ర‌వీంద్ర‌నాథ్‌ఠాగోర్ వ‌లె బాపిరాజుగారు కూడ బ‌హుముఖ ప్ర‌జ్ఞాథురీణులై, విభిన్న సాహిత్య ప్ర‌క్రియ‌ల‌ను వెల‌యించారు. గేయాలు, న‌వ‌ల‌లు, నాటిక‌లు, వ్యాసాలు, క‌థ‌లు, క‌ధానిక‌లు అనేకములు ఆయ‌న హృద‌య సాగ‌ర‌మునుండి వుప్పొంగిన భావ‌త‌రంగాల‌లో వెలువ‌డ్డాయి. అనురాగం, ఆర్థ్ర‌త‌, ధ‌ర్మము, క‌రుణ‌, సంగీతం, చిత్ర‌లేఖ‌నం, శిల్పం మున్న‌గున‌వి ఆయ‌న ర‌చ‌నారామ‌ణీయ‌త‌కు ముఖ్యావ‌లంబ‌న‌ములు. క‌మ‌నీయ క‌ల్ప‌న‌ల‌తో, ర‌మ‌ణీయ‌త‌కు రూపురేఖ‌లు సంత‌రించుకున్న బాపిరాజుగారి మ‌ధుర గేయాలు ఈ క‌ళ‌, గోధూళి, తొల‌క‌రి, హార‌తి, అను సంపుటాలుగా వెలువ‌డి, ర‌స‌జ్ఞుల ర‌స‌నాంచ‌లాల‌పై నేటికీ స‌ర‌స సంగీత‌మ‌య నృత్యాలు స‌ల్పుతున్నాయి. న‌వ‌లార‌చ‌న‌లో ఆయ‌న సిద్ధ‌హ‌స్తుడు. హిమ‌బిందు, గోన‌గ‌న్నారెడ్డి, అడ‌విశాంతిశ్రీ‌, అంశుమ‌తి ( చారిత్ర‌క‌ములు), నారాయ‌ణ‌రావు, కోనంగి, తుఫాను, న‌రుడు, జాజిమ‌ల్లె (సాంఘిక‌ములు), మ‌ధుర‌వాణి, శిలార‌థం, కైలాసేశ్వ‌రుడు, (అసంపూర్ణ‌ములు) అను న‌వ‌ల‌లు ర‌చించారు. త‌న కాల్పనిక‌శ‌క్తిచే సుమారు 60 క‌థ‌ల‌ను ర‌చించి, తెలుగు క‌థా సాహిత్యాన్ని తేజోమ‌యంగావించారు. వారి కొన్ని క‌థ‌లు రాగ‌మాలిక‌, త‌రంగిణి, తూరికానృత్యం, మిధ్యాచ‌లం, భోగిర‌లోయ‌, అను సంపుటాలుగా వెలువ‌డినాయి. ఆంద్ర సామ్రాజ్ఞ, ఉషాసుంద‌రి, ఏరువాక‌, కృతి స‌మ‌ర్ప‌ణ‌, దుక్కెటెద్దు, గుడ్డిపిల్ల‌, న‌వోద‌యా, శైల‌బాల మొద‌ల‌గు నాటిక‌లు రేడియో ప్ర‌సారానికి అనువుగా ర‌చించి లోకానికి అందించారు. ఇన్ని క‌ళ‌ల అపూర్వ పాండిత్యాన్ని స‌ముపార్జించి అనంత‌శ‌క్తితో యిన్ని ర‌చ‌న‌లు చేసి ఆధునికాంధ్ర సాహిత్యాన్ని సుసంప‌న్నంగావించి ఆజాత శ‌త్రువై పాషాణ క‌ర్క‌శ హృద‌యాల‌ను కూడ క‌ర‌గింప‌చేసి ఆంధ్ర జ‌న హృద‌య స‌ద‌నాల‌పై త‌న అజ‌రామ‌ర కీర్తిప‌తాక‌ను ఎగుర‌వేసిన ర‌స‌రాజు అడివి బాపిరాజుగారు 22-9-1952 వ తేదీన మ‌ద్రాసులో దివంగ‌తులైనారు. ఆయ‌న పుట్టిన తేదీ 8-10-1895.

అడివి బాపిరాజుగారి వ్య‌క్తిగ‌త జీవితంలో ఆయ‌న నారాయ‌ణ‌రావు న‌వ‌ల పెన‌వేసుకొని, ఆయ‌న జీవిత సంఘ‌ట‌న‌లు చాలావ‌ర‌కు అందు ప్ర‌తిఫ‌లించాయి క‌నుక‌, ఆ న‌వ‌లా విశేషాల‌ను వేదిక‌గా ఆయ‌న జీవితాన్ని, ర‌చ‌న‌ల‌ను స్థాలేపులాక న్యాయంగా ప్ర‌స్తావించాను.

న‌వ‌లా విష‌యం :-

కాల్పానిక‌, రాజ‌కీయ‌, సాంఘికోద్య‌మాల ప్ర‌భావం వ‌ల్ల 20వ శ‌తాబ్దం ద్వితీయ ద‌శ‌నాటికి ఆంధ్ర సాహిత్యంలో నూత‌న ధోర‌ణులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా తెలుగు న‌వ‌లా సాహిత్యంపై గాంధీజీ సిద్ధాంతాల యొక్క‌, కాల్ప‌నిక‌, హైంద‌వోద్య‌మాల యొక్క ప్ర‌భావాలు అధికంగా ప‌డ్డాయి. 1920-40 సం.ల మ‌ధ్య‌కాలంలో ముఖ్య న‌వ‌లాకారులుగా ప్ర‌ఖ్యాతిగాంచిన ఉన్న‌వ ల‌క్ష్మీనారాయ‌ణ‌, విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌, అడ‌వి బాపిరాజు, నోరి న‌ర‌సింహ‌శాస్త్రి మొద‌ల‌గు ప్ర‌ముఖులు, మాల‌ప‌ల్లి, వేయిప‌డ‌గ‌లు, నారాయ‌ణ‌రావు నారాయ‌ణ‌భ‌ట్టు మున్న‌గు ఉత్త‌మ న‌వ‌ల‌లు ర‌చించి, తెలుగు న‌వ‌లా సాహిత్యానికి చ‌క్క‌ని మెరుగులు దిద్దారు. వీరిలో బాపిరాజు గారి వ్య‌క్తిత్వం క‌డువున్న‌త‌మైన‌ది, ర‌చ‌నామార్గ‌ము విశిష్ట‌మైన‌ది.

బాపిరాజుగారి వ్య‌క్తిత్వం - నారాయ‌ణ‌రావు న‌వ‌ల :-

సౌంద‌ర్యోపాస‌న‌, క‌ళామ‌య భావ‌న‌, లాలిత్యం, దాక్షిణ్యం, ప‌రోప‌కారం, సుంద‌ర స్త్రీ మూర్తిని ఆరాధించుట‌, అపార‌లౌకిక‌, ప‌రిజ్ఞానం, జాతీయ‌వాదం, ప‌రాకాష్ఠ ప్ర‌ణ‌యం, ఆధ్యాత్మ‌క‌దృష్టి మొద‌ల‌గున‌వి బాపిరాజుగారి విశిష్ట వ్య‌క్తిత్వ ముఖ్య ల‌క్ష‌ణాలు. బాపిరాజు గారి ర‌చ‌న‌కు స్త్రీ ఒక చైత‌న్య స్ర‌వంతి. ప్ర‌కృతి అంచుల వ‌ర‌కు ఆయ‌న మ‌న‌స్సు విహంగంలా విహ‌రిస్తుంది. (సాహిత్య ప‌రిచ‌యం - శ్రీ ఇంద్ర‌గంటి శ్రీ కాంత‌శ‌ర్మ‌. పుట‌.178) అని శ్రీ ఇంద్ర‌గంటి శ్రీ కాంత‌శ‌ర్మ‌గారు ఆయ‌న ర‌చ‌న‌లోని చైతన్యాన్ని ప్ర‌స్ఫుటంగావించారు.

నాటి న‌వ‌లాకారుల‌లో అడివి బాపిరాజు గారు అగ్ర‌గ‌ణ్యులు. అప్ప‌టి న‌వ‌ల‌లో అగ్ర‌గ‌ణ్య‌మైన‌ది ఆయ‌న నారాయ‌ణ‌రావు న‌వ‌ల‌. ఇది అత్యుత్త‌మ సాంఘిక న‌వ‌ల‌, క‌నుక‌నే ఆంధ్ర విశ్వ‌విద్యాల‌యం వారు 1934 సం.లో నిర్వ‌హించిన పోటీలో ఈ న‌వ‌ల విశ్వ‌నాధ వారి వేయిప‌డ‌ట‌ల తో పాటు బ‌హుమతి నందిన‌ది. ఆ పోటీయే ఈ న‌వ‌ల యొక్క ఆవిర్భావానికి ముఖ్య కారంణం. ఇందలి యిత‌వృత్తం నాల్గు భాగాల‌లో, 60 ఘ‌ట్టాలుగా ప్ర‌పంచించ‌బ‌డింది.

న‌వ‌లా వైశిష్ట్యం :-

ఈ న‌వ‌ల‌లో నాయ‌కుడు నారాయ‌ణ‌రావు. నాయిక శార‌దాదేవి. నాటి స‌మాజంలో పెద్ద‌రికం వ‌హించిన కొన్ని కుటుంబాల స‌మ్మేళ‌నాత్మ‌క గాథ‌యే ఇంద‌లి యిత‌వృత్తం. ఇందు నియోగి బ్రాహ్మ‌ణ కుటుంబ క‌థ ప్రాముఖ్య‌త వ‌హించిన‌ది. ఈ క‌థ అంత‌యు ఒక యితివృత్తం అనుకుంటె, నారాయ‌ణ‌రావు అనే కేంద్ర బిందువు చుట్టూ ఈ క‌థావృత్తాంత‌యు ప‌రిభ్రమించింది. ఇంద‌లి ర‌చ‌న ల‌లిత ప‌ద‌బంధాల‌తో స‌ర‌ళ గ్రాంధిక భాష‌లో న‌డుప‌బ‌డింది. కొన్ని స‌న్నివేవాల‌లో స‌మ‌యోచిత స‌మాస భూయిష్ట‌శైలి కాన వ‌స్తుంది. క‌థానాయ‌కుడైన నారాయ‌ణ‌రావు మాట‌ల‌లో, చేష్ట‌ల‌లో, భావాల‌లో గుణ‌గణాల‌లో, సంప్ర‌దాయ సంస్కారాల‌లో, విద్యా వివేకాత్మ‌క‌చ విన్యాసాల‌తో శ‌క్తియుక్తుల‌లో ప్ర‌ణ‌య‌రీతిలో, స‌మతామ‌మ‌త‌ల‌లో సౌంద‌ర్యాధ‌న‌లో బాపిరాజుగారి వ్య‌క్తిత్వం తొంగిచూస్తుంది, అని ఆల్టంగిని గూర్చి విమ‌ర్శ‌కుల‌న్న‌ట్లు బాపిరాజు గారి సంస్కార ముఖం నుండి ఊడి ప‌డ్డ మ‌నిషియే నారాయ‌ణ‌రావు. నాటి సాంఘిక ప‌రిస్థితులు, రాజ‌కీయోద్య‌మాలు, వివిధ క‌ళారీతులు విద్యావిధానం, ప్ర‌ణ‌య‌లీల‌లు మొద‌ల‌గున‌వి ఈ న‌వ‌ల‌లో చ‌క్క‌గా ప్ర‌తిబింబించాయి. ఈ న‌వ‌లాకారుని సామిజిక స్పృహ‌కు యివి ప్ర‌బ‌ల నిద‌ర్శ‌నాలు. ర‌చ‌యిత కార్య‌క‌ళా మ‌ర్మ‌జ్ఞుడు, అలంకార సాంప్ర‌దాయ పరిజ్ఞాన సంప‌న్నుడు అయి వున్న కార‌ణం చేత యింద‌లి నాయికా నాయ‌కుల సౌంద‌ర్యాతిశ‌యాల‌ను, గుణ‌గ‌ణాల‌ను స‌ల‌క్ష‌ణంగా, మ‌నోహ‌రంగా వ‌ర్ణించారు. బాపిరాజుగారు కాల్ప‌నిక క‌వితా ప్ర‌భావితులు. చిత్ర‌కళాకారులును అయివుండుట‌వ‌ల్ల‌, ప్ర్ర‌ణ‌య లీలా ప‌రాకాష్ఠ ద‌శ‌ల‌ను హృద‌య స్పంద‌నాత్మ‌క స‌న్నివేశాల‌ను, మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ల‌ను ప్రాకృతిక వాతావ‌ర‌ణ‌మును, పాత్ర‌ల రూపురేఖ‌ల‌ను ర‌స‌ర‌మ‌ణీయ‌ముగా చిత్రించ గ‌లిగారు.

ర‌స‌మ‌య కావ్య‌గౌర‌వం :-

ప్రాచీన క‌వుల‌లో పింగ‌ళి సూర‌న‌, త‌న అమేయ ప్ర‌తిభ‌తో త‌న క‌లాపూర్ణోద‌య ప్ర‌బంధాన్ని యితి వృత్త విచిత్ర విన్యాసాల‌తో న‌వ‌ల‌గా మ‌ల‌చి న‌ట్లే, ఈ ర‌చ‌యిత‌, త‌న ర‌చ‌నా పాటవానికి, క‌వితా ప్ర‌తిభ‌ను జోడించి, ర‌స‌రామ‌ణీయ‌క‌త‌ను, వ‌ర్ణ‌నాత్మ‌క‌వైన విలువ‌ల‌ను సాధించుట వ‌ల‌న ఈ న‌వ‌ల‌కు విశిష్ట కావ్య గౌర‌వం ల‌భించింది. న‌వ‌ర‌స‌భ‌ర‌తిమైన న‌వ‌లయిది. ప్ర‌ధానంగా శృంగార ర‌సం, త‌దిత‌ర ర‌సాలు అనుషంగి కాలుగానూ ఆయా స‌న్నివేశాల‌లో యిందు చిత్రింప బ‌డ్డాయి. త‌ల్లి యొక్క‌, జ‌గ‌న్మోహ‌న‌రావు యొక్క‌యు రాగ‌ద్వేష పూరిత దుర్భోధ‌ల ప్ర‌భావం చేత‌, గ‌ర్వాతిరేకం చేత‌నూ త‌న మ‌న‌సును క‌లుషితం గావించుకొని, అనురాగ దూరురాలైన శార‌దాదేవి యొక్క‌యు శృంగార స్థితి తాత్కాలిక‌ముగా ర‌సాభ‌స‌గా ప‌రిణ‌మించ‌బోతుండ‌గా, కాల‌క్ర‌మంలో త‌న దోషాన్ని గుర్తించి, ప‌శ్చాత్తాప‌ప‌డి చివ‌ర‌కు త‌న భ‌ర్త‌యై, శృంగార ర‌సాధి దేవుడైన నారాయ‌ణ‌రావును క‌లిసి, ఆనంద పార‌వ‌శ్య‌ముతో సంసార యాత్ర‌ను సాగించిన శుభావ‌హ ప‌రిణామ‌ము శృంగార ప‌రాకాష్ట ద‌శ‌గా ప‌రిగ‌ణింప‌వ‌చ్చును. ర‌చ‌యిత త‌న హాస్య ప్ర‌సంగ కుశ‌ల‌త‌ను, నారాయ‌ణ‌రావు, ల‌క్ష్మీప‌తి, రాజారావు మొ|| మిత్రుల సంభాష‌ణ ద్వారా ప్ర‌ద‌ర్శించారు.