గుంటూరు ఆంధ్రా క్రిస్టియ‌న్ కాలేజీలో నా ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువు పూర్త‌యింది. భీమ‌వ‌రంలో మా తమ్ముడు కృష్ణారావు చ‌దువు పూర్త‌యింది. న‌న్ను ఆంధ్రా మెడిక‌ల్ కాలేజీలో చేర్పించ‌డానికి, మ‌మ్మ‌ల్నిద్ద‌ర్నీ మా మామ‌య్య విశాఖ‌ప‌ట్నం తీసుకెళ్లారు. త‌రువాత నేను లాయ‌ర్ని అయినందుకూ, కృష్ణారావు డాక్ట‌రు అవుతున్నందుకూ మా నాన్న‌గారూ, మా మామ‌గార్లూ ఎంత‌గానో సంబ‌ర‌ప‌డ్డారు. మా విద్యార్థి ద‌శ‌లోనే పెళ్లిళ్ళు జ‌రిగినాయి.

1934లో మా మామ‌య్య మా తమ్ముడూ, నేనూ విశాఖ‌ప‌ట్ట‌ణం వెళ్లాము. ఆంధ్రా మెడిక‌ల్ కాలేజీ అడ్మిష‌న్స్ వెయిటింగ్ లిస్టులో నేను మొద‌టివాణ్ణి. ట‌ర్న‌ర్స్ చౌల్ట్రీలో మొద‌టి గ‌దిలో మ‌కాంపెట్టి, వేచి ఉన్నాం. అప్పుడ‌క్క‌డ శ్రీ‌రంగం శ్రీ‌నివాస‌రావు బాపిరాజును నాలుగైదుసార్లు క‌లుసుకున్నారు. అత‌ని మ‌హాప్ర‌స్థానం బాపిరాజుకు చూపించారు. ఇద్ద‌రూ క‌లిసి ఆ గేయాల‌కి తాళ‌ము, ఛంద‌స్సు, స‌రిచూసారు. మెరుగులు దిద్దారు. శ్రీ రంగం శ్రీ‌నివాస‌రావు మ‌హాప్ర‌స్థానం ప్రచుర‌ణానంత‌రం మ‌హాక‌వి శ్రీ‌శ్రీ అయారు, గేయానికి యుగ‌క‌ర్త అయ్యారు.
ఆ సంత్స‌రంలోనే బాపిరాజు, జ్వాల‌లు అనే గేయం వ్రాశారు. అందులోని మ‌చ్చ‌కి కొన్ని పంక్తులు :

ఫోనిక్సు ప‌క్షిలా కొత్త‌ద‌వుతూ
కొత్త భావాల్ కొత్త రుచులూ
కొత్త జీవం పోసుకుంటూ
పాత స‌త్యం బ‌య‌ట‌ప‌డ‌త‌ది.
కొత్త లోకం పుట్టి వ‌చ్చే
వెల‌గ‌నివ్వండోయ్ జ్వాల‌లు, వెల‌గ‌నివ్వండోయ్ బాపిరాజు, శ్రీ‌శ్రీ వీరిలో ఒక‌రి క‌వితా ప్ర‌భావం ఒక‌రి మీద బాగా ఉంది. వారిద్ద‌రు గాఢ మిత్రుల‌, బాపిరాజు సిగ‌రెట్లను సేవించేవారు. శ్రీ‌శ్రీ మ‌ధువును సేవించే వారు. వారు సాహితీ మిత్రులు.

వేచి వేచి వేసారి కాకినాడ పిఠాపురం రాజావారి క‌ళాశాల‌లో నేను బి.య‌స్‌.సి లోనూ, మా తమ్ముడు ఇంట‌ర్మీటియ‌ట్‌లోనూ, చేరాం. ద‌రిమిలాను ఆంధ్రా మెడిక‌ల్ కాలేజీలో సీటు ఇచ్చాంర‌మ్మ‌ని టెలిగ్రాం వ‌చ్చినా నేను విశాఖ‌పట్ట‌ణం వెళ్ళ‌లేదు. బెనార‌స్ వెళ్ళి హిందూ విశ్వ‌విద్యాల‌యంలో య‌ల్‌.య‌ల్‌.బి చ‌దువుకున్నాను.

బారిరాజు ర‌చ‌న‌లు, ముఖ్యంగా చారిత్ర‌క న‌వ‌ల‌లు చ‌దివిన కొంద‌రు ఈయ‌న హిందూమ‌తానికి పెద్ద‌పీట‌వేసి బౌద్ధ‌మ‌తానికి చిన్న పీట వేసాడ‌న్నారు. ఇంకొంద‌రు బౌద్ధాన్ని అంద‌లం ఎక్కించి, హైంద‌వాన్ని కించ‌ప‌ర్చాన్నారు. మ‌రికొంద‌రు ఈయ‌న‌కి హిందూ బౌద్ధ‌మ‌తాన్ని గురించి బొత్తిగా తెలియ‌ద‌న్నారు. అంటే ఆయ‌న ర‌చ‌న‌లు అంద‌రికి త‌లోక‌విధంగా అర్థ‌మ‌య్యాయ‌న్న‌మాట‌. అందుకే నేను కూడా నాలుగు మాట‌లు చెప్ప‌ద‌లిచాను. బాపిరాజు త‌న ర‌చ‌న‌ల్లో ప్ర‌స్తావించిన‌ది, హిందూమ‌తమూ కాదు, బౌద్ధ‌మ‌తమూ కాదు అనీ,ఆర్ష ధ‌ర్మ సూత్రాలు, బుద్ధుడి ధ‌ర్మ‌సూత్రాలూ అనీ.

శైవులు, వైష్ణ‌వులు, ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులులాగ ర‌క‌ర‌కాలు హిందూమ‌త‌స్తులున్నారు. కానీ, ఇది హిందూధ‌ర్మం. ఇది హిందూమ‌తం అని చెప్ప‌గ‌ల‌మార్గం నాడు, నేడు ఎన్న‌డూలేదు. బాపిరాజు ప్రస్తావించిన‌ది ఆర్ష‌ధ‌ర్మం ఆర్ష‌మ‌తం. ఆర్ష‌ద‌ర్మ‌సూత్రాల‌కు ఒక పుస్త‌కం అంటూ లేక‌పోయినా, ప్ర‌జ‌ల్లో వారి భాష‌లో, అనుశృతంగావ‌స్తూ, వారి అనుస‌ర‌ణ ఆచ‌ర‌ణ‌ల‌వ‌ల్ల వారికి చ‌క్క‌గా అల‌వ‌డి, వారి జీవితాల్లో పెన‌వేసుకుపోయిన ఈ ఆర్ష‌ధ‌ర్మ ఆర్ష‌మ‌తం అయింది. అస‌తోనూ, స‌ర్గ‌మ‌య‌, త‌మ‌సోమా జ్యోతిర్గ‌మ‌య‌, అని కీర్తించిన ఈ ఆర్ష‌ధ‌ర్మాన్నే మ‌తాన్ని బాపిరాజు ప్ర‌స్తావించారు.

య‌జ్ఞాయాగాల‌నీ, క్ర‌తువుల‌నీ, బ‌లుల‌నీచ మంత్ర తంత్రాల‌నీ, ప్ర‌జ‌ల‌కు తెలియ‌ని దేవభాష‌లో కృత్రిమ సృష్టి చేసి, వారిని భ‌య‌భ్రాంతుల‌ని చేసి, మ‌భ్య‌పెట్టి స్వ‌చ్ఛ‌మైన ఆర్ష‌ధ‌ర్మాన్ని, ఆర్ష‌మ‌తాన్ని క‌ల్తీచేసి క‌శ్మ‌లంచేసి, ప‌త‌నం చేసి త‌రుణంలో సిద్ధార్థ గౌత‌ముడు ప‌రిత‌పించి ప‌దేక్షుత‌ప‌స్సుచేసి, బుద్ధుడై, ప్ర‌వ‌క్తఅయి, ద‌మ్మం అనే పేరుతో, ప్ర‌జ‌ల భాష‌లో ఆర్ష‌ధ‌ర్మాన్ని పున‌రుద్ధించాడు బుద్ధుడి అనుయాయులు బౌద్ధులు పీట‌కాల‌నీ, హీన‌యాన‌మ‌నీ, మ‌హాయాన‌మ‌నీ, జాత‌క క‌థ‌ల‌నీ, మంత్ర‌తంత్రాల‌నీ, ఎన్నో సృష్టించి, బుద్ధుడి ద‌మ్మ సూత్రాల్ని క‌ల్తీచేసి, బుద్ధుడిమ‌తాన్ని క‌శ్మ‌లం చేసి నాశ‌నం చేసారు బాపిరాజు ప్ర‌స్తావించినది, బుద్ధుడి ద‌మ్ము సూత్రాలు. ఇదే బుద్ధుడిమ‌తం. అందుకే బుద్ధం ...ద‌మ్మం  శ‌ర‌ణం గ‌చ్చామి అని అన్న‌ది.

బాపిరాజు మెచ్చిన ఆర్ష‌ధ‌ర్మం హిందూధ‌ర్మం. ఆయ‌న మెచ్చిన బుద్ధ‌ద‌మ్మం బౌద్ధ‌ద‌ర్మం. వ‌ల‌సినంత సంస్కృతీసంస్కారాలు ఆల‌వ‌ర్చుకొని, ఈతావుల‌లో ప‌రిశోధించ‌వ‌ల‌సి వున్న‌ది.

అది విరోధి 1950 సంవ‌త్స‌రం. భీమ‌వ‌రం సుహృత్ ప‌రిష‌త్ బాపిరాజుకి క‌న‌కాభిషేకం చేసిన‌ది. ప‌రిష‌త్ స‌భ్యులు బాపిరాజుకు చోపుదార్ల హెచ్చ‌రిక‌ల‌తో మంగ‌ళ వాయిద్యాల‌తో వేదిక‌పైకి తీసుకువ‌చ్చారు. పురాత‌న భాగ‌వ‌త ఫ‌క్కీలో సుహృత్ కళాభిజ్ఞులు బాపిరాజుకు జేజేలు, అంటూ ఆల‌పించారు. కుల‌ప‌తిని ఆరాధించారు. వేద‌ఘోష జ‌రుగుతుండ‌గా ప‌రిష‌త్ ప్ర‌ధాని చెరుకువాడ వెంక‌ట‌సుబ్బారావు స‌హ‌స‌భ్యుల‌తో క‌లిసి, బంగారు పువ్వుల‌తో బాపిరాజుకు క‌న‌కాభిషేకం చేసారు. మంగ‌ళ‌హార‌తి, స్వ‌స్తివాచ‌కంతో మ‌హోత్స‌వం ముగిసింది.

ఇలాగ‌, ఎన్న‌ని అనుభ‌వాలు తెల్చేది, ఎన్న‌ని జ్ఞాప‌కాలు త‌డిమేది !

మా బాపిరాజు మామ‌య్య మ‌హనీయుడు, మాన‌నీయుడు, మ‌హామ‌నిషి.