5
 

తొలి తెలుగు న‌వ‌ల‌

తెలుగు భాష‌లో న‌వ‌ల సంపూర్ణ స్వ‌భావ‌ముతో న‌వ‌త‌రించి శ‌తాధిక సంవ‌త్స‌ర‌ములు కాగా తొలి తెలుగు న‌వ‌ల‌ను నిశ్చ‌య‌ముగ నిర్ణ‌యించుట సాధ్య‌ప‌డుట‌లేదు. ఈ విష‌య‌మునుగూర్చి మూడు వాద‌ములున్న‌వి. మొద‌టిది కొక్కొండ వేంక‌ట‌ర‌త్న‌ముగారి మ‌హాశ్వేత తొలి తెలుగు న‌వ‌ల యున్న‌ది. రెండ‌వ‌ది న‌ర‌హరి గోపాకృష్ణ‌మ్మ సెట్టిగారు ర‌చించిన శ్రీ రంగరాజ చ‌రిత్ర‌ము. మూడ‌వ‌ది కందుకూరి వీరేశ‌లింగముగారు వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ అన్న ఆంగ్ల న‌వ‌ల‌కు ప్ర‌భావితులై ర‌చించిన రాజ‌శేఖ‌ర చ‌రిత్ర‌ము.


కొక్కొండ‌వారి మ‌హాశ్వేత 1867వ సంవ‌త్స‌ర‌మున, శ్రీ‌రంగ‌రాజు చ‌రిత్ర‌ము 1872వ సంవ‌త్స‌ర‌ము, రాజ‌శేఖ‌ర చ‌రిత్ర‌ము 1878వ సంవ‌త్స‌ర‌మున ర‌చింప‌బ‌డిన‌వి. కాల‌మును బట్టి వాద‌ములేదు. మ‌హాశ్వేత ప్ర‌థ‌మ న‌వ‌ల కాకుండ‌పోవుట‌కు చెప్ప‌బ‌డు కొన్ని కార‌ణ‌ములు 1) మ‌హాశ్వేత‌ను గూర్చి త‌దుప‌రి ర‌చ‌యిత‌లు పేర్కొన‌క‌పోవుట, 2) శివ‌శంక‌ర‌పాండ్యాగారొక్క‌రే పంతులుగారు తొలి న‌వ‌లాక‌ర్త‌ల‌నుట‌చేత నావాద‌మున‌కు బ‌ల‌ము చేకూర‌లేద‌నుట‌, 3) చాలాకాల‌ము ప్ర‌చురింప‌బ‌డ‌క‌పోవుట‌, 4) ప్ర‌చురింప‌బ‌డిన‌ను (1893లో వైజ‌యంతి ప‌త్రిక‌లో) న‌సంపూర్ణ‌ముగ వెలువ‌డుట ఇవి ముఖ్య కార‌ణ‌ముల‌ని కొంద‌రు చెప్పుచున్నారు.

కాని ఈ వాద‌మునుండియే కొక్కొండ‌వారు ప్ర‌థ‌మ న‌వ‌లాకారుల‌ని చెప్పుట‌కు వీలుక‌లుగుచున్న‌ది. 1) త‌దుప‌రి ర‌చ‌యిత‌లు పేర్కొన‌క పోవుట‌కు కార‌ణ మా న‌వ‌ల ప్ర‌చురింప‌బ‌డ‌క‌పోవుట‌యే, 2) శివ‌శంక‌ర పాండ్యావంటి మ‌హారాష్ట్ర భాషాకోవిదున‌కు సంస్కృత పండితున‌కు అస‌త్య‌ములు వ్రాయ‌వ‌ల‌సిన య‌గ‌త్య‌ము క‌నుపింప‌దు. అందున‌ను త‌ప‌స్సంప‌న్నుల‌గు వేంక‌ట‌ర‌త్న‌ము పంతులుగారి విష‌య‌మున న‌ట్లు జ‌రుగ‌దు. శివ‌శంక‌ర‌పాండ్యాగారు ఆంగ్ల‌మున వేంక‌ట‌ర‌త్న‌ము పంతులుగారి జీవిత చ‌రిత్ర‌మును వ్రాసిర‌ని నిడ‌ద‌వోలు వెంక‌ట‌రావుగారు తెలిపియుండిరి, 3) ప్ర‌చురింప‌బ‌డ‌క‌పోవుట‌కు కార‌ణ‌ము ధ‌నాభావ‌ము కావ‌చ్చును, 4) మ‌హాశ్వేత 1893వ సంవ‌త్స‌ర‌మునైన‌, న‌స‌మ‌గ్ర‌మునైన ప్ర‌చురింప‌బడుట‌తో శివ‌శంక‌ర‌పాండ్యాగారి మాట‌ల‌ను న‌మ్మ‌క త‌ప్ప‌దు. ఎందుచేత‌న‌న‌గా ఏ ర‌చ‌యిత‌యైన‌ను అసంపూర్ణ ర‌చ‌న‌మును ప్ర‌చుణార్థ‌ము ప‌త్రిక‌కు పంప‌డుక‌దా ! మ‌రియు మ‌హాశ్వ‌త‌లోని భాష భావ‌ములు, య‌ధాత‌ధ‌ముగ బాణుని కాదంబ‌రినుండి స్వీక‌రింప‌బ‌డుట‌చే నిందు నూత‌న‌త్వ‌ము కొర‌వ‌డి న‌ది గాన న‌వాన్ లా తీతి న‌వ‌లా య‌న్న వ్యుత్ప‌త్తి స‌రిపోలేద‌ను మ‌రి యొక భావ‌మున్న‌ది. ఈ ల‌క్ష‌ణ‌ము మ‌హాశ్వేత‌యే తొలి ప్ర‌య‌త్న‌మ‌ని చెప్ప‌క చెప్పుచున్న‌ది. ఎందుచేత‌న‌న‌గా నిది ప్ర‌థ‌మ ప్ర‌య‌త్న‌ము. సాన‌లు తీయ‌బ‌డిన‌దికాదు. కాని త‌రువాత‌వారికి నూత‌న ప్ర‌యోగ‌ములు చేయుట‌కు భావ‌స్ఫుర‌ణ‌మున క‌నుకూల వాతావ‌ర‌ణ‌ము క‌ల్పింప‌బ‌డుట‌కుప‌యోగ‌ప‌డుచున్న‌ది. మ‌రియు కొక్కొండ వేంట‌క‌ర‌త్న‌ము పంతులుగారి భాషావైదుష్య‌ము నింతింత య‌న‌రాదు. మ‌రియు శివ‌శంక‌ర‌పాండ్యాగారు విగ్ర‌హ‌తంత్ర‌మున‌కు పీఠిక వ్రాసిరి. అన‌గా ఆంధ్ర భాష తెలియ‌నివారు కారు. భాష తెలియ‌నివారిచే పంతులుగారు పీఠిక వ్రాయించియుండ‌రు.

వేంక‌ట‌ర‌త్న‌ము పంతులుగారు కాదంబ‌రిని సంపూర్ణ‌ముగ న‌నువ‌దింప‌క మ‌హాశ్వేత వృత్తాంత‌ము మాత్ర‌మే తెలిగించి మ‌హాశ్వేత‌య‌ని గ్రంథ నామ‌మిడుట‌త‌ప్ప మ‌రెట్టి మార్పును చేసియుండ‌లేదు అని ర‌మాప‌తిరావుగార‌నిరి. కాదంబ‌రినుండి మ‌హాశ్వేత‌ను విడివ‌ర‌చుట‌యే నూత‌న‌త్వ‌ము. న‌వ‌ల పేరుకూడ నాయిక పేరుతో ప్రారంభ‌మ‌యిన‌ది. మ‌రియు శివ‌శంక‌ర‌పాండ్యాగారు గాక మరికొంద‌రుకూడ మ‌హాశ్వేత యొక్క సంపూర్ణ స్వ‌రూప‌మును చూచిర‌నుట‌కు సాక్ష్య‌ముగ నొక లేఖ‌ను గ్ర‌హించుట‌యైన‌ది. శ్రీ కొక్కొండ వేంక‌ట‌ర‌త్న‌ము పంతులుగారు న‌ర‌కాసుర విజ‌య‌వ్యాయోగ‌మ ను నాట‌క‌మును ర‌చించి క‌డ‌ప వాస్త‌వ్యులైన శ్రీ టి.బి.శేషాచార్యులుగారికి పంప‌గా, ఆచార్యులుగారు పంతులుగారికి త‌మ సంతోష‌ము తెలియ‌జేయుచునిట్లు ప్ర‌త్యుత్త‌ర‌ము వ్రాసియున్నారు. తాము ప‌స‌ద‌నంబుగం బంపిన న‌ర‌కాసుర విజ‌య‌వ్యాయోగ‌ము నంది యచ్ఛోదంబుగ‌నుగొన్న చంద్రాపీడుడుంబోలె బ్ర‌హృష్ట‌స్వాంతుడ‌నైతి ఈ లేఖ 1872లో వ్రాయ‌బ‌డిన‌ది. అచ్ఛోద స‌ర‌స్సును గ‌నుగొన్న చంద్రాపీడుని యుప‌మాన‌మును ఆచార్యులుగారు తెచ్చిరి గాన మ‌హాశ్వేత యొక్క నామ‌మిచ‌ట ధ్వ‌నించుచున్న‌ది. వారొక చ‌తుర‌ముగానీయుప‌ను వాడియుండిరిగాని కేవ‌ల‌ము ప‌ర‌మార్థ‌మైన‌చో చంద్రాపీడునిక‌న్న యానంద‌మును పొందిన‌వారిని ఆచార్యులుగారు ఉప‌మింప‌గ‌ల‌రు. ఒక ర‌చ‌యిత‌ను వారి వారి ర‌చ‌న‌ల పేర్ల‌తో సంభావించుట యొక్క చ‌మ‌త్కార‌ముగ లోక‌మునందున్న‌ది. కిన్నెర‌న్ మీట మ‌ధుర సంగీత‌మెత్తి, స‌ర‌తరంగిత శ్రీ‌కృష్ణ ర‌మ్య కావ్య అనియు స్వ‌ర్గ‌పు నిచ్చెన‌ల్ గట్టి నిల్సు అనియు శ్రీ విశ్వ‌నాధ‌వారిని తాడికొండ వెంక‌ట‌కృష్ణ‌య్య‌గారు ప‌ద్య‌రూప‌స‌మ‌ర్చ‌న‌ను గావించియున్నారు. ఈ గేయ‌మున కిచ్నెర శ్రీ‌కృష్ణ సంతీత కావ్య‌ము, స్వ‌ర్గానికి నిచ్చెన‌ల‌ను న‌వ‌ల మొద‌లైన కృతుల‌ను త‌ల‌పింప‌చేయుచున్న‌ట్లుగ అచ్ఛోద స‌ర‌శ్చ‌ద్రాపీడుల‌నుప‌మించుట‌లో ఆచార్యుల‌వారు మ‌హాశ్వేత‌నుత‌ల‌పింప‌చేయుచున్నారు.

న‌ర‌కాసుర విజ‌య‌వ్యాయోగ‌ము ప్ర‌థ‌మాంధ్ర అనువ‌దిత నాట‌క‌ము కాగా మంజ‌రీ మ‌ధుక‌రీయ‌మే ప్ర‌థ‌మాంధ్ర నాట‌కముగ పేరుగాంచిన ద‌వియు పంతులుగారికి న్యాయ‌ముగ రావ‌ల‌సిన కీర్తి యిచ‌ట‌కూడ లోపించుట నిడ‌ద‌వోలువారు ప్ర‌క‌టించియున్నారు. విగ్ర‌హ‌తంత్ర‌మున‌కు వ్రాసిన పీఠిక‌లోన‌నే శివ‌శంక‌ర‌పాండ్యాగారు న‌ర‌కాసుర విజ‌య‌వ్యాయోగ‌ము ఆంధ్ర వాజ్మ‌య‌శాఖ‌లో క్రొత్త పుంత‌ల‌ను క‌నుగొన్న‌దని ప్ర‌శంసించిరి. 1872వ సంవ‌త్స‌ర‌మున స‌క‌ల విద్యావ‌ర్ధ‌ని పురుషార్థ ప్ర‌దాయిని ఈ నాట‌క‌మును స‌మీక్ష చేసిన ప‌త్రిక‌లు.

ఇచ‌ట వేంక‌ట‌ర‌త్న‌ము పంతులుగారి పాండిత్య‌ము క్రొత్త దారులు త్రొక్క‌వ‌లెన‌న్న వారి యుత్సాహ‌ము వెల్ల‌డించి వారి న‌వ‌ల‌యే ప్ర‌థ‌మాంధ్ర న‌వ‌ల‌య‌ని నిరూపించుట‌కు ప్ర‌య‌త్న‌ము జ‌రిగిన‌ది. న‌వ‌ల‌కు పేరు రానంత మాత్ర‌మున మ‌రియొక‌రు ప్ర‌శంసింప‌నంత మాత్ర‌మున‌, ప్ర‌య‌త్న‌ము, ప్ర‌య‌త్న‌ము కాక‌పోదు. ఇందువ‌ల‌న రంగ‌రాజు చ‌రిత్ర‌ము గాని రాజ‌శేఖ‌ర చ‌రిత్ర‌ముగాని ఖ్యాతినొందిన న‌వ‌ల‌య‌గునేకాని ప్ర‌థ‌మ న‌వ‌ల కాదు. ఆంగ్ల భాషానువాద‌మువ‌ల‌న‌గాక సంస్కృత భాష‌నుండియే ప్ర‌థ‌మాంధ్ర న‌వ‌ల యావిర్భ‌వించుట సువ్య‌క్త‌ము. ఆంగ్ల భాష‌నుండి న‌వ‌ల యుద్భ‌వించిన‌దికాద‌ని తెలుపుట‌యే యిచ‌టి యుద్దేశ‌ముకాని వేఱొక భాష‌నుండి ప్రేర‌ణ‌నంది ర‌చ‌న‌లు చేయుట సాహిత్య‌మున‌కు లోప‌ముగ భావించుట‌కాదు. ఆదాన ప్ర‌దాన‌ముల‌చేత‌నే భాష‌గాని సాహిత్య‌ముగాని విస్తృత శాఖ‌ల‌లో పుష్టినొందున‌న్న‌ది నిర్వివాదాంశ‌ము. ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌ర‌ములు సంభాష‌ణ‌ము, సామాన్య‌మైన క‌థాక‌థాన‌మేగాక జేమ్స్ జాయిస్ వంటివార‌లు న‌వ‌ల‌ను ఆంత‌రంగిక‌ములైన క‌ద‌లిక‌లోనికి కొనిపోయిరి. మాన‌వ‌మేథ‌కు హృద‌య‌మున‌కు సంబంధించిన న‌వ‌ల‌ల‌ను ర‌చించియుండిరి.

విశ్వ‌నాథ‌వారి నవ‌ల‌లో క‌థ‌లో నెక్కువ భాగ‌ము ఉత్త‌ర‌ముల రూప‌మున న‌డిచిన‌ది. అశ్వ‌మేథ‌ము ఆఱు న‌దులు ఉప‌న్యాస‌పూర్వ‌క‌ముగ న‌డిచిన న‌వ‌ల అంత‌రంగ‌మును త్ర‌వ్వుకొనుచుపోయెడి న‌వ‌ల ఏక‌వీర మ‌నోవిశ్లేష‌ణాత్మ‌క‌మైన‌వి ధ‌ర్మ‌చ‌క్ర‌ము గంగూలీ ప్రేమ‌క‌థ వంటివి.