33
 

అతీత‌శ‌క్తులు లేవా ?

 

ఒక‌సారి నేను వ్రాసిన వ్యాసాన్ని ప‌రికిస్తూ ఒక త‌ప్పుప‌ట్టారు మా గురువుగారు. అందులో నేను ఒక వ్యక్తికి మాన‌వాతీత శ‌క్తులున్నాయిని రాశాను. ఈ శ‌క్తి క‌ల్గింది మాన‌వుడికే గ‌దా మ‌రి మాన‌వాతీత శ‌క్తులంటావే అని మా గురువుగారు న‌వ్వి అతీంద్రియ శ‌క్తులు అని దిద్దారు. ఈ మాట‌లో కూడా ఏదో దోషం భాషాప‌రంగా ఉంద‌ని అనుకున్నాను.

అంద‌రూ   చేయ‌గలిగే ప‌నులు సామాన్యంగా ఉండి ఆశ్చ‌ర్య క‌ల్గించ‌వు. కొంద‌రి ప‌నులు ఆశ్చ‌ర్య జ‌న‌కాలుగా ఉంటాయి. చేతులూ కాళ్ళూ లేక‌పొయినా నోటితో చిత్రాలు గీసేవాళ్ళున్నార‌ని తెలిస్తే చిత్రంగా అన్పిస్తుంది. అలా ప్రాక్టీస్ చేసాడు అని స‌ర్దుకుంటాము. చిన్న బిందెని మోయ‌గ‌ల్గిన అమ్మ‌కి పెద్ద బిందెమెసే అమ్మ‌ని చూస్తే ఆశ్చ‌ర్యం ! తానూ అలా చెయ్య‌లేక‌పోయాన‌నే చింత క‌ల్గుతుంది. కానీ పెద్ద బిందె మోసేవాళ్ళు ఉండ‌రు అని మాత్రం అన‌దు. ఎందుక‌ని ? క‌ళ్ళారా చూస్తోంది గ‌దా !

ఇలాగే భార‌త‌దేశంలో ఆనాదిగా మ‌హ‌త్తులుగ‌ల మ‌హిమాన్వితుడైన మ‌హ‌ర్షుల‌నేక‌మంది ఉన్నారు. వారు చూపేశ‌క్తుల‌నీ, వాళ్ళ‌నీ భూత‌ద్దాల‌లోంచి  శ‌ల్య‌ప‌రీక్ష‌లు చేసి గాని విశ్వాసం కుదుర్చుకోరు. అంద‌రూ న‌మ్ముతున్నారు గ‌దా మ‌న‌మూ న‌మ్మితే త‌ప్పేమిటి అనుకునేవారు కొంద‌రు. ఆప‌ద‌ల్లో మ‌రో దిక్కులేక వారిని ఆశ్ర‌యించేవారు కొంద‌రు. మూఢంగా న‌మ్మేవారు కొంద‌రూ ఉంటారు.

ర‌మ‌ణ‌మూర్తి బోధ‌న‌ల‌ను ఆయ‌న చూపిన మ‌హిమ‌ల‌ను చ‌దివిన నా మిత్రురాలు  ఆయ‌న ఈ కాలంలో ఉంటే ఎంత బాగుండేది అంటుంది లేదా మ‌న‌మే,  ఆకాలంలో ఉంటే బాగుండేది అంటుంది. అస‌లు ఏ రూపంలోనైనా ఉన్నామేమో అంటుంది. నాకు కూడా అలాగే అన్పించినా నిజంగా ర‌మ‌ణ మ‌హ‌ర్షిగాని నార‌దమ‌హ‌ర్షిగాని, రాముడుగాని, కృష్ణుడు గాని ఎవ‌రైనా స‌రే బ్ర‌తికి ఉన్న‌వాళ్ళ‌ని న‌మ్మే శ‌క్తి మ‌న ర‌క్తంలో లేదేమో ?  భార‌తంలో కృష్ణుడ్ని దుర్యోధ‌నుడు న‌మ్మాడా ?  ఏదో నాట‌క‌మో మోస‌మో అనుకోమా ?  అనే అనుమానం కూడా కల్గుతుంది.

ఇలా ఆలోచిస్తున్న త‌రుణంలో స్వామీ వివేకానంద ప్ర‌వ‌చ‌నాల‌ను చ‌ద‌వ‌డం సంభ‌వించింది. వారి భావాల్ని మీతో పంచుకుందామ‌ని అన్పించింది. అందుకే ఈ వ్యాస‌మూ, వ్యాసంగ‌మూను.

జ‌న‌వ‌రి ఎనిమిదో తారీఖున 1900 లో లాస్ ఏంజెల్స్‌లో7 వివేకానంద మ‌న‌స్సు కుండే శ‌క్తుల్ని గురించి వ‌ర్జిస్తూ శ్రోత‌ల‌కు త‌న అనుభ‌వాన్ని గురించి ముచ్చ‌టించారు. ఒక‌నాడు వివేకానంద‌స్వామి త‌న మిత్రుల‌తో క‌ల్సి ఒక సాధ‌కుని ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. అత‌డు చాలా సామాన్యుడు. పెద్ద‌గా చదువుకున్న‌వాడు కాడు. కానీ త‌న దగ్గ‌ర‌కు వ‌చ్చే వారి హృద‌యాల్లో ఏమిసంశ‌యాలున్నాయో ఏమి ప్ర‌శ్న‌లున్నాయో తెల్సుకోగ‌ల‌డు.

వివేకానందుడు వీరి మిత్రులు తాము కొన్ని ప్ర‌శ్న‌ల‌కు వ్రాసి జేబుల్లో పెట్టుకున్నారు. ఆసాధ‌కుడు వారి ప్ర‌శ్న‌ల‌ను చెప్పి వాటికి స‌మాధానాల‌ను కూడా చెప్పి తానుకూడా ఏదో వ్రాసి అంద‌రికీ త‌లో కాగిత‌మూ ఇచ్చాడుట !  ఆ త‌ర‌వాత వారిని ఏదైనా ఒక వాక్యం చెప్ప‌మ‌న్నారుట‌. వారు ఒక‌రు సంస్కృతంలోనూ, అర‌బిక్‌లో ఒక‌రూ, జ‌ర్మ‌న్ బాష‌లో ఒక‌రూ చెప్పారుట‌. త‌రువాత ఆయ‌న వ్రాసిచ్చిన‌దేమిటా అని చూస్తే తాము వివిధ భాషల్లో చెప్పిన మాట‌లే అవి ! ఆయ‌న ఆ భాష‌లు చ‌దువుకో లేదు ! తాము ఈ మాట‌లే చెప్తామ‌ని ముందే ఎలా ఊహించాడు అని ఆశ్చ‌ర్య‌పోయారుట !

మ‌రోమారు హైద‌రాబాదులో ఒక‌స్వామి కోరిన పండ్ల‌ను త‌న దుప్ప‌టిలోంచి తీసి ఇస్తాడ‌ని విని ప‌రీక్షించ‌డానికి మిత్ర స‌మేతంగా వ‌చ్చారు. అప్పుడాస్వామి జ్వ‌రంతో బాధ‌ప‌డ్తున్నాడు. వివేకానంద చేతిని త‌న నుదుటిపై ఉంచితే త‌న జ్వ‌రం త‌గ్గుతుంద‌న్నాడు. అలా చేసేస‌రికి అత‌ని జ్వ‌రం తగ్గింది. నీ చేతిలో ఉన్న శ‌క్తేనా చేతుల‌లోనూ ఉంద‌ని ఆ స్వామి న‌వ్వాడు. వివేకానంద వారికి త‌మ‌తో తెచ్చిన ర‌గ్గు ఇచ్చి ఆకాలంలో ఆదేశంలో పండ‌ని పండ్ల‌ని తెప్పించ‌మ‌ని కోరాడు. ఆయ‌న అలాంటి తేనెలూరే తీయ‌టి పండ్ల‌ని తెప్పించి ఇచ్చాడు. బుట్ట‌ల‌కొల‌దీ పూల‌ను, మంచి ముత్యాల్లాంటి మంచు బిందువుల‌తో మిల‌మిల మెర‌సే మంచిమంచి సుగంధాల‌ను వెద‌జ‌ల్లేకుసుమాల‌ను, పూల‌నూ ఆ ర‌గ్గులోంచి తీసి ఇచ్చాడు. మిత్ర బృందం ఎంతో సంతోషించింది.

అంతుప‌ట్ట‌ని ఈ మ‌న‌స్సులో అంతు చిక్క‌ని శ‌క్తులెన్నో ఉన్నాయ‌ని వివేకానంద నొక్కి వ‌క్కాణించారు. అంతేకాదు జ‌న సాంద్ర‌త పెరిగిన కొద్దీ మాన‌వుల భౌతిక శ‌క్తీ, మానసిక శ‌క్తీ కూడా త‌గ్గుతుంద‌ని స్వామి ప్ర‌వ‌చించారు.

ఇందుచేత కూడా జ‌న నియంత్ర‌ణా ఆవ‌శ్య‌క‌త తెలుస్తోంది. త‌స్మాత్ జాగ్ర‌త్త !