7
బ్రహ్మచ‌ర్యశ్రమ‌ము.

ఉప‌న‌య‌న తత్వము

బ్రహ్మచ‌ర్యాశ్రమ‌మ‌న విద్యార్థిద‌శ‌య‌ని చెప్పనొప్పును "ఆధ్యాత్మ విద్యవిద్యానాం" అని భ‌గ‌వ‌ద్గీత‌లో చెప్పబ‌డిన రీతిని యీ ద‌శ‌యందు విద్యార్థి ఆధ్యాత్మ విద్యన‌భ్యసించును.
ఈ విద్యాభ్యాస‌ము నిమిత్తము స‌ద్గురువు నాశ్రయించుట సాంప్రదాయ‌మైయున్నది. బ్రహ్మవిద్యకొర‌కు వ‌చ్చితినినియు, బ్రహ్మచారిగా నుందున‌నియు, త‌న‌యొక్క ఉద్ధేశ్యమును గురువున‌కెరిగించును. ("బ్రహ్మచ‌ర్యంమాగాం బ్రహ్మచ‌ర్యాసాని") అంత‌ట గురువు "కోసికోనామాసి" అని శిష్యునితో "నీవు శ‌రీర‌మాత్రుడ‌వు కావు నీవు బ్రహ్మవు. నీకు ఉప‌దేశింప‌నున్న నేను బ్రహ్మనే. నీవు బ్రహ్మచారివై బ్రహ్మసాక్షాత్కార‌మును పొంద‌వ‌ల‌యును. క‌నుక నీవు నియ‌మ‌బ‌ద్ధమైన జీవిత‌ము గ‌డుప‌వ‌ల‌యును" అని చెప్పును. అప్పుడు ఉప‌న‌య‌న‌క్రతువు జ‌రుగును. య‌జ్ఞోప‌వీత‌ము విద్యార్థిధ‌రించును. ఉప‌న‌య‌న‌మ‌న‌గా స‌మీప‌మున‌కు పిల‌చుకొని వెళ్లుట‌. ఆచార్యుల‌వారి స‌మీప‌మున‌కు పోవుట‌య‌ను ప్రయ‌త్నమున‌కు ఉప‌న‌య‌న‌మ‌ని పేరు. బ్రహ్మచారియ‌న‌గా బ్రహ్మజ్ఞాన‌మును సంపాదించు ఆచార‌మందుండువాడు. బ్రహ్మచ‌ర్య వ్రత‌ము చేప‌ట్టుట‌చే ఉప‌న‌య‌నమున‌కు వ్రత‌బంధ‌మ‌ను మ‌రియెక పేరుగ‌లిగిన‌ది.

ఉప‌న‌య‌న య‌జ్ఞము

ఈ య‌జ్ఞమందు బ్రహ్మవిద్య యెట్టి విఘ్నము లేక జ‌రుగుట‌కు దేవ‌త‌ల‌ను, ఋషుల‌ను, బ్రాహ్మణుల‌ను, యోగుల‌ను, మ‌హ‌త్ముల‌ను, ఆహ్వానింతురు. వ‌చ్చినవారంద‌రును వ‌టువు యొక్క బ్రహ్మచ‌ర్యము నిర్విఘ్నముగ జ‌రుగుట‌కు ప్రార్థింతురు.

"ఏత‌త్ బ్రహ్మచ‌ర్యం పూర్ణంకుర్యాత్ య‌తో
నిర్విఘ్న బ్రహ్మత‌త్త్వాధ్యయ‌నేచ అస్య‌ప్రవృత్తిర్భవేత్‌"

త‌ల్లిదండ్రులు కుమారునిజూచి సంతోష‌ముగా ఆచార్యునితో వెళ్లుము. ఆయ‌న ఆజ్ఞానువ‌ర్తివై న‌డువుము, బ్రహ్మవిద్య న‌భ్యసింపుము. స‌త్యమును గ్రహింపుము. బ్రహ్మ భావ‌మును పొందుము. త‌రువాత యీ సంసార‌ములోనికి వ‌చ్చి సుఖింపుము అని చెప్పెద‌రు.

"గ‌చ్ఛతాత‌, య‌ధాసుఖం, ఏత‌దాజ్ఞాంకురు,
శాస్త్రాణ్యధీత్య, బ్రహ్మత‌త్వం ప‌రిజ్ఞాయ‌
బ్రహ్మభావం ప్రాప్య సంసారాభినివిష్టోభవ‌"

ఉప‌న‌య‌న కృతువు యొక్క నిజ‌త‌త్వమిట్లుండ‌గా నేడు మ‌న‌ము చేసుకొనుచున్న ఉప‌న‌య‌న‌ముల‌ను చూచి సిగ్గు ప‌డ‌వ‌ల‌దా

శూద్రత్వము - ఉప‌న‌య‌న‌ము

ఈ ఉప‌న‌య‌న కృతువు బ్రహ్మ క్షత్రియ వైశ్యుల‌కే గాని శూద్రుల‌క‌ర్హత లేద‌ని చెప్పుట మ‌నుము వినుచున్నాము. వేద‌ధ‌ర్మమును విడ‌నాడుట‌చే అశౌచ‌ముచే స‌ర్వక‌ర్మోప జీవ‌న‌ముచే శూద్రత్వము త‌ట‌స్థించెన‌ని లోగ‌డ‌నే చెప్పి యుంటిని. శూద్రత్వము శాశ్వత‌ముగా నుండున‌దికాదు. శూద్రత్వము నియ‌మ‌బ‌ద్దమైన జీవిత‌ము కొంత‌కాల‌ము గ‌డుపుట‌వ‌ల‌న పోవున‌నిశ‌త‌ప‌ధ బ్రాహ్మణ‌మునుండి లోగ‌డ‌నే ప్రమాణ‌ము జూపియుంటిని. భృగుమ‌హ‌ర్షియు య‌జ్ఞధ‌ర్మక్రియ‌లు శాశ్వత‌ముగా వీరికినిషేధింప బ‌డ‌లేద‌ని చెప్పిన వాక్యముల నుదాహ‌రించ‌తిని. ప‌రుశురాముడు బెస్తవాళ్లకు య‌జ్ఞోప‌వీత‌ములు వేసి బ్రాహ్మణుల‌నుగా జేసిన‌ట్లు లోగ‌డ పురాణ‌వాక్యముల నుదాహ‌రించి యుంటిని. ప‌ర‌శురాముడు ద‌శావ‌తార‌ముల‌లో ఒక అవ‌తార‌ముగ ప‌రిగ‌ణింస‌బ‌డి లోక‌ముచే పూజింప బ‌డుచున్నాడు.

భ‌గంతుడే బ్రహ్మనిష్టగ‌ల‌వారికి య‌జ్ఞ సూత్రము క‌ల్పించి స్వయ‌ముగా త‌న‌క్రియ‌చే ప్రపంచ‌మున‌కు ఆద‌ర్శనుడ‌య్యెను. గార్గ్యాయ‌న మ‌హ‌ర్షి ప్రణ‌వాద‌మ‌ను త‌న గ్రంధ‌ము నందు జాతి శూద్రుడైన‌ను యీ సంసార‌మెట్టిది యేకార్యమెట్లు చేయ‌వ‌ల‌యును అని చింతాక్రాంతుడై జిజ్ఞాస‌క‌లిగిన వాడైన‌చో వానికి ఉప‌య‌నాధికారము క‌ల‌ద‌ని చెప్పియున్నాడు. ఈ అంత‌ర్ముఖ ప్రవృత్తి క‌లిగిన‌చో శూద్రుడైన‌ను ద్విజుడ‌గును. అగ్రజాతి వాడైన‌ను యీస్థితి క‌లుగ‌నిచో పతితుడ‌గుచున్నాడు. శూద్రుడు త‌న శూద్రత్వమును పోగొట్టుకొనినచో షోడ‌శ సంస్కార‌ముల‌కును అర్హుడ‌గుచున్నాడు.

ఏత‌దంత‌ర్ముఖ ప్రవృత్తౌ స‌త్యాం శూద్రస్యాపి ద్విజ‌త్వం ప్రతీయ‌తే యోహ్యేవంక‌దా ప్యంత‌ర్ముఖో న‌భ‌వ‌తిస‌నాంత‌శ్శాస్త్రే ప్రవృత్తః ప‌తిత‌శ్చ భ‌వ‌తి ! సంసార‌గ‌తంహి సుఖందుఃఖ‌శ్చ క్షణ‌భంగురం భాస‌తే మృతౌశోకః జ‌న‌నేహ‌ర్షః ప్రాప్తౌసుఖం, త‌ద‌భావే దుఃఖ‌శ్చేత్యాద్యధ‌మాగ‌తిః

శూద్రుడు స్వార్దత్యాగియై మ‌నుష్యసేవ‌వ‌ల‌న యీ ఆంత‌ర్ముఖ ప్రవృత్తిపొందున‌నియు, త‌ద్వారా సంస్కార‌మునక‌ర్హుడ‌నియు, గార్గ్యాయ‌న మ‌హ‌ర్షి త‌న ప్రణ‌వ‌వాద‌మందు చెప్పుచున్నాడు. మ‌నోవాక్కాయ క‌ర్మల‌యందు జ్ఞాన‌నిష్ఠతో మాన‌వ సేవ చేసిన‌చో శూద్రత్వము పోవుట‌యందు ఆశ్చర్యయేమున్నది! ద్విజ‌త్వము సంప్రాప్తమ‌గునుగ‌దా ! అట్టి వాడు స‌ద్గురువు నాశ్రయించి సంస్కారార్హుడ‌గును. షోడ‌శ‌సంస్కార‌ము అకార‌, ఉకార‌, మ‌కార (ఓంకార‌ము) ప్రతిష్ఠిత‌మ‌ని తెలుప‌బ‌డిన‌ది.

"త‌స్మాత్ షోడ‌శ సంస్కారాణామ‌పిచాకా
రోకార‌మ‌కార‌ప్రతిష్ఠి త‌త్వంవిజ్ఞేయం..."
"సంస్కారేణ విశుద్ధానాం బ్రహ్మత్వముప‌జాయ‌తే"
"శూద్రాణాం హితావ‌త్ సేవైక‌నియ‌తా భ‌వ‌తి!
త‌త్సేవ‌యాతు పున‌రంత‌ర్ముఖ‌త్వం త‌ద్వ్యాపార‌
సాధ‌నం య‌దిచేద్భవ‌తి. త‌దాస్వస‌ద్గురుణా స‌ర్వాధికా
రేణ తేషామ‌పిత‌త్సంస్కారాభంతి". (ప్రణ‌వ వాద‌ము)
త‌త్సేవ‌యాతు పున‌రంత‌ర్ముఖ‌త్వం త‌ద్వ్యాపార‌
సాధ‌నం య‌దిచేద్భవ‌తి. త‌దాస్వస‌ద్గురుణా స‌ర్వాధికా
రేణ తేషామ‌పిత‌త్సంస్కారాభంతి. (ప్రణ‌వ వాద‌ము)
సేవ‌యాహిచ స‌ర్వైస్తు త్రివ‌ర్ణత్వం సుల‌భ్యతే,
ద్విజోభూత్వాయ‌ధాయోగ్యం క‌ర్తవ్యం క‌ర్మచోత్తమం
సంస్కార‌విహితంముఖ్యం త‌ధోప‌న‌య‌యాధికం,
తం ప్రాప్తోతిమ‌నుష్యశ్ఛ సేమ‌యా స‌ర్వక‌ర్మణా !!
మ‌న‌సా క‌ర్మణా వాచాక్రియ‌యా జ్ఞాన‌నిష్ఠ యా
స‌ర్వదా సేవ‌నం కుర్యాద్భూత‌మాత్రస్య నిశ్ఛయాత్‌
ఏవంకృతేన వైశ్యత్వం జాయ‌తే మాన‌వ‌స్యచ !
క్షత్రియ‌త్వం ల‌భేత్తేన బ్రాహ్మణ్యంచ‌ప‌రాత్పరం!!

య‌జ్ఞోప‌వీత ర‌హ‌స్యము

య‌జ్ఞోప‌వీత‌ములోని ర‌హ‌స్యార్ధమును మ‌న‌ము కొంత తెలుసుకొన‌వ‌ల‌సియున్నది. ఈ య‌జ్ఞోప‌వీత‌ము ప‌ర‌బ్రహ్మను తెలియ‌జేయుట‌వ‌ల‌న సూత్రమ‌నిపిలువ‌బ‌డును. య‌జ్ఞోప‌వీత‌మే సూత్రాత్మయే - మోక్షస్వరూప‌మైన‌ది.

"సూచ‌నాత్పూత్రమిత్యాహూ స్సూత్రంనామ‌
ప‌రంప‌దం, త‌త్సూత్రం విదితంయేన స‌విప్రోవేద‌పార‌గః " (బ్రహ్మోప‌నిష‌త్‌)

ప‌ర‌బ్రహ్మమేదో దానిని య‌జ్ఞోప‌వీత‌ముగ ధ‌రింప‌వ‌ల‌యును. య‌ద‌క్షరం ప‌రంబ్రహ్మత‌త్సూత్రమితిధార‌యేత్ ఎవ‌డుప‌ర‌బ్రహ్మ రూప‌క‌మ‌గు నీ బ్రహ్మసూత్రమునుధ‌రించునో (బుద్ధిగుహ‌యంద‌ని ప‌ర‌బ్రహ్మమును తెలిపి దానినే ద్యానించునో) వాడు ప్రకాశ‌రూపుడ‌గుచున్నాడు. ప‌ర‌బ్రహ్మజ్ఞాన‌ము ఎవ‌రికిగ‌ల‌దో వారేయ‌జ్ఞోప‌వీత‌ముక‌ల‌వారు.

"సూత్రమంత‌ర్గతం యేషాం జ్ఞాన‌య‌జ్ఞోప‌వీతినాం,
తేవైసూత్రవిదోలోకేతేచ య‌జ్ఞోప‌వితినః"

ఎవ‌నికి బ్రహ్మజ్ఞాన‌రూప‌మైన య‌జ్ఞోప‌వీత‌ముక‌ల‌దో వానికి స‌మ‌స్తమ‌గు బ్రాహ్మణ్యముక‌ల‌దు.

"శిఖాజ్ఞాన‌మ‌యీ య‌స్యఉప‌వీతంచ త‌న్మయం
బ్రాహ్మణ్యం స‌క‌లం త‌స్య ! ఇతిబ్రహ్మవిదోవిదుః."

ప్రత్యక్ష బ్రహ్మమును సూత్రముగ నెవ‌డుధ‌రించునో వాడే బ్రాహ్మణుడ‌నియు, జ్ఞాన‌మ‌నుసూత్రమును, ధ‌రించిన వారే య‌జ్ఞోప‌వీత‌మును ధ‌రించిన‌వార‌నియు అట్టిజ్ఞాన‌మే ఉత్తమోత్తమ‌మైన‌దై ప‌విత్రము చేయున‌నియు, బాహ్యమున ధ‌రించు జందెము క‌ర్మచేయుట‌కే ఉప‌యోగించున‌నియు, అధ‌ర్వణ వేద‌యందు (నార‌ద‌ప‌రివ్రాజ‌కోప‌నిష‌త్తు) చెప్పబ‌డియున్నది. దానిని చ‌దువ‌రులుమూల‌యందు గ‌మ‌నింతురుగాక‌.