46
 

నేను అత్య‌వ‌స‌ర‌మైన విష‌యాలు త‌ప్ప శిష్యుల‌కు పాఠాలు చెప్ప‌డం లేదు. ఇం ముందు ఏ మాత్ర‌మూ వీలుండ‌దు ప్ర‌భూ !

చిత్తం

నాట్యం ఇక‌ముందు శుక‌వాణికి అవ‌స‌రం ఉండ‌దు. ఇంక ఆమెకు విద్య పూర్తికావాలంటే సంగీత సాహిత్యాల‌లోనే

సాహిత్యంలో కావ్యాలు పూర్తి అయిన‌వి. నాట‌కం ప్రారంభిస్తుంది. ఆ వెన‌క చంద‌స్సూ, వ్యాక‌ర‌ణ‌మూ !

చిత్తం ప్ర‌భూ !

ఇంత‌లో ఇద్ద‌రు సేవ‌కులు ద‌శావ‌తార చిత్ర చిత్ర‌త‌మైన మ‌చిలీపట్ట‌ణ‌పు తెర‌కొనదానిని రంగ‌స్థ‌ల‌మందు ప‌ట్టుకొని నిలుచుండిరి. తెర‌ముందు అఖండ దీపాలు ఈవ‌లావ‌ల వెలిగించినారు.

రంగ‌స్థ‌లంలో వివిధ ప‌ద్మాలంకార చిత్రాంచ‌ల గోగో పాంగ‌నా ప‌రివృత‌వేణుగానానంద దివ్య‌గోపాల చిత్ర చిత్ర‌త‌మైన మేల‌క‌ట్టుతో రాధికానృత్య చిత్రాలంకృత య‌వ‌నికులు ప్ర‌క్క తెరలుగా, విశ్వ‌మోహ‌న‌మూర్తిన్నీ, ల‌క్ష్మీ నాధుడున్నూ, మ‌ణి విరాజిత స‌హస్ర ఫ‌ణి ఛ‌త్ర చ్ఛాయాంకిత శిర‌స్సు గ‌ల వాడున్నూ, బ్ర‌హ్మాండ విస్ఫారిత కోటి కోటి యోజ‌న ప‌రివృత వ‌ల‌యాకార స‌ర్ప‌దేహ ప‌ల్యంకుడున్నూ, స‌ప్త‌ర్షి, గ‌రుడ‌, హ‌నుమంతాది భ‌క్త‌జ‌న ప‌రివేష్టితుడున్నూ, నాభిప్ర‌దేశ జ‌నితోర్ద్వ ప్ర‌సారిత స‌హ‌స్ర ప‌త్ర క‌మ‌లాస‌న వాణీ ముఖ విల‌సిత చ‌తుర్ముఖ పుత్ర వందితుడున్నూ అయిన శ్రీ రంగ‌ధామేశ్వ‌రుని చిత్ర‌ప‌ట‌ము నేప‌ధ్యం క‌ప్పే తెర అయిన‌ది.

రంగ‌స్థ‌లం అంతా పూల‌మాల‌ల‌తో అలంక‌రించారు. వేయి దీపాలు దీపావ‌ళిలా వెలిగిపోతున్న‌వి. అప్పుడు నాట్య‌గురువైన పండితుడొక‌డు తెర‌ముందుకు వ‌చ్చి స‌భాస‌దుల‌కు న‌మ‌స్క‌రించి నిలుచున్నాడు. వెంట‌నే శృతి తాంబూరాలు, తోలుతిత్తి శృతి మ్రోగ‌నారంభించిన‌వి.

నాట్య గురువు భైర‌విరాగాన విఘ్న‌రాజ పూజా శ్లోక‌మాల‌పించినాడు.

స‌త్య‌వాక్య‌త‌త్ప‌రులు, స‌ద్గుణ గ‌రిష్టులు, ధ‌ర్మ‌ర‌తులు, కీర్తి విరాజితులు వేద వేదాంగ పారంగ‌తులు, న‌వ‌వీణాగాన కంఠ‌గాన ప్ర‌కాండులు, ప్ర‌సిధ్ద వీరులు తేజోవిల‌సితులైన రాజులు, రాజ‌కుమారులు క‌లిగిన మా ఈ స‌భ‌కు నాయ‌క‌మ‌ణి నాయ‌క‌రాజ శిరోమ‌ణి , ర‌ఘునాథ‌నాయ‌కుడు మ‌రిన్నీ
స‌ర్వ‌సంప‌దాక‌రుడున్నూ, బుద్ధియందు బృహ‌స్ప‌తి వంటివాడున్నూ, యుక్తాయుక్త వివేక పూర్ణుడున్నూ, దాన‌శీలుడున్నూ, గాన విద్యాపారంగుతున్నూ, స‌ర్వ‌జ్ఞుడున్నూ, కీర్తిశాలియున్నూ, స‌ర‌స‌గుణాలు క‌ల‌వాడున్నూ హావ‌భావ విలాసాలు తెల‌సిన వాడున్నూ మాత్స‌ర్యాది గుణాలు లేని వాడున్నూ, ఆయా కాలానికి త‌గిన మంచిన‌డ‌వ‌డి క‌ల‌వాడున్నూ, ద‌య‌క‌ల‌వాడున్నూ, ధీరోదాత్త నాయ‌కుడున్నూ, స‌ర్వ‌క‌ళా ప్ర‌జ్ఞియూ, రాజ‌నీతి విశార‌దుడున్నూ అయిన మా యువ‌రాజులంవారు శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాధ నాయ‌కుల‌వారు ఈ స‌భ‌కు నాయ‌కులై ఉంటున్న‌వారు.

ఇంక మా దేశికులు, మ‌హామంత్రులు ఎటువంటి వార‌యా ? అంటే దృఢ‌ప్ర‌జ్ఞ‌గ‌ల‌వాడ‌ను, హంస పాల‌నువ‌లె స‌ద్గుణాలు గ్ర‌హించువాడును, కీర్తి విరాజితునుడు, స‌ర్వ‌మాన‌వ‌భావ‌ము అర్ధ‌ము చేసుకొన్న‌వాడును, గుణ‌దోష ప‌రిశీల‌నా ద‌క్షుడును, శృంగార లీలాభావం తెలిసికొన్న వాడును, ప‌క్ష‌పాత ర‌హితుడును, నీతి విశార‌దుడును, ఉత్త‌మ మ‌న‌స్సుగ‌ల‌వాడును స‌ర్వ‌శాస్త్ర పారంగ‌తుడును, సామ‌దాన భేదోపాయ స‌మ‌ర్ధుడును, మ‌హాక‌వి అయిన మా గోవింద‌మ‌ఖి బ్ర‌హ్మ‌మంత్రి ఈ స‌భ‌ను అలంక‌రించి ఉన్నారు.

ఇంక నాట్యంచేసే న‌ర్త‌కి ఎటువంటిద‌య్య అంటే,
త‌న్వీ రూప‌వతీ శ్యామా పీనోన్న‌త ప‌యోధ‌రా
ప్ర‌గ‌ల్భా స‌ర‌సా కాన్తా కుశ‌లాగ్ర‌హ మోక్ష‌యాః
చార తాళ‌యా భిజ్ఞా మ‌ణ్డ‌ల స్థాన ప‌ణ్డితా
హ‌స్తాంగ స్థాన నిపుణా క‌ర‌ణేషు విలాసినీ.

ఇక న‌ర్త‌కి రూప‌వతియును, యౌవ‌న మ‌ధ్య‌న్ధురాలును, పీన‌ములు ఉత్తుంగా వ‌య‌వ‌సంప‌ద గ‌ల‌దియును, ప్రౌఢ‌యును, ర‌సికురాలును, మ‌నోహ‌రిణియును, భావం గ్ర‌హించ‌డం వ‌ద‌లి వేయ‌డాల‌యందు నిపుణ‌త క‌ల‌దియును, తాళ ల‌య గ‌తులు తెలిసిన‌దియును, మండ‌ల చార‌గ‌తులు బాగా తెలిపిన‌దియును హ‌స్తాది స‌ర్వాంగాభిన‌య‌మూ, అంగ‌హార క‌ర‌ణాదులు పూర్తిగా ఎదిగిన‌దియు, విలాసినియు అయి ఉండ‌వ‌లెను. కాని ఈ బాలిక యౌవ‌నోన్ముఖ‌యైన బాలిక‌. అయితే త‌క్కిన అన్ని గుణాల‌లోనూ భ‌ర‌త మ‌హ‌ర్షి, నందికేశ్వ‌రుల వ‌ర్ణ‌న‌లే ఈ బాలిక అందాల‌కు ఏమాత్ర‌మూ స‌రిపోవున‌టువంటివి కావు సుమా ! అని ముగించినాడు.