కలం స్నేహాలు
గొబ్బిళ్లుపెట్టడమూ వేరుసెనగ పప్పులు నమలడమూ స్కూలెగ్గొట్టి తమ్ముడితో గోళీలాడటమూ నా హాబీలు అని రసిందో కార్డుమీద మా చిట్టి. వీటిని హాబీలనరే చిట్టీ అని మా తమ్ముడు ఏడ్పిస్తే బిక్కమోహం పెట్టింది. కలం స్నేహం చెయ్యాలంటే మీ హబీలేమిటో తెలియజెయ్యడన్నారుట ఏదో ఓ పత్రికవారు. తనక తోచిన మూడుముక్కలూ వ్రాసింది. ఈ స్నేహాలు స్నేహాలుగానే ఉండక పోవచ్చు లేనిపోని సమస్యలు అందరికీ కాకపోయినా కొందరికైనా తెచ్చిపెట్టవచ్చు. కొందరికే సుమండీ !
ఎదురింట్లోనుండి గోలగోలగా ఏడ్పులు విన్పిస్తున్నాయి. పట్నాల్లో ఎవరి సంగతి వారికేగాని ఇంకోరి సంగతి పట్టించుకోరు. అయినప్పటికి ఏం ఆ పదవచ్చిందో ఏమిటో పాపం అని వెంటనే తలుపుకొట్టకుండా ఉండలేకపోయినాను, తలుపుకొట్టగానే శబ్ధమంతా మంత్రం వేసినట్లు మాయం అయిపోయింది. ఇంటాయన నాముందు నుంచే రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. ఏం పనిమీద వచ్చారన్నట్లుగా ఇబ్బందిగా చూసిందాయిల్లాలు ఎదోనసిగేసి వచ్చేసాను.
తరువాత రెండురోజులకు వారి చిన్న అమ్మాయి అసలు సంగతి చెప్పేసింది. ఆంటీ ఆనాడు మీరు రాకపోతే మా అక్కను మానాన్న చంపేసేవాడేనని వాళ్ళపెద్ద అమ్మాయి బి.ఎస్.సి. చదువుతోంది. ఎవడో పనీపాటాలేనివాడు ఆ అమ్మాయికి ప్రేమలేఖ వ్రాశాడుట. అదీ తండ్రి ఆఫీసుకి ! అసలే ఆ తండ్రి కర్కోటకుడు, పిల్లల్ని గడపదాటనీడు. కిటికీలోంచి వీధిలోకి తొంగిచూడనీడు. ఖర్మంజాలక ఎక్కడికేనా తీసికెడితే తల అటూ ఇటూ తిప్పిచూడకుండా దించిన తలఎత్తకుండా నడవాల్సిందే. మెడ అటూ ఇటూ బెసిగిందో ఇక ఆనాడు వాళ్ళకి శివరాత్రే ! ఇన్ని రూల్స్ అలాంటి తండ్రి కూతురికి ప్రేమలేఖవస్తే ఆ తండ్రి ఎలా ఇరటేట్ అయిపోతాడో మీరే ఊహించుకోండి. అతని పెపకం (ఆమె పెపకం అనను) లో ఆ పిల్లలు ఉత్త అమాయకుల్లా నోరూవాయీలేని శుద్ధ మొద్ధావతారాల్లాగా పెరుగుతున్నారు. ఇంతకూ ఎవరో ప్రేమ లేక రాస్తే పాపం మీ అక్కని కొట్టడం ఎందుకు మీనాన్న అని ప్రశ్నించాను. మా అక్కే ముందు వాడికి వ్రాసి ఉంటుందంటాడు. లేకపోతే ఆఫీస్ ఎడ్రస్ ఎలా తెలుస్తుంది అంటాడు. అయ్యోరామ ! నిజంగా అలారాసేదయితే తండ్రి ఎడ్రస్ యిచ్చి తన్నులు తింటుందా అన్న ఆలోచన ఈ పెద్దమనిషికి రాలేదేమి ? అక్కతానురాయలేదు మొర్రో అన్నా విన్పించుకోడు అంది, నాకోసంగతి గుర్తుకొచ్చింది.
ఆ మధ్య అంటే నాల్గుయిదు సంవత్సరాల క్రితం కేవలం స్కూలు పిల్లలకోసమే నడిపే ఒక పత్రికకి మా పెద్దపాప ఒక వ్యాసం వ్రాసింది. అప్పుడు దానికి పన్నెండేయేళ్ళు. ఆ పత్రికవారొక నిబంధన పెట్టారు. వ్యాసంరాసేదరి పూర్తిపేరూ, చదువుతున్న స్కూలుపేరూ వ్రాయాలి. ఎడ్రస్ ఇంటిదైనా స్కూల్‌దైనా ఇయ్యవచ్చుగాని స్కూల్ హెడ్‌మాస్టరునుండి హామీపత్రం తీసుకుని జతచెయ్యాలి. అని ఆ తంటాన్నీ పడింది. వ్యాసానికి బహుమతికూడావచ్చింద. స్కూలువాళ్ళు పొగిడారు. మరో వ్యాసం వ్రాసింది. మొదటిసారి స్కూల్ ఎడ్రస్ యిచ్చానుగదా ఈ సారి ఇంటి ఎడ్రస్ ఇస్తానంది. సరేనన్నాము మేము కన్పించిన వారికల్లా మా అమ్మాయి బహుమతి సంగతి చెప్పుకుంటూ మురిసిపోతున్నాం. అసలు మురిపెం పదిరోజులుకూడా పట్టలేదు. వ్యాసం బాగుందంటూ ఉత్తరాలుకూడా రావడం మొదలుపెట్టినాయి. మాకు మరీ ఆనందం అయ్యింది నీకు దేశంలో ఫాన్స్ కూడా ఏర్పడ్డా రని హస్యముచేసాము.
ఇంతలో ఇంకో బెడద వచ్చిపడింది. నిన్ను ప్రేమిస్తున్నాం నిన్ను చూడకపోతే బ్రతకలేం అని ప్రేమలేఖలు వచ్చిపడసాగినాయి. ఆ రాసేది కూడా స్కూలుపిల్లలే, పధ్నాలుగేళ్ళలోపువాళ్ళే. మా పాప రెండు ఎడ్రసు లివ్వడంవల్ల ఇంటికీ స్కూలుకీ కూడా ఇలాటి లెటర్స్ వచ్చినాయి. స్కూల్‌లోని మగపిల్లల చేతుల్లో ఈ లేఖలుపడడం, వారు దానిని నుంచో నీకుండా కూచోనీకుండా ఏడ్పించడం వారుకూడా లెటర్స్ వ్రాయడం చేయసాగారు. మాకు తల బొప్పికట్టింది. ఏం చెయ్యాలో తోచకుండా పోయింది.
ఇంకోఘటికుడు ఇంకా కాస్త ముందుకు పోయి మా అమ్మాయే అతనికి లెటర్ వ్రాసినట్లూ ఏదో స్టేషన్లో కల్సుకున్నట్లూ మళ్ళీ ఎప్పుడెప్పుడు కలుస్తారూ అని తహతహలాడిపోతున్నట్లు వ్రాశాడు. ఇదే మా ఎదురింటాయన అయితే పిల్లని చీల్చి చెండాడేవాడే. కాని మా అమ్మాయి సంగతి మాకు బాగా తెలుసు గనక ఆ ఉత్తరాలని కేర్ చెయ్యకుండా అవతలపారేయడమేగాక మా అమ్మాయి బెంబేలెత్తిపోకుండా దానికి ధైర్యం చెప్పి ప్రపంచంలో ఇటువంటి పరిస్థితులేర్పడినప్పుడెల్లా నిబ్బరంగా ప్రవర్తించాలో నూరిపోసి ఆత్మస్థయిర్యాన్ని పెంపొందించుకోగలిగేందుకు తోడ్పడగలిగాము. మూడేళ్ళయిన తరువాత కూడా ఆ ప్రబుధ్ధుడు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. అమ్మాయి కాలేజీ చదువుకొచ్చింది. అతను స్కూలు ఆవరణము దాటలేకుండా ఉన్నాడు.
కలంస్నేహాం పేరుతో తెలిసీ తెలియని వయస్సులో ఏదో నవలలోని ప్రేమ డైలాగులో, సినిమాలోని ఆదర్శాలో వల్లించుకుంటూ అవే లేఖలుగా, వ్రాస్తూ అదే ప్రేమ అనుకొని ప్రేమించే హక్కు మాకుందని పెద్దలను ఎదిరిస్తూ ముందడుగు వేస్తున్నామనుకుంటూ విప్లవం తెస్తున్నామనుకుంటూ బోల్తాకొడతారు. పిల్లలు కేవలం పధ్నాలుగు పద్దెనిమిదేళ్ళ వాళ్ళే మరీ అమాయకంగా మోసపోతారు. ఈ వయసులో పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించుకొంటూ వారి ప్రవర్తన ఎలా వుంది ? ముఖకవళికలు ఎలావున్నాయి. ప్రపంచంలో ఉంటున్నారా ? లేక ఊహాగానాల్లో తేలిపోతూ పరధ్యానంగా ఉంటున్నారా ? మొదలైన విషయాలను చూసుకుంటూ వుంటే ఆ తరువాత వారు ఎన్ని ఢక్కాముక్కాలైనా తిని నిబాయించుకోగల్గుతారు. అవసరమైతే లాలించో బెదిరించో మామూలు స్థితిలోకి తేవాలి. వారి ఖర్మ వారిదే నని ఊరుకుంటే లాభంలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నంచేసి వారొక వేళ దారితప్పుతున్నారన్న అనుమానంవస్తే దారికి తీసుకురావాలి !
ఇంతకూ మా ఎదురింటి పాపచేసిన పాపమేమిటో చెప్పనేలేదు కదూ. పాపంఆ అమ్మాయి మీరే ప్రధానమంత్రి అయితే ఏం చేస్తారు అన్న అంశం మీద మూడు ముక్కలు వ్రాసి ఫోటో జతచేసి ఎడ్రస్‌తో సహా ఏదో పత్రికకు పంపిందట ! అదండీ సంగతి !
రచయిత్రిగా పేరుతెచ్చుకోవాలని ఉబలాటపడిన మా అమ్మాయి ఒక్క వ్యాసంతో ఆస్త్రసన్యాసం చెయ్యలేదు గాని అమ్ములను పొదిలో దాచేసుకుంది. మళ్ళీ కొంతవయస్సు వస్తేగాని దానంతట అది తేరుకోదు. |