వయో వృద్ధులు
వృద్ధుల బుద్ధులు సంచలించవే అన్నాడొక కవి. వృద్ధాప్యం వచ్చేసరికి శరీరం చెప్పిన మాటవినదు. కాలు నడవనంటుంది. చెయ్యి కదలనంటుంది. ఏ చిన్న పని చెయ్యాలన్నా బద్ధకంగా అన్పిస్తుంది. బుద్ధి వక్రంగా ఉంటుంది. మనసు పరిపరి విధాల పోతుంది. ప్రతీదానికో చిరచిర ఏదో తపన, అందరూ తనన చిన్న చూపు చూస్తున్నారో, తను నెవ్వరూ పట్టించుకోవడంలేదనో, ప్రతీ విషయం తనకు చెప్పడం లేదనో బాధకల్గి ఒకరకమైన కాంప్లెక్సుకు లోనయిపోతారు. ఇక నోరుమాత్రం అన్ని అవయవాల్లోకి చాలా ఏక్టిక్‌గా ఉంటుంది. దానికి విసుగూ విరామం ఉండదు. జీర్ణకోశం ఎదురుతిర్గినా లెక్కచేయదు. ఏదో ఒకటి ఎప్పుడూ నముల్తూ ఉండాల్సిందే.
ఇక వయసు ఉడుగుతూ ఉండగా వచ్చే వ్యాధులు ఎన్నో. శక్తి క్షీణించిన ఈ వృద్ధులకు సేవలు చేసేందుకు కన్న కొడుకులే ఇష్టపడరు. ఇక కోడళ్ళ సంగతి ఏం చెప్పాలి ? దగ్గరకు వస్తే ముసలి వాసనట ? వారి అవసరాలను తీర్చి ఆదరిద్దామనే భావం వచ్చినా దానిని అణచివేసుకొంటరు.
అందరూ ఇలా వృద్ధులను నిర్లక్ష్యం చేస్తారని కాదు. కొందరు ఉత్తములూ, సంస్కారవంతులూ వృద్ధులను తమకు పెద్ద దిక్కుగా గౌరవాభిమానాలతో చూసుకుంటూ, సలహాలను తీసికొంటూ, సంప్రదింపులన చేస్తూ నెత్తిన పెట్టుకొంటారు. అనుభవాలతో తలలు పండిన పెద్దల సలహాలు చాలా వరకూ ఉచితంగానే ఉంటాయి. కొంతమంది వృద్ధాప్యం వచ్చే సరికి ఛాందసులవుతారు. ఎంత బాగా చూస్తున్నా ఏదో లోటు వారకి కన్పిస్తూనే ఉంటుంది. ఏదో అసంతృప్తి ! ఇంటికి వచ్చినవారితో కొడుకులమీద, కోడళ్ళమీదా ఏదో ఒకటి చెప్పందే వారికి తోచదు. చెప్పిందే చెప్పి మాట్లాడిందే మాట్లాడి వచ్చిన వాళ్ళని కదలనీకుండా నిలబెట్టి బోరు కొట్టిస్తారు. ఇవతలివాళ్ళు వింటున్నారాలేదా అన్నధ్యాస కూడా వీరికి ఉండదు.
చూడవచ్చిన వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా ఉంటుంది. ఇటు వీళ్ళు, చెప్పె మాటలు వినకా తప్పదు. వింటుంటే కొడుకులూ కోడళ్ళు ఏమనుకుంటారోనన్న బాధా తప్పదు.
ఇంతకీ అసలు సంగతి ఇంకోటి ఉంది. ఇటీవల కాలమాన పరిస్థితుల ప్రకారం వృద్ధులను ప్రత్యేక గృహాలను నెలకొల్పడం ఎంతో అవసరం. తల్లులు ఉద్యోగాలనకు వెళ్తే పసివారిని చూసేందుకు క్రెషెలు ఎలా అవసరమో హోమ్ ఫర్ ది ఓల్డ్ కూడా అంతె కాదు అంతకంటే ఎక్కువే అవసరం చిన్న పిల్లలను ముద్దు కోసం ఏ పక్కింటివాళ్ళో చూస్తారు. ముసలివాళ్ళని చూస్తే చాలామందికి వెరపె . పూర్వంలాగా ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. భార్యా భర్త ఇద్దరూ ఉద్యోగాలకి పోవాలి. ఇక ఏ జబ్బు చేసినా, లేవలేకపోయినా మంచినీళ్ళు అలదించేవాళ్ళు కూడా ఉండదు.
ఓ బాలమ్మ ఓ మనోహరమ్మ ఓ సుబ్బమ్మ ఇలా ఎందరో జన్మనెత్తినందుకు తమని తామె తిట్టుకుంటూ తమ ప్రాణాలను తామే తీసికొనే తెగింపు లేక ఎప్పుడు తీసుకుపోతావు భగవంతుడా అని చివరి రోజుకోసం ఎదురుతెన్నులు చూస్తూ పరమ దయనీయంగా బరువుగా కాలాన్ని గడుపుతున్నారు. కన్నబిడ్డలున్న వాళ్ళ స్థితి నా అన్నవాళ్లు దిక్కులేని వారి పరిస్థితీ ఒక్కొక్కప్పుడు ఒక్కలాగే ఉంటొంది.
సంఘసేవ చేయాలనే తపన ఉన్నవారు కొందరు జతగూడి వృద్ధుల గృహాలను నడిపి వృద్ధుల కనీసావసరాలను తీర్చగల్గితే ఎంత బాగుంటుంది ? చాలామంది సంఘసేవ అంటే చీర నలగకుండా కుర్చీలో కూర్చుని చేసేదయితేనే ఇష్టపడతారు వృద్ధుల గృహాలను నడిపేందుకు కమర్షియల్‌గా లాభాలనార్జించే ప్లాన్‌తో కొంతమంది ముందుకు వస్తున్నారు. ప్రభుత్వాలు కోటికొక్కటిగా నడుపుతూనే ఉంది. కొన్ని మతసంస్థలు కూడా అక్కడోటి అక్కడోటి హోమ్ ఫర్ ది ఏజ్‌డ్ నడుపుతూనే ఉన్నాయి. కానీ ఇవి అందరికీ అందుబాటులో లేవు. ఇందులో ఎన్నో రాజకీయ మత ప్రాబాల్యాలు చిక్కుకుని ఉన్నాయి. ఉదాహరణి బ్రాహ్మణవృద్ధులు క్రైస్తవ మిషనరీలు నడిపే గృహాలలో నివసించలేరు. వారి చాదస్తాలన వారు వదులుకోలేరు. అందరికీ వీలుగా ఉండేలా చక్కని ప్రాతిపదిక వేసుకొని కనీసం తాలూకాకి ఒకటైనా వృద్ధులకు గృహాలను నెలకొల్పడం ఎంతో ప్రయోజనకారిగి వుంటుంది. వృద్ధుల వడలి ఎండిన మ్రోడు జీవితాలకో చిరుజల్లులాగా ఈ గృహాలు తృప్తిని కల్గిస్తాయి. ఈనాటి వృద్ధులు దేశానికి దేశ ప్రగతికీ తమ రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించిన ఒకనాటి ప్రముఖులే. తమ నటనతో రసిక జనాన్ని ఉర్రూతలూగించి నటులూ, కళాకారులూ, ప్రాణాలనూ ఆస్తులనూ, చదువునూ దేశరక్షణకై వినియోగించిన మిలటరీ ఉద్యోగులు స్వాతంత్ర యోధులూ ఇలా అన్ని రంగాల వారూ లోతైన కనులతో ముడతలు పడిన చర్మాలతో గజ గజ వణుకుతూ మనకు గోచరిస్తారు. వారికి యువతరం చేయూత నియ్యగలిగేది ఇలా వృద్ధులకు గృహాలు నిర్మించి అన్ని సదుపాయాలనూ కల్గించి మాత్రమే తరాల అంతరాలను తట్టుకో లేక అల్లాడి పొయ్యే ముసలివారికి తమ వయసు వారితో కాలం గడిపే అవకాశాన్ని ఈ గృహాలే ఇయ్యగలవు. ఉడతా భక్తిగా ఇలాటి గృహనిర్మాణాలకి మనం కూడా ఎలా తోడ్పడగలమో ఆలోచిద్దాం.
|