1
 

శాయన భార‌తం

విరాట ప‌ర్వం

ఇది పెద్ద పాములాగ ఎంతో భ‌యంక‌రంగా ఉండి. దీనిని చూసేస‌రికి జ‌నులు బెదిరిపోతారు. దీనిని వ‌దిలిపెట్టిపోవాలంటే నాకు హృద‌య‌వేద‌న క‌లుగుతోంది. విడిచిపెట్ట‌డానికి మ‌న‌స్క‌రించ‌డంలేదు. అయినా త‌ప్ప‌దు. ఏం చేయ‌ను అంటూ అర్జునుడు మ‌ద‌న‌ప‌డుతున్నాడు. చివ‌ర‌కు గుండె రాయి చేసుకున్నాడు. ఆయుధాల‌న్నీ గుప్త‌ప్ర‌దేశంలో భ‌ద్ర‌ప‌ర్చ‌డ‌మే క‌ర్త‌వ్యం అనుకున్నారు. అనువైన స్థ‌లం కొర‌కు న‌లుదిక్కులా ప‌రికించాడు. ఈ స‌మీపంలో ఒక స్శ‌శాన భూమిలో ఒక పెద్ద జమ్మిచెట్టును చూచినాడు. పైకి పెరుగుట‌కు చోటుచాల‌క ఆకాశాన్నే పైకి తోసేస్తోందా అన్నంత ఎత్తుగా పెరిగిందా చెట్టు.దాని కొమ్మ‌లు, పేరాశ‌లాగ పొడ‌వుగా ఉన్న‌వి. ఆకులు ఒకదాని ప్ర‌క్క‌న ఒక‌టి పెరిగి ద‌ట్టంగా ఉన్నాయి. ప‌ట్ట‌ప‌గ‌లే పెనుచీక‌ట్లు కమ్ముకుని ఉన్న‌దా చెట్టు.

ఆ గుబుర్ల‌లో కాకులు, గ్రుడ్ల‌గూబ‌లు, పాములు కాపురాలు చేస్తున్నాయి. ఆ శమీ వృక్ష ప‌రిస‌రాల్లోకి పోవ‌చానికే భ‌యం క‌లిగిస్తు్న‌ది. అట్టి జ‌మ్మి చెట్టును ధ‌ర్మ‌రాజుకు చూపించాడు.

అన్న‌య్యా !  ఆ చెట్టును చూడు. ధూళి ధూస‌ర‌మ‌య‌మై ఎలాగ ఉన్న‌దో ?  దాని మీద కాకులు, గుడ్ల‌గూబ‌లు నివ‌శిస్తున్నాయి. భూతాలు, పిశాచాలు, ఢాకినీలు, దెయ్యాలు.

దాని మీద ఉన్న‌ట్లు అగుప‌డుతున్న‌ది. ఏదో దుర్వాస‌న కొడుతున్న‌ది. మ‌హాభ‌యంక‌రంగా ఉంది. ఆ జ‌మ్మి చెట్టు చేరువ‌కైనా ఎవ‌రూ పోవ‌డానికి సాహసించరు. మ‌న ఆయుధాలు ఆ చెట్టులో పెడ‌దామా ?  అది చాలా పెద్ద‌ది. విస్తార‌మైన‌ది కూడానూ, దాని ద‌రికి వెళ్లి చూడ‌డానికి గాని, ఎక్క‌డానికి గాని ఎవ‌రికీ అవ‌స‌రం ఉండ‌దు. క‌నుక ఆ చెట్టులో పెట్ట‌డం మంచిది. మ‌న అస్త్ర‌శ‌స్త్రాల‌న్నీ క‌ట్టక‌ట్టి, పైన చ‌ర్మము, వెంట్ర‌కలు వేసిక‌ట్టి ఒక శ‌వాకారంగా చేద్దాము. అప్పుడు దాని జోలికి ఎవ‌రూ వెళ్ల‌రు. మ‌నం ఎక్క‌డ ఉన్నా నిశ్చింత‌గా ఉంద‌వచ్చు.

మ‌ళ్లీ వ‌చ్చి తీసుకువెళ్ల‌వ‌చ్చు అన్నాడ‌ర్జునుడు. అంద‌రూ స‌మ్మ‌తించారు. దేవ‌, దాన‌వుల‌తో యుద్ధాల్లో దిగ్విజ‌యం చేకూర్చిన త‌న ధ‌నువు, గాంఢీవాన్ని అనాడొక చెట్టుకు క‌ట్టి పెట్టి విడిచిపోవ‌ల‌సి వ‌చ్చింది క‌దా అని అర్జునుడు వా పోయాడు. దైవ నిర్ణ‌యాన్ని కాద‌న శ‌క్తిలేక గాంఢీవం ఎక్కుదించి చేతినుండి దింపాడు. పిమ్మ‌ట మిగిలిన పాండ‌వులంద‌రు త‌మ త‌మ చాప‌ముల‌ను, విల్లుల‌ను, క‌త్తుల‌ను, గ‌ద‌ల‌ను, ఇత‌ర ఆయుధ‌ముల‌ను క‌లిపి ధ‌ర్మ‌రాజు మ‌హోగ్ర‌మైన స‌ర్పాల‌ను పెట్టెలో పెట్టి క‌ట్టిన‌ట్లు గ‌ట్టిగా క‌ట్ట‌క‌ట్టాడు. ఆ క‌ట్ట ప‌ట్టుకొని చెట్టెక్కి బ్ర‌హ్మ‌, విష్ణు, మ‌హేశ్వ‌రుల‌ను దిక్పాలుర‌ను, సూర్య చంద్రుల‌ను, వ‌న పితృదేవ‌త‌ల‌ను, భూమ్యాకాశ‌ముల‌ను ప్రార్థించి, ఒక సువిశాల‌మైన శాఖ‌కు ఆయుధ‌ముల క‌ట్ట‌ను వ్రేలాడ‌క‌ట్టాడు. అర్జునుడికీ నాకు త‌ప్ప ఇంకెవ‌రికీ వి క‌న‌బ‌డ‌కుండుగాక !  విష‌జ్వాల‌లు వెడ‌ల గ్ర‌క్కె మ‌హాభ‌యంక‌ర భుంజ‌గాల్లాగ‌, భ‌యంక‌రంగా ఆగుప‌డుగాక ! భీయుడికి ఎప్పుడు ఆగ్ర‌హావేశాలు క‌లుగుతాయో ! ఏమో ! ఈ విష‌మ సంవ‌త్స‌రంలొ అత‌నిని ఏమ‌ర‌కుండా ర‌క్షించెద‌రు గాక ! అంటూ ఆయుధాది దేవ‌త‌ల‌ను ప్రార్థించాడు. పిద‌ప చెట్టు దిగి దానికి ప్ర‌దిక్షిణ‌చేసి సాగిల‌బ‌డి మ్రొక్కి భీముణ్ణి కౌగ‌లించుకొని ఓదార్చాడు.

ధర్మ‌రాజు చెట్టు దిగిచేస్తున్న ప‌నుల‌న్నీ ఆ ప‌రిస‌రాల‌లో ఉన్న ప‌శువుల కాప‌రులు చూచారు. పాండ‌వువుల వారిని మ‌భ్య‌పెట్టాల‌ని ఇలా అన్నారు.

ఇది నూరేళ్ల వృద్ధురాలు. మా అమ్మ‌. ఇప్పుడు...చ‌చ్చిపోయింది. మా కులాచార ప్ర‌కారం ఇలాగ చేశాం. అని పాండ‌వులంద‌రు ప‌శువుల కాప‌ర్ల‌తో ప‌దేప‌దే చెప్పారు.

ఆ చేరువ‌లో చ‌చ్చిప‌డి ఉన్న ఒక ప‌శువు చ‌ర్మం ధ‌ర్మ‌రాజు స‌హదేవుడి చేత ఒలిపించాడు. ఎండ‌కు, వాన‌కు భ‌ద్రంగా ఉంటుంద‌ని ఆ చ‌ర్మాన్ని ఆయుధాల క‌ట్ట‌కు క‌ప్పించాడు. ఆ స‌మీపంలో ఒక శుష్క‌శ‌వం క‌నిపించింతానికి. ఆ శ‌వం ఒక బిచ్చ‌గాడిద‌ని గ్ర‌హించి దాన్ని కూడా ఆయుధాల క‌ట్ట‌కు పైన పెట్టించినాడు. ఈ శ‌వం దుర్వాస‌న‌వ‌ల్ల దీని ద‌రికి ఎవ‌రూ రారు అని న‌వ్వుకుంటూ విరాట‌ప‌రం వైపున‌కు న‌డ‌చారు. అజ్ఞాత‌వాస కాలంలో త‌మ ర‌హ‌స్య వ‌ర్త‌న‌కు అనువుగా వారు త‌మ పేర్ల‌ను క్ర‌మంగా జ‌యుడు, జ‌యంతుడు, విజ‌యుడు, జ‌య‌త్సేనుడు, జ‌య‌ద్భ‌లుడు అని సంకేతించుకొన్నారు. వారంతా పుణ్య‌నది స్నానాలుచేసి జ‌పాలు, హోమాలు చేశారు.

ధ‌ర్మ‌రాజు తూర్పు ముఖంగా నిల‌బ‌డి య‌ముణ్ణి ప్రార్థించాడు. ఆనాడు య‌క్షుడి రూపంలో త‌న త‌మ్ముల ప్రాణాలు పుచ్చుకొన్న‌ప్పుడు, తానా య‌క్ష ప్ర‌శ్న‌ల‌కు త‌గిన స‌మాధానాలు ఇవ్వ‌గా క‌నుప‌ర్చిన పుత్ర ప్రేమ క‌నుప‌ర్చ‌మ‌న్నాడు. ఆనాడు త‌మ అజ్ఞాత‌వాసం విజ‌య‌వంతం అయేట్లా ఇచ్చిన వ‌రం, ఇప్పుడు య‌మునికి జ్ఞ‌ప్తికి తెచ్చినాడు. ఆ వ‌రం స‌ఫ‌లీకృతం చేయ‌మ‌ని అర్థించాడు.తాను స‌న్యాసి వేషం వేసుకొన్నాడు. దండ‌, క‌మండ‌లాల‌తో కాషాయ‌వ‌స్త్రాల‌లో, స‌న్యాసిరూపంలో ధ‌ర్మరాజు గుర్తుప‌ట్ట‌రానంత‌గా మారిపోయాడు. భీముడు, అర్జునుడు, న‌కులుడు, స‌హ‌దేవుడు, ద్రౌప‌ది వారి వారి పూర్వ నిర్ణ‌యాల‌న‌నుస‌రించి స‌ముచిత వేషాలు ధ‌రించారు. వారు ఒక‌రినొక‌రు పోల్చుకోలేనంత చిత్రంగా మారిపోయారు.

క్రమంగా ఒక్కొక్క‌రే రండి అంటూ అనేక విధాలైన పాచిక‌ల‌ను ఒడిలో భ‌ద్ర‌ప‌ర్చుకొని బ‌య‌లుదేరాడు ధ‌ర్మ‌రాజు.

విరాట‌రాజు, ఆనాడు త‌న రాజ‌భ‌వ‌న‌ము వెలుప‌ల కొలువు తీర్చియున్నాడు. అల్లంత దూరాన య‌తిరూపంలో ఆస్థానం వెపు న‌డచివ‌స్తూన్న ధ‌ర్మ‌రాజును చూచినాడు విస్తుపోతూ.

ఆహో !  అటు చూడంటి ! ఆ వ‌చ్చే వారెవ‌రు ?  అత‌ని వ‌ర్ఛ‌స్సు క‌న్నుల పండువుగా ఉంది . కాని ఆ స‌న్యాసివేషం ఏమిటి చెప్మా !  జ‌గాల్ని పాలించ‌గ‌ల తేజం అత‌నిలోంచి ఉట్టిప‌డుతూంది !  త్రిమూర్తుల‌తో సాటియైన స్వ‌రూపం ! ర‌త్న‌భూష‌ణాలు, ప‌ట్టపుటేనుగులు, వేత్ర‌హస్తులు చూడ‌గా మ‌హారాజులా ఉన్నాడు. మ‌హారాజేమిటి సార్వ‌భౌముడు !  మ‌న వ‌ద్ద‌కు ఎందుకు వ‌స్తున్నాడో ! అత‌డు ఏది కోరితే అది...వ‌స్త్రాలు...మ‌ణులు...బంగారం నా రాజ్యాన్న‌యినా స‌రే...ఇచ్చెయ్యాల‌ని అనిపిస్తున్న‌ది. అంటూ విరాటుడు సింహాస‌నం దిగి మౌనికి ఎదురుగాపోయి, స‌గౌర‌వంగా తీసుకువ‌చ్చి ఉచితాస‌నం పైన ఆశీనుణ్ణి చేశాడు.

అయ్యా ! మునీశ్వరా ! నీ జ‌న్మ‌భూమి ఏది ?  నీది  ఏకులం ?  నివాస‌స్థ‌లం ఎక్క‌డ ?  పేరేమిటి ?  ఇప్పుడు నీవిక్క‌డ‌కు విచ్చేసిన కార‌ణం ఏమి ?  అంటూ ప్ర‌శ్న‌ల‌ప‌రంప‌ర కురిపించాడు.

ఉన్న‌ది ఉన్న‌ట్లు చెప్పేవాళ్లెక్క‌డ ఉన్నారీకాలంలో ! తోచిన‌ట్లు మాట్లాడ‌వ‌ల‌సిన ప‌రిస్థితిలో ఉన్నాను నేను. అదీగాక‌, ఎట్టివారైనా అంత‌గా ప‌ట్టి చూడ‌లేదుగా !  అన్నాడ‌త‌ను, చిరున‌వ్వుతో.