89
 

మూర్తెప్ప నాయ‌కులు ఆలోచ‌న‌లో ప‌డి శూన్య‌ములోనికి చూస్తూ మౌనం వ‌హించినారు. అంద‌రూ ఏమ‌నుకుంటారో ? ఇలా శుక‌వాణిని విద్య నేర్చుకొనేందుకు రాజ‌మందిరానికి పంప‌డం ఉచితంగా ఉన్న‌దా లేదా ? పంప‌మ‌ని స్ప‌ష్టంగా చెప్ప‌డం ఎలాగ ? యువరాజు కోర్కెను కాద‌న‌డం ఎలాగ ? దీనికి పరిష్కారం ఇంకేదైనా ఉన్న‌దా ? అన్న విచికిత్స‌లో కొట్టుకొని పోయినాడ‌త‌డు. అస‌లింత‌కూ శుక‌శాణి అంగీక‌రిస్తేనే క‌దా పంప‌మ‌న్నాడు, యువ‌ప్ర‌భువు ?

చెంచెల‌క్ష్మిని పిలుచుకొని వ‌చ్చిన‌ది. మర‌క‌త‌వ‌ల్లి. మూర్తెప్ప నాయ‌కులు కుమార్తెను ద‌గ్గ‌ర కూర్చుండ బెట్టుకొని బుజ్జ‌గించి విష‌యమంతా వివ‌రంగా చెప్పినారు.

తల్లీ ! రాజుల‌కు అనేక‌మైన భారాలు నెత్తిమీద ఉంటాయి. వారికి ఎప్పుడు విశ్రాంతి ఉంటుందో, ఎప్పుడు ఏప‌ని ఉంటుందో వారికే తెలియ‌దు, అందుచేత నువ్వు అక్క‌డే ఉండిన‌ట్ల‌యితే ర‌ఘునాథులు త‌మ‌కు వీలునప్పుడ‌ల్లా నీకు బోధ చేస్తారుట‌. పెళ్ళి కాకుండా ప‌ర గృహానికెలా పంపేద‌ని మీ అమ్మ సంశ‌యిస్తూన్న‌ది. నీకు ఇంకా విద్యార్జ‌న చేయ‌లాని ఉన్న‌దా ? నేర్చిన‌దానితో తృప్తిప‌డి మ‌న న‌గ‌రాజుతో ఆడుకుంటూ, పాడుకుంటూ కాలం గడుపుతావా ? నీ అభీష్టం ఎలా ఉంటే అలా చేద్దాము.ఔ

నాన్న‌గారూ ! నాకిప్పుడు వ‌చ్చిన చ‌దుకెంతండీ ! కేవ‌లం ఉద్గ్రంధాల‌ను చ‌ద‌వ‌డం వ‌ర‌కే కాదా వ‌చ్చింది ? నాట్య సంగీతాల‌లో కూడా అంతేనండీ. కానీ, నాకింకా ఎంతో నేర్చుకోవాల‌ని ఉంది. కావ్య‌శాస్త్ర మ‌ర్మ‌జ్ఞురాలిని కావాల‌ని ఉండి. గంగాదేవిలాగా స్వ‌యంగా కావ్యాల‌ను అల్లాల‌నీ ఉందండీ !

మూర్తెప్ప నాయ‌క‌లు మ‌ర‌క‌త‌వ‌ల్లి వంక చూచారు. ఆమె న‌వ్వుతూ కుమార్తెవంక చూచిన‌ది. ఇక అమ్మాయి నిర్ణ‌యం విన్నారుక‌దా ! మ‌నం వద్దన్న‌ప్ప‌టికీ ఊరుకోదు. క‌నుక యువ‌రాజు కోరిక ప్ర‌కార‌మే చేయండి.

అమ్మా ! నాన్నగారూ ! మీరు కూడా అక్క‌డికి వ‌చ్చెయ్యండి.

బాగుంది, బాగుంది ! అమ్మా నాన్న‌ల‌తో అత్త‌వారింటికి వెడ‌తావా ? న‌లుగురూ న‌వ్వుతారు. ఎప్ప‌టికైనా అక్క‌డికి వెళ్ళ‌వ‌ల‌సిన‌దానివే, కాక‌పోతే కొంత‌ముదంఉ, అదీ

దేవీ ! నువ్వామాట ప‌దేప‌దే అన‌కూడ‌దు.

అమ్మా ! నేనొక్క‌దానినే అక్క‌డ‌కు వెళ్ళ‌ను. నాకు భ‌యం ! నువ్వు కూడా రావ‌ల్సిందే !

పసిపిల్ల‌లాగ మార‌ము చేసింది, చెంచుల‌క్ష్మి.

అమ్మో ! నీకు భ‌యమంటే న‌మ్మేదెవ‌ర‌మ్మా. ఇన్నాళ్ళనుంచి చూస్తున్నాను కానా ! నువ్వేమో, నీ భావాలేమోగాని అమ్మ‌గాని, నాన్న‌గారు కాని క‌న్పిస్తున్నారా ! ఆ పెట్టెల‌నిండా నువ్వు వ్రాసిపెట్టుకొన్న క‌వ‌నాల‌ను చూస్తే తెలియ‌దా ! నువ్వు చ‌క్క‌గా ఉండ‌గ‌ల‌వు త‌ల్లీ ! ఎప్పుడెప్పుడు రాకుమారుడొస్తాడా, ఎప్పుడెప్పుడు చ‌దువుకుందామా అని ఒళ్ళంతా క‌ళ్ళు చేసికొని, అత‌డికోసం ఎదురు చూడ‌ట‌మే స‌రిపోతుంది గాని ఈ అమ్మ నీకు గుర్త‌కొస్తుందా, నాన్నా !

మ‌ర‌క‌త‌వ‌ల్లి న‌వ్వుతూ అన్న మాట‌ల‌కు చెంచుల‌క్ష్మి క‌ల‌త‌ప‌డ్డ‌ది. ఆమె గొంతు గ‌ద్గ‌ద‌మైన‌ది.

అమ్మా, నువ్వలా అన‌క‌మ్మా ! క‌న్న‌త‌ల్లిని మ‌రిచ‌పోయేటంత క‌ఠిన‌మైన గుండెకాదు, నాది. ఈ వైభ‌వాల‌కు మురిసిపోయేటంత లోభ‌మెహాలు నాకు లేవు.

ప‌సిదాన్ని అంత బాధ‌పెడ‌తావెందుకు, దేవీ ! మ‌న చెంచుల‌క్ష్మి హృద‌యం అమృతం కాదూ ! అయినా నేను ప్ర‌తిదిన‌మూ కొలువుకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా నిన్ను చూస్తాను. నువ్వు రాద‌ల్చుకొన్న‌ప్పుడ‌ల్లా రావ‌చ్చు.

మూర్తెప్ప నాయ‌కుడు కుమ‌ర్తెను లాలించినాడు.

మ‌రి మంచి ముహుర్త‌ము చూడ‌మ‌ని పేరిశాస్త్రుల‌వారికి వార్త‌పంపండి, అన్న మ‌ర‌క‌త‌వ‌ల్లి మాట‌ల‌కు మూర్తెప్ప నాయ‌కుడు ప‌క‌ప‌క న‌వ్వినాడు.

ఆ అవ‌స‌ర‌ము కూడ లేదు. కార్తీక బ‌హుళ‌ద‌శ‌మి గురువారంనాడు ఉద‌యం తొమ్మిది ఘంట‌ల న‌ల‌భై నిమిషాల‌కు ఇందిరా భవ‌న ప్రాంగణాన‌కు ర‌ధం చేరుకొవాల‌ని సెల‌విచ్చినాడు, నా మేన‌ల్లుడు. గోవింద దీక్షితుల శిక్ష‌ణ‌లో ఈపాటి శుభ‌మూహూర్తాల‌ను నిర్ణ‌యించ‌డం చేత‌న‌ల‌యిన‌ట్లుంది. ఈ వార్త ముందుగా నా చెవినే వేశాడుట‌. రెండు మూడు దినాల్లో తండ్రిగారికి మంత్రిగారికీ తెలియ‌జేస్తారుట‌.