16

సాధ‌న చ‌తుష్టయ సంప‌త్తి

మోక్షమునం దిచ్చగ‌ల‌వారు త‌ప్పక సాధ‌న చుత‌ష్టయ‌సంప‌త్తి న‌భ్యసింప‌వ‌ల‌యును.

శుక్లయ‌జుర్వేదములోని వ‌రాహ ఉప‌నిష‌త్తునందు సాధ‌న‌చ‌తుష్టయ సంప‌త్తియ‌న‌నేమో పేర్కొన‌బ‌డిన‌ది.

సాధ‌న చ‌తుష్టయ సంప‌త్తియ‌న‌గా :-

1.నిత్యానిత్య వ‌స్తువివేక‌ము
2.ఇహ‌ముత్ర ఫ‌ల‌భోగ‌విరాగ‌ము
3.శ‌మాదిష‌ట్క సంప‌త్తి
4.ముముక్షుత్వము

బ్రహ్మము నిత్యమ‌నియు, ప్రపంచ‌ము అనిత్యమ‌నియు తెల‌సుకొన‌వ‌ల‌యును. అనిత్యమైన‌టువంటిన్ని, అశాశ్వత మైన‌టువంటిన్ని, యీ ప్రపంచ‌ములోని వ‌స్తువుల‌ను గ్రహించుట‌కె కాల‌ము దుర్వినియోగ‌ముచేయ‌క బ్రహ్మప‌దార్ధమును క‌నుకొనుటకై కృషిచేయ‌వ‌ల‌యును.

"బ్రహ్మైవ నిత్యమ‌న్యత్తు హ్యనిత్యమితి వేద‌నం!
సోయం నిత్యానిత్య వ‌స్తువివేక ఇతిక‌ధ్యతే"

ఈ లోక‌మును ప‌ర‌లోక‌మును గ‌ల ప‌దార్ధముల‌నిత్యముల‌ని నిశ్చయించుట‌వ‌ల‌న వానియందు కోరిక‌లేకుండుట‌యు, అవి తుచ్ఛవ‌స్తువుల‌ని భావించుట‌యు, ఇహ‌ముత్రార్ధఫ‌ల‌భోగ విరాగ‌మ‌న‌బ‌డును.

శ్లో !!" ఐహికా ముష్మికార్ధేషు హ్యనిత్యత్వేన నిశ్చ
యాత్ ! నైస్పృహ్యం తుచ్ఛబుద్ధిర్యత్తద్వైరాగ్యమితీర్యతే" (శంక‌ర స‌ర్వవేదాంత సిద్ధాంత‌ము)

భోగ్యవ‌స్తువుల‌యందు దోష‌ముగ‌ల‌ద‌ని యెంచుట‌చేవానియం ద‌స‌హ్యముక‌లుగును. ఈ లోక‌మునను ప‌ర‌లోక‌మున‌ను భోగ్యవ‌స్తువుల‌ను విమ‌ర్శింప‌వ‌ల‌యును. ఈ విష‌య‌ము యీ క్రిందిరీతిగా విభ‌జించి విచారింత‌ము.

1.మాన‌వ‌శ‌రీర‌ము, గ‌ర్భవాస‌ము
2.శైశవాద్యవ‌స్థలు
3.కాంత‌లు
4.గృహ‌ములు
5.ధ‌న‌ము
6.పుత్రులు
7.స్వర్గాదిలోక‌ములు

త‌ల్లిక‌డుపులో మ‌ల‌మూత్రముల‌న‌డుమ నున్నవాడై పురువుల‌చే కొర‌క‌బ‌డుచు జ‌ఠ‌రాగ్నిచే గ్రాగుచుండు స్థితి త‌లంప‌వ‌ల‌యును. శుక్లయ‌జుర్వేద‌ములోని గ‌ర్భోప‌నిష‌త్తు నందు వ‌ర్ణింప‌బ‌డిన గ‌ర్భస్థజీవుని విచార‌ముజూచిన‌చో గ‌ర్భన‌ర‌క‌మెటువంటిదో మ‌న‌కుతోచి వెంట‌నే వైరాగ్యము క‌లుగుట‌కు అవ‌కాశ‌ముగలుగును. యోనినుండి వెలువ‌డిన త‌రువాత పాప‌ముల‌ను నివృత్తిచేసి మోక్షమునొసంగెడి మ‌హేశ్వరుని శ‌ర‌ణుజొచ్చెద‌న‌నియు, ఆచార్యునివ‌ల‌న జ్ఞాన‌ము పొందెద‌న‌నియు, యోగము న‌వ‌లంభించెద‌న‌నియు, కామ‌క్రోధాదుల‌చే గలుగుసంక‌ట‌ముల బూడిద చేతున‌నియు, భ‌గ‌వంతుని మ‌న‌స్సునందు భ‌జింతున‌నియు, మ‌న‌స్సును వేరెచ్చట‌ను పోనియ‌న‌నియు, మ‌హ‌త‌పస్సుచేయుద‌న‌నియు, యీరీతిగా గ‌ర్భస్తుడ‌గుజీవుడు ప్రమాణ‌ములు చేయును. గ‌ర్భము నుండి వెలువ‌డిన‌పిద‌ప యీ ప్రమాణ‌ముల నొక్కటియైన‌ను జ్ఞాప‌క‌ముంచుకొని అట్లు జీవిత‌ముగ‌డుప‌క తద్వ్యతిరిక్తమ‌గు జీవిత‌ముగ‌డుపుట‌చేగ‌దా సంసార‌దుఃఖ‌ము క‌లుగుచున్నది. ఈ శ‌రీర‌ము మీద యెక్కవ‌భ్రాంతిచే శ‌రీర‌మేతాన‌ని స‌ర్వవాల స‌ర్వావ‌స్థల‌యందును దాని పోష‌ణ‌కై పాటుబుచున్నాము. శ‌రీర‌ము అశ్వర‌మ‌నియు, దీనినెంత‌గా కాపిడిన‌ను మృత్యవు నిశ్చయ‌మ‌నియు తెలుసుకొన‌నిచో దేహాభిమాన‌ము చాలా వ‌ర‌కు న‌శించును. అందువ‌ల‌న‌నే వేద‌మునందు అప‌రిశుద్ధమైన యీ శ‌రీర‌మును గురించి నీవు త‌లంప‌వ‌ద్దని య‌నేక విధ‌ముల హెచ్చరింప‌బ‌డిన‌ది. ఇట్లు చెప్పుట‌చే శ‌రీర సంర‌క్షణ కూడ‌ద‌ని య‌ర్ధముకాదు. శ‌రీర‌ము స‌రియైన స్థితిలోనున్ననే ధ‌ర్మాచ‌ర‌ణ‌మున‌కు వీలుప‌డును. కృష్ణయ‌జుర్వేద తైత్తిరీయోప‌నిష‌త్తునందు కుశ‌ల‌క‌ర్మనుండి అన‌గా దేహ‌రోగ్యముని మిత్తము చ‌సుకొన‌వ‌ల‌సిన ఔష‌ధ‌సేవ‌నాది చికిత్సయందుప్రమాద‌మును పొంద‌వ‌ల‌ద‌ని ఉప‌దేశింప‌బడిన‌ది.
కుశ‌లాన్నప్రమ‌దిత‌వ్యం (11 అనువాక‌ము శిక్షావ‌ల్లి)
ధ‌న‌ము, దారాపుత్రాదులు యిండ్లు వీటియందు లంప‌టుడు కాకూడ‌ద‌ని వేద‌ము చెప్పుచున్నది.

"అస‌క్తిర‌న‌భిష్వంగః పుత్రదార‌గృహాదిషు" గీత‌.

"్యక్తేష‌ణో హ్యనృణ‌స్తం విదాత్వా మౌనీ సేవ‌దాశ్రమే య‌త్రకుత్ర" శ్రుతి.

ఈష‌ణ‌త్రయ‌మును ధనేష‌ణ‌, దారేష‌ణ‌, పుత్రేష‌ణ విడువ‌వ‌ల‌యున‌ని శ్రుతి చెప్పుచున్నది. స్త్రీ వాంఛ వీడ‌వ‌ల‌న‌యున‌ని సామ‌వేద‌ములోని మ‌హోప‌నిష‌త్తునందు స్పష్టప‌రుప‌బ‌డిన‌ది.

పుత్రేష‌ణ‌, విత్తేష‌ణ‌, లోకేషణ‌ములు బ్రహ్మజ్ఞాన‌మున‌కు ప్రతిబంధ‌క‌ముల‌నియు, అందువ‌ల‌న బ్రాహ్మణుడు ఆత్మ జ్ఞాన‌మును బాల్యమునుండి పొంద‌వ‌ల‌యున‌నియు, భార్యయైన‌ది త‌న‌ప‌తియొక్క ప్రయోజ‌న‌ము నిమిత్తమై మాత్రము ప్రియ‌మైయండ‌లేద‌నియు, త‌న ఆత్మ ప్రయోజ‌న‌వై ప్రియ‌ముగానున్నద‌నియు, అదేవిధ‌ముగా కూమారునియందును, ధ‌న‌మునందునుచ స‌మ‌స్తమునందును ప్రీతి నుంచుచున్నాడ‌నియు స‌ర్వమును ఆత్మ కొర‌కేగాని, వేరుకాద‌నియు, ఆత్మయే చూడ‌త‌గిన‌ది, విన‌త‌గిన‌ది, త‌లంప‌ద‌గిన‌ది, ధ్యానింప‌ద‌గిన‌ద‌నియు, మొద‌లైన విష‌య‌ములు శుక్ల య‌జుర్వేద‌ములో బృహ‌దార‌ణ్యక శ్రుతియందు 2 వ అధ్యాయ‌ము 4 వ బ్రాహ్మణ‌మునందును, 3 వ అధ్యాయ‌ము 5 వ బ్రాహ్మణ‌మునందును చెప్పబ‌డిన‌వి. ఆ విష‌య‌ముల‌న్నియు చ‌దువ‌రులు జాగ‌రూవ‌త‌తో గ‌మ‌నించ‌వ‌ల‌యును. దారాపుత్రాదులు ధ‌న‌మును యిహ‌లోక‌మునందు కొంత‌వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుదురేగాని, మోక్షప్రాప్తికి యెంత‌మాత్రమును స‌హ‌య‌కారులు కారు. మీదుమిక్కిలి ప్రతిబంధక‌ము గూడా అయివున్నారు.

"న‌క‌ర్మణా న‌ప్రజ‌యా ధ‌నేన‌త్యాగేనైకే అమృత‌త్వమాన‌శుః"

(కృష్ణయజుర్వేద‌ము. కైవ‌ల్య ఉప‌నిషత్తు) త్యాగ‌యే మోక్షమార్గమ‌ని శ్రుతిచెప్పుచున్నది. కాల‌మంతయు ప‌ర‌మేశ్వరుని సేవ‌కు వినియోగించ‌కుండా వీరిసేవ‌కే హ‌రించుచున్నారు. గృహ‌స్థాశ్రమ‌ముయొక్క నిజ‌ధ‌ర్మముల‌ను, ప‌విత్రత‌ను గ్రహించ‌ని హేతువుచేత‌ను, స్త్రీ పురుషు ల‌న్యోన్యము భోగ్య వ‌స్తువుల‌ను తలంపుతో సంచ‌రించు చుండుట‌వ‌ల‌న‌ను దుఃఖ‌మున‌కు కార‌ణ‌మ‌గుచున్నది. ధ‌ర్మవిరుద్ధముగాని కామ‌ము స్వీక‌రింప‌ద‌గిన‌దే.

"ధ‌ర్మావిరుద్ధభూతేషు కామోస్మి భ‌ర‌త‌ర్షభ‌"

ధ‌నాశ‌చేయ‌వ‌ల‌ద‌ని వేద‌ము చెప్పుచున్నది.

"మాగృధః క‌స్యస్విద్ధనం" (శుక్ల యజుర్వేద‌ము. ఈశావాస్యము. 1) ధ‌న‌మే మ‌న‌ల‌ర‌క్షించున‌నియు, లంప‌టుడై, మోహ‌ముచే దానిని సంపాదించుట‌కు యేమార్గమునైన‌ను అవ‌లంభించుట‌ను వేద‌మునిందించుచున్నది. ధ‌న‌ము కేవ‌ల‌ము నిష్ప్రయోజ‌న‌మ‌ని అర్ధముకాదు.

"భూత్యైన‌ప్రమ‌దిత‌వ్యం" అని తైత్తిరీయోపనిష‌త్తునందు చెప్పబడిన‌ది. సంప‌ద‌యందు ప్రమాద‌మును పొంద‌వ‌ల‌దు. అన‌గా సంప‌ద‌క‌లుగుట‌కు న్యాయ‌మార్గమునందు ప్రవేశించ‌వ‌ల‌యును. అన్యాయ‌ముగా ధ‌న‌ము సంపాదించుట రాక్షస సంప‌ద‌య‌ని శ్రీ‌కృష్ణ భ‌గ‌వానుడు గీత యందు బోధించియున్నాడు. సంపాదించిన ధ‌న‌మును స‌ద్వినియోగ‌ము చేయ‌వ‌ల‌యున‌ని అభిప్రాయ‌ము. కావున ధ‌న‌మే మ‌నల‌ను ర‌క్షించున‌నే అల్పబుద్ధితో కాల‌మంత‌యు ధానార్జన‌కై వినియోగింప‌క దానియొక్క అనిత్యత్వమును గ్రహించి నిత్యవ‌స్తువుల‌ను తెలుసుకొనుట‌కు ప్రయత్నింవ‌ల‌యును. ధ‌న‌మ‌దాంధులు భ‌గ‌వంతునిచేరుట యెంత దుర్లభ‌మో క్రీస్తు చక్కగా వ‌ర్ణించియున్నాడు.

స్వర్గాదిలోకములు పొంద‌వ‌ల‌యున‌ని అనేక కామ్యక‌ర్మల‌ను య‌జ్ఞయాగాది క్రతువుల‌ను డంబ‌ముగా చేయువారిని యెంద‌రినో మ‌నము జూచుచున్నాము. ఆస్వర్గాదిలోక‌ములు అనిత్యమైన‌వి.

"అబ్రహ్మభువ‌నాన్‌ల్లోక్లాః పున‌రావ‌ర్తినోర్జున‌
మాముపేత్యతు కౌంతేయ పున‌ర్జన్మన‌విద్యతే"

ఈ రీతిగా శ్రీ‌కృష్ణభ‌గ‌వానుడు సెల‌విచ్చియున్నాడు. .జీవిత‌ము యొక్క ప‌ర‌మావ‌ధి జ‌న‌న మ‌ర‌ణ రాహిత్యమును పొందుట‌గాని భోగ‌ముల‌కొర‌కు ఆయాలోక‌ముల‌ను పొందుట‌గాదు. పుణ్యఫ‌ల‌ము క్షీణించిన‌వెంట‌నే మ‌ర్త్యలోక‌మున‌కు తిరిగి రావ‌ల‌సిన‌దియే. కాబట్టి మ‌న‌ము భోగ‌ముల నిచ్చుమార్గముల‌ను కోర‌క ప‌ర‌మేశ్వరుని ఆరాధించి ఆత్మతత్వమును తెలుసుకొని కృతార్ధత పొంద‌వ‌ల‌యును.

3.శ‌మ‌ము, ద‌మ‌ము, తితిక్ష, ఉప‌ర‌తి, శ్రద్ధ, స‌మాధాన‌ము, అను నీఆరును శ‌మాదిష‌ట్క మ‌న‌బ‌డును. మ‌న‌స్సు ఏకాగ్రవృత్తిచే ల‌క్ష్యమునందు స్థిర‌ముగానుంచుట శ‌మ‌మ‌ని చెప్పబ‌డుచున్నది.

"ఏక‌వృత్త్యవ‌మ‌న‌సః స్వల‌క్ష్యేనియ‌త‌స్థితిః
శ‌మ‌యిత్యుచ్యతే స‌ద్భి శ‌మ‌ల‌క్షణ వేదిభిః"

కామ‌ము, క్రోధ‌ము, లోభ‌ము, మ‌దము, మోహ‌ము, మ‌త్సర‌మునకు అరిష‌డ్వర్గమును జ‌యించిన‌చో శాంతి క‌లుగ‌దు. యోగ‌త‌త్వోప‌నిష‌త్తునందు జీవుడు కామ‌ము, క్రోధ‌ము, భ‌య‌ము, మోహ‌ము, లోభ‌ము, మ‌ద‌ము, ర‌జోగుణ‌ము, జ‌న్మము, మ‌ర‌ణ‌ము, కృప‌ణత్వము, శోక‌ము, సోమ‌రిత‌న‌ము, ఆక‌లి, ద‌ప్పి, అత్యాశ‌, ల‌జ్జ, వెర‌పు, దుఃఖ‌ము, సంతోష‌ము, విషాద‌ము యివి మొద‌ల‌గు దోష‌ముల చేత విడువ‌బ‌డిన‌వాడై కేవ‌లుడైయుండ‌వ‌లెన‌ని బోధింప‌బ‌డిన‌ది. శ‌రీర‌మున‌కు కామ‌ము, క్రోధ‌ము, భయ‌ము, నిశ్వాస‌ము, నిద్రయ‌ను అయిదు దోష‌ములు క‌ల‌వ‌నియు, కామ‌ము సంక‌ల్పము లేమిచేత‌ను, క్రోధ‌ము క్షమ‌చేత‌ను, భ‌య‌ము భ్రాంతిచేత‌ను, నిశ్వాస‌ము మిత‌భోజ‌న‌ముచేత‌ను, నిద్రత‌త్వ విచార‌ముచేత‌ను, నివృత్తియ‌గుచున్నవ‌నియు, శుక్లయ‌జుర్వేదమునందు చెప్పబడినిది.

"దేహ‌స్య పంచ‌దోషాభ‌వ‌న్తి ! కామ‌క్రోధ భ‌య‌
నిశ్వాస‌నిద్రాః, త‌న్నిరాస‌స్తు నిస్సంక‌ల్ప
క్షమాల‌ఘ్వాహారాప్రమాద‌తాత‌త్వసేవ‌నం"   (మండ‌ల బ్రాహ్మణోప‌నిష‌త్తు)

1. ద‌మ‌ము. బుద్ధి యొక్క దోష‌ములు నివ‌ర్తించుట‌కొర‌కు బుద్ధిని శాసించుట ద‌మ‌మ‌ని చెప్పబ‌డును.

"నిగ్రహాబాహ్యవృత్తీనాం ద‌మ‌యిత్వ భిదీయ‌తే"

ఇంద్రియ‌ములు విష‌య‌ములయందు స్వేచ్ఛగావ‌ర్తింప‌గా మ‌న‌స్సు చెడిపోవుచున్నది. ఇంద్రియ‌ముల నిరోధించిన‌చో మ‌న‌స్సు మంచి స్వభావ‌ల‌మును పొందుచున్నది.

కామ‌సంక‌ల్పము (కోరిక‌) గ‌ల‌మ‌న‌స్సు అశుద్ధమైన‌ది. అదిలేనిది శుద్ధమైన‌ది. బంధ‌మోక్షముల‌కు కార‌ణ‌ము మ‌న‌స్సే విష‌య‌ముల‌యందాసక్తిగ‌ల మ‌న‌స్సు బంధ‌ము. త‌ద్వ్యతిరిక్తము మోక్షముకొర‌కు అగుచున్నది. మ‌న‌స్సెల్లప్పుడు విష‌య‌రాహిత్యమైన‌దిగా జేయ‌వ‌లెను. సంక‌ల్పము న‌శించు నంత‌వ‌ర‌కు మ‌న‌స్సును నిరోధింప‌వ‌ల‌యును. అట్టిమ‌న‌స్సును ఆత్మస్వరూప‌మును పొందింప‌వ‌ల‌యును.

(కృష్ణయ‌జుర్వేద‌ము. అమృత‌బిందూప‌నిషత్తు)

శుద్ధబుద్ధి విచార జ్ఞాన‌ముగ‌ల మ‌న‌స్సుచేత‌ను దేవునితెలుసుకొనువారు అమృత‌ము నుందెద‌ర‌ని శ్వేతాశ్వత‌ర ఉప‌నిష‌త్తు చెప్పుచున్నది. (4 అధ్యాయ‌ము 20)

ఆత్మర‌ధ‌స్వామి. శ‌రీర‌ము ర‌ధ‌ము, బుద్ధి సార‌ధి, మ‌న‌స్సు ప‌గ్గము. చ‌క్షురాదింద్రియ‌ములు గుఱ్ఱములురూపాదివిష‌య‌ములు మార్గములు. శ‌రీరేంద్రియ మ‌న‌స్సహితుడ‌గు జీవాత్మభోక్త. నేర్పరిగాని సార‌ధికి దుష్టములైన గుఱ్ఱములెట్లు స్వాధీన‌ముకావో అస‌మాహితుడైన మ‌న‌స్సుచేత వివేక‌హీనుడైన‌వాడ‌నికి ఇంద్రియ‌ములు వ‌శ‌ముకావు. యుక్తుడైన మ‌న‌స్సుగ‌ల‌వానికి వ‌శ‌మ‌గును. ఎవ్వడు వివేక‌హీనుడై చిత్తమును వ‌శ‌ప‌ర‌చుకొన‌క చంచ‌లుడై అప‌విత్రుడుగానున్నాడో వాడు మోక్షమును బొంద‌జాల‌డు. జ‌న‌న మ‌ర‌ణాది ల‌క్షణ‌మ‌గు సంసార‌మును పొందుచున్నాడు. జ్ఞాన‌మునుపొంది యుక్తమైన మ‌న‌స్సుగ‌ల‌వాడై ప‌విత్రమైన జీత‌విముగ‌డుపునో వానికి పున‌ర్జన్మలేదు. ప‌ర‌బ్రహ్మమును పొందుచున్నాడు. సంసార బంధ‌మునుండివిముక్తి జెందుచున్నాడు.

(కృష్ణయజుర్వేద‌ము. క‌ఠోప‌నిష‌త్తు)

2. తితిక్ష. స‌హ‌నం స‌ర్వదుఃఖానాం తితిక్షాసాశుభామ‌తా. ప్రార‌బ్ధవ‌శ‌మున ప్రాప్తించిన దుఃఖ‌మునుగూర్చి చింత‌నొంద‌క స‌హించుట తితిక్షయ‌న‌బ‌డును. ఓర్పులేనిచో విఘ్నముల‌చే ప‌డిపోవును.

3. ఉప‌ర‌తి. విష‌యేభ్యః ప‌రావృత్తిః ప‌ర‌మోప‌ర‌తిర్హిసా. స‌మ‌స్త విష‌య‌ముల యందును ఆత్మ బుద్ధిచేయుట ఉప‌ర‌తి య‌న‌బ‌డును. స‌క‌ల‌మును భ‌గ‌వ‌ద్వ్యాప‌క‌ముగా చూడ‌వ‌ల‌యును.

4. శ్రద్ధ. నిగ‌మాచార్య వాక్యేషు భ‌క్తి శ్రద్ధేతి విశ్రుతా. వేద‌వాక్యముల యందును గురు వాక్యముల‌యందును న‌మ్మక‌ముంచ‌వ‌ల‌యును.

5. స‌మాధాన‌ము. ల‌క్ష్యమందు మ‌న‌స్సేకాగ్రముగ నిల్పుట‌యే స‌మాధాన‌మ‌న‌బ‌డును.

"చిత్తైకాగ్ర్యస్తుస‌ల్లక్ష్య స‌మాధాన‌మితిస్మృతిం"

6. ముముక్షుత్వము. ఈ సంసార బంధ‌మునుండి యెట్లు ముక్తిక‌లుగును. నేనేమిచేయ‌వ‌ల‌యును. ఈ రీతిగా దృఢ బుద్ధితో విత‌ర్కించుకొనుట‌యే ముముక్షుత్వము. ఇది జ్ఞానోద‌య‌మున‌కు చాల స‌హ‌కారి. ఈ శ‌మాదిష‌ట్కమును ఆచ‌ర‌ణ‌లో పెట్టిన‌చో యెట్టి గొప్పఫ‌లిత‌ముల నైన‌ను పొంద‌వ‌చ్చును.