ముందుమాట‌

యోగ‌శాస్త్రంలో నాద‌బిందు క‌ళ‌ల‌కు అత్యుత్త‌మైన స్థాన‌మున్న‌ది. సాధ‌కుడు బ‌హ్మ‌దండిని విపంచిగాచేసి దివ్య‌నాదాన్ని అనుభూత‌మొన‌ర్చుకొన‌గల్గుతారు. చిణిచిణినాదం, ఘంటారావం, శంఖానాదం, వీణానాదం, మేఘ‌నాదం మొద‌లైన ద‌శ విధ నాదాల‌ను విన‌గ‌ల్గుతాడు.


ప్ర‌ణ‌వ‌నాద‌మై ఓంకార‌ము స‌ర్వ‌దృష్టికి మూలాధార‌ము, హృద‌య‌ము, చిత్త‌ము, బుద్ధుల యొక్క సంయోగ‌మువ‌ల‌న తెలియ‌న‌ది బిందువు.


గుణ‌ర‌హితాకాశ‌, ప‌రాకాశ‌, మ‌హాకాశ‌, తత్త్వాకాశ‌, సూర్యాకాశ‌మ‌నే ఆకాశ‌పంచ‌కంలో, కోటి సూర్య‌ప్ర‌భ‌ల‌తో విర‌జిల్లేవి చిత్క‌ళ‌లు.


ఈ విశాల విశ్వ‌సృష్టి, వాద‌ములో పుట్టి నాదుమ‌లోనే ల‌య‌మ‌వుతున్న‌ది.అట్లే. సార‌స్వ‌త సాధ‌న చేసిన శ్రీ అడివి బాపిరాజుగారి సాహిత్య‌మూ, క‌ళ‌లూ, శ‌శిక‌ళారాధ‌న‌తో ప్రారంభ‌ము, శ‌శిక‌ళారాధ‌న‌లోనే లీన‌మ‌వుతున్న‌వి. నాద‌బిందు శ‌శిక‌ళ అనే పేరుగ‌ల ఈ జ‌యంత్యుత్స‌వ ప్ర‌త్యేక సంచిక‌తో స్మృతంజ‌లి ఘ‌టించ‌డం ఉచితంగా ఉంటుంద‌ని మా భావ‌న‌. అనాహ‌తంలో ఉన్న షోడ‌శ‌ద‌శ ప‌ద్మంనుండి జ‌నించిన‌ది నాదం. శ్రీ బాపిరాజుగారి చిత్రం హృద‌యాకారంలో చిత్రించ‌బ‌డింది.


ఈ జ‌యంత్యుత్స‌వ ప‌త్రిక‌కు నామ‌క‌ర‌ణంచేసి ముఖ‌ప‌త్రం రూపొందించిన డాక్ట‌ర్ దిట్ట‌క‌వి శ్యామలాదేవి ప్ర‌జ్ఞ‌, ఉప‌జ్ఞ బ‌హుదొడ్డ‌వి. మిక్కిలి మెచ్చ‌తగ్గ‌వి. ఈ జ‌యంత్యుత్సావాలు జ‌రుపుకోడంలో మా ముఖ్యోద్ధేశాలు, శ్రీ అడ‌వి బాపిరాజును స్మ‌రిస్తూ ఆయ‌న యావ‌త్ సృష్టినీ సింహావ‌లోక‌నం చేయుట‌, ఆయ‌న సృష్టిలో, విస్తృత‌మైన ప‌రిశోధ‌న‌కు త‌గిన తావులు సూచిస్తూ, ఆయ‌న సాహిత్య‌క‌ళా ర‌చ‌న‌ల‌కు దీటైన ర‌చ‌న‌లు చేయుట‌కు ప్రోత్స‌హించుట ఇందుకు ఉప‌యుక్తంగా ఉండ‌గ‌ల‌, అడివి బాపిరాజు సృష్టిని, సాధ్య‌మైనంత వివ‌రంగా, ఈ పత్రిక‌లో పొందుప‌ర్చాము.

 

ఈ జయంత్యుత్స‌వాల వెనుక‌గ‌ల శ‌క్తీ, యుక్తీ, ఒక అజ్ఞాత వ్య‌క్తివి. త‌మ‌ను జ్ఞాతం చేయ‌రాద‌నే అజ్ఞ‌. కోర్టునుండి జారీ అయే మాండేట‌రీ ఇంజక్ష‌న్ ఆర్డ‌రుకంటే గట్టిదీ, అనుల్లంఘ‌నీయ‌మైన‌ట్టిదిన్నీ ఒక‌టి వుంది. ఈ అజ్ఞాత పురుషునికి మా జోహార్లు.


నాద‌బిందు శ‌శిక‌ళ చ‌క్క‌గా త‌యారించ‌డానికి తోడ్ప‌డ్డ‌వారెంద‌రో....అంద‌రికీ మా కృత‌జ్ఞ‌త‌లు.


బుద్ధ‌వ‌ర‌పు కామ‌రాజు
సంపాద‌కుడు.