21

స‌ర్వంఖ‌ల్విదంబ్రహ్మనేహ‌నానాస్తికించ‌న‌

జ్ఞాన‌విజ్ఞాన‌ముల‌న‌నేమో పూర్తిగా తెలుసుకొని సృష్టి లోకానుపించుచున్న అనేక విధ‌ముల‌గు అశ్వర‌ప‌దార్ధముల‌న్నింటిలోను ప‌ర‌మాత్మ యొక్కడేక‌ల‌డ‌ని మ‌న‌ము గ్రహించి ఆయ‌న‌చే యీసృష్టి యెట్లు నిర్మింప‌బ‌డిన‌దో విచారించ‌వ‌ల‌యును. ఈ శ‌రీర‌ములోని ఆత్మయొక్క నిజ స్వరూప‌మును గుర్తెరుగ‌వ‌ల‌యును. ప‌ర‌మేశ్వరునియొక్క జ్ఞాన‌విజ్ఞాన‌ములు మ‌న‌ము తెలుసుకొన్నచో ఇత‌ర‌మేదియు తెలుసుకొన న‌గత్యములేదు. సామ‌వేదాంత‌ర్గత ఛాందోగ్యోప‌నిష‌త్తునందు శ్వేతకేతువు త‌నతండ్రిని యేయొక‌వ‌స్తువు తెలుసుకొనిన‌చో అంత‌ము తెలియ‌బ‌డుచున్నదో అదియేది అని ప్రశ్నించెను. అందుకుతండ్రి "య‌ధాసోమ్యైకేన మృత్పిండేన స‌ర్వంమృణ్మయం విజ్ఞాతం స్వాద్వాచారం భ‌ణం వికారో నామ‌ధేయం మృత్తికేత్యేవ‌స‌త్యం". (ఛాం 6-1-4) అనిచెప్పెను. దీని అర్ధమేమ‌న‌గా నాయానా ఒక్క మ‌ట్టిముద్దయందేమి యున్నదియు తెలిసిన‌చో మిగ‌తామ‌ట్టితో చేయ‌బ‌డిన ప‌దార్ధముల‌న్నియు, ఆమ‌ట్టియొక్క వేర్వేర‌గు నామ‌రూప‌ములు ధ‌రించిన కాల‌ముగానే మ‌రియొక‌టేమియుకాద‌ని తెలియును. ఈ ప్రకార‌ముగానే జ‌గ‌త్తు యొక్క మూల‌త‌త్వమైన బ్రహ్మను తెలుసుకొనుట‌చే తెలుసుకొన‌దిన వ‌స్తువు వేరొక‌టిలేదు. ఈ ప్రకార‌ముగానే ముండ‌కోప‌నిష‌త్తునందును (1-1-3) చెప్పబ‌డిన‌ది. "క‌స్మిభ‌గ‌వో విజ్ఞాతేస‌ర్వమిదం విజ్ఞాతం భ‌వ‌తి".

ప్రపంచ‌ములోని నానాత్వము నందేక‌త్వము తెలుసుకొనుట‌యే జ్ఞాన‌మున‌కు ల‌క్షణ‌మ‌నియు, ప‌ర‌మావ‌ధియ‌నియు నానాత్వము లేనేలేద‌నియు, అట్లు తెలుసుకొన‌నివాడు జ‌న‌న మ‌ర‌ణ చ‌క్రమందు ప‌డుచున్నాడ‌నియు, వేదాంత‌ము చాటుచున్నది.

"నేహ‌నానాస్తికించ‌న‌"
"మృత్యోస్సమృత్యుమాప్నోతియిఇహ‌నానేవప‌శ్యతి" (బృహ‌దార‌ణ్యక‌ము. 4-4-19) క‌ఠోప‌నిష‌త్తు 4 - 11)

ఎప్పుడు స‌ర్వభూత‌ముల‌యందును గ‌ల పృధ‌క్త్యము నానాత్వము, ఏక‌ముగ కాన్పించునో మ‌రియు నీయేక‌త్వమునుండి యే స‌ర్వమును విస్తృత‌మ‌యిన‌ది య‌ని కాన్పించునో అప్పుడే బ్రహ్మప్రాప్తియ‌ని గీత ఖండిత‌ముగ సూచించుచున్నది. సృష్టియావ‌త్తును ప‌ర‌మేశ్వరునుండియే బ‌య‌లువెడ‌లిన‌వి. ఏత‌స్మాజ్జాయ‌తే ప్రాణోమ‌నః స‌ర్వేంద్రియాణిచ‌, ఖంవాయుర్జోతిరాపః పృదివీవిశ్వస్యధార‌ణీ (ముండ‌క 2-1-3) దీని అర్ధము. వీనినుండి ప్రాణ‌ము, మ‌న‌స్సును, అన్ని యింద్రియ‌ముల‌ను, ఆకాశ‌మును, వాయువును, అగ్నియును, జ‌ల‌మును, విశ్వమును, ధ‌రించుపృధివియు న‌నునివియ‌న్నియు ఉత్పన్నముల‌గుచున్నవి. ఈ విష‌య‌మే కృష్ణ య‌జుర్వేద‌ము (కైవ‌ల్యోప‌నిష‌త్తు 1-15) నందును చెప్పబ‌డ‌న‌ది. ప్రశ్నోప‌నిష‌త్తు 6వ ప్రశ్నలో 4వ మంత్రమునందు కూడ‌యిటుల‌నే వ‌ర్ణింప‌బ‌డియున్నది. ఉప‌నిష‌త్తుల‌లో క్లిష్టముగా చెప్పబ‌డియున్న యీ విష‌య‌ములు ప‌ర‌మాత్మ శ్రీ‌కృష్ణుడు బ‌హుచ‌క్కగా గీత‌యందు బోధించుచున్నాడు. ప‌ర‌మేశ్వరునియొక్క ప్రకృతి రెండువిధ‌ములు. పృథివి, జ‌లము, అగ్ని, వాయువు, ఆకాశ‌ము, మ‌న‌స్సు, బుద్ధి, అహంకార‌ము యీ యెనిమిదియును భ‌గవంతుని యొక్క అప‌రా అన‌గా నికృష్టమ‌గు ప్రకృతి. దేనిచే యీజ‌గ‌త్తు ధ‌రింప‌బ‌డుచున్నదో అట్టిదైన జీవ‌స్వరూప‌ము ప‌రాప్రకృతి అన‌గా శ్రేష్టమైన ప్రకృతి. ఈ రెంటినుండియు స‌ర్వభూత‌ములును ఉత్పన్నమ‌గుచున్నది. ఈ జ‌గ‌త్తున‌కంత‌కును ప‌ర‌మేశ్వరుడే మూల‌భూతుడును చివ‌ర‌ను(ప్రళ‌య‌ము) అయివున్నాడు. దార‌మునంద‌నేక మ‌ణులు గ్రుచ్చబ‌డిన‌టుల ప‌ర‌మాత్మయందివి యన్నియు గూర్చబ‌డిన‌వి. స‌ర్వభూత‌ముల‌కు స‌నాత‌న‌మ‌గు బీజ‌ము ప‌ర‌మాత్మయే. బీజంమాం స‌ర్వభూతానాం విద్ధిపార్ధస‌నాత‌నం ( 7-10) నేను నాయొక్క ఒక‌టియేయ‌గు నంశ‌ముచేత‌ను నీజ‌గ‌త్తంత‌యు వ్యాపించియున్నాన‌ని శ్రీ‌కృష్ణుడు గీ.10 అధ్యాయ‌ము 42వ శ్లోక‌ములో సూక్ష్మముగా చెప్పియున్నాడు.

"విష్టభ్యాహ‌మిదం కృత్స్న మేకాంశేన‌స్థితో జ‌గ‌త్‌"

ప్రకృతి (మ‌హ‌ద్ర్ర్భహ్మ) యనున‌ది ప‌ర‌మాత్మకు యోనియై యున్నద‌నియు, దాన‌యందు పురుషుడైన తాను గ‌ర్భమునుంచుచున్నాన‌నియు, అనంత‌ర‌ముదాని యందుండి స‌ర్వభూత‌ములును పుట్టుట కారంభించు చున్నవ‌నియు, ప‌శుప‌క్ష్యాది స‌ర్వయోనుల యందును పుట్టుచున్న దేహ‌ముల‌న్నింటికి ప్రకృతియే యోనియ‌నియు, తానుబీజ‌దాత‌న‌గు తండ్రిన‌నియు, శ్రీ కృష్ణుడు స్పష్టీక‌రించియున్నాడు. క‌ల్పాంత‌మునందు స‌ర్వభూత‌ములు త‌న‌యొక్క ప్రకృతినొందుచున్న వ‌నియు క‌ల్పారంభ‌మునందు తాను ప్రకృతిని స్వాధీన‌ము చేసుకొని వారి వారి ప్రాచీన క‌ర్మల న‌నుస‌రించి అధ్యక్షుడై ప్రకృతి నుండి చరాచ‌ర సృష్టినంత‌యు స‌మ‌స్తభూత‌ముల‌యొక్క స‌ముదాయ‌మును ప్రస‌వింప జేయుచున్నాన‌నియు నిర్మించుచున్నాన‌నియు భ‌గ‌వంతుడు గీత‌లో 9వ అధ్యాయ‌మునందు వ‌ర్ణించియున్నాడు.

ప్రకృతి ప‌ర‌మేశ్వరునుండియే ఉత్పన్నమైన‌ది. స్వతంత్రురాలుగాదు. ప్రకృతియనున‌దియే మాయ‌. "మాయాంతు ప్రకృతిం విద్యాన్మాయినంతు మాహేశ్వరం". అని శ్వేతాశ్వత‌ర ఉప‌నిష‌త్తునందు చెప్పబ‌డిన‌ది. ప్రకృతియే మాయ‌. ప‌ర‌మేశ్వరుడామాయ‌కు అధిప‌తి. ఆ ఉప‌నిష‌త్తునందే వేరొక‌చోట "ఆస్మాన్మాయీ సృజ‌తేవిశ్వమేత‌త్" అని చెప్పబ‌డియె. దీనినుండి మాయ‌యొక్క అధిప‌తి సృష్టిని జేయుచున్నాడ‌ని దాని అర్ధము. నా యొక్క ప్రకృతినే య‌ధిష్టించి నేనామాయ‌చే జ‌న్మించుచున్నాన‌ని శ్రీ‌కృష్ణుడు గీత‌యందు తెలిపియున్నాడు." ప్రకృతింస్వామ‌ధిష్టాయ సంభ‌వామ్యాత్మ మాయ‌మా " (గీ. 4 - 6 )
ఈ పైవిచార‌ణ‌ను బ‌ట్టి తేలిన‌దేమ‌న‌గా ప్రకృతియ‌ను, జీవుడు ప‌ర‌మేశ్వరుని అంశ‌ములే. కావున‌నే స‌ర్వంఖ‌ల్విదంబ్రహ్మనేహ‌నానాస్తికించ‌న య‌ని చెప్పబ‌డిన‌ది. అంత మాత్రముచే అవి వేరుకావ‌నియును చెప్పకూడ‌దు జీవుడు త‌న తొల్లిటిఅంశ‌ను మ‌రిచి ప్రకృతి సంబంధ‌మైన విష‌యోప‌భోగ‌ముల‌చే సంసార‌చ‌క్రమున బ‌డి జ‌న‌న మ‌ర‌ణ‌ముల నెందుచున్నాడు. త‌న‌యొక్క కృషిచే త‌న తొల్లింటి స్థాన‌మును పొంద‌వ‌ల‌యును.

జీవేశ్వరుల సంబంధ‌ము

అధ‌ర్వణ వేద‌మందు (మూడ‌వ ముండ‌క‌ము. మొద‌టి ఖండ‌ము) జీవాత్మ ప‌రమాత్మల సంబంధ మీ క్రింది తీరున చెప్పబ‌డిన‌ది.

1. రెండుప‌క్షులు మంచిగ‌మ‌న‌ము గ‌ల‌వి. ఒక‌టి నొక‌టి యెడ‌బాయ‌క యుండును. (అవి జీవాత్మప‌ర‌మాత్మల‌ను పేరు క‌ల‌వి) ఆ రెండును స‌మాన‌ఖ్యాతిగ‌ల‌వి. ఆ రెండును ఒకే వృక్షమును (శ‌రీర‌మును) ఆశ్రయించుకొని యుండును. వీటిలోనెక‌టి (జీవుడు) పుణ్యపాప ఫ‌ల‌మును రుచితో కూడ భుజించును. వేరొక‌టి యూర‌క దేనిని భుజింప‌క చూచుచుండును.

2. స‌మాన వృక్షమునందు ప్రవేశించిన జీవుడు మాయ‌చేత మోహ‌మునుపొంది దుఃఖ‌ప‌డుచున్నాడు. ఎప్పుడు వేరొక ప‌ర‌మాత్మను చూచుచున్నాడో అప్పుడు దుఃఖర‌హితుడై మ‌హిమ‌నొందుచున్నాడు.

3. ఎప్పుడు ప‌ర‌బ్రహ్మ స్వరూప‌మును చూచుచున్న సాధ‌కుడు (యోగి) జ్యోతిర్మయుడ‌గు జ‌గ‌త్కర్తయు, యీశ్వరుడును, బ్రహ్మయోనియునున‌గు ప‌ర‌మాత్మను చూచుచున్నాడో అప్పుడు ఆజ్ఞాని పుణ్య పాప‌ముల‌ను తిర‌స్కరించినిర్లేపుడై ప‌ర‌మ‌సామ్యమును పొందుచున్నాడు.

జీవేశ్వరుల‌కు భేద‌మేమియు లేద‌నియు, అవిద్యయే యీ భేద‌మున‌కు కార‌ణ‌మ‌నియు వేద‌మ‌నేక‌విధ‌ముల ఘోషిల్లుచున్నది. శ్వేతాశ్వత‌ర ఉప‌నిష‌త్తు జీవేశ్వరుల‌కు యెట్టిభేద‌ములేద‌ని ఖండిత‌ముగా ప‌లుకుచున్నది. సామ వేదాంత‌ర్గత చాందోగ్యమునందు సంభాష‌ణ రూప‌క‌ముగా జీవేశ్వరుల సంబంద‌ము అతి మ‌నోహ‌ర‌ముగ‌ను, స్పష్టముగ‌ను, ర‌మ‌ణీయ‌ముగ‌ను వ‌ర్ణింప‌బ‌డిన‌ది.

భ్రమ‌నివార‌ణ‌

జీవేశ్వరుల‌కు భేద‌ము చూచుట భ్రమ‌యియు బింబ ప్రతిబింబ ద‌ర్శన‌ముచే ఆభ్రమ నివ‌ర్తించున‌నియు అధ‌ర్వణ వేద‌ము (అన్నపూర్ణోప‌నిషత్తు) చాటుచున్నది.

"బింబ‌ప్రతిబింబ ద‌ర్శనేన భేద‌భ్రమోనివృత్తః"

ఒక‌డు ప‌గిలిపోయి అనేక చిల్లులు గ‌ల అద్దములో త‌న‌ను చూచుకొనెను. అప్పుడు అత‌డొక‌డే అనేక బింబ‌ములుగా తోచెను. కాని ఆబింబ‌ములు త‌న‌క‌న్న వేరుకాద‌ని అత‌డెరుగును. ఏప‌గులు లేని అద్ధములో త‌రువాత చూచుకొనెను. అచ‌ట ఒక బింబ‌మే కానుపించెను. అదియును త‌న‌క‌న్న వేరుకాద‌ని అత‌డెరుంగును. అవివేక‌ము గ‌లిగి సంక‌ల్ప విక‌ల్పక‌మైన మ‌న‌స్సుగ‌ల‌వానికి ప‌దార్ధ భేద‌ములనేక‌ములుగ క‌నుపించును. స‌రియైన మ‌న‌స్సుగ‌ల‌వానికి ప‌దార్ధ భేద‌ముల‌నేక‌ములుగ క‌నుపించును. స‌రియైన‌మ‌న‌స్సు అన‌గా శుద్ధాంతఃక‌ర‌ణ క‌లవానికి భేద‌ము కార‌రాదు. అద్ధములో కానిపించు బింబ‌ములు అస‌త్యమును విష‌య‌మున్న, తానుమాత్రము నిజ‌మ‌ను విష‌య‌మున్న, త‌ప్పక గోచ‌రించును. ఈ విష‌య‌ము శాస్త్రజ్ఞాన‌మువ‌ల‌న‌ను, గురూప‌దేశ‌ము వ‌ల‌న‌ను, స‌త్సాంగ‌త్యము వ‌ల‌న‌ను, అనుభ‌వ‌మువ‌ల్లను, క్రమ‌క్రమ‌ముగా స్పురించును.