72
 

ఒక శుభోద‌యాన రాజ‌నరేంద్రున‌కొక ఆలోచ‌న క‌ల్గిన‌ది. కాశీ క్షేత్రానికి భార్యా స‌మేతుడె వెళ్లి ఈశ్వ‌రార్చ‌న చేసి రావాల‌నుకొన్నాడు, త‌ల‌చిన‌దే త‌డ‌వుగా కొంత సైన్నాన్నీ ర‌ధాల‌నూ గ‌జ‌తుర‌గ ప‌దాతుల‌నూ వెంట పెట్టుకొని కాశీకి ప్ర‌యాణ‌మైనాడు.

ఎముక‌లు కొరికే చ‌లిలో స‌రిగంగ స్నారాలు చేసినాడు. షోడ‌శ దానాలూ బ్రాహ్మ‌ణుల‌కు చేసి, మ‌హా రుద్రాభిషేకాలు చేసి ప‌ర‌మ‌శివున‌కు ప్రీతి క‌లిగించినాడు.

వామ‌భాగాన మైమావ‌తీ, శిర‌స్సున భ‌గీర‌ధీ కొలుచుచుండ‌గా జ‌టా జూటాన్న‌లంక‌రించిన చంద్ర జ్యోత్స్న‌ల‌కు దీటైన చిరున‌వ్వు న‌వ్వుతూ ఆ ప‌ర‌మేశ్వ‌రుడు రాజ‌న‌రేంద్రుని అనుగ్ర‌హించినాడు.

చిన్ని కృష్ణుడే వారి ఇంట దోగాడు చున్న‌ట్లు ఆ రాజు, రాణి సంతోషాంబుధిలో తేలియాడినారు. ముద్దులు మూట‌క‌ట్టుచున్న పిస‌బాలుని క్ష‌ణ‌మైనా విడువ‌క మాతృమూర్తిక‌న్న నెక్కువ‌గ లాలించేవాడా మ‌హారాజు. పిల్ల‌వాని ఆట‌పాట‌ల‌లో మునిగిపోయి రాచ‌కార్య‌ములు స‌హిత‌ము విస్మ‌రించే వాడు. ఆ కందు క‌నువిప్పి చూస్తే మురిపెము, ఉంగాయ‌ని యేడ్చిన‌చో ముద్దు. అత్త‌య‌న్న‌చో య‌ల‌రింపు, తాత‌య‌న్న‌చో త‌రించిన‌ట్లు పొంగి పోవును. స‌ర్వ ప్ర‌పంచ‌ము పుత్ర మ‌యంగానే ప్ర‌కాశించిపోతున్న‌ది రాజ‌రాజ న‌రేంద్రున‌కు.

క‌నురెప్ప‌వేయ‌క కునుగొంచుంద‌న‌లొన‌
నుంగ నుంగ‌య‌ని సారె నుగ్గ‌డింప‌
నెల‌న‌వ్వు పాల‌బుగ్గ‌ల‌పై దువాళింప‌
న‌త్తత్త‌య‌ని దోగి యాడుచుండ‌

ఆ రాజు ఆహారాదిక‌ముల‌ను కూడ పుత్రుని బంగ‌రు డోల‌క‌డ‌నే పూర్తి చేసుకొని, పంచ ప్రాణ‌మ‌లు నాత‌ని మీద‌నే పెట్టుకొని బ్ర‌తుకు చుండెను. ఆ పుత్రుడే సాంగ‌ధ‌రుడు. బిడ్డ‌కు పెరిగి విద్యాదిక‌ములు నేర్చుకొనుట‌కు గురువుల ద‌గ్గ‌ర‌కు వెళ్ళున‌పుడు ఏలాగో కాల‌మును చిత్రాంగి ద‌గ్గ‌ర వెళ్ళ‌బుచ్చుచు పుత్రుని వియోగ‌మును విస్మ‌రించ‌గ‌లిగినాడు.

సారంగ‌ధ‌రుడు యుక్త‌వ‌య‌స్సు వ‌చ్చునప్ప‌టికి మ‌హా సౌంద‌ర్య వంతుడ‌,

అంద‌మున జ‌యంతున‌కు, కంతున‌కు, వ‌సంతున‌కు స‌మ ఉజ్జీ యైనాడు. అత‌ని వెడ‌ద క‌న్నులు, ఆ స‌మనాసిక‌, ఆ దీర్ఘ బాహువులు, ఆ సింహ‌ప‌రాక్ర‌మ‌ము చూచుట‌కు రెండు క‌న్నులు చాలుట‌లేదు. తల్లి హృద‌య‌మును స‌హితము మోహ‌పెట్ట‌గ‌ల యాత‌ని చ‌క్క‌ద‌న‌ములో నేదైన లోప‌మున్న‌దో ! లేక అత‌ని క్రీడాప‌ర‌త్వ‌మే చేటు తెచ్చిన‌దో !

ఒక‌నాడు సారంగ‌ధ‌రుడు త‌న మిత్రుడు సుబుద్ధితో కూడి పావుర‌ముల నెగుర‌వేయుచు క్రీడించుచున్నాడు, ఒక పావుర‌ము రాజ నరేంద్రుని భోగ‌ప‌త్నియైన చిత్రాంగి మేడ‌పై వ్రాలిన‌ది. సారంగ‌ధ‌రుడు దానికౌ పోవుచుండ‌గా సుబుధ్ధి వారించినాడు.

అయినప్ప‌టికీన్నీ పావుర‌ము పై నున్న మ‌మ‌కార‌ముతో సారంగ‌ధ‌రుడు చిత్రాంగి గృహ‌మున‌కు పోయినాడు. చిత్రాంగి సారంగ‌ధ‌రుని చూచి మోహ‌ప‌డి కామ‌తుర‌యైన‌ది. ఈత‌ని ఒయ్యార‌మె ల‌క్ష‌చేయును కాదా అని త‌ల‌చిన‌ది. ఆమె సారంగ‌ధ‌రుని చూచి,

....ల‌జ్జ దో విడిచి యేకాంతంబుగా న‌ల్దె లంగుల‌న్‌గ‌నుచున్‌
బైట దొలంగ నీవి వ‌ద‌ల‌న్ కామాంధ‌కారంబు నెమ్మ‌ద‌మున్ గ‌ప్పిన‌

గ‌న్నుగాన‌క‌, లాల‌స‌తో బ‌ల‌వంత‌ముగా కుమారుని కౌగ‌లించ‌వెల‌న‌ని ముందుకు వ‌చ్చిన‌ది. సారంగ‌ధరుడు భ‌య‌ముతో గ‌డ‌గ‌డ వ‌ణ‌కుచు పోబోయినాడు. ఆమె దారి యీయ‌లేదు. లాలించిన‌ది, వేడుకున్న‌ది, క‌ల్ల‌బొల్లి యేడ్పులు యేడ్చిన‌ది. మ‌న్మ‌ధ సామ్రాజ్య‌ము నిరువుర‌ము క‌ల‌పి యేలుద‌మ‌ని భ్ర‌మ‌పెట్టిన‌ది.
సారంగ‌ధ‌రుడు త‌న దుర‌దృష్ట‌మున‌కు చింతించినాడు. అమ్మా ! త‌ల్లీ ! అనుచు భ‌క్తిగా పాదముల‌కు మ్రొక్కినాడు నీతుల‌ను నియ‌మాల‌ను ఏక‌రువు పెట్ట‌నాడు. పాప‌మ‌న్నాడు, న‌ర‌క‌మ‌న్నాడు, య‌ముడ‌న్నాడు, దేవుడ‌న్నాడు. అయినప్ప‌ట‌కిని చిత్రాంగి బిగువు స‌డ‌లిన‌ది కాదు. మోహ‌పు మ‌బ్బులు తొల‌గిన‌వికాదు. అత‌డు వారించిన కొల‌దీ ఆమెలో ప‌ట్టుద‌ల హెచ్చ‌యిన‌ది. చిత్రాంగి ఎన్నో వ‌న్నెచిన్నెల‌ను చూపిన‌ది. అయిన‌ను సారంగ‌ధ‌రుడు చ‌లింప‌క స్థిర‌ముగ‌నున్నాడు. ఆమె