17

వాస‌నాక్షయ‌ము. అనుభ‌వ‌జ్ఞాన‌ము. మ‌నోనాశ‌ము.

ఈ మూడును ఒక్కమాటుగా చిర‌కాల‌మ‌భ్యసింప‌వ‌ల‌యును. మోక్షరూప‌ఫ‌ల‌మును యిచ్చుచున్నవి. ఈ మూటిని అభ్యసింప‌నిచో నూర్లకొల‌ది సంవ‌త్సర‌ములైన‌ను మోక్షము క‌లుగ‌నేర‌దు.

"త్రయ‌యేవంసమం యావ‌న్నాభ్యస్తాశ్చ పునః
పునః తావ‌న్నప‌ద సంప్రాప్తిర్భవ‌త్యపిస‌మాశ‌తైః"   (ముక్తికోప‌నిష‌త్తు)

చిర‌కాలమీ మూడును అభ్యసించిన‌చో హృద‌య గ్రంధులు అన‌గా మ‌లిన‌వాస‌న‌లు తెగిపోవును. వాస‌న‌లు మూడువిధ‌ములు. 1.శాస్త్రవాస‌న 2. దేహ‌వాస‌న 3.లోక‌వాసన . ఈ వాస‌నాత్రయ‌ముతో గూడుకొనియున్నవానికి బ్రహ్మజ్ఞాన‌ము చ‌క్కగా పుట్టజాల‌దు.

"లోక‌వాస‌న‌యా జంతోశ్శాస్త్ర వాస‌న‌యాపిచ‌
దేహ‌వాస‌న‌యాజ్ఞానం య‌ధావ‌న్నైవ‌జాయ‌తే"

వాస‌నాస‌మూహ‌ము శుభ‌మ‌నియును, అశుభ‌మ‌నియును, రెండువిధ‌ములు. ప‌రిశుద్ధమైన శుద్దవాస‌నాస‌మూహ‌ముచే మాన‌వుడ‌నుగ్రహింప‌బ‌డిన ప‌ర‌మేశ్వరుని స్థాన‌మును క్రమ‌ముగా పొందును. అశుభ‌వాస‌న‌యే బ‌ల‌ముగానున్నచో సంక‌ట‌మునందుచేర్చును. అశుభ వాస‌న‌ల‌యందు ప్రవేశించిన చిత్తమును పురుష ప్రయ‌త్నమును సాధ‌న‌ముచే శుభ‌రూప‌ముల‌గువానియందు ప్రవేశింప‌జేయవ‌ల‌యును. మ‌న‌స్సనెడి బాల‌కుని పురుష ప్రయ‌త్నముచేత లాలింప‌వ‌ల‌యును.
పౌరుషేణ ప్రయ‌త్నేన లాల‌యేచ్చిత్త బాల‌కం అశుభ క‌ర్మల వైపున పోనీయ‌క శ‌మ‌ద‌మాది గుణాభ్యాస‌ము చేత‌ను, శాస్త్రవిచార‌ణ శ్రవ‌ణాదుల‌చేత‌ను, స‌త్కర్మల‌వైపున‌కే మ‌ర‌లున‌టుల చేయ‌వ‌ల‌యును. మ‌లిన‌వాస‌న అజ్ఞాన‌మే ఘ‌న‌మైన ఆకార‌ముగా క‌ల‌దియు, ఎక్కువైన అహంకార‌ము క‌ల‌దియు, పున‌ర్జన్మ గలుగ‌జేయున‌దియు న‌ని చెప్పబ‌డుచున్నది. వాస‌న‌ల‌యందు ద‌గులుకొనుట‌యే సంసార‌ము, బంధ‌ము. వాస‌నాక్షయ‌మేమోక్షమార్గమగును. అశుభ‌వాస‌న‌గ‌ల‌పురుషుడు ఊర‌క అనేక శాస్త్రములు చ‌దువుట‌లో కాల‌ముగ‌డుప‌క స‌ర్వాంత‌ర‌మైస్వయంప్రకాశ‌మ‌గు తేజ‌స్సును వెదుకుకొన‌వ‌ల‌యును. ముందుగా బంధ‌మ‌గుమ‌లిన‌వాస‌న‌ల‌ను వ‌దలి విష‌య‌వాస‌న‌ల‌ను వ‌ద‌లి, మైత్రి. ముదిత‌, క‌రుణ‌, ఉపేక్షయ‌నెడి స్వచ్చముల‌గు శుభ‌వాస‌న‌ల‌ను గ్రహింప‌వ‌ల‌యును.

"మాన‌సీర్వాస‌నాః పూర్వంత్యక్త్వా విష‌య‌వాస నాః !
మైత్ర్ర్యాది వాస‌నానామ్నార్గృహాణామ‌ల వాస‌నాః"

ఆ మైత్ర్యాదివాస‌ల‌చేత వెలుప‌ల వ్యవ‌హ‌రింప‌బ‌డుచున్నను లోప‌ల స‌మ‌స్తాభిలాఫ‌ముల‌నువ‌ద‌లి చిన్మాత్ర బ్రహ్మవాస‌న‌యే క‌ల‌వాడుకావ‌లెను. ఏది శ‌బ్ధస్పర్శరూప ర‌స‌గంధ‌ముల‌కు అవిష‌య‌మ‌గుటచేత పాంచ‌భౌతిక వికార‌శూన్యమో ఏయ‌ది అవ్యయ‌మును, నిత్యమును నామ‌గోత్రములు లేనిదియునున‌గు బ్రహ్మత‌త్వమును, ఎల్లప్పుడు సేవింప‌వ‌ల‌యును. (భ‌జ‌స్వనిత్యం) మ‌న‌స్సుకు వృక్షమున‌కు ప్రాణ‌స్పంద‌ము (ప్రాణ‌ముల‌యొక్క క‌ద‌లిక‌) మ‌లిన‌వాస‌న‌ల‌నెడి రెండుబీజ‌ములుగ‌ల‌వు. ఆ రెంటిలో యేఒక్కటిన‌శించిన‌ను రెండును న‌శించును. దృఢాప‌రోక్ష జ్ఞాన‌మువ‌ల‌న వాస‌న‌న‌శించును. వాస‌న‌న‌శించిన ప్రాణ‌స్పంద‌ముమానును. ఇవి న‌శించిన చిత్తవృక్షము స‌మూల‌ముగ‌న‌శించును.

"ద్వేబీజే చిత్తవృక్షస్య ప్రాణ‌స్పంద‌న వాస‌నే
ఏక‌స్మి చ‌త‌యోః క్షీణేక్షిప్రంద్వేఅపిన‌శ్యతః"

మ‌లిన‌సంస్కార‌ము న‌శించిపోవుట‌కు కొన్ని ఉపాయ‌ములు వేదాంత‌ము చెప్పుచున్నది.

1.అసంగుడ‌గుట‌
2.సంసార‌భావ‌ము వ‌ద‌లుట‌.
3.శ‌రీర‌ము అశ్వర‌మైన‌ద‌ను విష‌య‌ము తెలుసుకొనుట‌.
4.గురుబోధ‌చేత‌ను, శాస్త్రప్రమాణ‌ముచేత‌ను నిర్ణయింప‌బ‌డిన ప‌ద్ధతిని ఆచ‌రించుట‌.

"అసంగ వ్యవ‌హార‌త్వాద్భవ భావ‌న‌వ‌ర్జనాత్‌
శ‌రీర‌నాశ‌ద‌ర్శిత్వా ద్వాస‌నాన‌ప్రవ‌ర్తతే"
"గురుశాస్త్ర ప్రమాణైస్తు నిర్ణీతం తావ‌దాచ‌ర‌"

సంక‌ల్పము న‌శించిన‌చో మ‌న‌స్సుఉండ‌జాల‌దు. ఏలన‌న‌గా సంక‌ల్పమే స్వరూప‌ముగాగ‌ల‌ది మ‌న‌స్సు. విక‌ల్పాత్మక‌మ‌గు మ‌న‌స్సును శీఘ్రముగ‌శోషింప జేయుమ‌ని వేదాంత‌ము బోధించుచున్నది.

"సంక‌ల్పమేవ‌త‌న్మన్యే సంక‌ల్పోప‌శ‌మ‌న‌త‌త్‌
శోష‌యా శుయ‌ధా శోష‌మేతి సంసార‌పాద‌పః"

మ‌న‌స్సు వృత్తిరూప‌మున స‌ర్వత్ర వీజృంభించుట‌చే ప‌ర‌మేశ్వరునెరుగ‌క బాధ‌ప‌డుచున్నాము. మ‌న‌స్సు అట్లువిజృంభింప‌క న‌శించుట‌యే మోక్షరూప‌మ‌గు శ్రేయ‌స్సున‌కు కార‌ణ‌మ‌గుచున్నది.

"ఉపాయ‌యేక‌యేవాప్తి మ‌న‌స‌స్స్వస్య నిగ్రహే మ‌న‌సోభ్యుద‌యో నాశోమ‌నోనాశోమ‌హోద‌యః"

ఏక త‌త్వదృఢాభ్యాస‌ముల‌వ‌ల‌న మ‌న‌స్సు జ‌యింప‌బ‌డ‌వ‌ల‌యును. లేనిచో రాత్రియందు పిశాచ‌ముల‌వ‌లె హృద‌య‌మునందు వాస‌న‌లు చ‌లించుచుండున‌ని వేద‌ము చెప్పుచున్నది. మ‌నోనాశ‌మున‌కు బాహ్యేంద్రియ నిగ్రహ‌మ‌త్యావ‌శ్యక‌ము. బాహ్యేంద్రియ‌ముల‌ను యిత‌ర వ్యాపార‌ములందు చొర‌నీయ‌క చేతిని చేతితోబిగించిప‌ట్టి దంత‌ముల‌ను దంత‌ముల క‌దియ‌బ‌ట్టి అవ‌య‌వ‌ముల‌ను అవ‌య‌వ‌ముల‌చే ఆక్రమించి ఈ రీతిని మ‌నోనిగ్రహ‌ము కొర‌కు అభ్యాస‌ముచేయ‌వ‌ల‌యును. బాగుగా ఆస‌న‌శుద్ధిగాకూర్చుండి బ్రహ్మత‌త్వమును శాస్త్రస‌మ్మత‌మ‌గు యుక్తిన‌వ‌లంభించి చింతించ‌వ‌ల‌యును. శాస్త్రస‌మ్మత‌మ‌గు మార్గము లెవ్వియ‌న‌గా

1. బ్రహ్మవిద్యను పొందుట‌
2. స‌జ్జన సాంగ‌త్యము మోక్షముయొక్క వాకిటయందు నలుగురు ద్వార‌పాల‌కులుగ‌ల‌రు. వారెవ్వర‌న‌గా
1. ఇంద్రియ‌నిగ్రహ‌ము 2. బ్రహ్మవిచార‌ము 3. ఎల్లప్పుడు సంతోష‌ముగానుండుట 4. స‌జ్జన‌సాంగ‌త్యము

"మోక్షద్వారే ద్వార‌పాలాశ్చ త్వారః ప‌రికీర్తితాః
శ‌మో విచార‌సంతోష‌శ్చతుర్ధ స్సాధుసంగ‌మః"

3. మ‌లిన‌వాస‌నా ప‌రిత్యాగ‌ము.
4. ప్రాణ‌స్పంద నిరోధ‌న‌ము

ఈ ఉపాయ‌ములు చిత్తమ‌నోజ‌య‌మునందు స‌మ‌ర్ధములైన‌వి.

"అధ్యాత్మ విద్యాధిగ‌మ‌స్సాధు సంగ‌తి రేవ‌చ ! వాస‌నా సంప‌రిత్యాగః ప్రాణ‌స్పంద‌నిరోధ‌నం ! ఏతాస్తా యుక్తయః పుష్టాస్సంతి చిత్తజ‌యేకిల"

పై జెప్పిన శాస్త్రస‌మ్మత‌మ‌గు నుపాయ‌ముల న‌వ‌లంభింప‌క బ‌లాత్కార‌ముగ హ‌ఠ‌యోగ‌ముచే మ‌న‌స్సునుజ‌యింప‌జూచు వార‌ల‌ను మ‌న‌మెంద‌రినో జూచుచున్నాము. యీప‌ద్ధతి వేద‌విరుద్ధమైన‌ది. వారిని చీక‌టియందు దీప‌మునువ‌ద‌లి కాటుక‌ల‌చేత వ‌స్తువుల‌ను వెద‌కువారికిపోల్చుచున్నది. హ‌ఠ‌యోగాదుల‌చేత‌ను మ‌నోజ‌య‌ము అశ‌క్యమ‌ని వేదాంత‌ము చాటుచున్నది. తామ‌ర‌కాడ నూలుతో మ‌దించిన గ‌జ‌శ్రేష్టమును క‌ట్టుట‌వంటిద‌ని చెప్పుచున్నది.

"సతీషు యుక్తిష్వేతాసుహ‌ఠన్నియ‌మ‌యంతియే
చేత‌సోదీప‌ముత్సృజ్య విచిన్వంతిత‌మోంజ‌నైః"

"విమూఢాః క‌ర్తుముద్యుక్తా యేహ‌ఠాచ్చేత సోజ‌యం ! తేనిబ‌ధ్నంత నాగేంద్రమున్మత్తం బిస‌తంతుభిః"

పైన చెప్పబ‌డిన మ‌నోజ‌య‌మున‌కు ఉపాయ చ‌తుష్టయ‌మునందొక‌టియైన ప్రాణ‌స్పంద‌నిరోధ‌మునుగూర్చి శాండిల్యోప నిష‌త్తునందు ప్రధ‌మాధ్యాయ‌మునందు వివరింప‌బ‌డిన‌ది. ఆవిష‌య‌ముల‌న్నియు చ‌దువ‌రులు గ‌మ‌నింప‌వ‌లెను.