93
 

క‌ళావ‌తీదేవి ర‌ఘునాథులు మౌన‌ముగా భుజించ‌డ‌ము చూసి. స్వామీ ! మీరు మా వువ్వురితోను మునుప‌టిలాగ మ‌స‌ల‌డం లేదెందుచేత ? మేము చేసిన నేర‌మేమైనా ఉన్న‌దా, ప్ర‌భూ ! ఈ తీయ‌ని శిచారిణుల‌ను మ‌రి రెంటిని వ‌డ్డించుకొన రాదా ! అన్న‌ది.

దేవీ ! మీరు ముగ్గురు నా ప్రాణ‌తుల్య‌లుకారా ! మ‌న‌ము నలువుర‌మూ క‌లిసి భుజిస్తూ ఉంటే ప‌ర‌మానందంగా ఉన్న‌ది. రాజ్య‌వ్య‌వ‌హారాలు పాల‌కుని ఎప్పుడూ చికాకు ప‌రుస్తూనే ఉంటాయి. స‌రే ! దానికేమిగాని ల‌క్ష్మీకుమారికి మాట‌లు ఏమైనా నేర్పావా ? ఆమె నోరువిప్పి ఒక్క ముత్య‌మైనా రాల్చేనా చేయి. దేవీ.

ల‌క్ష్మీకుమారి సిగ్గుతో త‌ల‌వంచుకొన్న‌ది. ప్ర‌భూ ! మీరు జింజి స‌మీపార‌ణ్యాల‌కు వెడుతూన్నార‌ట ? అచ‌టి కోయలు న‌మ్మ‌దగ్గ‌వారు కాదు. భ‌య‌ము చేత ఆమె కంఠ‌ము కంపించిన‌ది.

చిన్న‌రాణీవారికి భ‌ర్త‌పైనున్న అనురాగానికీ, క్షేమ‌వాంఛ‌కూ మ‌హ‌దానందంగా ఉన్న‌ది. కాని, దేవీ ! ఒక్క‌మాట‌. వారు నిజంగా కిరాతుకులే. కిరాత‌క కృత్యాలు చేయడం వారి నైజం కానీ, బంధుమిత్రుల‌ను స‌హితం వంచించేందుకు స‌ర్వ‌యుత్నాల‌నూ చేసే మ‌న దుర్గాధిన‌ప‌తుల‌క‌న్న‌, పాల‌కుల క‌న్న వారు మిక్కిలి స‌హృద‌యులు. మైత్రి చేసినారో ప్రాణాల‌నైనా అర్పించ‌డానికి వెనుదీయ‌రు. క‌క్ష వ‌హిస్తారో ప‌చ్చి ర‌క్తం జుర్రుడానికి వెనుకాడ‌రు.

ల‌క్ష్మీదేవి మోము విన్న‌బోయిన‌ది. ర‌ఘునాథుని ఆ మాట‌లు త‌న తండ్రి కృష్ణ‌ప్ప చేస్తూ ఉన్నాడు. ఈ ప్ర‌భువు త‌న తండ్రికి ప్రాణ‌దాత త‌న కుమార్తెకు ప్రాణ‌ప‌తి. అయినప్ప‌టికిన్నీ త‌న తండ్రి మధుర పాల‌కునితో క‌లిసి కుట్ర‌లు ప‌న్నుతూ ఉన్నాడు. ఇట్టివారికి సౌశీల్యం గ‌ర‌వ‌డానికి వైకుంఠేశునికైనా శక్యంకాదు. ఆమె క‌ల‌వ‌ర‌ప‌డిన‌ది. స్వ‌చ్ఛ‌మైన న‌వ్వుల‌తో పసిపాప‌వ‌లె కేరింత‌ల‌తో గ‌డ‌ప‌వ‌ల‌సిన కాల‌ము బ‌రువుగా జ‌రుగుతూ ఉన్న‌ది.

రామ‌భ‌ద్ర‌కు హాస్య‌ర‌స‌మ‌న్న ప్రీతి. గంభీర ప్ర‌సంగాలామెకు హిత‌వు కావు. స‌మ‌యాన్ని తేలిక‌ప‌ర్చి ర‌స‌మ‌యం చేయ‌ద‌ల‌చి,

ప్ర‌భూ ! అక్క‌గారు చూశారా తమ‌కు చెప్ప‌కుండా ఎంత‌ప‌ని చేస్తున్నారో ! అన్న‌ది, చిరున‌వ్వుతో.

ర‌ఘు : దేవీ ! అదేమిటో నాకు చెప్ప‌వూ, వినాల‌ని కుతూహ‌లంగా ఉన్న‌ది.

రామ‌భ‌ద్ర ర‌ఘునాథుని చేయిప‌ట్టుకొని ఒక పంజ‌ర‌ము క‌డ‌కు కొనిబోయిన‌ది.

రామ‌భ‌ద్ర : ఇదీ ! ఈ శుక‌ము ! దీని వాణి ఎంత మ‌ధురంగా ఉంటుందో ! దీనిని అక్క‌గారికి చిదంబ‌రం నుండి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడు తెచ్చియిచ్చినాడు.

క‌ళావ‌తి చిరున‌వ్వుతో చూచిన‌ది.

రామ‌భ‌ద్ర : ప‌్ర‌భూ ! ఈ చిట్టి చిలుక మీనాక్షిదేవి భుజాన నిల‌చి ఆమె మ‌ధుర‌మైన ప‌లుకుల‌ను విన‌గ‌ల్గిన అదృష్ట‌శాలి ! నేడు మీ ముంజేతి మీద వాలాల‌ని ఉవ్విళ్ళూరుతున్న‌ట్లుగా చూస్తున్న‌ది. ఈ శుక‌వాణిని మీరు లాలించ‌రూ.

ఆమె అన్యాప‌దేశంగా శుక‌వాణ‌ఙ ప్ర‌స‌క్తి తెచ్చిన‌ద‌ని యువ‌ప్ర‌భువు గ్ర‌హించినాడు. ఆమె జ‌డ‌ప‌ట్టుకొని వెనుక‌కువంచి మోముపై మోము పెట్టి, దేవీ ! నీ ఆగ‌డ‌ము నాకు తెలియ‌దా ! నీ స్వ‌భావోక్తులు చాల తియ్య‌గా ఉన్నాయి. నీవు చెంగ‌ల్వ క‌ళాక‌వి శిష్య‌వు కావా ! ఏవీ ఆ మ‌ధురోక్తుల‌ను స్ర‌వించిన ఈ బింబాధ‌రాల‌లో మ‌రెంత మ‌ధువున్న‌దో ఆన‌నీ, అనినాడు, చిరున‌వ్వుతో.

13

మూర్తెప్ప నాయ‌ని వారి భ‌వ‌న ప్రాంగ‌ణాన‌కూ ఇరువురు సైనికులు అశ్వ‌ముల‌పై వ‌చ్చిరి. దౌవారికుడు వారి రాక‌లోని అంత‌ర్య‌మును ప్ర‌శించినాడు. ప్ర‌భువుల నుండి వార్త తెచ్చాము. మూర్తెప్ప సేనానిని క‌లియ‌వ‌లెను అని అన్నారు. దొర‌వారు విష్వ‌క్సేమ‌ని ఆల‌యాన‌కు వెళ్ళారు. మ‌ర‌ల ద‌య‌చేయండి, అని నిల‌య‌ముగ ప‌లికినాడు, దౌవారికుడు.

ఆ సైనికులు ప్ర‌ధ‌మ ప్రాంగ‌ణ‌మున‌కు ఆవ‌ల పూల‌బాల‌ల‌తో ఉసులాడుచున్న శుక‌వాణీ బాల‌ను చూచినారు. కాశ్శీరంపు కుసుమ‌లాలిత్య‌ము గొజ్జంగి కుసుమ‌శోభ మ‌ల్లికాల‌తాంత ప‌రీమ‌ళ‌ముల‌తో నాగ‌వ‌ల్లీ క‌న‌క‌ల‌త‌వ‌లె ప‌ర‌మ ర‌మ‌ణీయ‌ముగ‌ పూగుత్తుల‌ను చెక్కిళుల క‌ద్దుకొమ‌చు, సంపంగితావుల నాస్వాదించుచు, జాజుల‌ను ప‌లాలించుచు విహరించుచున్న‌దా త్రిలోక‌మోహన మూర్తి. ఆమె మోమున ర‌వంత వేద‌న‌, ఇసుమంత యోచ‌న‌. ఏదియో తెలియ‌ని ప‌రాకుచేత ప్ర‌తిదిన‌మువ‌లె పూల క‌న్నెల‌తో ఊసులాడుట‌లేదు, వాటితో పంత‌గించి ప‌క‌ప‌క చ‌లిపిగ న‌వ్వుట లేదు. ఆమె దృష్టి ఆలోచ‌న మ‌రెక్క‌డో చిక్కుకొని వెనుక‌కు మ‌ర‌లుట లేదు.