6
వ‌ర్ణాశ్రమ ధ‌ర్మానుష్టాన‌ము.

బ్రాహ్మణుని జీవిత‌మే ఆద‌ర్శన‌ము

మాన‌వుడు బ్రహ్మ పాప్తి కొర‌కు త‌న యొక్క వ‌ర్ణాశ్రమ ధ‌ర్మముల‌ను చ‌క్కగా నెర‌వేర్పవ‌ల‌యును. ప్రధ‌మ‌ములో నంద‌రు బ్రాహ్మణులే య‌నియు, వారు వేరు వేరు వృత్తుల న‌వ‌లంభించుట‌చే ఆయీ వ‌ర్ణము లేర్పడిన వినియు, నాల్గువ‌ర్ణముల‌లోను ప్రధాన‌మైన‌ది బ్రాహ్మణ వ‌ర్ణమేయ‌నియు, బ్రాహ్మణుని జీవిత‌యే మాన‌వులంద‌రికి ఆద‌ర్శక‌మ‌నియు, నెవ్వరేవృత్తి న‌వ‌లంభించిన‌ను ఆధ్యాత్మిక దృష్టిలో యావ‌న్మందియు బ్రాహ్మణులే కావ‌లెన‌నియు, లోగ‌డ‌నే తెలిపియుంటిని.

"త‌స్మాద‌గ్నా దేవ‌దేవేషు లోకిమిచ్ఛంతె. బ్రాహ్మణే మ‌నుష్యేషు, ఏతాభ్యాంహిరూపాభ్యాంబ్రహ్మభ‌వ‌త్" (బృహ‌దార‌ణ్యక ఉప‌నిష‌త్తు.)

వ‌ర్ణ ధ‌ర్మమ‌న‌నేమి?

ఒక ప‌ర్యాయ మొక‌వృత్తి న‌వ‌లంభించిన‌పుడు అందువ‌ల‌న ఆవ‌ర్ణమున‌కు చేరిన‌పుడు ఆ వృత్తి ధ‌ర్మమును త‌న స్వప్రయోజ‌నార్ధమై కాక స‌మాజ‌ము యొక్క క్షేమ‌మున‌కై ఆచ‌రింప‌వ‌ల‌యును. ఈ అర్ధమునే కృష్ణ య‌జుర్వేదాంత‌ర్గత వరాహ ఉప‌నిష‌త్తు చెప్పుచున్నది.

"స్వవ‌ర్ణాశ్రమ ధ‌ర్మేణ‌"

వ‌ర్ణాను సార‌ముగ స్వభావ జ‌న్యముల‌గు గుణ‌ముల న‌నుస‌రించి ప్రాప్తమైన ప‌నుల‌ను చ‌క్కగా నిర్వర్తించుట‌యును, భ‌గ‌వంతుని యొక్క పూజ‌యే య‌నియు, అట్టవాడు ఉత్తమ‌మ‌గు సిద్ధినొందున‌నియు, భ‌గ‌వ‌ద్గీత‌యందు చెప్పబ‌డిన‌ది.

"స్వేస్వేక‌ర్మణ్యభిర‌తః సంసిద్ధింల‌భ తేన‌రః!
స్వక‌ర్మనిర‌త‌సిద్ధింయ‌ధా వింద‌తిత‌చ్చృణు!!
య‌తఃప్రవృత్తిర్భూతానాంయేన స‌ర్వమిదంత‌తం
స్వక‌ర్మణాత‌మ‌భ్యర్చ సిద్ధిం వింద‌తిమాన‌వః"

(గీ.18-45,46.) ఇదియే స్వధ‌ర్మమ‌ని గీత‌యందు బోధింప‌బ‌డిన‌ది.

ఆశ్రమ‌జీవితావ‌శ్యవ‌త‌

ఆశ్రమ‌ములు నాలుగు 1. బ్రహ్మచ‌ర్యాశ్రమ‌ము. 2. గృహ‌స్థాశ్రమ‌ము 3. వాన‌ప్రస్థాశ్రమ‌ము. 4. స‌న్యాసాశ్రమ‌ము.

"బ్రహ్మచ‌ర్యాశ్రమంసమాప్య గృహీభ‌వేత్‌
గృహీభూత్వావ‌నీభ‌వేత్ వ‌నీభూత్వప్రవ్రజేత్" (శ‌త‌ప‌థ 14 కాండ‌.)

బ్రహ్మసాక్షాత్కార‌మున‌కు ఆశ్రమ‌ములు సోపాన‌ముల‌ని చెప్పవ‌చ్చను. మాన‌వుని జీవితు క్రమ‌ముగ నొక్కక్క ఆశ్రమ‌ము గ‌డ‌చిన కొల‌దిని విక‌సించును. మాన‌వుడీ నాలుగు ఆశ్రమ‌ముల‌ను స్వీక‌రించి వాని యొక్క నిజ‌త‌త్వమును తెలిసికొని అట్లు జీవిత‌మును సంస్కరించుకొనుట‌యే వేద‌మ‌త‌ము. అథ‌ర్వణ వేదిమిట్లు బోధ‌చేయుచున్నది.

"స‌త్కుల‌భ‌వ ఉప‌నీత‌స్సమ్యగుప‌న‌య‌న పూర్వకం చతుశ్చాత్వా రింశ‌త్సంస్కార సంప‌న్నస్స్వాభి మ‌తైక‌గురు స‌మీపే స్వశాఖాథ్యయ‌న పూర్వకం స‌ర్వవిద్యాభ్యాసం కృత్వాద్వాద‌శ‌వ‌ర్ష శూశ్రూషాపూర్వకం బ్రహ్మచ‌ర్యం పంచవింశ‌తి వ‌త్సరంగార్హస్థ్యం పంచ‌వింశ‌తి వ‌త్సరం వాన‌ప్రస్థాశ్రమం త‌ద్విధిత‌త్ర్కమా న్నిర్వర్త్యం చ‌తుర్విధ బ్రహ్మచ‌ర్యష‌డ్విధ‌గార్హస్థ్యం చ‌తుర్విధ వాన‌ప్రస్థధ‌ర్మం స‌మ్యగ‌భ్యస్య త‌దుచితం క‌ర్మస‌ర్వంనిర్వర్తయాం సాధ‌న చ‌తుష్టయ సంప‌న్న స‌ర్వసంసారోప‌రి మ‌నోవాక్కాయ క‌ర్మభిర్యథాశా నివృత్తస్తథావాస‌నైష‌నోప‌ర్యపి నిర్వైర‌శ్శాంతో దాంతః సన్యాసీ ప‌ర‌మ‌హంసాశ్రయేణాస్ఖలితః స్వస్వరూప‌ధ్యానేన దేహ‌త్యాగం క‌రోతి, స‌ముక్తోభ‌వ‌తీత్యుప‌నిష‌త్‌".

ముండ‌కోప‌నిష‌త్తు నందును, బృహదార‌ణ్యక‌ము నందును, ఆశ్రమ జీవిత‌ము మోక్ష మార్గమున కేల ఆవ‌శ్యక‌మో సూచింప‌బ‌డిన‌ది. శుక్ల య‌జుర్వేద‌ములోనిద‌గు జాబాలోప‌నిష‌త్తు నాలుగు ఆశ్రమ‌ముల‌ను చ‌క్కగా నెర‌వేర్పవ‌ల‌యున‌ని చెప్పుచున్నది. మైత్రాయ‌ణ బ్రాహ్మణ ఉప‌నిష‌త్తు త‌న ఆశ్రమ ధ‌ర్మము బాగుగా నిర్వర్తింప వ‌ల‌యున‌నియు, అంత‌క‌న్న ప‌ర‌మైన ధ‌ర్మము లేద‌నియు, అట్లు చేయ‌నిచో ప‌త‌తుడ‌గున‌నియు తుద‌కు నిశ్చయ‌మ‌గు స‌న్యాస‌ము వ‌ల‌న మోక్షప్రాప్తి క‌లుగున‌నియు, భోదించుచున్నది. ధ‌ర్మస్కంధ‌ములు మూడ‌నియు, బ్రహ్మసంస్థుడైన‌వాడు అమృత‌త్వమును పొందున‌నియు, సామ‌వేద‌ము ఘెషిల్లుచున్నది. బ్రహ్మచ‌ర్యమును విస్తరించి వ‌ర్ణించుచున్నది. ఆశ్రమ‌ధ‌ర్మముల ఆవశ్యక‌త నీరీతి నెరింగిన పిమ్మట ఆయా ఆశ్రమ ధ‌ర్మముల‌ను, త‌త్వమును, ఆచ‌ర‌ణ విధాన‌ముల‌ను ముందు విపుల‌ముగ చూత‌ము.