19

నిజ‌మ‌గుయజ్ఞమేది

శుక్ల యుజుర్వేద‌ములోని శాట్యాయ‌నీయోపనిష‌త్తునందు స‌ర్వయ‌జ్ఞముల‌లోను జ్ఞాన‌య‌జ్ఞమే ఉత్తమ‌మైన‌దని చెప్పబ‌డిన‌ది. జ్ఞాప‌య‌జ్ఞస్సవిజ్ఞేయ‌స‌ర్వయ‌జ్ఞోత్తమోత్తమః ఈ య‌జ్ఞము యొక్కల‌క్షణ‌ములు నారాయ‌ణ ప్రశ్నమునందు (80 అనువాక‌ము) చ‌క్కగా వ‌ర్ణింప‌బ‌డిన‌ది. దీనికే దేహేంద్రియాదిక‌మున‌కు సాక్షియ‌గు ఆత్మయే యజ‌మానుడు. అంతఃక‌ర‌ణ‌మునందు గ‌ల శ్రద్ధయే ప‌త్ని. హృద‌య‌మే యూప‌ము కామ‌మే ఆజ్యము. కోప‌ము ప‌శువు. త‌ప‌స్సే అగ్ని. స‌ర్వేంద్రియ‌ముల‌ను ఉప‌శ‌మింప‌జేయున‌ట్టి ద‌మ‌మ‌ను చిత్తవృత్తియే ద‌క్షిణ‌. అధ‌ర్వణ వేదాంత‌ర్గత ప్రాణాగ్ని హోత్రోప‌నిష‌త్తునందు నిజ‌మ‌గు య‌జ్ఞతత్వము తెలుప‌బ‌డిన‌ది.

"అస్యశ‌రీర‌య‌జ్ఞస్య యూప‌ర‌శ‌నాశోభిత‌స్యాత్మాయ‌జ‌మానః, బుద్ధిఃప‌త్నీ, వేదామ‌హ‌ర్త్విజః, అహంకారోధ్వర్యుః, చిత్తంహోతా...., శ‌రీరంవేదిః....,స్మృతిర్ధయాక్షాంతిర‌హింసాపత్నీసంయజాః,ఓంకారోయూపః,ఆశార‌శ‌నా,మ‌నోర‌ధః,కామఃప‌శుః......బుద్ధీంద్రియాణియ‌జ్ఞపాత్రాణి, క‌ర్మేంద్రియాణిహ‌వీంషి, అహింసాయిష్టయః, త్యాగోద‌క్షిణా, అవ‌భృధంమ‌ర‌ణం.

ఈ పైనుద‌హ‌రించిన శారీరిక య‌జ్ఞమున‌కు జీవుడేయ‌జ‌మానుడు, నిశ్చయాత్మక‌మ‌గు బుద్ధియే ప‌త్ని. నాలుగువేద‌ములే మ‌హఋత్విక్కులు. అన‌గా స‌మంత్రక‌ముగ య‌జ్ఞమును చేయించువారు. అన‌గా వేద‌ధ‌ర్మమే జీవిత‌ములో అవ‌లంభింప‌త‌గిన‌ది. అదియే జీవిత‌మును శాసించున‌ది. శ‌రీర‌మేయ‌జ్ఞవేది. స్మృతి, ద‌య‌, ఓర్పు, అహింస యివి ప‌త్నీసంయాజులు. ఓంకార‌మే యూప‌ము. (యాగీయ‌ప‌శువును క‌ట్టివేయుస్తంభ‌ము) ఆశ‌యేర‌శ‌న (త్రాడు) మ‌న‌స్సేర‌ధ‌ము. కామ‌మే యాగ‌ప‌శువు. అయిదు జ్ఞానేంద్రియ‌ములు య‌జ్ఞపాత్రలు. క‌ర్మేంద్రియ‌ములు హివిస్సులు. అహింస‌యే ఇష్టము. త్యాగ‌యే ద‌క్షిణ‌, మ‌ర‌ణ‌మే య‌జ్ఞమైన పిద‌ప దీక్షావిస‌ర్జన స‌మ‌య‌మందు చేసెడిస్నాన‌ము. ఈస‌త్యమునే య‌జుర్వేదాంత‌ర్గత గ‌ర్భోప‌నిష‌త్తు చాటుచున్నది. సంతోష‌మే దీక్షయ‌నియు స‌త్యవాక్కులే వ్యాహృతుల‌నియు, ఆయుస్సు, బ‌ల‌ము, పిత్తమ‌నున‌వి, ప‌శువుల‌నియు, కామ‌మాజ్యమ‌నియు యొద‌ల‌గు విష‌య‌ములిట సూచింప‌బ‌డిన‌వి. ".....దీక్షాంసంతోష‌.....కామ‌మాజ్యం జీవిత‌కాల‌స్సత్రకాలో.... సూనృతానివ్యాహృత‌యః ఆయుర్భలం పిత్తంప‌శ‌వో..... "

ఈ ప్రపంచ‌ములోని వారంద‌రు యీ య‌జ్ఞమును చేయువారే. ఈ య‌జ్ఞమును చేయ‌నివాడు జీవించిన‌వాడుకాదు. అనగా బ్రతికియున్నను ప్రయోజ‌న‌ము లేద‌నిఅర్ధము. ఈ శ‌రీర‌ము య‌జ్ఞము కొర‌కే చేయ‌బ‌డిన‌ది. య‌జ్ఞమునుండియేక‌లుగుచున్నది. య‌జ్ఞమున‌కు తగిన‌ట్లు వికార‌మును పొందుచున్నది. స‌న్మార్గమునుంచి యీ య‌జ్ఞమును త‌ప్పించిన‌చో దుఃఖస‌ముద్రమునందు ముంచివేయును.

".....స‌ర్వేయ‌జ్ఞకృతో నాయ‌జ్ఞకృజ్జీవ‌తి య‌జ్ఞాయే దం శ‌రీరంయ‌జ్ఞాద్భవ‌తి య‌జ్ఞానురూపం వివ‌ర్తతే ప‌రిణామినీ శ‌రీర‌ధారా దుఃఖాబ్ధింగ‌చ్ఛతి".

ఆమ‌ర‌ణాంత‌ము ఇంద్రియ‌నిగ్రహ‌ము మ‌నోనిగ్రహ‌ము క‌లిగి అరిష‌డ్వర్గమును జ‌యించి త్యాగ‌ముతో జీవించుట‌యే మ‌హ‌య‌జ్ఞము. మ‌న‌జీవిత‌మంత‌యు నియ‌మ‌బ‌ద్ధమైన ఒక య‌జ్ఞమే.
"శ్రేయాన్ ద్రవ్యమ‌యాద్యజ్ఞాత్ జ్ఞాన‌య‌జ్ఞః ప‌రంత‌ప స‌ర్వంక‌ర్మాఖ‌లంపార్ధజ్ఞానేప‌రిస‌మాప్య"తే (గీ. 4 -- 33)

ప‌శువ‌ధ య‌జ్ఞము

ప‌శువ‌ధ‌తో కూడిన య‌జ్ఞమునుగురించి కొంత ముచ్చటించుట‌స‌మంజ‌స‌ముకాదు. ఆత్మస‌మ‌ర్పణ‌య‌ను యాగ‌ము ప‌శువ‌ధ‌రూప‌క‌ముగా ప‌రిణ‌మించిన‌ది. తైత్తిరీయ సంహిత 6-1-11 యందుయీ విష‌య‌ము స్పష్టముగ చెప్పబడియున్నది.

"పురాఖ‌లువా యేష‌మేధాయాత్మాన మార‌భ్యచ‌ర‌తే యోదీక్షితః"

ఐత‌రేయ బ్రాహ్మణ‌ము 6-7 యందు రక్తపూరిత‌మైన ప‌శువ‌ధ రాక్షస ప్రీతిక‌ర‌మైన‌ద‌ని చెప్పబ‌డిన‌ది.

కృత‌యుగ‌మును వేదోక్తమ‌గు ఆత్మయ‌జ్ఞమే, జ్ఞానయ‌జ్ఞమే, ధ‌ర్మముగా నుండెన‌ని భాద‌త‌యునందున్నది.

"ఆత్మయోగ స‌మాయుక్తో ధ‌ర్మోయంకృత‌ల‌క్షణః" (భార‌త‌ము అర‌ణ్యప‌ర్వము)

"నైష‌ధ‌ర్మః స‌తాందేవా య‌త్రవ‌ధ్యేత వైప‌శుః
ఇదం కృత‌యుగం శ్రేష్టంక‌ధం వ‌ధ్యేతు వైప‌శుః" (భార‌త‌ము. శాంతిప‌ర్వము)

ఈ ప‌శుహింపాయ‌జ్ఞములు మొద‌ట ఇంద్రునిచే యీ లోక‌మున ప్రచార‌మున‌కు దేబ‌డెన‌ని మత్స్యపురాణ‌ము (143 అధ్యాయ‌ము) వాయుపురాణ‌ము (57 అధ్యాయ‌ము) ల‌యందు విపుల‌ముగా చెప్పబ‌డియున్నది. చ‌దువ‌రుల‌వి చూతురుగాక‌.