7
 

 

 

నవ‌ల‌లోని వ‌స్తువుతో పాత్ర‌లు స‌మ్మేళ‌న‌ము పొంద‌వ‌లెను. పాత్ర‌ల యొక్క మ‌న‌స్త‌త్వ‌మును క్ర‌మ‌వికాస‌ముతో న‌నుశీల‌న‌ము గావించిన‌ప్పుడే ప్ర‌కృతి స‌దా ప్ర‌త్యుత్ప‌న్న‌మ‌గుచునేయుండును. మాన‌వునిలోని కోరిక‌లు గాని మ‌నస్సుగాని ధ‌నాధుల‌కు లోబ‌డియుండ‌వు. వాని ప‌రిధిని దాటి చ‌రించుట‌కే యి సంసిధ్ధ‌మ‌గుచుండుట ప్ర‌కృతి సిద్ధ‌ము. రిక్షా నడిపి జీవించువానిచేత న‌వ‌ల‌లోగాని నాట‌క‌ములోగాని పెద్ద పెద్ద వేదాంత వాక్య‌ముల‌ను వెల్ల‌డింప‌జేయుట పాత్ర‌క‌నౌచిత్య‌మ‌ని విమ‌ర్శ‌కుల‌నుచుందురు. కాని ఇచ‌ట రిక్షావాడు వేదాంత‌ము చెప్పుట అస‌హ‌జ‌ముకాదు. వాని భాష వానికి త‌గినట్లుగ నుండ‌వ‌లెన‌న్న‌దే ముఖ్య‌ము. వేదాంత‌మ‌న్న‌దిగాని బుద్ధియ‌న్న‌దిగాని వ్య‌క్తుల సంస్కార‌మునుబ‌ట్టి జ‌నించున‌దేగాని వారి పాఠ‌శాల క‌ళాశాల‌ల‌లోని చ‌దువువ‌ల‌న‌గాని ధ‌న‌మువ‌ల‌న‌గాని జనించున‌దికాదు. ఈ విష‌య‌మును శ్రీ విశ్వ‌నాథ సంజీవ‌క‌ర‌ణి య‌న్న పంచ‌మ కుల‌ములోని బాలిక చేత‌ను స్వ‌ర్గానికి నిచ్చెనలు లోని శ‌శిచేత‌ను నిరూపింప‌జేసియున్నారు. శ‌శి హ‌రిజ‌న కుటుంబ‌ములో పుట్టిన‌ది. విశ్వ‌నాథ‌వారు పాత్ర‌ల‌ను స‌మాజ‌ము నుండియే స్వీక‌రించిర‌నుట‌కు సాక్ష్య‌ముగ శ‌శి పాత్ర‌ను తీసికొన‌వ‌చ్చును. కృష్టా జిల్లాలో కురుమ‌ద్దాలియ‌న్న గ్రామ‌మున పిచ్చ‌మ్మ అను ఒక హరిజ‌న స్త్రీ 1870లో జ‌నించి పూర్వ‌జ‌న్మ సంస్కార‌వ‌శ‌మున పాత్ర వ‌స్తు, శిల్ప‌, వ‌ర్ణ‌నానై పుణ్య‌ముల‌తో నున్మీల‌న‌మై ప్ర‌శ‌స్తి వ‌హించును.

పాత్ర‌ల యొక్క క్ర‌మ‌వికాస ప‌రిణామ‌మున‌కు వేయి ప‌డ‌గ‌లులోని గ‌రిక మొక వ‌చ్చుతున‌క‌. విశ్వ‌నాథ‌వారు సృష్టించిన ప్ర‌తీక‌పాత్ర‌లు స‌హిత‌ము స‌హ‌జ‌ములుగ క‌న్ప‌ట్టుట‌కీ క్ర‌మ వికాస‌మే కార‌ణ‌ము.


పాత్ర పోష‌ణ‌యే న‌వ‌ల‌కు భావాత్మ‌య‌ని బొడ్డ‌పాటి కుటుంబ‌రావుగారి య‌భిప్రాయ‌ము. వీరు ఈ విష‌య‌మున ఆంధ్ర న‌వ‌ల‌ల‌కు ఆమెరిక‌ను న‌వ‌ల‌లు ఆచార్య‌త్వ‌మును నెర‌పిర‌నిరి. జాతీయ న‌వ‌ల‌కు శ‌రీర‌తుల్య‌మ‌నిరి. సాంఘిక రాజ‌కీయాది దృష్టుల‌చేత న‌వ‌ల‌కు పాత్ర‌పోష‌ణ‌ము భావాత్మ‌య‌గుచున్న‌ది. కావున న‌వ‌ల‌కు పాత్ర పోష‌ణ‌ము ప్రాణ‌మున‌క‌న్న మిన్న య‌గుచున్న‌ది.

చిన్న పిల్ల‌లు తమ య‌భిరుచికి త‌గిన‌ట్లుగ బొమ్మ‌ల‌ను పేర్చుకొనన‌ట్లు ర‌చ‌యిత‌లు త‌మ ప్ర‌కృతిని త‌గిన పాత్ర‌ల‌ను సృష్టింతుర‌ని ఆంగ్ల విమ‌ర్శ‌కుడు ఆల్ట‌ర్ ఎలెన్ యొక్క భావ‌ము. విశ్వ‌నాథ‌వారి పాత్ర సృష్టిని చూచిన‌చోనీ విష‌య‌ము నూటికి నూరుపాళ్ళు స‌త్య‌మ‌గుచున్న‌ది. వేయి ప‌డ‌గ‌లు లోని ధ‌ర్మారావు విశ్వ‌నాధ‌వారేయ‌ని పెక్కురు విమ‌ర్శ‌కులు పేర్కొనియున్నారు. ఆయ‌న‌లోని భ‌క్తికి గిరిక‌ను, జ్ఞాన‌మున‌కు ధ‌ర్మారావును, వైరాగ్య‌మున‌కు హార‌ప్ప‌ను, యోగ‌మున‌కు గ‌ణాచారిని చెప్పిన‌చో విశ్వ‌నాథ స‌మ‌గ్ర వ్య‌క్తిత్వ‌ము బహిర్గ‌త‌మ‌గును.

షేక్‌స్పియ‌ర్ త‌న నాట‌క‌ముల‌లో కొన్ని పాత్ర‌ల‌ను త‌న జీవిత గాథ‌కు సంబంధించిన కొన్ని సంఘ‌ట‌న‌ల‌కు ప్ర‌తికృతులుగ చిత్రించెన‌ను వాదు క‌ల‌దు. విశ్వ‌నాధ‌వారి వివాహ‌ము ప్ర‌థ‌మ భార్యా మ‌ర‌ణ‌ము ద్వితీయ వివాహ‌ము వార‌నుభ‌వించిన దారిద్ర్య‌ము మొద‌ల‌గు విష‌య‌ములు వేయి ప‌డ‌గ‌లు లో య‌ధాత‌ధ‌ముగ చిత్రింప‌బ‌డిన‌వి.

షేక్ స్పియ‌ర్ నాట‌క‌ముల‌లోని కొన్ని పాత్ర‌లు ర‌చ‌యిత‌ను మించి పోయి య‌ధేచ్చ‌ముగ సంచ‌రించున‌నియు ఆత‌నికి తాను సృష్టించిన కొన్ని పాత్ర‌ల‌న్న మ‌క్కువ ఎక్కువ‌నియు వాల్ట‌ర్ ర్యాలి పండితుడు నుడివెను. విశ్వ‌నాథ‌వారికి కూడ త‌న పాత్ర‌ల‌పై య‌నంత‌మైన సానుభూతియున్న‌ది. ధ‌ర్మ‌మును వ్య‌తిక్ర‌మించిన పాత్ర‌ల‌పై కూడ‌నీ సానుభూతికి క‌రుణ‌కుపార‌ము లేదు. ధూమ‌రేఖ‌ల లోని వేద‌మరీచి ప‌రిస్థితుల ప్ర‌భావ‌ముచేత వ‌రుస‌కు పిన‌తండ్రియైన‌వానితో న‌క్ర‌మ‌మైన సంబంధ‌ము పెట్టుకొనిన‌ది. ఆమె ప‌రిస్థ‌తి క‌రుణాత్మ‌క‌ముగ వ‌ర్ణిత‌మైన‌దేగాని ధూషించిన‌ట్లుండ‌దు. అట్ల‌ని ర‌చ‌యిత ఆమె చేసిన దుష్క‌ర్మ‌ను స‌మ‌ర్థించెన‌న‌రాదు. పాఠ‌కుల కామెపై యేహ్య‌త‌గాక ఆమెకట్టి స్థితిని క‌ల్పించిన ప‌రిస్థితిపై యేహ్య‌త క‌లుగును. ఇట్టి పాత్ర చిత్ర‌ణ‌ము చేయుట‌లో విశ్వ‌నాథ‌వారి దందెవేసిన చేయి.

ర‌చయిత‌ను ధిక్కిరించి య‌ధేచ్ఛ‌ముగ సాగిపోయిన పాత్ర‌లు కూడ విశ్వ‌నాధ‌వారి న‌వ‌ల‌లో లేవ‌న‌రాదు. ఇట్టి ప‌రిస్థితి ర‌చయిత అనుభ‌వ‌మున‌కు మించిన పాత్ర‌ల‌ను సృష్టించినప్పుడే సంభ‌వించిన‌ది. బ్ర‌హ్మ‌రాక్ష‌సులు, పిశాచ‌మ‌లు మొద‌లైన‌వి మ‌హోప‌న్యాస‌ముల చేయుట స్వ‌ర్గానికి నిచ్చెన‌లు లోని భ‌ర్తృపిశాచ‌మును, ల‌లితా ప‌ట్ట‌ణ‌పురాణి లోని కాల‌భ‌ట్టు అన్న బ్ర‌హ్మ‌ర‌క్ష‌స్సును ఈ విష‌య‌మున నుద‌హ‌రింప‌వ‌చ్చును.

కొంద‌రు ర‌చయిత‌లు పాత్ర‌లు స‌జీవ‌ముగ‌నుండున‌ట్లు చిత్రించుట‌కు కార‌ణ‌ము వారు త‌మ య‌నుభ‌వ‌ముల నా పాత్ర ద్వారా ప్ర‌వేశ పెట్టుట‌యే య‌నియు. విఫ‌ల‌మైన తావుల‌లో వారిక‌నుభ‌వ శూన్య‌త‌యే కార‌ణ‌మ‌నియు ముంద్రా వ‌చించియుండిరి. జార్జి ఇలియ‌ట్‌, డికెన్స్‌, జేన్ ఆస్టిన్ మొద‌లైన నవ‌లాకారులు త‌మ న‌వ‌ల‌లో ప్ర‌తిబింబించిన‌ట్లుగ విశ్వ‌నాథ‌కూడ త‌మ న‌వ‌ల‌లో త‌మ అంత‌రంగ‌మ‌ధ‌న‌ము, త‌మ న‌మ్మ‌క‌ములును విశ్వాస‌ముల‌ను, జ్ఞాన‌మును విరాట్స్వ‌రూప‌ముతో నిన‌దింప‌జేసియున్నారు. ఇట్లు చేయుట ఋషితుల్యుడైన క‌వికి మాత్ర‌మే సాధ్య‌ము. ర‌చ‌యిత‌లేగాక చిత్రకారులు కూడ త‌మ‌ను తాము త‌మ కృతుల‌లో ప్ర‌తిబింబింప‌జేసికొనుట కుత్సాహ‌ప‌డుదుర‌ని ముంద్రాగారు వ్రాసియున్నారు. కార్వో అను చిత్ర‌కారుడు త‌న పోలిక‌లుగ‌ల చిత్ర‌ముల‌ను న‌లుబ‌ది చిత్ర‌ముల‌ను వ్రాసెన‌ట‌.

పాత్ర చిత్ర‌ణ‌ము రెండు ర‌క‌ములుగ‌నుండును. ప్ర‌త్య‌క్ష విధాన‌ము ప‌రోక్ష విధాన‌ము పాత్రము యొక్క ఆకృతిలోని ముఖ్య విష‌య‌మ‌లును పేర్కొని వ‌ర్ణించి చెప్పుట ఒక విధ‌ము. పాత్ర‌ము యొక్క స్వ‌భావ‌మును గుణ‌ముల‌చేత వ‌ర్ణించి చెప్పుట రెండ‌వ విధ‌ము. అని శివ‌రావుగారు అభిప్రాయ‌ప‌డియున్నారు. అన‌గా గుణ‌వ‌ర్ణ‌న‌మొక‌టియ‌ని వీరియుద్ధేశ‌ము. రూప‌మున‌కు ప్రాధాన్య‌మిచ్చుట ముఖ్యాంశ‌ముకాదు గావున రెండు విధ‌ములైన పాత్ర చిత్ర‌ణ‌ము లిట్లుండ‌వ‌లెను.