12
 


రెండ‌వ ప్ర‌క‌ర‌ణ‌ము


మ‌ధుర భ‌క్తి సిద్ధాంత‌ము

విశ్వ‌నాథ‌వారు న‌వ‌లాలోక‌మున సృష్టించిన మ‌హిళామ‌ణుల గుణ‌క‌ర్మ‌ల‌ను బట్టి, సైద్ధాంతిక ప్ర‌తిపాద‌న‌ముపై వింగ‌డించుట జ‌రిగిన‌ది. ప్ర‌తి స్త్రీ మూర్తి యందున పెక్కు గుణ‌ములు ద్యోత‌క‌మ‌గున‌ప్ప‌టికి ప్ర‌స్ఫుట‌ముగ దోచు ముఖ్య ల‌క్ష‌ణ‌మున‌కు ప్ర‌తీక‌లుగ పాత్ర‌ల‌నెన్నుట‌యైన‌ది.

మ‌ధుర భ‌క్తికి ప్ర‌తీక‌గ వేయి ప‌డ‌గ‌లు లోని గిరిక ఏకైక స్త్రీ మూర్తి. మ‌ధుర భ‌క్తియ‌న‌గా భ‌గ‌వంతుని భ‌ర్త‌గ భావించి యాత‌నికై ప‌రిత‌పించుట‌. జీవాత్మ‌ను స్త్రీగ‌ను ప‌ర‌మాత్మ‌ను పురుషునిగ‌ను భావించి ఈరెంటి ఏకీక‌ర‌ణ‌కై మ‌ధుర వేద‌న న‌నుభ‌వించుట‌. గిరిక కృష్ణ‌ప‌ర‌మాత్మునికై మ‌హాభిసారిక‌య‌గుట లోకోత్త‌మముగ వ‌ర్ణింప‌బ‌డిన‌ది.

గిరిక‌


విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారిచే ర‌చింప‌బ‌డిన వేయి ప‌డ‌గ‌లు న‌వ‌ల యందు ప్ర‌ధాన‌మైన పాత్ర గిరిక‌. ఈమెను ఒక ప్ర‌తీక‌పాత్ర య‌న‌వ‌లెను. దేవదాసీ సంప్ర‌దాయ‌ములోని మాహాత్మ్య‌మును తెలుపుట‌కై ప్ర‌త్యేకముగ సృష్టింప‌బ‌డిన‌ది గిరిక‌. ఆ సంప్ర‌దాయ‌ము ఎందుల‌కు ప్రారంభింప‌బ‌డిన‌దో దానిలోని మ‌హ‌దాశ‌య‌ము లేవియైయుండునో గిరిక పాత్ర రూప‌మున వ్య‌క్త‌ము చేయ‌బ‌డిన‌ది. ప్ర‌తీక పాత్ర‌యైనంత మాత్ర‌మున గిరిక ర‌క్త‌మాంస‌ములులేని మ‌ర‌బొమ్మ‌వ‌లె కానుపించ‌క విశ్వ‌నాథ త‌ల‌చిన దేవ‌దాసీ త‌త్త్వ‌మును మించి రాధికాతత్త్వ‌మునందుకొని ప్ర‌కృతి పురుషుల కేక‌త్వ‌మును సాధించిన‌ది. మ‌ధుర భ‌క్తిలోనీమో ప‌రాకాష్ట ద‌శ‌నందుకొనుట‌కు ముందు గోపిక‌యై, స‌త్య‌యై, రుక్మిణియై, ల‌క్ష్మియున‌గుట‌యేగాక ల‌క్ష్మీనారాయ‌ణ స్వ‌రూప‌మునుకూడ త‌న‌లో ప్ర‌తిబింబింప చేయ‌గ‌ల్గిన‌ది. ఈమె భ‌క్తికి నాట్య‌క‌ళా కౌశ‌ల‌ము ముఖ్య‌ప‌రిక‌ర‌మై సాహిత్యాకాశ‌ము రాకా పూర్ణ శ‌శాంక‌మై విరాజిల్లిన‌ది.


దేవదాసీ సంప్ర‌దాయ‌ము మ‌న దేశ‌ములో పూర్వ‌మునుండి వ‌చ్చుచున్న‌ది. దేవాల‌య‌ముల‌పై చెక్కిన నాట్య‌భంగిమ‌ల‌నుబ‌ట్టి భ‌గ‌వంతునికి నాట్య‌ముకూడ ఒక ఉప‌చార‌ముగా భావించి సేవించెడివారని తెలియుచున్న‌ది. ఇప్ప‌టికిని గృహ‌ముల‌లోను, ఆల‌య‌ముల‌లోను పూజాంత‌మున నృత్యం ద‌ర్శ‌యామి అను నుప‌చార వాక్య‌మువ‌ల‌న భ‌గ‌వంతునికి నృత్య‌మొక రాజోప‌చార‌ముగ భావించెడివార‌ని చెప్పవ‌చ్చును.

దేవదాసి య‌న‌గా దేవునికి దాసి. భ‌గ‌వంతునికి త‌న నృత్య‌మ‌నెడి సేవ‌ల‌చేత ఆనంద‌ము క‌లుగ‌జేసెడి ధ‌న్య‌జీవి. వైష్ణ‌వాల‌య‌ముల‌లో ఆరాధ‌నా నృత్య‌మును చేసెడి న‌ర్త‌కిని వైష్ణ‌వ‌దాసియ‌నియు, శివాల‌య‌ములో ఆరాధ‌నా నృత్య‌మును చేసెడి న‌ర్త‌కిని శివ‌దాసియ‌నియు ప‌లిచెడివారు. దేవాల‌య‌ముల‌లో దేవదాసి నృత్య‌ము చేయున‌పుడు ఆమె స‌ర్వాంగ‌ములందునా దేవ‌త‌లు వ్యాపించియుందుర‌ని విశ్వ‌సింతురు. ఒక్కొక్క అంగ‌ము నొక్కొక్క దేవ‌త వ‌శ‌ప‌రుచుకొనును. దేవాల‌య‌ములో నృత్య‌ము చేయున‌పుడు దేవదాసి యొక్క స‌ర్వాంగ‌ములందుపూ స‌దాశివుడూ క్షేత్ర‌పాలుడూ, బుద్ధుడూ, మ‌హాదేవుడూ, స్థిర‌ల‌క్ష్మి, పార్వ‌తి, శ్రీ మ‌హావిష్ణువు మేరుమంద‌ర‌ములు, ల‌క్ష్మి భూదేవి, ఇంద్రుడు, బ్ర‌హ్మ‌, వాయువు, సూర్య‌చంద్రులు ఆశ్ర‌యించి ఉందురు.


దేవ‌దాసీమ‌ణుల‌ను ప్ర‌జ‌లు అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో చూచెడివారు. తెల్ల‌ని ప‌ట్టువ‌స్త్ర‌ము కానెపోసి క‌ట్టుకొనుట‌యు వెండి గ‌జ్జ‌ల‌ను న‌ల్ల‌ని ప‌ట్టుతాడుకుక‌ట్టి కాలికి క‌ట్టుకొనుట‌యు మొద‌ల‌గు అలంకార‌ములు సంప్ర‌దాయ‌సిద్ధ‌ముగ వ‌చ్చిన‌ట్టివే.

శ‌రీరానంద‌ముక‌న్న ఆత్మానంద‌మున‌కును, స్వ‌ర్గ‌ముక‌న్న మోక్ష‌మున‌కును ప్రాముఖ్య‌మునిచ్చి జీవాత్మ‌ను ప‌ర‌మాత్మ‌తో నైక్య‌ము పొందించు ఘెర‌త‌ప‌ములు చేసిన మ‌హార్షులు పుట్టిన పుణ్య‌భూమి భార‌త‌దేశ‌ము. పూర్వ‌ము మాన‌వుని ప్ర‌తిచ‌ర్య‌యు మ‌హామున‌ల‌చే ధ‌ర్మానుగుణ‌ముగ నిర్ధేశింప‌బ‌డిన‌ది. మ‌నుధ‌ర్మ‌శాస్త్ర‌ము, ఆప‌స్తంబ‌సూత్ర‌ములు, మొద‌లైన విట్టివే. దివ్యఋషులు త‌మ త‌పోమ‌హిమ‌వ‌ల‌న ప‌ర‌మాత్ముని ద‌ర్శించి సాదార‌ణ మాన‌వుల‌న‌కు స‌హిత‌ము భ‌గ‌వ‌ద్ద‌ర్శ‌న భాగ్య‌ము ప్ర‌సాదించుట‌కై అనేక మార్గ‌ములు నిర్మించిరి. భ‌క్తి జ్ఞాన వైరాగ్య‌ముల‌ను త్రివిధ ముక్తి మార్గ‌ములుగాక‌, సంగీత‌, సాహిత్య‌, శిల్ప‌, నృత్యాది క‌ళ‌ల‌ను సహిత‌ము మోక్ష‌హేతువులుగ నిర్ధేశించియుండిరి. భ‌ర‌తుడు నాట్య‌మును సృష్టించి నాట్య‌వేద‌ము అనెను. నాట్య‌వేదోమ‌యాకృతః నాట్య‌ము అభిన‌య ప్రాధాన్య‌ము క‌ల‌ది. ఆంగిక‌విన్యాస‌ముల‌చేత భావ‌ముల‌క‌ర్ద‌మును ప్ర‌కాశింప‌జేయుట‌యే అభిన‌య‌ము.

నృత్య‌క‌ళ‌న‌భ్య‌సించిన కొంద‌రు దైవారాధ‌న‌కై మీదుగ‌ట్టి త‌ప‌స్సువ‌లె భావించి త‌రించిరి. ఆరాధ‌నాక‌ళ‌తో ప‌ర‌మాత్మ‌కు హృద‌యార్ప‌ణ‌ము చేసికొను స్త్రీ దేవ‌దాసి. అనుక్ష‌ణ‌ము భ‌గ‌వంతునికై త‌పించుచు ఆంగిక‌విన్యాస‌ముల‌తో న‌ట‌న‌ము స‌ల్పుచు ధ‌న‌వ్యామోహ‌మును త్య‌జించి త‌మ్ముతాము మ‌ర‌చి అరిష‌డ్వ‌ర్గ‌ముల‌ను జ‌యించి అన్య‌ధాశ‌ర‌ణం నాస్తిత్వ‌మేవ శ‌ర‌ణంమ‌మ య‌నెడి యాద‌ర్శ‌ముతో దైవ‌స‌న్నిధిని నృత్య‌ము చేసెడివారు.