పీఠిక‌

మ‌త విష‌య‌ములు యందంత‌గా శ్రద్ధలేని యీరోజుల‌లో నీగ్రంధ‌మును వ్రాయుబూనుట హ‌స్యాస్పద‌ముగ తోచ‌వ‌చ్చును. ఈ గ్రంధ‌మును వ్రాయుట‌కు నేన‌న్ని విధ‌ముల న‌న‌ర్హుడ‌న‌ని చెప్పక‌త‌ప్పదు. కాని ప‌ది పండ్రెండేండ్లనుంచియు నేను చేసిన కృషి వృధాపోవున‌ను చింత‌తోను, నా స్నేహిత బృంద‌మున‌న్ను ప్రోత్సహించినందున‌ను వేద‌ధ‌ర్మమును నేన‌ర్ధము చేసుకొనినంత‌వ‌ర‌కు నీ గ్రంధ‌రూప‌మును ప్రచురించ‌బూనినాను.దీనియందునేక దోష‌ములున్నవ‌ని నేనెరుగుదును. కాని యేది స‌త్యమ‌గు ధ‌ర్మమ‌నినేను గ్రహించితినో దాని యందు పొందుప‌ర‌చుట‌కు వెనుదీయ‌లేదు. వ్యాక‌ర‌ణ సూత్రముల నెంత‌మాత్రము నేను పాటింప‌క భావ‌మున‌కే ప్రాముఖ్యత‌నిచ్చి మామూలు భాష‌లో నీగ్రంధ‌మును వ్రాసితిని. పండిత లోక‌ము న‌న్ను మ‌న్నించెద‌రుగాక‌. వేద‌మ‌త సంబంధ‌మైన విష‌య‌ముల‌న్నియు నొక్క పుస్తక‌మునందెచ్చట‌ను లేకుండుట చేత‌ను, గ్రంధ‌ముల‌న్నియు చాల‌వ‌ర‌కు సామాన్యప్రజ‌కు చ‌దువుట‌కు వీలులేని సంస్కృత భాష‌యందుండుట చేత‌ను, పామ‌ర లోక‌మున కైన‌ను నీ గ్రంధ‌ముప‌యోగ‌ప‌డ‌క పోద‌ను నూహ‌తో దీనిని ర‌చియించి ప్రచురింప సాహ‌సించితిని. దీని యందు చెప్పబ‌డిన జీవిత‌ము న‌వ‌లంభిచుట‌కు శ‌క్తి సామ‌ర్ధ్యముల‌ను, ధృడ నిశ్చయ‌మును, స‌ర్వేశ్వరుడు మ‌న‌కొసంగుగాక‌. పాఠ‌క మ‌హ‌శ‌యులు దీనిలోని త‌ప్పుల‌ను ద‌య‌చేసి చూపిన‌చో రెండ‌వ కూర్పునందు స‌వ‌రించుకొందున‌ని విన్నవించుచున్నాను.

గుడివాడ‌.
15-8-1935.

ఇట్లు

బుధ‌జ‌న విధేయుడు,
దిట్టక‌వి రామ‌కృష్ణయ్య.