36
 

కో - ఎడ్యుకేష‌న్‌

 

కాలేజీలు తెరుస్తున్నారు. సీట్ల కోసం తంటాలు మొద‌ల‌వుతున్నాయి. అబ్బాయి లైతే ఎక్క‌డో అక్క‌డ ఏదో ఒక కాలేజీలో ఎంత దూర‌మైనా స‌రే పంపేయ‌వ‌చ్చు. ఎన్ని బ‌స్సులు మారైనా వెళ్లిపోగ‌ల‌డు. హాస్ట‌లులోనైనా ఉండిపోగ‌ల‌డు. కానీ అమ్మాయిల‌కు దూరంగా ఉన్న స్కూల్స్‌లో గాని కాలేజీల్లోగాని చేర్చ‌డానికి ఎంత మోడ‌ర‌న్ వ్యూస్ ఉన్న త‌ల్లిదండ్రులైనా ఇష్ట‌ప‌డ‌రు. ద‌గ్గ‌ర‌లో ఉన్న ఏదో ఒక కాలేజీలోనూ చేర్చ‌లేరు. మ‌హిళా క‌ళాశాల‌లోనే చేర్చాల‌కుకొనేవారి అవ‌స‌రాల‌కు త‌గిన‌న్ని ప్ర‌త్యేక కళాశాల‌లులేని లోటు ఎంతో ఉంది. ఉన్న కాలేజీల సంఖ్య విద్యార్థుల సంఖ్య‌తో పోలిస్తే ఎంతో త‌క్కువ‌గా ఉంది. దూరాల‌కు కూడా ఇప్పుడు వెళ్ళ‌డం లేదా అంటే వెడుతూనే ఉన్నారు. బ‌స్సులేక్కేట‌ప్పుడూ దిగేట‌ప్పుడూ ప్ర‌యాణం చేసేట‌ప్పుడు ఆడ పిల్ల‌ల శ‌రీరాలూ  మ‌న‌సులూ ఎంత‌గానో న‌లిగిపోతూ ఉంటాయి. ఎన్నో అగ‌చాట్లు పాపం మ‌రో గ‌త్యంత‌రం లేదు.

 

కొన్ని దేశాల్లో అయితే ఆడ‌పిల్ల‌ల‌కాలేజీ అని మ‌గ‌పిల్ల‌ల కాలేజీ అని వేరువేరుగా ఉండ‌వు. ఇలా వేరుగా వుంటాయినికూడా వీరికి తెలియ‌దు. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. కానీ మ‌న‌దేశంలో అలాక్కాదు. రెండిటికి చెడిన తంతు అయింది. ఇక్క‌డ ఆడ పిల్ల‌లూ మ‌గ‌పిల్ల‌లూ (యుక్త వ‌య‌స్సు వ‌చ్చిన త‌రువాత )  క‌ల‌సి విచ్చ‌ల‌విడిగా తిర‌గ‌రు. వీక్ ఎండ్స్ కి ఏ సుంద‌ర‌తీరాల‌కో పిక్నిక్ లు అంటూ వెళ్ళ‌రు డేటింగ్స్ పేరుతో స్వేచ్ఛ‌గా సంచరంచి జీతిత భాగ‌స్వామినీ ఎన్నుకోలేరు.

కానీ టెన్త్ క్లాస్ చ‌దివే అబ్బాయీ అమ్మాయీ ప్రేమించుకొని పెద్ద‌ల అంగీకారంతో పెళ్ళి చేసికొన్న‌వార్త ఈమ‌ధ్య‌నే ప‌త్రిక‌ల్లో వ‌చ్చింది. ఈ పిల్ల‌ల‌కు మ‌య‌సెంత ఉంటుంది .  ఎంత ఎక్కువ‌గా అంచ‌నా వేసినా అమ్మాయికి ప‌ద‌హారు అబ్బాయికి ప‌ద్దెనిమిదికీ మించి ఉండ‌వు. ఈ ప‌సివాళ్ళ‌కి ఇప్పుడే ప్రేమ‌లేమిటి ?  పెళ్ళెమిటి ?  సంసారంలో ప‌డి కొట్టుమిట్టాడి పోవ‌డం త‌ప్ప వారు ఏ రంగంలో అభివృద్ధి సాధించ‌గ‌ల‌రు ?  వారి భ‌విష్య‌త్తును వారే అణ‌చివేసుకొన్నారు. పురోభ‌వృద్ధికి దారి తీసే అన్ని మార్గాల‌నూ వారి చేత్తో వారే మూసివేసికొన్నారు. ఈ ర‌కం వివాహాలు వారి ఆరోగ్యానికిగాని స‌మాజం ఆరోగ్యానికి కాని ఏ ర‌కంగా మంచివి ?  ఆలోచిండండి.

ఈ పెళ్లిలో ఇంకో విశేషం కూడా వ్రాశారు. ఇద్ద‌రూ చ‌దివేది ఒకే త‌ర‌గ‌తి అమ్మాయి పాస‌యితే అబ్బాయితో స‌మానవ‌వుతుంది. అందుకే అమ్మాయి ప‌రీక్ష వ్రాయడం మాని చ‌దువుని త్యాగం చేసి అబ్బాయి పురుషాధిక్యాన్ని స్టేట‌స్‌నీ నిల‌బెట్టింద‌ట‌. పెళ్ళాడ‌టంలోనూ ప్రేమించ‌డం లోనూ ఫార్వాడ్‌గా ఎగ్రెస్సివ్‌గా ఆలోచించ‌గ‌లిగిన వీరు ఇద్ద‌రిలో ఎవ‌రెక్కువ చ‌దువుతున్నారూ అన్న విష‌యంలో మాత్రం విశాలంగా ఆలోచించ‌లేక పోయారు.

సినిమాలు, న‌వ‌ల‌లు వెద‌జ‌ల్లే చ‌వుకబారు ప్రేమ‌గాథ‌లు మ‌త్తులో ప‌డిపోయిత‌మ ప‌రిస‌రాల్లో అందుబాటయిన అనుకూల‌మ‌యిన వారిని ప్రేమించామ‌నుకొని అదొక థ్రిల్‌గా భావించి ప్రేమ‌లేఖ‌లు వ్రాసుకోడం చాటుమాటుగా క‌లుసుకోడం కాలం క‌లిసి రాక‌పోతే చెరోదారి కావ‌డం జ‌రుగుతుంది. అమాయ‌కులు కొంద‌రు త‌మ భ‌విష్య‌త్తును రైలుప‌ట్టాల కిందో ఎండ్రిన్ డబ్బాల్లోనో వెతుక్కుంటూ ఉన్నారు. ఇటువంటి సంఘ‌ట‌న‌లు ఎన్నో.

ఇలాఎందుకు జ‌రుగుతోంది ?  ఒక ప్ర‌క్క‌న భార‌తీయ సంప్ర‌దాయం శీలం ఏక‌ప‌త్నీవ్ర‌తం , ఏకస‌తీత్వం అనే విలువైన భావాలు రక్తంలో త‌ర‌త‌రాలుగా ప్ర‌వ‌హిస్తున్నాయి. పాశ్చాత్య నాగ‌రిక‌త‌, స్వేచ్ఛాసంచారం అదే అభివృద్ధి అనుకొనే ధోర‌ణులూ పెరిగిపోతున్నాయి. వాటి ఆక‌ర్ష‌ణా గ‌ట్టిగానే ఉంది. ఈరెండు ఒకే త్రాటికి రెండు చివ‌ర్లు. బాలావ్య‌వ‌స్థ దాటిన అర్భ‌కుల‌ను బాల్య‌యౌవ‌నావ‌స్థ‌ల సంధి కాలంలో ఉన్న ప‌సివాళ్ళ‌ను ఈ రెండు నాగ‌రిక‌త‌ల త్రాడు బ‌లంగా చుట్టేసి రెండు వైపులా లాగుతూ ఉండ‌డంవ‌ల్ల‌నే ఇలాంటి విషాద ప‌రిణామాల‌కు కార‌ణం ఈ బ‌లీయ‌మైన సంఘ‌ర్ష‌ణ‌లో ఎవ‌రు త‌ట్టుకోగల‌రో నిర్ణ‌యించేదికాలం

వ‌య‌స్సు తెచ్చే ప్ర‌లోభాల‌కు త‌ట్టుకోగ‌ల్గిన‌వారిని కూడా మభ్య‌ప‌రిచేదిగా ఉంటోంది ప్ర‌స్తుత వాతావ‌ర‌ణం. ప‌బ్లిక్‌గా ఓ ఆడ‌పిల్ల‌చెంగులాగ‌డ‌మో జ‌డ‌గుంజ‌డ మో ఇంకో స్టెప్ కూడా ముందుకు వెయ్య‌డ‌మో ఘ‌న‌కార్యంగా భావించేవిధంగా రెచ్చ‌గొట్టేలా ఉన్న‌ది నేటి సాహిత్యం.నిజ‌జీవితంలో అటువంటి అనుభ‌వాల‌ను ఏ ఆడ‌పిల్లా కోరుకోదు. అందుకే ఆడ‌పిల్ల‌ల‌కు ప్ర‌త్యేకంగా ఉన్న కాలేజీల్లో చేర‌డానికే మూడువంతుల మంది అమ్మాయిలు ఉత్సాహం చూసిస్తారు. కో ఎడ్యుకేష‌న్ కాలేజీల్లో పాఠాలు చెప్పే మ‌హిళా లెక్చ‌ర‌ర్లు వ‌య‌స్సులో పెద్ద‌వారై న‌ప్ప‌టికీ మ‌గ‌విద్యార్థుల‌కు వెరుస్తారు. సంఖ్య‌నుబ‌ట్టి చూస్తే మ‌హిళా క‌ళాశాల‌లు నూటికి ఇర‌వై శాతం కూడా లేవు. పాఠ‌శాల‌ల సంగ‌తి చెప్ప‌నే అక్క‌ర‌లేదు. ప్ర‌త్యేక స్త్రీ క‌ళాశాల సంఖ్య‌ను పెంచే విష‌యాన్ని గురించి సాంఘిక సంక్షేమ కాంక్ష గ‌ల ప్ర‌తి ఒక్క‌రూ గాఢంగా యోచించ‌వ‌లసిన ఆవ‌శ్య‌కం ఎంతో ఉంది. మీరేమంటారు ?