ద్వితీయ స్వర్గము
భోజాన్వేషి
సరసుడైన ఆ మంత్రి శేఖరుడు లక్ష్మణమంత్రి నిరవద్య పురానికి దగ్గిరగా ఉన్న మారెంపల్లి వేశ్యావాటికలో ఆనాడు అందంలో, నాట్యంలో, గానంలో సాహిత్యంలో ఉభయ గోదావరీ తీర రాష్ట్రాల ప్రసిద్ది పొందిన స్వరాంగి అదే వేశ్యరాణి కొమరిత పదునారేండ్ల ఎల ప్రాయపు బాలిక కురంగ నయనను చేపట్టినాడు. ఆకురంగనయన అందంలో ఊర్వశిని ఓడించింది. కంఠమాధుర్యంలో శారదాంక స్థవీణా పంచమతారను అపశృతి చేయునంతగా చేస్తుంది. ఆ బాలిక సర్వ విద్యాపారంగ, గాంధర్వ విద్యాధరి, నాట్య కళాప్సర, సాహిత్య విద్యా సరస్వతి అటు ధర్మపత్ని సూరమాంబా దేవిని ఇటుకురంగనయననూ దక్షిణ నాయకుడై లక్ష్మణమంత్రి సమప్రేమతో పాలిస్తూ వుండెను.
చేమకూర లక్ష్మణా మాత్యుడు నిడుదప్రోలు రాజ్యంలో ఉద్భవించిన ఉత్తమ ఆరువేల నియోగి బ్రాహ్మణ వంశంవాడు. ఉండి సీమకు దశగ్రామాధికారయై తన ప్రతిభవల్ల నిడుదప్రోలు రాజును మెప్పించి ఆయనకు మంత్రి అయినాడు. లక్ష్మణా మాత్యుడు మహావీరుడు,
రసజ్ఞుడు, ఉత్తమ సేనాపతి. ఆయన మంత్రిత్వం క్రింద నిడువప్రోలు పద్మ వెలమ రాజులు మేకా వెంకటరెడ్డి నాయనింవారు కొండపల్లి రాజ్యంలో సామంతుడై సుఖసంవిధానంగా రాజ్యం చేస్తూ ఉన్నాడు. లక్ష్మణా మాత్యుడు మహావీరుడు, రసజ్ఞుడు, ఉత్తమ సేనాపతి. ఆయన మంత్రిత్వం క్రింద నిడుదప్రోలు పద్మ వెలమ రాజులు మేకా వెంకటరెడ్డి నాయనింవారు కొండపల్లి రాజ్యంలో సామంతుడై సుఖసంవిధానంగా రాజ్యం చేస్తూ ఉన్నాడు. లక్ష్మణా మాత్యుడు ఉత్తమ సచివుడే కాకుండా ప్రజ్ఞావంతుడైన సేనాపతి కూడా.
ఆయన తాటికొండ రామయా మాత్యుని తనయ సూరమాంబను భార్యగా స్వీకరించాడు. ఆ దంపతుల ప్రేమ ఆ రాష్ట్రం అంతటా గాధలుగా చెప్పుకుంటూ వుండేవారు.
ప్రియ భార్యకూ ప్రియాంగనకూ కూడా ఎంతకాలానికి సంతతి కలగలేదు. రాణ్మహేంద్రపుర మార్కండేశ్వరునికి, గునిపూడి సోమేశ్వరునికి ద్రాక్షారామ భీమేశ్వరునికిను పిష్టపుర కుక్కుటేశ్వరునికి లక్ష్మణాచార్యులు ప్రతిమాస శివరాత్రికీ ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించారు. జపాలు చేయించారు, నాగప్రతిష్ఠ సర్పశాంతి చేయించారు. అయినా లక్ష్మణామత్యులకు సంతానము లేదు. ఇంతలో మహా పండితుడు మంత్రోపాసి అయిన ఒక బ్రాహ్మణోత్తముడు లక్ష్మణమంత్రికి సౌరమంత్రం ఆదిత్య హృదయం ఉపదేశించి, ఆదివారాలు పాలు పొంగించుకుంటూ, దినదినమూ సూర్య సమస్కారాలు చేస్తూ ఉండవలసింది అని కోరినాడు. |