2
ప్రమాణ ధ‌ర్మమేది?
(ప్రతిఆచార‌ము మ‌త‌ముకాదు)

మ‌న‌దేశములోని ప్రతి ఆచార‌మును, మ‌త‌మ‌నే మూఢ‌విశ్వాస‌ముతో నున్నాము. అది కేవ‌ల‌ము మ‌త‌మ‌న నేమో తెలిసికొన‌క పోయిన హేతువుచే యేర్పడిన అజ్ఞాన‌ము. వేద‌మ‌త‌ము అతివిశాల‌మైన‌ది. ప్రపంచ‌మున కంత‌కును వ‌ర్తించును. ఈ విష‌య‌మై స్వామి వివేకానందుడు యిట్లు ఖండిత‌ముగ ప‌లికెను. ప్రతి గ్రామ‌దేవ‌త‌లోను, ప్రతి మూఢ ఆచార‌ములోను మ‌త‌మున్నద‌ని పిల‌చుట‌కు మ‌న‌మ‌ల‌వాటు ప‌డియున్నామ‌ని మీరు జ్ఞాప‌క‌ముచుకొన‌వ‌ల‌యును. మ‌న‌మ‌త‌ము యొక్క మూల సిద్ధాంత‌ముల‌ను చ‌దివి క‌డుకొన‌మ‌ల‌యును. ఆచార‌ములు అనేక‌ములుగాను, భిన్నభిన్నములుగా నున్నవి. వేనిన‌నుస‌రింతుము. వేనిన‌నుస‌రిప‌ము ద‌క్షిణ‌దేశ‌పు బ్రాహ్మణుడు, మాంసాహ‌ర‌మును పుచ్చుకొను, ఉత్తర‌దేశ‌పు బ్రాహ్మణుని చూచిన‌చో దద్ధరిల్లి పోవును. కాని ఉత్తర‌దేశ‌పు బ్రాహ్మణుడు అదిమంచిదియే అని అనుకొనును. య‌జ్ఞముల పేరిట వంద‌ల‌కొల‌ది గొర్రెల‌ను చంపును. మీకొక‌టి ఆచార‌మైన‌చో అత‌నికొక‌టి ఆచార‌ము. హిందు దేశ‌మందంత‌ట‌ను భిన్నభిన్న ఆచార‌మ‌లున్నవి. అవిప్రదేశ‌మును బ‌ట్టి యుండును. ప్రతి విష‌య‌ములోను ముఖ్యమైన‌వి యేవో ముఖ్యముకానివేవో మొద‌ట మ‌న‌ము నేర్చుకొన‌వ‌ల‌యును. ముఖ్యమైన‌వి శాశ్వత‌మైన‌వి. ముఖ్యముకానివి ఒక కాల‌మందే విలువ‌క‌లిగిన‌వి.కొంత‌వాల‌మైన‌త‌రువాత అవి మార్పుచెందిన‌చో ప్రత్యక్షముగా అపాయ‌క‌ర‌మ‌గును.

వేద‌ములు

వేద‌మ‌త‌ధ‌ర్మమునే స‌నాత‌న ధ‌ర్మమ‌ని మ‌న‌ము పిల‌చుచున్నాము. వేద‌ములు నాలుగు ఋగ్వేద‌ము, య‌జుర్వేద‌ము, సామ‌వేద‌ము, ఆధ‌ర్వణ‌వేదము. ప్రతి వేద‌మున‌కును సంహిత‌, బ్రాహ్మణ‌ములు, ఉప‌నిష‌త్తుల‌ను, మూడుభాగ‌ములు గ‌ల‌వు. సంహిత భాగ‌మందు క్రతువుల‌లో చ‌దువు మంత్రములు గ‌ల‌వు. (సూక్తములు) బ్రాహ్మణ‌ములు క‌ర్మకాండ‌నుగురంచి చెప్పును. వీటియందు అచ్చట‌చ్చట గొప్ప సిద్ధాంత‌ములును భావ‌ములును కూడ గ‌ల‌వు. ఈ బ్రాహ్మణ‌ముల‌లో కాండ్య బ్రాహ్మణ‌ము, శ‌త‌ప‌ధ బ్రాహ్మణ‌ము ముఖ్యమైన‌వి. ఉప‌నిష‌త్తులు మ‌త‌మును ధ‌ర్మమును భోధించును. ఉప‌నిష‌త్తుల‌లో ప్రధాన‌మైన‌వి 108. ఈ ఉప‌నిష‌త్తుల పేర్లన్నియు యిచ్చట వ్రాయుట అన‌వ‌స‌ర‌ము. ముక్తికోప‌నిష‌త్తునందు యీ జాబితా యివ్వబ‌డిన‌ది. చ‌దువ‌రులు అచ్చట చూచుకొందురుగాక‌.

మ‌త‌ధ‌ర్మమ‌నుష్ఠింప‌వ‌లెను

వేద మ‌త ధ‌ర్మముల‌ను మ‌న‌ము గ్రంధ‌ములో తెలిసికొనిన మాత్రమున యేమి ప్రయోజ‌న‌ములేదు. మ‌న జీవిత‌ముల వాటిని అనుష్టించ వ‌ల‌య‌ను. మ‌త‌మనున‌ది శుష్క వేదాంత‌ము కాదు. అనుష్టాన‌మే అంద‌లి ప్రధానాంశ‌ము. మ‌న‌ము వేద‌మును వ‌ల్లించిన వారిని చుచుచున్నాము. వారికి అర్ధము తెలియ‌దు. త‌త్వము అంత‌కుమున్నె సున్న. ఇట్టి చ‌దువుల‌వ‌ల్లనేమి ప్రయోజ‌న‌ములేదు.
గీ!! వేద‌తాత్పర్యమార‌సి వేదిత‌వ్య ! మెరుగువార‌లు
వేద‌జ్ఞులిట్లుగాని ! వారు వేద‌పాఠ‌కులు స‌ర్వంబున‌ర‌య‌
వేద‌ప‌రి నిష్ఠిత‌ము చూవెవిప్రవ‌ర్య.
క‌ !! వినువేద వేద్యము నెరుం ! గ‌నియాత‌ని వేద‌పాఠ‌క‌ల‌నంబు సుధీధ‌న వేద‌భార‌వ‌హ‌నం బ‌న‌జ‌నువింతియ నిర‌ర్ధకాయాసంబై (మ‌హ‌భార‌త‌ము)
బ్రహ్మానుభ‌వ‌ము లేనివారిని వేద‌ధ‌ర్మమ‌నుష్టించినివారిని గురించి వేద‌మిట్లు జెప్పుచున్నది.
త‌మేవ‌ధీరో విజ్ఞాయ‌ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః నానుధ్యా
యేద్బహూన్ శ‌బ్ధాన్ వాచో విగ్లాప‌నంహిత‌త్‌
"కుశ‌లాబ్రహ్మ వార్తాయాం వృత్తిహీనా ( బ్రహ్మనుభ‌వ‌ము లేనివార‌ని అర్ధము ) స్సురాగిణః
తేప్యజ్ఞాన‌త‌యానూనం పున‌రాయాంతియాంతిచ‌"

శంక‌రాచార్యుల వారు త‌మ‌వివేక చూడామ‌ణి యందు మ‌త ధ‌ర్మము ప్రత్యక్షానుభ‌వ‌ము లేనిచో నిష్ర్పయోజ‌న‌మ‌ని చక్కని ఉప‌మాన‌ముల‌తో నిరూపించినారు. 64 మొద‌లు 68 శ్లోక‌ములు చూడ‌గోరెద‌ను. వేద‌ధ‌ర్మమును స‌ర్వవ‌ర్ణముల వారికిని ఉప‌దేశింప వ‌ల‌యున‌నియు అది గొప్ప మ‌హ‌త్కార్యమ‌నియు వేద‌వ్యాసుడు బోధించుచున్నాడు.
స‌ర్వస్తర‌తు దుర్గాణిస‌ర్వోభద్రాణి ప‌శ్యతుశ్రావ‌యేత్‌
చ‌తురోవ‌ర్ణా కృత్వా బ్రహ్మణ‌మ‌గ్రతః ! వేద‌స్యాధ్యయ‌నం
చైవ‌త‌చ్చ కార్యంమ‌హ‌చ్ఛృతం ! స్తుత్యర్ధమిహ‌దేవానాం వేదాః సృష్టాః స్వయంభువః
చాతుర్వర్ణ్య వ్యవ‌స్థ స‌ర్వప్రపంచ‌మునందు గ‌ల‌దు. ప్రపంచములోని మాన‌వులంద‌ఱు జాతి, కుత‌, గోత్ర, వ‌ర్ణ భేద‌ముల‌తో నెట్టినిమిత్తము లేకుండా బ్రాహ్మణులు కావ‌ల‌యును. ఇదియే ప‌ర‌మాత్మకోరిక‌. మ‌న‌ప‌ర‌మాశ‌య‌మును. వ‌ర్ణత‌త్వమును గురించియు బ్రాహ్మణ‌త్వ సిద్ధిని గురించియు ముందు ప్రక‌ర‌ణ‌మునందు విపుల‌ముగ చ‌ర్చింత‌ము. ఇచ్చట వేద మ‌త ధ‌ర్మముల ప్రపంచ‌మంత‌యు అవ‌లంభించి జీవిత‌మునం ద‌నుష్టించ‌వ‌ల‌యున‌ని మాత్రము మ‌ర‌ల మ‌ర‌ల నొక్కి చెప్పుచున్నాను. వేద‌మ‌త ధ‌ర్మముల ప్రపంచ‌మందంత‌ట ప్రచార‌ము చేయుట‌త్యావ‌శ్యక‌మ‌ని తిరిగి చెప్పుచున్నాను.