47
 

అంత‌శ్శ‌త్రువులు

 

ఈర్ష్యాశువు, జుగుస్సావంతుడు. నిస్సంతోషి, క్రోధ‌నుడు నిత్య‌శంకితుడు ప‌ర‌భాగ్యోప‌జీవి ఈ ఆరుగురూ దుఃఖ‌భాగులు అంటాడుచిన్నియ‌సూరి. కామ‌క్రోధ లోభ‌మోహ‌మ‌ద మాత్స‌ర్యాల‌ను అరిష‌డ్వ‌ర్గాలుగా మ‌న పెద్ద‌లు నిర్ణ‌యించారు అంటే ఈ పై చెప్పిన దుర్గుణాలు లేనివారు సంతోషంగా ఉండ్చులుగుతార‌న్న మాట‌.

గొంగ‌ట్లో అన్నంతింటే ఏదో వ‌చ్చింద‌న్న సామెత‌లాగా మ‌నిషిగా పుట్టిన త‌రువాత ఇలాంటి గుణాలు లేకుండా ఉండ‌గ‌ల గ‌డం సాధ్య‌మా ! అలా అంత శ్శ‌త్రువుల‌ను నాశ‌నం చేసికోగ‌ల్గిన‌వాడు మ‌నిషి దైవ‌స‌మానుడు  అయిపోతాడు గ‌దా అని మ‌నం అనుకోవ‌చ్చు. మాన‌వుడిగా జ‌న్మిస్తూనే కొన్ని మంచిగుణాల‌నూ కొన్ని చెడ్డ‌గుణాల‌నూ కూడా వెంట‌తెచ్చుకుంటాం. భ‌గ‌వ‌ద్గీత‌లో కూడా దైవీ సంప‌త్తి అసుర‌సంప‌త్తి అనే విభ‌జ‌న కన్పిస్తుంది. పిత్రార్జితంగా కొంత అప్పు కొంత బాంక్ బాలెన్సూ తెచ్చుకున్న‌ట్లు బాంక్ బాలెస్సును జాగ్ర‌త్త‌గా కాపాడు కుంటూ అప్పుతీర్చుకుని కాస్త విల‌వ వేసుకోగ‌ల్గ‌డ‌మో, ఎడాపెడా ఖ‌ర్చుపెట్టి ఉన్న‌దంతా క‌రిగిందిచేసి మరింత అప్పుల పాలు కావ‌డ‌మో, ఆ వ్య‌క్తి నేర్పుమీదా మాన‌సిక ప‌రిస్థితిమీదా ఆధార‌ప‌డిన‌ట్లే సుగుణ దుర్గుణాలు క‌ల్సి ఉన్న‌వ్య‌క్తులు ఏ స్వ‌భావాన్ని ఎక్కువ‌గా నిలుపుకోగ‌ల్గుతారు ఏ స్వభావాన్ని జ‌యించ‌గ‌ల్గుతారు అన్న విష‌యం వారివారి సంస్కారంమీద ఆధార‌ప‌డి ఉంటుంది.

సుగుణాలుంటే సంతోషంగా మ‌న‌గ‌లిగేదీ దుర్గుణాలుంటే దుఃఖాన్ని అనుభ‌వించేదీ ఆ వొక్క‌వ్య‌క్తే గాక వాటి ప్ర‌భావంప‌రిస‌ర స‌మాజంపైన కూడా ప‌డ‌క త‌ప్ప‌దు త‌న‌కోప‌మె త‌న శ‌త్రువు త‌న శాంత‌మె త‌న‌కు ర‌క్ష అన్న ప‌ద్యాన్నీ స‌మ‌యంలో గుర్తుకు తెచ్చుకోవాలి మ‌నకి మ‌నంచాలా మంచివాళ్ళం గానే అన్పిస్తాం. మ‌న‌మొహం చూచుకునేందుకు అద్దంవుంది. హృద‌యం ప్ర‌తిబింబించాలంటే అంత‌రంగాన్ని శుభ్ర‌ప‌ర‌చుకోవాలి ! మ‌న‌కి ఈర్ష్య‌, అసూయ‌, మొద‌లైన గుణాలున్నాయో లేవా అన్న‌ది తెల్సుకోవాలి. మ‌న‌ల‌ను మ‌నం ఇలా ప్ర‌శ్నించుకోవాలి.

మ‌న‌ప‌క్కింటి ఆమె ఓ మంచిచీర కొనుక్కుంది లేదా ఓ గొలుసు చేయించుకుంది. అదిచూడ‌గానే మ‌నం ఎలారియాక్ట్ అయ్యాము నిజాయితీగా నిజం తెల్సుకోండి.

1. అబ్బో ఈ మొహానికింత మంచిచీరెందుకు అన్న ఏవ‌గింపు క‌ల్గిందా ?

2. అయ్యో నాక‌న్నా మంచిచీర‌కొనుక్కుంటే అన్న బాధ క‌ల్లిందా ?

3. నేను కూడా ఇలాంటి చీర‌కొనుక్కుంటే బాగుండు న‌న్న ఆశ‌కల్గిందా ?

4. ఈ చీర ఏదొంగ‌లో ఎత్తుకుపోవాలి. ఎలాగైనా పాడై పోవాలి అన్పించిందా ?

5. పోనీ పాపం ఇన్నాళ్ళ‌కైనా ఒ మంచి చీర కొనుక్కుంది అన్న సంతోషంక‌ల్గిందా ?

ఈ అయిదు విష‌యాలూ క్షుణ్ణంగా అంత‌రంగాన్ని అడిగి తెలుసుకోండి అంత‌రంగం అంత ఆషామాషీగా అడిగిందానికి ఠ‌క్కున స‌మాధానం చెప్పెయ్య‌దు. ఎన్నో మెలిక‌లేస్తుందా డొంక‌తిరుగుడు స‌మాధానాల‌తో మ‌న‌ల్ని త‌బ్బిబ్బు చేస్తుంది. అయినా స‌రైన స‌మాధానం వ‌చ్చేవ‌ర‌కూ ప‌ట్టువ‌ద‌ల‌ద్దు.

అన్ని ఆలోచ‌న‌ల్లోకి మొద‌టిదీ నాలుగోదీ చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన ఆలోచ‌న‌లు రెండోది రెండోర‌క‌మే. మూడోది స‌హ‌జ‌మూ స‌హ్య‌మూ అయిన‌ది. అయిదోది ఉత్త‌మ సంస్కారాన్ని తెలియ జేసేదీ అని అనుకోవ‌చ్చు. ఒక‌టీ మూడూ ఆలోచ‌న‌లు మీకు వచ్చాయ‌ని మీరు నిర్ణ‌యించుకున్నార‌నుకోండి. అయినా మీరు బాధ ప‌డాల్సిందే లేదు. ఇలాంటి ఆలోచ‌న రావ‌డం త‌ప్పు స‌ర్వేజ‌నాః సుఖినోభ‌వంతు అని అంద‌రిశుభాన్నీ కోరాలి ఇలాంటి ఊహ‌చేసావంటే డొక్క చీరేస్తానని మ‌న‌స్సుని మంద‌లించండి. ఒక్క సారిగా మ‌న‌సుదార్లోకి రాదు. జీడిల‌పాకంలాగా వెన‌క్కీ ముందుకీ సాగ‌దీస్తూనే వుంటుంది, ప‌దేప‌దే చెప్పుదెబ్బ‌లు పెట్టాల్సిందే. లాలించీ బెదిరించీ దార్లోకి తెచ్చుకోవాలి ! అస‌లు ప్ర‌య‌త్న‌మంటూ మొద‌లు పెడితే ఎప్ప‌టికైనా విజ‌య‌లక్ష్మి వ‌రించ‌క‌మాన‌దు. క‌నుక ఫ‌లితంకోసం తొంద‌ర వ‌ద్దు శాంతంగా స‌హ‌నంగా మ‌స‌లుకోవాలి.

ఇక రెండో బ‌ల‌వంత‌మైన శ‌త్రువు కోపం. ఇది పుట్టుక‌తోనే వ‌స్తుంది. కామం కంటే జ‌యించ‌శ‌క్యం కానిది కోప‌మే. ఇంకా మాట‌లురాని ప‌సివాడికైనా ఏదైనా ఆట బొమ్మ ఇచ్చి లాక్కుంటే ఎంత‌కోపం వ‌స్తుందో ఏం చెయ్య‌లేక గుక్క‌ప‌ట్టి ఏడుస్తాడు. ఇలా ప‌సిత‌నం నుంచి ముస‌లిత‌నం దాకా ప‌ట్టిపాసార్చేది కోపం. కోపం నీ పాళ్ళ‌లో వుందో తెలుసు కోవాలంటే.

1. చీటికీ మాటికీ కార‌ణం ఉన్నాలేక పోయినా కోపంవ‌స్తుందా ?

2. వ‌స్తే తొంద‌ర‌గా త‌గ్గుతుందా ! ఎక్కువ కాలం ప‌డుతుందా ?

3. ఎంతో కార‌ణం వుంటేగానీ కోపం రాదా ?

4. కార‌ణం ఉన్నాగానీ కోపించ‌క శాంతంగానే వుంటారా ? ఇలాంటి ప్ర‌శ్న‌లు వేసుకోవాలి.

చీటికి మాటికీ కోసం వ‌చ్చేట‌ట్ల‌యితే త‌ప్ప‌ని స‌రిగా ఆరోగ్యంపాడ‌యి తీరుతుంది కార‌ణంవున్న‌పుడు కోపంరావ‌డం స‌హ‌జ‌మే కాని బ‌హిర్గ‌తం చేసేట‌ప్పుడు ముమ్మారు ఆలోచించాలి. కార‌ణంవున్నా కోపంరాని వాళ్ళ‌కి శిర‌సాన‌మ‌స్క‌రించాలి. కోపాన్ని త‌గ్గించుకోవాలంటే శాంతి మంత్రాన్ని ప‌ఠించాలి. కోపం వ‌చ్చే సంఘ‌ట‌న‌ల నుండి దూరంగాపోవాలి. లేదా వేరే పనిలో నిమ‌గ్నం కావాలి, కోప‌కార‌ణాన్ని గురించి కూలంక‌షంగా యోచించాలి.

ఇహ జీవితాన్ని దుఃఖ మ‌యంచేసేది శంక ! నిత్య‌శంక ! ప్ర‌తీదానికి ఆలోచ‌నే, అనుమాన‌మే బ‌య‌టికి వెడితే ఇంటికి స‌జావుగా వ‌స్తామారామా అన్న‌శంక‌. భ‌ర్త ఏపాడు ప‌న్లో చెయ్య‌కుండా ఇంటికి వ‌స్తాడో రాడో. మంచిగా వచ్చినా అనుమాన‌మే. స్కూలుకెళ్ళిన పాప ఏ ఏక్సిడెంట్‌లోనో చిక్కుకుందేమో నన్న శంక‌, ఇలా శంక‌ల‌ను శంకించుకుంటూ పోతారు తీరిక లేకుండా.

ఇంత‌కీ చెప్పొచ్చేదేమిటంటే మాన‌పులైన‌వారికి చెడ్డ‌గుణాలుండ‌టం స‌హ‌జ‌మే. ఆ చెడ్డ‌గుణాలేమిటో మ‌న‌సుని త‌వ్వితెలుసుకునివాటిని రూపుమాప‌డానికి చేసే ప్ర‌య‌త్న‌మే సంస్కారం. ఒక‌ప్పుడు మంచిగా లేనిదాన్ని ప్ర‌య‌త్నంచేసి మంచిగా మార్చ‌డ‌మే సంస్కార‌మంటే మీ అంత‌శ్శ‌త్రువుల‌ను హ‌త‌మార్చ‌డానికి ఇప్పుడే ప్ర‌య‌త్నం మొద‌లు పెడ‌తార‌ని ఆశిస్తూ.