సౌంద‌ర్యారాధ‌న :-

బాపిరాజుగారు సౌంగ‌ర్యారాధ‌కులు. వ‌స్తుగ‌త సౌంద‌ర్యాన్ని మెచ్చుకోవ‌డం, సౌంద‌ర్యాన్ని చూచి ఆనందిచ‌డం, దానిప‌ర‌మావ‌ధి. సుంద‌ర‌ప్ర‌కృతిలో అవినాభావ సంబంధాన్ని పెంచుకొని, త‌త్సౌంద‌ర్యాన్ని చూచి ప‌ర‌వ‌శించేవారు ఆయ‌న‌. క‌నుక‌నే పాత్ర‌ల స్థితిగ‌తుల‌ను వ‌ర్ణించేట‌ప్పుడు ప్ర‌కృతి ప్ర‌స్తావ‌న‌లు పార‌వ‌శ్యంతో చేశారు. పాత్ర‌లు శారీర‌క‌, మాన‌సిక స్థితిగ‌తుల‌ను చిత్రించుట‌కు ఈ సౌంద‌ర్యోపాస‌న ఆయ‌న‌కు బాగా ఉప‌క‌రించింది. కేవ‌ల‌ము వ‌స్తు బాహ్య‌సౌంద‌ర్యాన్నే కాక‌, ఆత్మ సౌంద‌ర్చాన్ని కూడ గుర్తించి, ప్ర‌శ‌సించ‌గ‌ల‌దిట్ట‌. ఆయ‌న చేసిన ప్రాకృతిక సౌంద‌ర్య వ‌ర్ణ‌న బాహ్య‌సౌంద‌ర్యారాధ‌న‌కు ప‌రిమితం. నారాయ‌ణ‌రావు, ప‌ర‌మేశ్వ‌ర‌మూర్తి, ప్ర‌సాద‌రావు, శ్యామ‌సుంద‌ర‌దేవి మొ|| కొన్ని ఆద‌ర్శ పాత్ర‌ల అక‌లుష ప్ర‌వృత్తుల‌ను చిత్రించుట‌లో అంతః సౌంద‌ర్యానికి ప్రాధాన్యం యిచ్చారు.

శాస్త్ర పాండిత్యం - లౌకికానుభవం

ద్వితీయ భాగంలో చివ‌రి ఘ‌ట్టానికి ఆ, ఇ, ఉ, ణ్‌, ఋ, ఐ, క్ అని పానీయ‌మునందలి మ‌హేశ్వ‌ర సూత్రముల‌లో మొద‌టి రెండింటిని క‌లిపి, చ‌మ‌త్కారావ‌హంగా రైలుబండి గ‌తిని, ధ్వ‌ని విశేషాన్ని అనుక‌రిస్తూ పేరుపెట్టి, త‌న శ‌బ్ధ‌శాస్త్ర ప‌రిచ‌యాన్ని ర‌చ‌యిత వ్య‌క్తం చేశారు. మ‌రియు ప‌రమేశ్వ‌ర నారాయ‌ణ‌రావుల తీర్థ‌యాత్రా సందర్భంగా అనేక పుణ్య క్షేత్రాల‌ను, న‌దీన‌దాల‌ను, ప‌ర్వ‌త శ్రేణుల‌ను, శిల్ప ర‌మ‌ణీయ‌ముల‌గు దేవాల‌యాల‌ను, అజంతా ఎల్లోరా గుహ‌ల‌ను, లేపాక్షి చిత్ర‌సంప‌ద‌ను. వివిధ ప‌ట్ట‌ణాల‌ను ప్రసావించి, ర‌చ‌యిత త‌న అపార లౌకికానుభ‌వాన్ని ప్ర‌క‌టించారు. ఇంకా ఇత‌ర ప్రాచీనాధునిక శాస్త్ర‌ముల‌కు చెందిన విష‌యాల‌ను స‌మ‌యానుకూల‌ముగా ప్ర‌స్తావించారు.