3
 

 

త‌మంత‌తాముగా త‌మదేశానికి త‌మ సోద‌రుల‌కి ఆత్మ నిష్ఠ‌తో ప్రేమ‌తో సాయ‌ప‌డేదుంకు సేవ చేసేందుకు ఐచ్చికంగా ముందుకు వ‌చ్చిన‌వారే ఈ సంస్థ‌లో స‌భ్యులు కాగ‌ల‌రు. ఇందుకు వ‌ల‌సిన త్యాగ‌నిర‌తి, శీల‌సంప‌త్తి, దేహ‌దారుఢ్య‌ము, స‌దాచార‌ము శిక్ష‌ణ వ‌ల్ల మ‌రింత దీప్తివంత‌మ‌య్యేందుకు కృషి చేసేలా డాక్ట‌ర్‌జీ నేతృత్వంలో రూపుదిద్దుకున్న మ‌హాసంస్థ ఇది. దీనినే రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్ అంటారు.

ఇప్ప‌టితో నేనూ నాదేశ‌మూ అన్న నినాద‌ము మ‌న‌ము -  మ‌న దేశ‌ము క‌ష్ట సుఖాలు సుఖ‌దుఃఖాలు మ‌న అంద‌రివి అనే స‌మాన భావం ఔన్న‌త్యంతో విశాల‌మై అల‌రారింది.

ప‌ర‌స్ప‌ర ప్రేమ అభిమానం, గౌర‌వం, ఆద‌రం అభిమానం మొద‌లైన స్వ‌భావాల‌తో పెన‌వేసుకున్న ఆత్మీయ భావం మ‌రెక్క‌డా క‌న‌లేమ‌ని నాయ‌కులు ప్ర‌స్తుతించారు.

ఇందులో ఒక‌రు పెద్ద ఒక‌రు పిన్న అన్న భావం లేదు. ఒక‌రు పాల‌కులు ఒక‌రు పాలితులు లేరు. ఒక కులం, ఒక శాఖ‌, ఒక తెగ‌, ఒక కుదురు అన్న భేదాలు లేవు. అంద‌ర‌మూ ఒక్క టేన‌న్న మ‌హాభావం ఊపిరి పోసుకోగా ఈ సంఘ‌ట‌న ఏర్ప‌డింది.

ఒక మ‌హోన్న‌త ల‌క్ష్య‌సాధ‌న‌కు ఏర్ప‌డిన ఈ స్వ‌యం సేవ‌క సంస్థ జాతి ప్ర‌జ‌ల‌లో స‌త్య‌మైన శాశ్వ‌త‌మైన దేశ‌భ‌క్తిని క‌లిగించ‌డ‌మేగాక దేశాన్ని ప‌రిపూర్ణ శ‌క్తిమంతంగా కూడా చేయ‌గ‌ల‌దు. అని ప్రముఖ చ‌రిత్ర‌కారుడు ఆర్‌.సి. మ‌జుందార్ డాక్ట‌ర్‌జీ ఉన్న‌త‌ద‌ర్శాల‌కు జోహారుల‌ర్పించారు.

హిందూదేశం, హైంద‌వ నాగ‌రిక‌త హైంద‌వ ధ‌ర్మం, హైంద‌వ సంస్కృతి ఇవ‌న్నీ, ఈనాటివా ? బ‌హు పురాత‌న‌మైన‌వి. మిగిలిన ప్ర‌పంచానికి ఆద‌ర్శంగా ఉండ‌గ‌ల‌ట్టివి. ఇట్టి భావాల‌ను ప్ర‌జ‌ల‌లో మొల‌కెత్తించ‌వ‌ల‌సిన ప‌నిలేదు. అవి వారిలో స‌హ‌జంగా ఉన్న‌వే. కాని నిద్రాణ‌మై ఉన్న‌వి నిశ్శ‌క్త‌మై ఉన్న‌వి. వాటిని జాగృతం చెయ్యాలి. చైత‌న్యవంతం చెయ్యాలి. కాంతివంతం చెయ్యాలి.

డాక్ట‌ర్ కేశ‌వ‌రావు హెడ్‌గెవార్‌జీ తాను స్వ‌యంగా స్వ‌యం సేవ‌కుడై చెప్పిన‌ద‌ల్లా ఆచరించిన ఆద‌ర్శ‌మూర్తియై అంద‌రికీ ఆరాధ్యుడైనాడు. గాంధీజీ, ప‌టేల్‌, మాల‌వ్యా వంటి ప్రముఖులు డాక్ట‌ర్ జీ కృషిలోని ఉన్న‌తాద‌ర్శాల‌నూ ఆశ‌యంలోని స్వార్థ‌రాహిత్యాన్నీ అభినందించారు.

గాంధీజీ కాంగ్రెసులోనే ఇలాటి సంస్థ‌ను ఒక దానిని ఏర్పాటు చెయ్య‌క ప్ర‌త్యేక‌మై సంస్థ ఎందుకు అని డాక్ట‌ర్ జీని ప్ర‌శ్నించారు.

డాక్ట‌ర్ జీ త‌మ సంస్థ రాజ‌కీయాల‌కు ద‌వ్వుగా ఉంటుంద‌ని స‌మాధానం చెప్పారు.

ఇలా డాక్ట‌ర్ జ స్థాపించిన రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్ వాడ వాడ‌లా పేట పేట‌లా ప‌ట్ట‌ణాల్లోనూ, న‌గ‌రాల్లోనూ శాఖోప‌శాఖ‌లుగా విస్త‌రించి జాతీయ వృక్షంగా అజేయంగా అద్వితీయంగా అవిచ్ఛిన్నంగా దిన‌దిన  ప్ర‌వ‌ర్థ‌మాన మ‌వుతూనే వుంది.

ఎక్క‌డ ఏ అవ‌స‌రం, ఏ అప‌ద, ఏ ఘాతుకం ఏ సాయం ఏ అవ‌శ్య‌క‌త ఏది వ‌చ్చినా అక్క‌డ స్వ‌యం సేవ‌కులు సిద్ధంగా ఉంటారు. మాన‌సిక‌, శారీర‌క‌, చిత్త‌ద్ర‌ఢిమ‌తో నిస్వార్థంగా ప్రేమ పూరిత‌మైన సేవ‌లందిస్తారు. ఏం జ‌రిగినా స‌రే మీరు నిరంత‌ర కృషితో ప్ర‌జ‌ల హృద‌యాల‌ను దోచుకోగ‌లుగుతారు.

ఇంత‌టి మ‌హ‌త్కార్యాన్ని సాధించ‌గ‌ల కేశవ‌రావు హెడ్గెవార్ ఓ విశిష్ట‌మైన శిశువుగా ఉగాది ప‌ర్వ‌దినాన ఉద‌యించినప్పుడు పుడ‌మిత‌ల్ల పుల‌క‌రించింది. వంద‌లు వేలుగా త‌న క‌న్న బిడ్డ‌లు క్ర‌మ శిక్ష‌ణ‌తో కదంతొక్కుతున్న‌పుడు పుడ‌మిత‌ల్లి బిడ్డ‌ల మీద ప్రేమాధిక్యంతో పుల‌కరించింది. స్వార్థ‌ర‌హితంగా త‌మ జీవితాల‌ను మాతృ సేవ‌కు కైంక‌ర్యం చేసుకుంటున్న త‌న ముద్దు బిడ్డ‌ల్ని చూసి సంతోషంతో పుడ‌మిత‌ల్లి పుల‌క‌రించింది.