5
బ్రాహ్మణేత‌రులు బ్రాహ్మణులైరి

వేదధ‌ర్మము తిరిగి స్వీక‌రింప‌వ‌లెను

పూర్వ మొక‌ప్పుడు మాన‌వులంద‌రు బ్రాహ్మణులెయ‌నియు, వారి ధ‌ర్మమును వీడి వివిధ వృత్తుల‌ను చేప‌ట్టుట‌చే వారి గుణ క‌ర్మల‌ను బ‌ట్టి క్షత్రియ వైశ్య శూద్ర మ్లేచ్ఛారి జాతులుగా - వ‌ర్ణములుగా మారిర‌నియు మ‌న‌ము యింత‌వ‌రకు తెలిసి కొనియుంటిమి. బ్రాహ్మణేత‌రులు తిరిగి బ్రాహ్మణులు కావ‌చ్చునా అయిన‌చో వారు ఎట్లగుదురు అందుల‌కేమి చేయ‌వ‌ల‌యును అను విష‌య‌మును మ‌న‌ము విచారింప‌వ‌ల‌సియున్నది. వేద ధ‌ర్మమును విడనాడుట‌చే బ్రాహ్మణ‌త్వము గోల్పోయిరి. గ‌నుక ఇప్పుడు మ‌న‌వారు కొన్ని వ‌ర్ణముల వారికి వేద‌ధ‌ర్మమున‌కు య‌జ్ఞధ‌ర్మమున‌కు అధికారము లేద‌ని చెప్పుచున్నారు. కాని వీరు తిరిగి వేద‌ర్మమును స్వీక‌రించుచో అన్ని అధికార‌ములు క‌ల‌వార‌గుదురు. భృగుమ‌హ‌ర్షి

"ఇత్యేతైః క‌ర్మభిర్వస్థా ద్విజావ‌ర్ణాంత‌రం గ‌తాః
ద‌ర్మోయ‌జ్ఞక్రియాతేషాం నిత్యం న‌ప్రతిషిద్ధ్యతే"

అని చెప్పియున్నాడు. ఇది యంత‌యు స‌త్య స‌మ్మత‌మ‌గును, స‌హేతుక‌ముగ నున్నది. వీరికి వేద ధ‌ర్మము నందెప్పటికిని య‌ర్హత లేక పోలేదు. తిరిగి త‌మ జీవిత‌మును సంస్కరించుకొన్నచో మ‌ర‌ల ద్విజ‌త్వము - బ్రాహ్మణ‌త్వము క‌లుగును వేద‌ము ఈ విష‌య‌మే చెప్పుచున్నది. లోగ‌డ‌నే యిత‌ర వ‌ర్ణముల వారు స‌యిత‌ము దీక్షితులై య‌ధార్ధ బ్రాహ్మణుల‌గుదుర‌ని వేద ప్రమాణ‌ము చూపింప‌బ‌డిన‌ది. ఇంకొక ప్రమాణ‌ము నిట నుదాహ‌రించుచున్నాను.

అధాస్మేసావిత్రీమ‌న్వాహ ! తాంహ‌స్మెతాం పురాంసంవ‌త్సరేన్వాహుః ! అథ‌ష‌ట్సుమాసేషు ! అథ‌చ‌తుర్వింశ‌త్యేహ ! అథ‌ద్వాద‌శ‌హె ! అథ‌ష‌డ‌హె అథ్యత్ర్యహే ! త‌ద‌పిశ్లోకంగాయంతి ! ఆచార్యో గ‌ర్భీభ‌వ‌తి హ‌స్తమాదాయ‌ద‌క్షిణం ! తృతీయ‌స్యాంస‌జాయ‌తే స‌విత్ర్యాస‌హ బ్రాహ్మణః ఇతి స‌ద్యోహ‌వాన బ్రాహ్మణాయాను బ్రూయాత్ అగ్నేయోవై బ్రాహ్మణః స‌ద్యోవా అగ్నిర్జాయ‌తే ! త‌స్మాత్సద్యయేవ బ్రాహ్మణాయాను బ్రూయాత్ (శ‌తప‌థ బ్రాహ్మణ 11-5-8)

బ్రహ్మచ‌ర్య వ్రతానంత‌ర‌ము సావిత్రీ మంత్ర ముప‌దేశించు చున్నారు. ఆ సావిత్రీ మంత్రము సంవ‌త్సర కాల ప‌ర్యంత‌ము వ్రత‌మాచ‌రించిన పిమ్మట ఉప‌దేశింతురు. లేక ఆరుమాస‌ములు లేక‌, యిరువ‌ది నాలుగు, పండ్రెండు, ఆరు, మూడు దిన‌ము లాచ‌రించిన పిద‌ప ఉప‌దేశింతురు. ఇందును గురించి శ్లోక‌మొక‌టి యున్నది:-

ఆచార్యుడు శిష్యుని కుడి చేతితో ప‌ట్టుకొనిన‌ప్పుడు గ‌ర్భమ‌ను ధ‌రించును. వ్రత‌ముయొక్క చివ‌ర‌రోజునందు శిష్యుడు సావిత్రితో కూడ బ్రాహ్మణుడై జ‌న్మించును. బ్రాహ్మణున‌కాక్షణ‌మే (అన‌గా యెట్టివ్రత‌ము లేకుండ) సావిత్రి మంత్రముప‌దేశింప వ‌చ్చును. బ్రాహ్మణుడ‌గ్ని వ‌ర్ణమున‌కు చేర‌న‌వాడు. అగ్ని ఒక క్షణ‌ములో పుట్టుచున్నది క‌దా! క‌నుక బ్రాహ్మణున‌కు త‌క్షణ‌మందె సావిత్రి మంత్రముప‌దేశింప వ‌చ్చును.

శూద్రత్వమ‌న‌నేమి?

ఉప‌న‌య నాదుల‌ను బ్రహ్మచ‌ర్య వ్రత‌మును పాలింప‌క య‌ధేచ్చగా జీవిత‌ము గ‌డుపుట‌చే శూద్రత్వము సంప్రాప్తమైన‌ది. "ప‌ద్యుహ‌వా ఏత‌చ్చశ్మశానం య‌చ్ఛూద్ర" అని శ్రుతివాక్య (శ‌త‌ప‌ధ బ్రాహ్మణ‌ము) మున్నది. శూద్రుడ‌నెడి యీ శ్మశాన‌ము చేతులు కాళ్లు గ‌ల శ్మశాన‌ము. శౌచాచార ర‌హితుడై, వేద‌ధ‌ర్మమును విడ‌నాడి సేచ్ఛగా నుండుట‌వ‌ల‌న శ్మశాన‌మువ‌లె అశుచి య‌యిన‌వాడు శూద్రుడ‌ని యీ శ్రుతి వాక్యమున‌కు తాత్పర్యము. ఈ వేద వాక్యార్ధమే భృగుమ‌హ‌ర్షియు, మ‌హ‌భార‌త‌మునందు ఇట్లు చెప్పియున్నాడు.

స‌ర్వభ‌క్షర‌తిర్నిత్యం, స‌ర్వక‌ర్మోఅశుచిః !
త్యక్తవేద స్త్వనాచారః, స‌వైశూద్ర ఇతిస్మృతిః

శూద్రుడు వేదాన‌ర్హుడ‌ని యెచ్చటెచ్చట వాక్యములు క‌నుపించిన‌ను అవి అన్నియు వేద‌ధ‌ర్మ విరుద్ధమ‌గు జీవిత‌ము గ‌డుపువానికే వ‌ర్తించున‌నియు మాత్రము గుర్తెరుంగ వ‌ల‌యును. శూద్రత్వమ‌నున‌ది ఒక స్థితి.

వేద‌మెల్లర‌కొర‌కు ప్రకాశ‌పరుప‌బ‌డిన‌ది

య‌థేమాం వాచంక‌ళ్యాణి మావ‌దానిజ‌నేభ్యః
బ్రాహ్మరాజ‌న్యాభ్యాం శూద్రాయ‌చార్యాయ‌చ స్వాయ‌చార‌ణాయ (యజుర్వేదం 26-2 )

య‌థా-యేట్లునేను జ‌నేభ్య-మ‌నుష్యులంద‌రికొర‌కు ఇమాం-యీ క‌ళ్యాణీ-సంసార‌ము యొక్కయు ముక్తియొక్కయు సుఖ‌మునిచ్చుస‌ట్టి, వాచం-నాలుగు వేద‌ముల యొక్క పాణిని, అవ‌దాని-ఉప‌దేశించు చున్నానో, అట్లు మీరున్నూ చేయ‌వ‌ల‌యును. బ్రహ్మరాజ‌న్యాభ్యాం-బ్రాహ్మణ క్షత్రియ ఆర్యామ‌-వైశ్య, శూద్రాయ‌-శూద్రుల‌కొర‌కును, స్వాయ‌త‌న‌భృత్యులు స్త్రీలు వీరికొర‌కు అర‌ణాయ‌-అతిశూద్రుల కొర‌కును వేదము ప్రకాశ ప‌రుచున్నాను. (ద‌యానంద‌). వ్రతాచ‌ర‌ణ‌ము కొంత‌కాల‌ము చేసిన పిద‌ప వేద ధ‌ర్మమున‌కు అర్హత క‌లుగున‌ని శ్రుతి చెప్పుచున్నది. శౌచాచార నియ‌మానుష్ఠాన‌మువ‌ల‌న ప‌రిశుద్ధుడై వేద విహిత ధ‌ర్మా చ‌ర‌ణ‌మునుకు అర్హుడ‌గుచున్నాడు. వేద‌ధ‌ర్మమును సంపూర్ణముగ విడ‌నాడి స్వచ్ఛంద జీవ‌ల‌న‌ముగ‌డుపుచు దేశ‌ద్రిమ్మరులై తిరుగువారు వ్రాత్యుల‌నువారు కొంద‌రున్నారు. వారిని స‌యిత‌ము బ్రాహ్మణుల‌లో చేర్చుకొన‌వ‌చ్చున‌నియు,వారు వ్రాత్యస్తోమ‌ము అను క‌త్రువును చేయ‌వ‌ల‌యున‌నియు, ఆట్టివారితో వివాహ‌ములు కూడ చేసికొన‌వ‌చ్చున‌నియు,భోజ‌న ప్రతి భోజ‌న‌ములు కూడున‌నియు, తాండ్యబ్రాహ్మణ‌ము చెప్పుచున్నది.(17-1-5)

వేద‌వ్యాసుని అభిప్రాయ‌ము

శూద్రయోనియందు పుట్టిన‌వాడు స‌ద్గుణ‌ములు క‌ల‌వాడ‌గుట వ‌ల‌న వైశ్యత్వమును, అదే ప్రకార‌ముగ క్షత్రియ‌త్వమును పొందును. ఋజుమార్గమున ప్రవ‌ర్తించువారికి బ్రాహ్మణ‌త్వము స‌హితము క‌లుగున‌నియు, స‌ద్గుణ‌ములు క‌లిగి ధ‌ర్మమార్గమును న‌డ‌చు శూద్రునికి బ్రాహ్మణ‌త్వము వ‌చ్చుననియు, భార‌త‌ములొ అర‌ణ్యప‌ర్వమందు చెప్పబ‌డియున్నది.

"శూద్రాయో నౌహిజాత‌స్య స‌ద్గుణానుప‌తిష్టతః!
వైశ్యత్వంల‌బ‌తేబ్రహ్మన్ క్షత్రియ‌త్వంత ధైవ‌చ‌!
ఆర్జవేవ‌ర్తమాన‌స్య బ్రాహ్మణ్య మ‌భిజాయ‌తే"!!

ఋగ్వేద‌ము - జైమినిసూత్రములు

ఐత‌రేయ బ్రాహ్మణ‌ము నందు (ఋగ్వేద‌ము ద్వితాయ పంచ‌క‌ము 19 న ఖండము) ఋషులు దాసీపుత్రుడైన క‌వ‌షుని త‌మ‌వ‌ద్దచేర్చుకొని మంత్ర ప‌ఠ‌న‌ముచేసిన‌ట్లు చెప్పబ‌డియున్నది.
బ‌దిరియ‌ను వేదఋషి వేద‌ముల‌లో చెప్పబ‌డిన య‌జ్ఞయాగాది కృతువు లొన‌ర్చుట‌కు శూద్రులు స‌యిత‌ము అర్హుల‌నియు, వారు జిజ్ఞాస‌తో వానిని చేసిన‌చో ఫ‌లిత‌మును పొందుదుర‌నియు, చెప్పియున్నాడు. (6-1-27)

జాన‌శ్రుతి క‌థ

జాన‌శ్రుతియ‌ను క్షత్రియుడు బ్రహ్మవిద్య న‌భ్యసించుట‌కు రైక్యుడ‌ను ఋషి యొద్దకు వెళ్లగా ఆ ఋషి ఓయీ శూద్రుడా అని క్షత్రియుని సంభోధించెను. అన‌గా వేద‌ధ‌ర్మమును వీడి శౌచాచార‌ర‌హితుడైన వాడా అని అర్ధము. త‌రువాత జాన శ్రుతికి బ్రహ్మ విద్య బోధించెను. ఇది సామ‌వేదాంత‌ర్గత‌మ‌గు చాందోగ్యోప‌నిష‌త్తునందు గ‌ల‌దు. (ఖండము 2-4 ప్రపాఠ‌కః)

స‌త్యకాముని క‌థ‌

స‌త్యకాముడను కుర్రవాడు గౌత‌ముని యొద్దకు బ్రహ్మ విద్య నేర్చుకొనుట‌కు రాగా ఆయ‌న నీగోత్రమేమి నీ తండ్రియెవ‌రు అని ప్రశ్నించెను. అప్పుడా కుర్రవాడు గోత్రమేమో తెలియ‌ద‌నిన్ని , తండ్రి యెవ‌రో తెలియ‌ద‌నిన్ని, త‌ల్లి ప‌రిచ‌ర్యచేయు కాల‌ములో యెవ‌రికో పుట్టిన‌ట్లు త‌న‌తో చెప్పిన‌ద‌నిన్ని, మొద‌ల‌గు సంగ‌తులు గౌత‌మునితో విన్నవించ‌గా అత‌డు స‌త్యసంధుడైన‌నేత‌ప్ప యిట్లు చెప్పడ‌నిన్ని, స‌త్యము చెప్పినాడు గ‌నుక యిత‌డు బ్రాహ్మణుడ‌ని నిరూపించి బ్రహ్మవిద్య నుప‌దేశించెను. గౌత‌ముడు కుల‌మేమో నిర్ణయించుట‌కు వీలులేని యీ ప‌రిస్థితుల‌లో ల‌క్షణ‌మును బ‌ట్టియే వ‌ర్ణప‌మును నిర్ణయించెను. (సామ‌.చాందోగ్య ఉప‌నిష‌త్తు 4-4)

బెస్తలు బ్రాహ్మణులైరి

స్కాంద పురాణ‌ములోని స‌హ్యాద్రి ఖండ‌మునందు ప‌ర‌శురాముడు దేశ‌మునందు బ్రాహ్మణులు లేవ‌పోగా బెస్తల‌కు య‌జ్ఞోప‌వీత‌ము వేసి వారిని బ్రాహ్మణుల‌ను జేసెన‌ని చెప్పబ‌డియున్నది.

"అబ్రహ్మణ్యేత‌దాదేశే కైవ‌ర్తాన్ ప్రేక్షభార్గవః!
.............య‌జ్ఞసూత్రమ‌క‌ల్పయ‌త్ !!
స్థాప‌యిత్వాస్వకీయే స‌క్షేత్రేవిప్రాస్‌ప్రక‌ల్పితాన్‌
జామ‌ద‌గ్న్యస్తదోవాచ‌సుప్రీతేనాంత‌రాత్మనా" !!

ఆప‌స్తంభుడు అభిప్రాయ‌ము

ఆప‌స్తంభుడు ధ‌ర్మ చ‌ర్యవ‌ల‌న వ‌ర్ణము మారిపోవున‌ని వేద‌తత్వము ననుస‌రించి చెప్పుచున్నాడు.

ధ‌ర్మచ‌ర్యయా ఉత్తరోవ‌ర్ణః పూర్వం పూర్వం
వ‌ర్ణ మాప‌ద్యతే జాతిప‌రివృతౌ
అధ‌ర్మచ‌ర్యాపూర్వో వ‌ర్ణోజ‌ఘ‌న్యజ‌ఘ‌న్య
వ‌ర్ణ మాప‌ద్యతే జాతిప‌రివృతౌ

ఈ జ‌న్మమందే మాన‌వుడు త‌న‌న‌డ‌త వ‌ల‌న ఎక్కువ వ‌ర్ణముగాని త‌క్కువ వ‌ర్ణముగాని పొందు న‌నియు, త‌పోబీజ ప్రభావ‌ము వ‌ల్ల ఉత్తమ‌వ‌ర్ణమును చెంద‌వ‌చ్చున‌నియు మ‌ను స్మృతియందు స‌యిత‌ము క‌ల‌దు.
త‌పోబీజ‌ప్రభావైస్తుతే గ‌చ్ఛంతి యు గేయుగే,
ఉత్కర్షం చాపిక‌ర్షంచ‌మ‌నుష్యేష్విహ‌జ‌న్మని.

వీత‌హ‌వ్యాదులు బ్రాహ్మణులైరి

భృగువు వీత‌హ‌వ్యుడ‌ను క్షత్రియుని త‌న యాశ్రమ‌మందు బ్రాహ్మణునిగ జేసెన‌ని మ‌హ‌భార‌త‌మునందు అను శాస‌న‌ప‌ర్వమందు ( ) చెప్పబ‌డి యున్నది. అత‌ని పుత్రడు గృత్సదుడు బ్రాహ్మణుల‌తో నుండి బ్రహ్మచారియు బ్రహ్మఋఫియు న‌య్యెను.

"య‌థాగ‌తం మ‌హ‌రాజ ముక్త్యావిష మివోర‌గః
భృగోర్వ చ‌న‌మాత్రేణ స‌చ‌బ్రహ్మర్షితాంగ‌తః,
వీత‌హ‌వ్యో మ‌హ‌రాజ బ్రహ్మవాదిత్వమేవ‌చ ! త‌స్య
గృత్సమ‌దః పుత్రో రూపేణేంద్ర ఇవాప‌రం.
........ య‌త్రగృత్సమ‌దో రాజ‌న్ బ్రాహ్మణై
స్సమ‌హీయ‌తే, న‌బ్రహ్మచారి విప్రర్షిః
శ్రీ‌మాన్ గృత్సమ‌దో భ‌వేత్‌."

విశ్వామిత్రుడు క్షత్రియుడైన‌ను బ్రాహ్మణ‌త్వమును పొందిన సంగ‌తి రామాయ‌ణ‌మునందు మ‌న మంద‌ర‌మును చ‌దివిన విష‌య‌మే. (రామాయ‌ణ‌ము ( ) బాలకాండ‌ము.) భార‌త అనుశాస‌నిక ప‌ర్వమందీత‌డు బ్రాహ్మణ వంశ‌మున‌కు క‌ర్తయ‌య్యెన‌ని వ్రాయ‌బ‌డి యున్నది.
ముద్గలుని వ‌ల‌న మౌద్గల్యగోత్రుల‌గు క్షత్రియ‌వంశ బ్రాహ్మణులు క‌లిగిర‌ని విష్ణు పురాణ‌మునందున్నది.

"ముద్గలాచ్చ మౌద్గల్యాః క్షత్రోపేతా ద్విజాత‌యో బ‌భూవుః"

ఈ పురాణ‌మునందే శ‌నియ‌ను క్షత్రియుని సంత‌తివారును, ఉర‌క్షయుడ‌ను క్షత్రియుని కుమారులును, మేధాతిథి య‌ను క్షత్రియుని కొడుకైన క‌ణ్వుని వంశ‌మువారును, బ్రాహ్మణులైన‌ట్లు చెప్పబ‌డియున్నది.

"గ‌ర్గాచ్చినిః త‌తోగార్గ్యాఃశైన్యాః క్షత్రో వేదాద్వి జాత‌యోబ‌భూవుః మ‌హ‌వీర్యాదురుక్షయోనామ‌పుత్రోభూత్‌,త‌స్యత్రయ్యారుణ పుష్కరిణౌ క‌పిల‌శ్చ పుత్రత్రయ మ‌భూత్‌. త‌చ్చత్రిత‌య‌మ‌పి ప‌శ్చాద్విప్రతా ముప‌జ‌గామ బృహ‌క్షత్రస్యసుహోత్రః, సుహొత్రాత్ హ‌స్తీఅజమీఢ‌, ద్విమీఢ వురుమీఢాస్త్రయోహ‌స్తిన‌ప్తన‌యాః, అజ‌మీఢాత్కణ్వః క‌ణ్వాత్ మేధాతిథిఃత‌తః కాణ్వాయ‌నాద్విజాః"
హ‌రివంశ‌ము నందును క్షత్రియున‌కు పుట్టిన‌వాడు బ్రాహ్మణుడైన‌ట్లును, నాభాగుడు అరిష్టుడ‌ను, వైశ్యులు బ్రాహ్మణ‌త్వమును పొందిర‌నియు చెప్పబ‌డియున్నది.

"పుత్రః ప్రతిధ‌స్యాసీత్ క‌ణ్వ స్సమ‌భ‌వ‌న్నపృః !
మేధాతిథి స్సుత‌స్తస్యయ‌స్మాత్ క‌ణ్వోభ‌వేద్ద్విజః
నాభాగారిష్ట పుత్రౌద్వౌనైశ్యౌ బ్రాహ్మణ‌తాంగ‌తౌ"