12

వాన‌ప్రస్థాశ్రమ‌ము.

గృహ‌భార‌మంత‌యు పుత్రునిపైనిడి తానేకాంత‌మున భ‌గంతుని ధ్యానించుచు బ్రహ్మసాక్షాత్కార‌రూప‌మ‌గు శ్రేయ‌స్సును పొందుట‌కై యీ ఆశ్రమ మేర్పడిన‌ది.

ఇంనేనున్నచో మ‌మ‌త్వమును ఆస‌క్తియు యేర్పడున‌ను ఉద్ధేశ్యముతోను, ధ్యాన‌మున‌కెక్కువ వీలుక‌లుగున‌నియు, శ్రద్ధతో త‌ప‌స్సుచేసికొనుట‌కును, శాంతిక‌లుగుట‌కును, వాన‌ప్రస్థాశ్రమ‌మేర్పడిన‌ది. భార్య యిష్టమైన‌చో భ‌ర్తతో వ‌న‌మున‌కు రావ‌చ్చును. లేనిచో నామెను కుమారుని యొద్దనుంచి భ‌ర్త వ‌న‌మున‌కు పోవ‌చ్చును.

"త‌ప‌శ్రద్ధేయేహ్యుప‌వ‌సంత్యర‌ణ్యే శాంతావిద్వాంసో
భైక్షచర్యం చ‌రంతః ! సూర్యద్వారేణ‌తే విర‌జాః
ప్రయాంతి య‌త్రామృతః స‌పురుషోహ్యవ్యయాత్మ"   (ముండ‌కోప‌నిష‌త్‌. 2 ఖం. 11)

కాని యీ కాలప‌రిస్థితుల న‌నుస‌రించి వ‌నములోనికి లేచిపోవుట చాల‌క‌ష్టమైన‌ప‌ని. పూర్వము వ‌న‌ముల‌యందుండు యేర్పాట్లు యీ కాల‌మున‌లేవు. క‌నుక అర‌ణ్యముల యందు నివ‌సించుట చాల‌దుర్లభ‌మును, అపాయ‌క‌ర‌మును అయివున్నది. ఏది యెట్లున్నను సంసార‌తాప‌త్రయ‌మును వ‌దులుకొని గృహ‌నిర్వహ‌ణ‌మంత‌యు యిత‌రుల‌కొస‌గి కేవ‌ల‌ము బ్రహ్మవిచార‌మందు యేదేని వ‌స‌తిగ‌ల వివిక్త ప్రదేశ‌మున కొంత కాల‌ముండుట యీ కాలానుసార‌ముగ ఆచ‌ర‌ణీయ‌మ‌ని తోచుచున్నది. ఆశ్రమ‌మెందుల కేర్పడిన‌దో దాని త‌త్వమెరింగి త‌ద‌నుసార‌ముగ జీవిత‌ముగ‌డుపుట ప్రధాన‌ముగాని అడ‌వికేగుట ప్రధాన‌ముగాదు.