10
గృహ‌స్థాశ్రమ ధ‌ర్మానుష్ఠాన‌ము.

పురుషుని వివాహ‌వ‌యో నిర్ణయ‌ము

విద్యార్ధిద‌శ యనంత‌ర‌ము గృహ‌స్థాశ్రమ‌మునందు ప్రవేశింప‌వ‌ల‌యును. ఎనిమిద‌వ‌యేట ఉప‌న‌య‌న‌ము జ‌రుగును.

"ద్వాద‌శ‌వ‌ర్షాణి వేద‌గ్రహ‌ణాంతంవాబ్రహ్మచ‌ర్యం కురు"

అని చెప్పబ‌డిన‌రీతిని క‌నీస‌ము 12 యేండ్లు బ్రహ్మవిద్యన‌భ్యసింప‌వ‌ల‌యును. క‌నుక బ్రహ్మచ‌ర్యాశ్రమ‌ము (12+8)=20 సంవ‌త్సర‌ములు వ‌య‌స్సు వ‌చ్చువ‌ర‌కు న‌డుప‌వ‌ల‌యును. దీనిని బ‌ట్టి తేలిన‌దేమ‌న‌గా 20 యేండ్లువ‌య‌స్సుదాట‌నిదే పురుషుల‌కు వివాహము చేయుట‌కు వేద‌మ‌త‌ము ఒప్పుకొనుట‌లేదు. మ‌న‌ముచేయు పెండ్లిండ్లు శాస్త్ర స‌మ్మత‌మో కాదో చ‌దువ‌రులే గ్రహింతురుగాక‌.

వివాహ‌ము యొక్క ఉద్ధేశ్యము

బ్రహ్మచ‌ర్యానంత‌ర‌ము గ‌రువు శిష్యున‌కు కొన్ని ఆదేశ‌ముల‌నుచెప్పును.

"ప్రజాతంతుం మావ్యచ్ఛేద్సీః" ( ప్రజాసంతాన‌మును విచ్చిత్తిని చేయ‌కుము అని యీ మంత్రముయొక్క అర్ధము. అన‌గా వివాహితుడ‌నై పుత్రసంత‌తిని పొందుమ‌ని భావ‌ము. (తైత్తిరీయోప‌నిష‌త్తు, శిక్షావ‌ల్లి. 11 అనువాక‌ము))

అధ‌ర్వణ‌వేద‌మంద‌లి నార‌ద‌ప‌రివ్రాజకోప‌నిష‌త్తు త‌న కుటుంబ‌మున‌కు త‌గిన క‌న్యనువ‌రించ‌వ‌ల‌యు న‌నియు, గృహ‌స్థ ధ‌ర్మానుసార‌ముగ నియ‌త‌క‌ర్మల నాచ‌రింప వ‌ల‌యున‌నియు, బ్రాహ్మణ‌త్వసిద్ధిని పొంద‌వ‌ల‌యున‌నియు, వంశ‌మునిలుచుట‌కు మాత్రమే, అన‌గా ఆ ఉద్ధేశ్యముతోనే ఒక కుమారుని పొంద‌వ‌లెన‌నియు, ఉప‌దేశించుచున్నది.

"ద్వాద‌శ‌వ‌ర్షసేవా పుర‌స్సరం స‌ర్వవిద్యాభ్యాసం
కృత్వాత‌ద‌నుజ్ఞయా స్వకులానురూపాభిమ‌త క‌న్యాం
వివాహ్య................గృహ‌స్థోచిత క‌ర్మకుర్వ
దౌర్ర్బాహ్మణ్యనివృత్తి మేత్యస్వవంశ వృద్ధికామః
పుత్రమేక‌మాసాధ్య................."

బ్రహ్మత‌త్వము స‌రిగా తెలుసుకొనిన‌నేగాని జ్ఞానేచ్ఛక్రియాసంబంధ‌మ‌గు సంసార‌మును, గృహ‌స్థుడు నడుప‌లేడ‌నియు, త్యాగార్ధము బ్రహ్మసిధ్యర్ధమును, గృహ‌స్థాశ్రమ‌ధార‌ణ‌మ‌నియును, గార్గ్యాయ‌న‌మ‌హ‌ర్షి బ‌హు చ‌క్కగా వ‌ర్ణించియున్నాడు. కావున‌నే ధ‌ర్మప్రజాసంప‌త్యర్ధం స్త్రీయ‌ముద్వహేత్ అని చెప్పబ‌డిన‌ది. వివాహ‌ముయొక్క యీ ప‌విత్రోద్ధేశ్యమే నేడెచ్చట‌ను కానకున్నది. శ‌త‌ప‌ధ బ్రాహ్మణ‌మునందును యీ ఉద్ధేశ్యమే చ‌క్కగా నిరూపింప‌బ‌డిన‌ది.

ఎట్టి క‌న్యల వివాహ‌మాడ‌వ‌లెను?

1.లోగ‌డ‌నే బ్రహ్మచారిణి అన‌గా బ్రహ్మవిద్యన‌భ్యసింప‌ని క‌న్యను వివాహ‌మాడ‌రాద‌ని చెప్పి శ్రుతిప్రమాణ‌మును చూపియుంటిని. వివాహ‌కాల‌మున ఆహుతిని వేయున‌పుడు వ‌రుడు చెప్పుమంత్రముగూడ యీ అర్ధమునే వివ‌రించుచున్నది. త‌న‌మాతా పితృల‌గృహ‌మునుండి భ‌ర్త యింటికిబోవ సిద్ధముగ‌నున్న నీ పూబోణి త‌న బ్రహ్మచ‌ర్యవ్రత‌మును సాంగ‌ముగ‌నెర‌వేర్చిన‌ది.


                                                    స్త్రీల‌కు వివాహ‌వ‌యోనిర్ణయ‌ము


2. ప‌సిపిల్లల‌గు క‌న్యల‌నువివాహ‌మాడ‌రాదు. ఋగ్వేద‌ము. 10 మండ‌ములో యిట్లు చెప్పబ‌డియున్నది.

"Go to an unmarried maiden whose person is well developed; make her a wife and unite her to a husband"
ఋగ్వేద‌మునందు బ్రహ్మచ‌ర్య నియ‌మ‌ముల‌చేత శిక్షల‌నుపొంది కుమారావ‌స్థనుల్లంఘించి పూర్ణయువావ‌స్థయందున్న స్త్రీలేగ‌ర్భము ధ‌రించుట‌క‌ర్హుల‌ని చెప్పబ‌డియున్నది.

"అధేన‌వోధున య‌న్తామ‌శిశ్విః శ‌బ‌ర్దుఘాఃశ‌శ‌యా
అప్రదుగ్ధాః న‌వ్యాన‌వ్యాయువ‌త‌యో భ‌వంతిర్మహ‌
దేవానామ సుర‌త్యమేకం", (ఋ. 3-55-16)

స్త్రీల‌కు వివాహ‌వ‌యోనిర్ణయ‌ము శ్రుతి చేసియుండ‌లేదు. కాని అతిబాల్యవివాహ‌ములు మాత్రము నిషేధించిన‌ది. వివాహ‌మంత్రముల‌నుబ‌ట్టి ర‌జ‌స్వలానంత‌ర వివాహ‌యే స‌శాస్త్రీయ‌మ‌ని కొంద‌రు చెప్పుచున్నారు.

1."సోమః ప్రధ‌మో వివిదే గంద‌ర్వో వివిద ఉత్తరః
తృతీయో అగ్నిష్టేస్తురీయ‌స్తె మ‌నుష్యజాః !! సోమోద
ద‌ద్గంధ‌ర్వాయ గంధ‌ర్వోద‌ద‌గ్నయే ! ద‌యింద్ర
పుత్రాంశ్చా దాద‌గ్నిర్మహ్య మ‌ధోఇమాం"

ఇవి ఋగ్వేదములోనివి. శాస్త్రమ‌ర్యాద యేమ‌న‌గా, క‌న్యను మొద‌ట‌సోముడును, త‌రువాత గంధ‌ర్వుడును, ద‌రిమిలాన‌గ్నియును త‌దుప‌రి మ‌న్యుడునువ‌రించును. పైన‌చెప్పిన‌రీతిని క‌న్యను ఒక‌రిత‌రువాత మెక‌రికిత్తురు ఈ సోమాదులు వ‌రించుకాల‌ము సంవ‌ర్తస్మృతియందుక‌ల‌దు.

"రోమ‌ద‌ర్శన సంప్రాప్తే సోమోభుజ్త్కేధ క‌న్యకాం
ర‌జోదృష్ట్వాతు గంధ‌ర్వః కుచౌదృష్ట్వాతు పావ‌కః"

దీనిని బ‌ట్టి కుచ‌ద‌ర్శన‌ము ద‌రిమిలానే పురుషుడు వివాహ‌మ‌డ‌వ‌ల‌యున‌ని స్పష్టప‌డుచున్నది. సోమాదులు వ‌రించుట‌న‌నేమోయాజ్ఞవ‌ల్క్య స్మృతియందున్నది.

"సోమం శౌచంద‌దౌస్త్రీణాం గంధ‌ర్వశ్చ శుభాంగిరం
పావ‌క స్సర్వమేధ్యత్వం మేధ్యావైయోషితోహ్యతః"

స్త్రీల‌కు సోముడు శౌచ‌మునిచ్చును. గంధ‌ర్వుడు మంచి పలుకుల‌ను అన‌గా వాక్చాతురిన‌చ్చును. అగ్ని స‌ర్వ ప‌రిశుద్ధత‌ల‌నిచ్చును. ఋగ్వేద‌ములోని మంత్రముల‌యొక్క తాత్పర్యమును పై రెండుస్మృతులును స్పష్టీక‌రించుచున్నవి గాన అవి నాచే అంగీక‌రింప‌బడిన‌వి.

2."అప‌శ్యంత్వా మ‌న‌సా చేకితానం త‌ప‌సోజాతం
త‌ప‌సో విభూతం ! ఇహ‌ప్రజామి హ‌ర‌యిం
శ‌రాణః ప్రజయా స్వప్రజ‌యా పుత్రకామ‌"

ఈ మంత్రము పెండ్లిలో నాల్గవ‌రోజున భార్యభ‌ర్తను గూర్చి చెప్పును. దీని అర్ధమేమ‌న‌గా నీవు యోగ్యుడ‌వ‌నియును, త‌ప‌స్సుచేపుట్టి త‌ప‌స్సుచేత వృద్ధిపొందినావ‌నియు, మ‌న‌స్సుచేత‌నే తెలుసుకొంటిని. నాయందు పుత్రకాముడ‌వైయున్న నీవు సంతోష‌పూర్వక‌ముగ సంతాన‌మును పొందుము.

3."అప‌శ్యంత్వా మ‌న‌సాదీథ్యానాం స్వాయాంత‌నూం
ఋత్వియేనాధ‌మానాం! ఉప‌మాముచ్వాయువ‌తి
ర్బభూయాః ప్రజ‌యా త్వ్రప్రజ‌యా పుత్రకామే"

యీ మంత్రము భార్యతో భ‌ర్తచెప్పును. దీని అర్ధమేమ‌న‌గా - నీవు ఇప్పుడు భ‌ర్తతో గూడ‌వ‌ల‌యున‌ని కోర్కెతోనున్నట్లు నామ‌న‌స్సుచేత క‌నిపెట్టినాను. యువ‌తివై పుత్రుని పొంద‌వ‌ల‌యున‌ని కోరిక‌గ‌ల నీవు న‌న్నుపొందిసంత‌తి బ‌డ‌యుము.
స్మృతుల‌నుబ‌ట్టి వివాహ‌వ‌యోనిర్ణయ‌ము చేయుట‌కు యెంత‌మాత్రము కుదుర‌దు. ఒక్కొక్కస్మృతి ఒక్కొక్కరీతిని చెప్పుచున్నది. హ‌రీస్మృతి స్త్రీల‌కు ఉప‌న‌య‌నాదుల‌ను గూడ చెప్పుచు బ్రహ్మచ‌ర్యాశ్రమానంత‌మున (అన‌గా ర‌జ‌స్వలానంత‌ర‌ము) వివాహ‌ము చేయ‌వ‌లెన‌ని విధించుచున్నది. వ‌సిష్టస్మృతి ర‌జ‌స్వలానంత‌ము 3 సంవ‌త్సర‌ముల వ‌ర‌కు వివాహ‌ము క‌న్య చేసుకొన‌వ‌చ్చున‌ని చెప్పుచున్నది. వ్యాస‌స్మృతి ఋతుమ‌తియై సుస్నాత‌యైయున్న స్త్రీ క‌న్యయ‌న‌బడున‌ని తెలుపుచున్నది. ప‌రాశ‌ర‌స్మృతులు వ‌గైరాకొన్ని ర‌జ‌స్వలానంత‌ర వివాహ‌ముల నిందించుచున్నవి. ఇట్టి ప‌రిస్థితుల‌లో స్మృతుల‌ను ప్రమాణ‌ముగా తీసికొనుట‌కే వీలులేదు. వేదధ‌ర్మము న‌నుస‌రించినంత‌వ‌ర‌కు స్మృతిని అంగీక‌రింప‌వ‌చ్చున‌ని లోగ‌డ‌నేవ్రాసితిని. ఈ విష‌య‌ములో మ‌నుస్మృతి చాల వ‌ర‌కు వేద‌మునాశ్రయించిన‌ద‌ని చెప్పవ‌చ్చును. ఉత్కృష్టుడును, సురూపుడును, నైన వ‌రుడుల‌భియించిన‌చో అన‌గా త‌ట‌స్థించిన‌ప్పుడు స‌రియైన వ‌య‌స్సురాక‌పోయిన‌ను బ్రాహ్మణ విధిచే వివాహ‌ము క‌న్యకు పిత్రాదులు చేయ‌వ‌ల‌యును. గుణ‌హీనుడగు వ‌రునికిచ్చుట‌కంటె క‌న్య ఋతుమ‌తియైనప్పటికి ఆమ‌ర‌ణాంత‌ము పితృ గృహ‌మందే వుండుటమేలు.

"ఉత్కృష్ఠాయాభిరూపాయ వ‌రాయా స‌దృశాయ‌చ‌
అప్రాప్తామ‌పితాంత‌స్మైక‌న్యాం ద‌ద్యాద్యధావిధి"
"కామ‌మామ‌ర‌ణాత్తిష్టేద్గృహే క‌న్యర్తుమ‌త్యపి
న‌చైవైనాం ప్రయ‌చ్ఛేత్తు గుణ‌హీనాయ‌క‌ర్హిచిత్‌" (మ‌నుస్మృతి 9-88,89)

పిత్రాదుల‌చే గుణ‌వంతుడగు వ‌రున‌కీయ‌బ‌డ‌కుండెనేని ఋతుమ‌తియైన‌ది మొద‌లు మూడేండ్లుప్రతీక్షించి స‌జాతీయుడ‌గువ‌రుని క‌న్య స్వయ‌ముగావ‌రించ‌వ‌లెను. ఆక‌న్యకుగాని ఆమెను పెండ్లిచేసుకొనిన వ‌రున‌కుగాని నించుకైన‌ను పాప‌ములేద‌ని మ‌నువుచెప్పుచున్నాడు. దీనిని బ‌ట్టితేలిన సారాంశ‌మేమ‌న‌గా ర‌జ‌స్వల‌కుపూర్వమైన‌ను, ర‌జ‌స్వల‌కు ద‌రిమిలానైన‌ను క‌న్యల‌కు వివాహ‌ము జ‌రుప‌వ‌చ్చును. యిందేమియు దోష‌ములేదు.

"త్రీణివ‌ర్షాణ్య దీక్షేత‌కుమార్యనృతు మ‌తీస‌తీ
ఊర్ధ్వంతుకాలాదేత‌స్మాద్విందేత స‌దృశంప‌తిం
అదాయ‌మానాభ‌ర్తార మ‌ధిగ‌చ్ఛేద్యదిస‌యం
నైనంకించిద‌వాప్నోతి న‌చ‌యం సాధిగ‌చ్ఛతి " (మ‌నుస్మృతి 9- 90,91)

ఈ విష‌య‌మే విష్ణుస్మృతియందును చెప్పబ‌డియున్నది. ఋతుత్రయ‌ముపాస్యైవ‌క‌న్యా కుర్యాత్స్యయంవ‌రం మూడు ఋతువులైన త‌ర్వాత క‌న్యస్వయ‌ముగానే వ‌రింప‌వ‌చ్చున‌నిదీని య‌ర్ధము. ర‌జ‌స్వల‌కు పూర్వమే వివాహ‌ము చేసిన‌చో ర‌జ‌స్వల‌కు పిమ్మట యుక్త కాల‌మున స‌మావేశ‌ము (గ‌ర్భాదాన‌ము) జ‌రుప‌వ‌చ్చును. ర‌జ‌స్వలానంత‌ర వివాహ‌ము చేసిన‌చో స‌మావేశ‌ము వివాహ‌ముతో పాటుచేయ‌వ‌చ్చును. వైద్య శాస్త్రమున‌నుస‌రించి స్త్రీకి 16వ యేడురానిది గ‌ర్భాద‌న‌ము జేయ‌కూడ‌దు.

"పూర్ణషోడ‌శ వ‌ర్షా స్త్రీ పూర్వవింశేన‌సంగ‌తా!
ఆయుష్మంతం సుతంసూతె తేజోబ‌ల‌స‌మ‌న్వితం"

స‌ప్తమ‌పురుషునితో సాపిండ్యమునివ‌ర్తించును గ‌నుక (స‌పిండ‌తాతుపురుషే స‌ప్తమేవినివ‌ర్తతే) వ‌రునిత‌ల్లిస‌పిండుల‌లో బుట్టిన‌దిన్ని, త‌ల్లి గోత్రమందు పుట్టిన‌దిన్ని, తండ్రిగోత్రమందు పుట్టిన‌దిన్న తండ్రికి స‌పిండుల యందు పితృవ్యాది క‌న్యాజాత‌కానిదియైన క‌న్యక‌వివాహ‌ము చేసుకొనుట‌కు అర్హురాలు.

"అస‌పిండార‌చ‌యామాతుర‌స‌గోత్రాచ‌యాపితుః
సాప్రశ‌స్తాద్విజాతీనాం దార‌క‌ర్మణి మైధునే "  (మ‌ను.3-5)

వివాహ‌సంస్కార క్రమ‌ము


వివాహ‌మొక ప‌విత్రమైన క్రతువు. దాని యొక్క ప‌విత్రత‌యే మ‌న‌మువిడ‌నాడినాము. అది షోకుగాను, కులాసాగాను కాల‌ముగ‌డుపు స‌మ‌య‌మ‌నిన్ని, బోగ‌పుమేశ‌ముల‌తోను, అవ్వాయ చువ్వాయ‌ల‌తోను, పూల ప‌ల్లకీల‌తోను, యింకా అనేక‌రీతుల గ‌డిపివేయుచున్నాము. చేయుచున్న క్రతువేమి దాని అర్ధమేమి అదిస‌శాస్త్రీయ‌ముగా జ‌రుగుచున్నదాలేదా అను విష‌య‌మెవ్వరికిని ప‌ట్టదు. పైగావివాహ‌ము చాలా ధ‌న‌వ్యయ‌ముతో గూడుకొనిన‌దై ఉభ‌య‌కుటుంబ‌ములవారిని ఋణ‌ముల పాలుచేసి పాడుచేయుచున్నది. వివాహ‌మెచ్చటే విధ‌ముగా జ‌రుగ‌వ‌ల‌యునో తెలుసుకొనిన‌చో యీహ‌డావిడి, డ‌బ్బుఖ‌ర్చు, ఆడంబ‌ర‌ము, స‌ర్వము పోవును.

క‌న్యావ‌ర‌ణ‌ము, క‌న్యాశోధ‌న‌ము, పాణిగ్రహ‌ణ‌హోమ‌ము - యీప‌నులు క‌న్యయింట‌జ‌రుగును. వెంట‌నే వ‌ధూవ‌రులు యిద్దరు వ‌రునియింటికేగుట‌కు ప్రయాణ‌మ‌గుదురు. వ‌రుని యిల్లు చేరిన‌వెంట‌నే గృహప్రవేశ‌హోమ‌ము జ‌రుగును. ద‌రిమిలామూడురాత్రులు వధూవ‌రులు వ్రత‌ములో నందును. భూమిపై పండుకొన‌వ‌ల‌యును. బ్రహ్మచ‌ర్య నియ‌మ‌మును కాపాడ‌వ‌ల‌యును. క్షార‌ల‌వ‌ణ‌ము మొద‌లైన‌వి వ‌ర్జింప‌వ‌ల‌యును. చ‌తుర్దఅప‌ర‌రాత్రమందు శేష‌హోమ‌ముజ‌రుగును. త‌దుప‌రిస‌మావేశ‌ము (గ‌ర్భాదాన‌ము) జరుగును. ఇవి వివాహ‌క‌త్రువులోని హంశ‌ములు. పాణిగ్రహ‌ణ‌ముత‌ప్ప మిగ‌తా యావ‌త్తుక‌త్రువు వ‌రునియింట‌నే జ‌రుగ‌వ‌ల‌యును. ప్రస్తుత‌ము మ‌న‌వివాహ‌ముల‌లో దీనికి విరుద్ధముగా క‌న్యయింట జ‌రుపుచున్నారు. శాస్త్రరీత్యావ‌ధూవ‌రులు బ‌య‌టికివ‌చ్చుట‌కు వీలులేదు. నేడు పల్లకీలఊరేగింపుటు యెక్కువైన‌వి.

అశ్వలాయ‌న గృహ్యసూత్రముల ప్రారంభ‌ములో వేద‌ప్రమాణ‌ము నొక‌దానిజూపుచు అగ్నిహోత్రము, ఆహుతులు అవ‌స‌ర‌ములేకుండ‌గ‌నే మంత్రముల‌ను శుద్ధమ‌న‌స్సుతో ప్రార్ధన‌ల‌రీతినిచ‌దివిన మాత్రమున‌నే వివాహ సంస్కార‌మును జ‌రుపుకొన‌వ‌చ్చున‌ని చెప్పబ‌డియున్నది.

వ‌ధూవ‌రుల య‌న్యోన్యధ‌ర్మము

దంప‌తులిరువురును ఒక శ‌రీర‌మేన‌ని వేద‌ము చెప్పుచున్నది.

"అర్ధోహ‌వాఏష ఆత్మన‌స్తస్మాద్యజ్జాయంన‌విం
ద‌తెనైతావ‌త్ ప్రజాయ‌తే అస‌ర్వోహితావ‌ద్భవ‌తి
అధ‌య‌దైవ జాయాం వింద‌తే అధప్రజాయ‌తేత‌ర్హిస‌ర్వోభ‌వ‌తి"

ఈ వేద‌మంత్రముయొక్క అర్ధమునే వివాహ‌మంత్రములు వివ‌రించుచున్నవి. ఏనాప‌త్య త‌న్వంసంసృజ‌స్వాధాజీవ్రీవిధ‌మావ‌దాసీ, నేయి, వ‌రుడు క‌న్యయొక్కహృద‌య‌మున‌రాచి యిట్లుమంత్రమును చెప్పుచున్నాడు.

"స‌మ‌జ్జంతు విశ్వేదేవాస్సమాపోహ‌ద‌యానినౌ
సంమాత‌రిశ్వాసంధాతా స‌ముదేష్ట్రీదిదేషునౌ"

అన్యోన్యప్రేమ‌క‌లిగి యుండున‌ట్లు మ‌న‌హృద‌య‌ముల‌ను దేవ‌త‌లుయేక‌ము చేయుదురుగాక‌య‌ని యీ మంత్రము యొక్క భావ‌ము.

"తావేహ‌వివాహ‌వ‌హై ప్రజాం ప్రజ‌న‌యావ‌హైసం
ప్రియౌరోచిష్ణు సుమ‌న‌స్కమానౌ జీవేవ‌శ‌ర‌ద‌శ్శతం"

మ‌న‌ము వివాహ‌ము చేసుకొంద‌ము. మ‌న‌కు సంత‌తి క‌లుగుగాక‌. ప్రియ‌ముగ‌ను, ప్రకాశ‌ముగ‌ను, సుమ‌న‌స్కుల‌యై నూరుసంవ‌త్సర‌ములు జీవింతుముగాక‌య‌ని యీమంత్రార్ధము. వ‌రుడు వ‌ధువుచేయిప‌ట్టుకొని అగ్ని హోత్రమునకునుత్తర‌ముగా నేడు బియ్యపు కుప్పలమీద నేడ‌డుగులు ఆమె చేత‌వేయించును. దీనికి స‌ప్తప‌దియ‌నిపేరు. అప్పుడు ప్రతి కుప్పకు వ‌రుడుచ‌దువు మంత్రములుగ‌ల‌వు. వాటి అర్ధమును గ్రహించ‌వ‌ల‌యును.

"స‌మామ‌నువ్రతాభ‌వ‌పుత్రాన్ విందావ‌హైబ‌హూతే సంతుజ‌ర‌ద‌ష్టయ‌"
(Be thou conducive to nutrition Be thou devoted to me. Let us obtain many sons and may they live to old age)

"ఊర్జేద్విప‌దీభ‌వ‌సామా................................. జ‌ర‌ద‌ష్టయః".
(Be thou conducive to strength............)

"రాయ‌స్పోషాయ‌త్రి ప‌దీభ‌వ‌సామా.... జ‌ర‌ద‌ష్టయః"
(Be thou conducive to increase of wealth)

"మా యోభ‌వ్యాయ చ‌తుష్పదీభ‌వ‌సామా......."
(Be thou conducive to maintenance of health)

"ప్రజాభ్యః పంచ‌ప‌దీభ‌వ‌సామా ......."
(Be thou conducive to Progeny)

"ఋతుభ్యః ష‌ట్పదీభ‌వ‌సామా.........."
(Be thou conducive to good seasons)

"స‌ఖాస‌ప్తప‌దీ భ‌వ‌సామా................."
(Be my Friend)

పోష‌ణ, బ‌ల‌ము, సంప‌ద‌, అరోగ్యము, స‌త్సంతాన‌ము, ఋతుకాలానుక్రమ‌జీతిము, ఆధ్యాత్మిక‌జ్ఞాన‌ము వీనియొక్క సంపాద‌న‌యందు వ‌ధూవ‌రుల‌న్యోన్యము స‌హ‌య‌భూతులుగానుండుట‌కు ప్రమాణ‌ము చేయుచున్నారుగ‌దా! ఇట్టి జీవితానుష్టానమందెంత సౌఖ్యమున్నది!
ఇప్పటి వ‌ధూవ‌రులు త‌మ‌వివాహ‌ములో యిట్టి ప్రమాణ‌ములు తాము చేయుచున్నామ‌ను విష‌య‌మెరుగ‌రుగ‌దా!

                                               స్త్రీ సంగ‌మ‌నియ‌మ‌ములు


పురుషుడు స‌త్సంతాన‌మును పుత్రుని పొందుట‌కు వివాహము చేసుకొనుచున్నాడ‌ని లోగ‌డ‌నే చెప్పియుంటిని. కామ‌సంతృప్తి కొర‌కుగాదు. క‌నుక యేకాల‌మందు స్త్రీ సంగ‌మ‌ముచేయ‌వ‌ల‌యును ఏకాల‌మందు చేయ‌రాదు అను విష‌య‌ములు జూడ‌వ‌ల‌సియున్నవి.

తైత్తిరీయోప‌నిష‌త్తు, శిక్షావ‌ల్లియందు ఉపాస‌క‌ధ‌ర్మములు చెప్పుచు, ప్రజాచ (సంతాన‌ముపొంద‌ద‌గిన‌ది.) ప్రజ‌న‌శ్చ (ఋతుకాల‌మందు భార్యతోసంగ‌మ‌ము చేయ‌వ‌ల‌యును) అని చెప్పబ‌డియున్నది (9 అనువాక‌ము)

ఋతువ‌న‌గా స్త్రీల‌కు శోణిత‌ద‌ర్శన‌ము చిహ్నముగాగ‌ల గ‌ర్భధార‌ణ యోగ్యావ‌స్థావిశేష‌ము. శోణిత‌ద‌ర్శన‌ము మొద‌లు ప‌దియారు దిన‌ములు ఋతుదిన‌ముల‌న‌బ‌డును.

మొద‌టినాలుగు రాత్రులును, ప‌దునొకండు, ప‌ద‌మూడ‌వ రాత్రులును, నిందిత‌ములు మిగిలిన ప‌దిరాత్రులు ప్రశ‌స్తములు.

"తాసామాద్యాశ్చ త‌స్రస్తునిందితైకాద‌శీచ‌యా
త్రయోద‌శీ ద‌శేషాస్తుప్రశ‌స్తా ద‌శ‌రాత్రయః "    (మ‌నుస్మృతి 3-47)

పుత్రార్ధియైన‌వాడు ఆఋతుదిన‌ముల‌లో స‌మ‌రాత్రుల‌నే స్త్రీనిపొంద‌వ‌ల‌యును. అయుగ్మరాత్రుల‌యందు పుత్రిక‌లు జ‌న్మించెద‌రు. త‌స్మాత్ యుగ్మాసు పుత్రార్ధీ సంవిశేవేదార్త స్త్రీయ‌మితి. (శ్రుతి)

ఈ విష‌య‌మే మ‌నువును (3-48) చెప్పుచున్నాడు. ఇంతేకాక పుత్రుడుజ‌న్మించుట‌కు శుక్లమ‌ధిక‌ముగ‌నుండ‌వ‌లయును గ‌నుక పురుషులు ఆహారాదిక‌ముచే శుక్లవృద్ధిక‌లుగున‌ట్లుజేసికొని స్త్రీల‌కాహారాది నియ‌మ‌ముచే శోణిత‌ము వృద్ధి కాకుండున‌ట్లు ఆఋతుదిన‌ముల‌లో స‌మ‌రాత్రులందు గ‌ర్భాదాన‌ముజేయ‌వ‌ల‌యును. ఆఋతుకాల‌మందే అమావాస్యాది ప‌ర్వముల‌ను విడువ‌వ‌ల‌యును. ప‌ర్వవ‌ర్జ్వం......(3-45, మ‌నువు) కామ‌జానిత‌రాన్విదురితి ఒక కుమారుడుపుట్టిన మీద‌ట స్త్రీసంగ‌మ‌ము వ‌ద‌ల‌వ‌ల‌యును. అటుపైన‌జ‌నించిన పుత్రుడు కామ‌జుల‌నియే చెప్పబడిరి.

స్త్రీసంగ‌మ‌ము రాత్రి వేళ‌నే జేయ‌వ‌ల‌యునుగాని ప‌గ‌టిపూట ప‌నికిరాదు. ప్రశ్నోప‌నిష‌త్తు 1 ప్రశ్న 13 మొద‌లు 1 మంత్రములు జూడ‌న‌గును.

"ప్రాణం వాఏతేప్రస్కంద‌న్తి ! యేదివార‌త్యా
సంయుజ్యంతే బ్రహ్మచ‌ర్యమేవ‌త‌ద్యద్రాత్రౌర‌త్యాసంయుజ్యన్తే"