6
 

- శ్రీ‌మీతి సుగుణ‌మ‌ణి.

 

స్వాతంత్య్ర మ‌హాపోరాటంలో సార‌ధ్యంవ‌హించి ఫాద‌ర్ ఆఫ్ ది నేష‌న్ అన్న ప్రఖ్యాతి గాంచిన‌వాడు మహ్మ‌తాగాంధీ.గాంధీజీ కుడిభుజాల‌వ‌లె  వీర సింహాలై పోరాడిన అతిర‌ధ మ‌హార‌ధులెంద‌రో ఉన్నారు. అంద‌రిపేర్లూ చ‌రిత్ర కెక్క‌లేదు. అంద‌రికీర్తి శాశ్వ‌తంగా నిలిచిపోలేదు. కొంద‌రే ఆచంద్ర‌తారార్కంగా య‌శోవంతు ల‌వ‌డం కొంద‌రు విస్మ‌రింప‌బ‌డ‌టం అన్నిరంగాల్లోనూ చూస్తూనే ఉన్నాము.

ఇలాగే ఆంధ్ర మ‌హిళ‌ల అభ్యున్న‌తికై అహోరాత్రులూ శ్ర‌మించి వారికోసం ఎన్నో సంస్థ‌ల‌ను స్థాపించిన దుర్గాబాయి దేశ‌ముఖ్ గారి గురించి తెలియ‌ని వారుండ‌రు. ఈమె అన్ని నిర్మాణాల‌ను చెప‌ట్టి విజ‌యవంతంగా పూర్తిచేయ‌గ‌ల‌గ‌డంలో, చేదోడు వాదోడుగా, తోడునీడ‌లుగా, కుడి భుజాలుగా, ఎంద‌రో మ‌హిళామ‌ణులు శ్ర‌మ‌ద‌మాదుల‌కోర్చి త్యాగ‌దీక్ష‌తో స‌ర్వార్ప‌ణం చేసిన వారున్నారు అలాంటి ఒక కుడిభుజ‌మే శ్రీ‌మ‌తి సుగుణ‌మ‌ణి.

కంచ‌ర్ల సుగుణ‌మ‌ణిగారిని క‌లుసుకొన్న వారెవ‌రైనా ఆమె నిరాడంబ‌ర‌త‌కు స్వార్థ రాహిత్యానికి జోహారు చేయ‌కుండా ఉండ‌లేరు అన్నిటిక‌న్న మిన్న‌గా ఆమెకున్న ఒక విశిష్ట‌మైన సుగుణం ఆమెకి ఇసుమంతైనా కీర్తి కాంక్ష‌లేక పోవ‌డ‌మే !

సుమారున‌లుబ‌ది సంవ‌త్స‌రాలుగా దుర్గాబాయిగారితో స‌రిస‌మంగా కృషిచేసిన‌ప్ప‌టికిన్నీ సుగుణ‌మ‌ణిగారు దుర్గాబాయిగారి క్రీనీడ‌లోనే నిల‌చి పోడానికి మొగ్గుచూపించ‌డం చూస్తూంటే ఆమెగారి నీమె అప‌ర‌దేవ‌త‌గా పూజించుకొన్నట్లుగా భావించ‌క త‌ప్ప‌దు. ఇన్ని సంవ‌త్స‌రాల త‌రువాత కూడా దుర్గాబాయిగారితో త‌మ ప్ర‌ధ‌మ స‌మాగమాన్ని త‌ల‌చుకొని ఆశ్రు త‌ర్ప‌ణం  చేశారంటే సుగుణ‌మ‌ణిగారి హృద‌యంలో దుర్గాబాయిగారెంత‌టి మ‌హోన్న‌త స్థానాన్ని పొందారో అనుహ్య‌మైన విష‌యం.

అస‌లు మ‌హిళా సేవ‌చేయాల‌నే త‌ప‌ర మీ కెందుకు క‌లిగింది ?  అన్న ప్ర‌శ్న‌కు సుగుణ‌మ‌ణిగారు సేవ‌భావం వారికి వంశ‌పారంప‌ర్యంగా వ‌చ్చిన‌దేన‌ని చేప్పారు. ఆమె తండ్రి వెంక‌ట‌స్వామి నాయుడుగారు ప‌ర‌రాజుల క్రింద ఉద్యోగం చేయ నిరాకరించి పిఠాపురుం రాజావారు న‌డిపే అనాధ శ‌ర‌ణాల‌య పాఠ‌శాల‌ను ప్ర‌ధానోపాధ్యాయుడుగా ప‌నిచేసారు. తండ్రిగారి శిక్ష‌ణలో ఎవ‌రినీ మీదేకులం ?  అన్న ప్ర‌శ్న అడ‌గ‌డానికి నోరు విడివ‌డేవికాదు. అన్ని కులాల వారి తోనూ ధ‌నికులు పేద‌లు అన్న విచ‌క్ష‌ణ లేకుండా స‌హ‌పంక్తి భోజ‌నాలు వారి క‌ల‌వాట‌యి పోయినాయి.

 చిన్న బాలిక‌గా ఏడెనిమిదేళ్ళ వ‌యస్సులో ఉన్న‌పుడు దుర్గాబాయి బులుసు సాంబ‌మూర్తి గారు మొద‌లైన నాయ‌కులు. అసంఖ్యాకంగా కాకినాడ వీధుల‌లో వందేమార‌తం గీతాలు పాడుకొంటూ, మా కొద్దీ తెల్ల దొర‌త‌న‌ము అనే బ్రిటీషు వ్య‌తిరేక గేయాలు ఆల‌పించుకొంటూ వెడుతూవుంటే సుగుణ‌మ‌ణి ఉత్తేజ‌ప‌డి పోయేదిజ‌. ఆ లేత వ‌య‌సులోనే త‌మ‌దేశానికి జ‌రిగే అన్యాయాల‌కు మ‌న‌సు చెప్ప‌రాని బాధ‌కు లోనుకాగా గుండెలోని ర‌క్తం తెలీని ఆవేశాల‌కు కుత‌కుతఉడికి పోయేది. తానేం చేయాలి ?  ఏమి చేయ‌గ‌ల‌దు ?

ఇలా ఆమె ఊహ‌లుసాగిపోతూంఉండేవి. వ‌య‌సుకు మించిన భావాలు శ‌రీరానికి మించిన ఆలోచ‌న‌లూ ఎదిగిపోతూ ఉండేవి. బ్రిటీషు రాక్ష‌సునెలా త‌రిమికొట్టాలి. ఇలా ఒక బాలిక‌లో దేశ‌భ‌క్తి త్యాగ‌నిర‌తీ సేవాదీక్షా పుష్క‌లంగా పండటానికి హృద‌య క్షేత్రం ఆరోగ్య‌క‌రంగా సుంద‌రంగా సాగుచేయ‌బ‌డింది.

ఆ రోజుల్లో బ్రిటీషు పాల‌కుల‌కు వ్య‌తిరేకంగా ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ వారు స‌భ‌లూ స‌మావేశాలూ నిర్వ‌హిస్తూ ఉండేవారు. ఆ స‌భ‌ల‌ను భ‌గ్నం చేయ‌డంలో బ్రిటీషువారి సేవ‌కులైన హిందూదేశ‌శ‌స్థులే ముఖ్య పాత్ర వ‌హిస్తూ ఉండేవారు. ఇలాటి విష‌యాల్లో ఘ‌టికుడ‌ని పోలీసు స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ఉద్యోగంలో చేరిన సుబ్బారావు ఘ‌ర‌కీర్తి పొందాడు. అత‌డు అసంఖ్యాకంగా డ‌ప్పులు రావించి మీటింగుల వద్ద వాయింపించి ప‌క్క‌వాడిక్కూడా ఒక్క మాట వినిపించ‌కుండా చేసేవాడు. అందుచేత ఈయ‌న‌గారికి డ‌ప్పుల సుబ్బారావు అనే నామం ఖాయ‌ప‌డి పోయింది. వీరు చేసిన సేవ‌ల‌కు మెచ్చిన దొర‌లు సుబ్బారావుకు డి.ఎస్‌.పి గా ప్ర‌మోష‌న్ ఇచ్చేసారు.

ఒక‌నాడు బుల‌సు సాంబమూర్తిగారి అధ్య‌క్ష‌త‌న కాకినాడ‌లో స‌భ జ‌రుగుతూ ఉంది. డ‌ప్పుల సుబ్బారావు పట్నంలో 144వ సెక్ష‌న్ ఉన్న‌ది కావున అంద‌రూ ఎక్క‌డి వార‌క్క‌డ త‌ప్పుకోల‌నే ఆజ్ఞ‌ను జారీచేశారు. కాని బులుసువారు అరంగుళం అయినా క‌దిలారుకారు. అధికార‌మ‌దంతో క‌నులు మూసుకొని పోయిన డి.ఎస్‌.పి. బులుసువారి త‌ల‌మీద లాఠీ తాండ‌వం చేసింది. వార త‌ల‌ప‌గిలి ర‌క్తం శివ‌జ‌టాజూటంనుండి పొంగువ‌చ్చే భాగీర‌థి లాగే ఉరుకులు ప‌రుగుల‌తో పెల్లుబికి పోయింది. ఆగ్ర‌హోదాగ్ధులైన దేశ భ‌క్తులు కొంద‌రు బులుసు వారి ర‌క్తాన్ని బేసిన్ల‌తో ప‌ట్టివేసి హాల్లో భ‌ద్ర‌ప‌ర‌చారు. ఆ ర‌క్తాన్ని చూచిన ఏ స్వ‌దేశీయుని ర‌క్తం ఉడుకెత్తి ఆవేశంతో ప‌ర‌వ‌ళ్ళు తొక్క‌దు ?  చిన్న‌పిల్ల సుగుణ‌మ‌ణి కూడా ఆ ప‌క్క‌నే ఉన్న స్కూల్లో చ‌దువుతూండ‌టంవ‌ల్ల టౌన్‌హాలుకి వ‌చ్చి ఈ ర‌క్తాన్ని చూచి ఉడుకెత్తి పోయింది. ఇదమిధ్ధ‌మ‌ని చెప్ప‌లేని ఆవేశంతో ఊగిపోయింది. ఆనాటి నుంచీ ఆపాప‌కు ప‌రోప‌కార చింత‌నే నేను ఎవ‌రికేమి చేయ‌గ‌ల‌ను అన్న త‌ప‌నే. బీహారులో భూకంపం వచ్చినా, గోదారితల్లికి వ‌ర‌ద‌లు వ‌చ్చినా, రాయ‌ల‌సీయ‌లో కాట‌కం వ‌చ్చినా, సుగుణ‌మ‌ణి న‌డుముబిగించేది. బుల్లిబుల్లిచేతులు చాచి త‌న‌కోసం కాక ఆర్తుల‌కోసం యాచిస్తే ఏరాతి గుండైనా మాత్రం క‌ర‌గ‌క మానుతుందా ?  బియ్య‌మూ డ‌బ్బులూ పాబ‌ట్ట‌లూ పోగుచేసి పెద్ద‌వారి కంద‌చేసేది. ఉడ‌తా భ‌క్తిని చూపించేది.

ఈ ధ‌న‌సేక‌ర‌ణ విద్య పెద్ద‌ద‌యిన త‌రువాత మరింత‌గా ఉప‌యోగ‌ప‌డింది. కాలేజీలో ఉన్న‌త‌విద్య న‌భ్య‌సించి త‌న ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకోడమేగాక మ‌దిలోన క‌దిలే త‌ప‌న‌ల‌కు అక్ష‌ర‌రూపాన్నిచ్చి గృహ‌ల‌క్ష్మి హిందూసుంద‌రి భార‌తి వంటి ప‌త్రిక‌ల‌లో వ్యాసాలు ప్ర‌క‌టించేది.

అప్పుడే దుర్గాబాయిగారు ప్రారంభం చేసిన ఆంధ్ర‌మ‌హిళ ప‌త్రిక వెలుగులోకి వ‌స్తోంది. ఒకచిన్న ఇంటిని అద్దెకు తీసికొని లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావ‌న్ అని చిన్న‌చిన్ని పాపాయిల‌కు డాన్సు పాట‌లునేర్పుతూ ఉండేవారు చిన్న పిల్ల‌ల‌ను వెంట‌బెట్టుకొని వ‌చ్చిన త‌ల్లులు పిల్ల‌ల‌ను బోధ‌న పూర్త‌య్యేవ‌ర‌కు ఊర‌కే కూర్చోలేక త‌మ‌కు కూడా ఏదైనా నేర్ప‌మ‌ని కోరారు. దుర్గాబాయీ వార త‌ల్లిగారూ ఈ పెద్ద‌ల‌కు హిందీ భోధించ‌డం మొద‌లు పెట్టారు.

ఈ ప‌రిస్థితిలో సుగుణ‌మ‌ణి దుర్గాబాయిని క‌లిసి ఆమెసంస్థ‌ల‌లో దేనిలోనైనా తాను కూడా ప్ర‌వేశించేటందుకు అవ‌కాశ‌మిమ్మ‌ని వేడుకొన్నారు. త‌మ‌కు జీతం నాతం అక్క‌ర‌లేద‌నీ ధ‌న‌వాంఛ త‌న‌కు లేద‌నీ సంఘ‌సేవ చేయాల‌న్న‌దే త‌మ జీవిత‌ధ్యేయ‌మ‌నీ సుగుణ‌మ‌ణి చెప్పిన‌ప్పుడు ల‌క్ష‌ల ధ‌నాన్ని ఆర్జించుకోవ‌చ్చును గాని ఇంత‌టి స‌హృద‌యురాల్ని, సంపాదించుకోగ‌ల‌గ‌టం క‌ష్టం అని దుర్గాబాయి ఆర్థ్ర‌న‌య‌నాల‌తో సుగుణ‌మ‌ణిని గాఢాలింగ‌నం చేసికొన్నారు. దుర్గాబాయి స్వ‌ర్గ‌స్థురాల‌యినా సుగుణ‌మ‌ణి హృద‌యంలో ఆక్ష‌ణం సుస్థిరంగానిలిచి పోయింది.

ఆంధ్ర‌మహిళాస‌భ ఎలా అయితే దిన దినాభివృద్ధిగా ఇంతింతై వ‌టుడింతై అన్న రీతిలో పెరిగిపోతోందో అలాగే స‌భ‌తో పాటు సుగుణ‌మ‌ణిగారి నిస్స్వార్థ‌సేవ కూడా ఎదిగిపోయింది. ఇంటింటికి వెళ్ళి ఆణాలు, పావ‌లాలు, ఎంత చిన్న‌మొత్త‌మైన‌సరే గృహిణులు మ‌న‌స్పూర్తిగా ఇచ్చిన‌దాన్ని చెంగుల‌తో పోగుచేసి కూడా బెట్టిన వీరికి త‌రువాత త‌రువాత వేలు ల‌క్ష‌లు పోగుప‌డ సాగినాయి.

మూడ‌వ త‌ర‌గ‌తి అయిద‌వ త‌ర‌గ‌తి కూడా చ‌ద‌వని మ‌హిళ‌ల‌ను, విధివంచిత‌ల‌ను, బీద‌వారిని,  చ‌దువుమీద ప్రేమ ఉండి అవ‌కాశాలు ల‌భించ‌ని వారినీ చేర‌దీసి బెనార‌స్ మెట్రిక్‌కు క‌ట్టించి అందులో శిక్ష‌ణ ఇప్పించి ప‌రీక్ష‌లు వ్రాయించేవారు. ఈ పాఠ‌శాల‌కు మ‌ద్రాసు ఒరిస్సా ఆంధ్ర (నేటి) బెంగుళూరు కేర‌ళ మొద‌లైన ద‌క్షిణ ప్రాంతాల స్త్రీలు చాలా మంది వచ్చిచేరి విద్యావంతులు కాసాగినారు. బెనార‌స్ మెట్రిక్ వ్రాసేవారు లెక్క‌లు నేర్చుకోన‌క్క‌ర‌లేదు. దుర్గాబాయి గారికి కూడా లెక్క‌లంటే భ‌య‌మేన‌ట ?

బొబ్బిలి రాణీవారు ఈ స్త్రీ సంక్షేమ ప్ర‌గ‌తిని స‌భానిర్వాహ‌కుల చాతుర్య ఔత్యుక్యాలినీ చూచి ముచ్చ‌ట‌ప‌డి ఒక‌స్త్రీల హాస్ట‌లును నిర్మింప‌చేశారు. ఇంత‌టితో మిగిలిన సంస్థానాల‌నేరాజులుకూడా బాగా ధ‌ర‌స‌హాయం చేయ‌డం మొద‌లు పెట్టారు. ఈ రోజులు వ‌చ్చేస‌రికి దుర్గాబాయిగారికి ధ‌న‌సేక‌ర‌ణ స‌మ‌స్యాతీరిపోయింది. త‌న‌క‌న్నివిధాలా తోడునీడ‌లా ఉండి త‌న భారాన్ని త‌న‌భుజాల‌పై కేత్తుకొనిమోయ‌గ‌లిగే స‌హ‌చ‌రి సుగుణ‌మ‌ణివ‌ల్ల కార్య‌భార‌మూ సులువ‌య్యింది.

ఇక సంస్థ‌ల త‌రువాత సంస్థ‌లు నిర్మాణాల త‌రువాత నిర్మాణాలు ఎన్నో ప్ర‌గ‌తి పూర్వ‌క‌కార్య‌క్ర‌మాలు ఒక‌దాని వెంట ఒక‌టి చ‌ల్ల‌గా పెరిగిపోసాగినాయి.

స్వ‌యంగా ప్రెస్ కొనుక్కుని మ‌హిళ అని పేరు పెట్టుకొనిస్వంత భ‌వంతిలోకి త‌ర‌లించుకొన్నారు.

విద్యాభ్యాసానికి వచ్చేమ‌హిళ‌లు వ‌యోభేధంలేకుండా అన్ని వ‌య‌స్సుగ‌ల వారూ వ‌చ్చేవారు. ఆంధ్ర‌మ‌హిళ ప‌త్రిక‌కు జ‌నాద‌ర‌ణ బాగా ల‌భించింది. సుగుణ‌మ‌ణి ఎసోసియేట్ ఎడిట‌ర్‌గా ప‌నిచేసినా మొద‌టి పేజీనుండి చివరి పేజీ వ‌ర‌కు త‌న‌మేధ‌స్సును ప‌ర‌చేది. ఇంత‌చ‌క్క‌టి నేర్ప‌రియైన కుడి భుజాన్ని చూసికొంటే దుర్గాబాయికి ఎంతో నిశ్చింత‌గా వుండేది.

చ‌దువువంట ప‌ట్ట‌ని వారికి టైల‌రింగ్ నేర్పించేవారు. ఇది ఒక సంవ‌త్స‌రం ట్రెయ‌నింగ్ కోర్సు అడ‌యార్‌లో గ‌వ‌ర్న‌మెంట్ వారు స్థ‌లం ఇచ్చాక ఆక్సిల‌రీన‌ర్స్‌, మిడ్ వైఫ‌రీ కోర్స్ ట్రెయినింగ్ ఇయ్య‌డం మొద‌లు పెట్టారు. బీద‌పిల్ల‌ల‌కు ఉచిత భోజ‌నం వ‌స‌తేకాక ఉచితంగా శిక్ష‌ణ‌ను కూడా ఇచ్చేవారు. ఈ ఖ‌ర్చుభ‌రించ‌డానికి గాను టూరిస్ట్‌హాస్ట‌ల్ నడిపి ధ‌న‌సంపాద‌న చేసారు.

వెనిగ‌ళ్ళ‌హ‌నుమంత‌రావు అనే ఒక లెక్చ‌రు గారికి పుట్టుక‌తోఏ పోలియో వాత‌ప‌డిన పుత్రుడు జ‌న్మించి కొద్ది రోజుల‌కే చ‌నిపోయినాడు. ఈ దంప‌తులు ఆంధ్ర‌మ‌హిళా స‌భ వారికి, ల‌క్ష‌రూపాయ‌లు ధ‌నం ఇచ్చి పోలియోవచ్చిన ఆనాధ‌శిశువుల‌కు శ‌ర‌ణాల‌యాన్ని న‌డ‌ప‌మ‌ని కోరారు. ఇదిచాలా క‌ష్ట‌మైన ప‌ని ఒక్కొక్క శిశువుకీ ఒక్కొక్క ఆయా ఉండాలి. అయిన‌ప్ప‌టికీ నిర్వాహ‌కుల శ‌క్తి సామర్థ్యాల‌తో ఆర్ధొపెడిక్ హోమ్‌ను అత్యంత‌స‌మ‌ర్థ‌త‌తో న‌డ‌ప‌గ‌లిగారు.

కొంద‌రు పెద్ద‌వ‌య‌సువారు రాట్నాలు వ‌డ‌క‌డం కొంద‌రు చేతిప‌నుల‌ను ఉహాత్మ‌కంగా నేర్చుకోవ‌డం కొంద‌రు ఉన్న‌త‌విద్యాభ్యాసాన్ని చేయ‌డం చేసేవారు. చేతితో చేసిన కాగితాన్ని ఆరోజుల్లో రాజులు స‌హితం ఉప‌యోగించ‌డానికెంతో ఉత్సాహ‌ప‌డేవారు. ఆంధ్ర‌మ‌హిళాస‌భ‌లో ఈ హండ్ పేప‌ర్ మంచిప్ర‌శ‌స్తంగా త‌యారయ్యేది.

ఇంత‌లో ప్ర‌త్యేకాంధ్ర రాష్ట్రం అవ‌త‌రించ‌డంతో రాష్ట్ర‌రాజ‌ధానిలో ఆంధ్ర మ‌హిళాస‌భ స్థాపించాల‌నే అభిప్రాయం నిర్వాహ‌కుల‌కు క‌లిగింది.

సుగుణ‌మ‌ణిగారు ఈ హోరాత్రులూ శ్ర‌మించి స్థ‌ల నిర్ణ‌యం చేయ‌డంతో దామోద‌రం సంజీవ‌య్య‌గారు ప్ర‌భుత్వంత‌రుపున ఆ నాలుగున్న‌ర ఎక‌రాల భూమిని ఆంధ్ర మ‌హిళాస‌భ‌కు కేటాయించారు.

మ‌ర‌లా ఇక్క‌డ కూడా మ‌ద్రాసులో ఉన్న సంస్థ‌ల‌న్నీ క్ర‌మ‌క్ర‌మంగా త‌ల‌లెత్త సాగినాయి. రీజిన‌ల్ హాండ్ క్రాఫ్ట్ ఫ‌ర్ ది విమెన్ కండెన్స్‌డ్ కోర్స్ ఫ‌ర్ దివిమ‌న్  మొద‌లైన‌వి ప్రారంభ‌మ‌యినాయి. ఇక్క‌డ ఉస్మానియా మెట్రిక్‌కి వెళ్ళేందుకు శిక్ష‌ణ‌నీయ‌సాగారు. శిశువిహార్ నుంచి వ‌యోజ‌న విద్య వ‌ర‌కు విద్యావ‌కాశాలు ఈ మ‌హిళా స‌భ‌లో ఏర్ప‌డినాయి. తల్లులు ఉద్యోగాల‌కు వెడితే బిడ్డ‌ల‌నాడించేందుకు క్రెష్ కూడా ఇక్క‌డ ఉంది. వైద్య‌స‌దుపాయాలు వీరు నిర్వ‌హించే ఆస్ప‌త్రుల‌లో ప‌రిపూర్ణంగా ఉన్నాయి. చెవిపోటు ద‌గ్గ‌ర‌నుంచి గుండె పోటు వ‌ర‌కు అన్ని వ్యాధుల‌కూ ఇక్క‌డ చికిత్స‌ల‌భించ‌గ‌ల‌దు. అన్ని రంగాలలోనూ నిపుణులైన డాక్ట‌రూ అత్యాధునిక‌మైన ప‌రికార‌లు ఇక్క‌డ పొందుప‌ర‌చారు.

ఇక్క‌డ శిశువిహార్‌లో చేరిన జాల పెద్ద‌దై టీచ‌ర్సు ట్రెయినింగ్ పూర్తిచేసికొని ఇక్క‌డ వీరు న‌డిపే స్కులులోనే ఉద్యోగం సంపాదించుకొవ‌చ్చు ఇక్క‌డ న‌ర్సింగ్ శిక్ష‌ణ‌ను పూర్తి చేసుకొన్న వ‌నిత ఇక్క‌డ హాస్స‌టల్‌లోనే ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఈ అన్ని సంస్థ‌ల‌కూ సుగుణ‌మ‌ణిగారు కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రించి అతి స‌మ‌ర్థ‌వంతంగా స‌భ‌ను నిర్వ‌హించ‌గ‌లిగేవారు. బీద‌పిల్ల‌ల‌కు ఉచిత విద్యాబోధ‌నేకాక స‌ర్వ‌సౌకార్యాల‌నూ వీరు అమ‌ర్చ‌గ‌ల‌రు ఎవ‌రి భుజ‌శ‌క్తిపై వారు బ్ర‌త‌క‌డాన్ని వీరు ఇక్క‌డ నేర్పిస్తారు.

దుర్గాబాయి వ్రాసిన విల్లులో త‌మ ఆస్తిని వినియోగించి సామాన్యుల‌కి వ‌చ్చే గుండె జ‌బ్బుల‌ను అతి త‌క్కువ ఖ‌ర్చుతోన‌యం చేసే వీలు క‌ల్పించాల‌ని వ్రాశారు. కానీ ఈ ధ‌నం ఇందుకు స‌రిపోదు అందుక‌ని ప్ర‌భుత్వ అనుమ‌తితో ఆంధ్ర ల‌క్ష్మీ లాట‌రీని న‌డిపి రెండుకోట్ల ధ‌నాన్ని సేక‌రించి అత్యాధునిక‌మైన ప‌రికారాల‌తో కార్డియాల‌జీ యూనిట్ ను ప్రారంభించారు. ఎంతోనిపుణులైన వైద్యులు కూడా సేవాభావంతోనే వైద్యం చేస్తారు. క్రేడిల్‌టుగ్రేల్ అన్ని స‌దుపాయాలూ ఇక్క‌డ‌ల‌భించాల‌ని స‌భానిర్వాహ‌కుల ప్ర‌గాఢ‌వాంఛ‌.

ఇలా ఎన్ని విష‌యాల‌లోనో అఖండమైన అద్భుత‌మైన ధ‌నాసేక్ష‌లేకుండా కృషి చేసిన సుగుణ‌మ‌ణి గారు ప్ర‌స్తుతం ఆంధ్ర మ‌హిళాస‌భ‌కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న‌ప్ప‌టికీ దుర్గాబ‌యిగారికి ఛాయామాత్రంగా మిగిలిపోడానికే మొగ్గుచూపిస్తారు. సుగుణ‌మ‌ణి వంటి త్యాగ‌మూర్తికి నిష్కామ‌క‌ర్మ  చేయ‌డంలో ల‌భించిన తృప్తి ఇంతా అంతా కాదు. ఆమెకు కీర్తి కండూతిలేదు. త‌నసేవ‌ల‌ను న‌లుగురూ గుర్తించాల‌నే ఈష లేదు. ఆహా ఓహో అని మెర‌మొచ్చ‌ల మెచ్చుకోలు ల‌క్క‌ర‌లేదు. త‌న మానాన త‌న ప‌నిచేసుకొని మౌనంగా ఉండిపోతారు. మ‌ణి త‌నంత‌ట తానే మెర‌వాలి !  ఇటువంటి స్వ‌యంప్ర‌కాశ‌కులైన ముద్దు బిడ్డ‌ల‌ను చూచుకొని జ‌న్మ‌భూమి మురిసిపోదూ !