రసక్తి...స్వీయానుభవముల కథనమును గృత్యముల ప్రశస్తిని నాయకుడే ప్రకాశము (ఖ్యాపనము) చేయుట యాఖ్యాయికా లక్షణమన్నను తప్పుకాదు.యదార్ధ విషయములనే వ్రాయవలసియుండుటచేత నీ ప్రక్రియలో కవి ప్రతిభఅతి పురాతన కాలముననే యిట్లు స్వీయచరిత్రలవంటి యాఖ్యాయికలున్న భారతీయ సాహిత్యమునకు నవలయను ప్రక్రియ క్రొత్తయనుట హాస్యాస్పదము. రామాయణ మహాభారతాదులుకూడ పెద్ద నవలలవంటివని నోరి నరసింహశాస్త్రిగారు వ్రాక్కుచ్చియున్నారు. సంస్కృతమున లక్ష్యములు లేని లక్షణములేర్పడి యుండవను వాదమును పురస్కరించుకొని యోచించినచో సర్వాంగ సుందరమైన భారతీయ కావ్య సరస్వతి సమగ్ర రూపమని యనవలెను.
మరియు సంస్కృతమున నాలుగు విధములైన గద్యములన్నవి. చూర్ణకము లేక చూర్ణము, ముక్తకము, వృత్తగంధి ఉత్కళికాప్రాయము. సమాసరహితమైనది ముక్తకము. వృత్తాభాగము కలది వృత్తగంధి అనగా నీగద్యను చదువుచుండగా పద్యమును చదువుచున్న యనుభూతి కలుగుచుండటచేత దీనికీ పేను వచ్చినదనవచ్చును. సమాసభూయిష్టమైనది ఉత్కళికాప్రాయము. చూర్ణకము అల్పసమాసములుగలది. ఈ విషయములను సమర్థించుచు శివతత్త్వ రత్నాకరముననున్నట్లు కావ్యాలంకార సంగ్రహమున కానవచ్చుచున్నది. కథాకల్పిత వృత్తాంతా సత్యార్ధాఖ్యాయికా మతా.
అతి ప్రాచీనమైన వేదమందుకూడ వచనము కలదు. ఐతరేయ బ్రాహ్మణమునకూడ వచనమున్నది. విద్యానాథుడు గద్యమునకు పద్యమునకు గద్యపద్య యుగళమునకు సమప్రాధాన్య మిచ్చునట్లు తోచుచున్నది. గుణాలంకార సహితౌ శబ్దార్థే దోషవర్జితౌ గద్యపద్యోభయమయం కావ్యం కావ్యవిదో విదుః గుణాలంకార సహితమైనది అర్థములతోకూడిన శబ్దముగలది దోషరహితమైనది కావ్యము. ఇది గద్యమైన కావచ్చును. పద్యమైన కావచ్చును. పింగళి సూరన్న రచించిన కళాపూర్ఱోదయమునకు నవలా లక్షణములున్నవి. రుద్రటుడు తన కావ్యాలంకారమున కథను గూర్చి విశిష్టముగ సమీక్షించెను. కథను రచించువాడు తన కర్తృత్వమును వంశాధికమును గుఱించి సంగ్రహముగ చెప్పవచ్చునన్న యభిప్రాయమును రుద్రటుడు వెలిబుచ్చెను. ఆఖ్యాయికలోనీ విషయము విపులముగనుండ వచ్చును.కు తావులేదు.
ఈ లక్షణములన్నియు చూచినచో పూర్వాలంకారికులు చెప్పిన కథా లక్షణములు నేటి కథల రూపముననున్న కథలకుగాక నవలలకే యన్వయించునట్లు తోచుచున్నది. కథలో కన్యాహరణము, సంగ్రామము, కన్యాలాభము ఉండవలెననుటచేత, భయానకాద్భుతరసము లుండవలెననుట చేత, దీని పరిధి పెద్దదియే కావలసి వచ్చుచున్నది. మరియు నొక చిన్న కథతో పెద్ద కథకు ముడిపెట్టవచ్చుననుటచేత.నా చిన్న కథ గద్యమున గాని పద్యమునగాని యుండవచ్చుననుటచేత. ఈ ప్రాసంగిక కథ నీతి ప్రబోధకముగనో ధర్మప్రబోదకముగనో యుండి తరువాతి కథతో నన్వయింపబడుటకు తగిన సారూప్యముండవలెననుటచేత దీనిని నవలయే యన వలెనుగాని కథ యనరాదు. కన్యాలాభముతో కథ సమాప్తి కావలెనన్నది రుద్రటుని మతము. నేటి నవలలు మూడు వంతు లీకన్యాలాభము తోడనే యంతమగుచున్నవి. నాయికా నాయకు లొకరినొకరు ప్రేమించుకొనుటయు, తల్లిదండ్రులో, కులమో, ధనమో, ప్రతినాయక పాత్ర వహించుటచేత వారి కలయిక కాటంకము కలుగుటయు తుదకెట్లో మబ్బులు చెదరి ప్రేయసీ ప్రియ లేకమగుటయు నేటి నవలలోని సర్వ సాధారణ విషయము. ఇట్లే భార్యాభర్తలు భేదాభిప్రాయములచేత విడిపోయి, ఇక్కట్లు పాలయి తుదకేకమగుట సామాన్యముగ నవలలో గానవచ్చుచున్నది.
|