ఆమె వెంట అదృశ్యంగా ఉన్న రాక్షసుడు సింమబలుణ్ణి విదిల్చి కొట్టాడు. వడివడిగా ఆ ఇల్లు వెలువడింది. కీచకుడు ఆమె వెంటపడ్డాడు. ఆమె భయపడింది. ఎటు పారిపోవటానికి తోచక, కొలువు తీర్చియున్న విరాటరాజు కొలువు కూటం వైపుకు పరుగెత్తింది. కామంతో, గర్వంతో కళ్లు మూసుకుపోయిన కీచుకుడు సభాసదులను సరకు చేయకుండా రహస్యం బట్టబయలు అవుతుందేమోననే విచారమన్నా లేకుండా ఆమెను తరుముకుపోయి ఆమె జుట్టుపట్టుకొని ఒంకూకొసరు లేకుంఆ జుట్టుపట్టుకుని వంచి క్రిందకుపడవేసాడు. ఆమె రక్షణకు వచ్చిన రాక్షసుడు అతణ్ణి నేలపై పడగొట్టాడు. తననీచపుపాటు ఎవరైనా గమనిస్తారేమోననే భయంతో తక్షణం లేచి నిలబడ్డాడు. ఆమె ఆత్మబలానికి దేహబలానికి విస్తుపోయాడు. ఒడుపుదప్పిన మహానాగులాగ బుసలు కొడుతూ మహాకోపంతో నిలబడ్డాడు.
ఆ సమయంలో ఆ కొలువులో ఉన్న ధర్మరాజు, భీయుడు కీచకుడి విజృంభణ, ద్రౌపది భంగపాటు చూచారు.
భీముడు మహా ఆగ్రహపరవశువయ్యాడు. అతని కన్నుల నుండి నిప్పులు రాలాయి. అతని శరీరం కోపంతో కంపించింది. ఆకారం భయంకరమైనది. నేలనూ నింగినీ తాళాలుగా చేసి వాయిస్తాడా ! కులపర్వతాన్ని ఒకదానిపై మరొక దానిని తన్నుతూ బంతి ఆట ఆడతాడా ! సప్తసముద్రాలనూ ఇక్కడిదక్కడ అక్కడి దిక్కడమార్చి ప్రపంచాన్ని లొంపిచేస్తాడా ! నాలుగు దిక్కుల్నీ ఒకచోటకుతెచ్చి పిసికిపిండం చేస్తాడా ! ఈ బ్రహ్మాండ భాండాన్నే పగుల గొడతాడేమో ! ప్రళయకాలాగ్నిలా ప్రజ్వరిల్లుతూన్న అతని రూపం భీతావహంగా ఉంది. అతని కోపాగ్నిలో ఆలోచనాశక్తి ఆహుతి అయింది. కీచకాదముడి నీచమునచడమే ముఖ్యం అనుకున్నాడు. కీచకుడి చుట్టం అవడంవల్ల విరాటుడు కూడా తన శత్రువే. చేరువలో ఉన్న ఒక మహోన్నత వృక్షాన్ని చూచాడు. పిమ్మట ధర్మరాజునుచూచాడు.
ధర్మరాజు భీముడి ముఖకవళికలు గమనిస్తూనే ఉన్నాడు. అతని అభిప్రాయం గ్రహించాడు. వద్దు తొందరపడకు అన్నట్లుగా కనుసౌజ్ఞ చేసాడు.
వలలుడికి ఇంకెక్కడా వృక్షాలు కనబడలేదా ? నీడిని ఇస్తూ ఫలపుష్పాలతో కన్నుల పండువుగా ఉన్న ఈ చెట్టును వంటకట్టెల కోసం విరచడం మంచిపని కాదు అని నిగూఢంగా అంటూ భీముణ్ణి వారించాడు.
ఆ అన్నదమ్ముల చేష్టలన్నీ ద్రౌపది చూస్తూనే ఉన్నది నెమ్మదిగా లేచినది లేతతీగను కప్పిన పరాగంలా ఆమె మేను ధూళిమయమైంది. చంపకం నవ సౌరభారి వెదజల్లుతున్నట్లు ఆమె నాసికా పుటాల నుంచి వేడి వాయువులు వీస్తున్నవి. కలువరేకుల మీద మంచుకణాల్లాగా ఆమె కన్నుల ఆశ్రుకణాలు నిండినవి. చంద్రబింబంలోని నల్లని మచ్చలాగ ఆమె కురులు ముఖాన్ని కొంచెం కప్పినవి. ఈ ప్రకారం ఉన్న ద్రౌపది అతి దైన్యంతో విరాట రాజు సభ ప్రవేసించింది. కోపం ఒక ప్రక్క, అజ్ఞాత వాసం భంగం అవుతుందనే భయం ఒక ప్రక్క ఆమె హృదయంలో చేరి పెనగులాడుతున్నది. సభ్యులందర్నీ చూస్తున్నట్లు తన భర్తలను రూక్షంగా చూచింది. తన కోపంవల్ల తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్త పడుతూ దుష్టశిక్షణ, శిక్షరక్షణ అనే నీతి తప్పక పాటించే ధర్మాధర్మనిపుణులు సకలశస్త్రోస్త్రకోవిదులు, మహాపరాక్రమవంతులు అయిదుగురు గంధర్వులు నా భర్తలు. అయినా నన్ను ఒకడు ఇట్లా తరుముకువస్తే వారు ఊరికే చూస్తూ ఊరుకోడం చిత్రంగా వుంది. ఇలాగయితే ఇంక ఎవరి ఆడవాళ్లు అవమానింప బడకుండా బ్రతగ్గలరు ?
ఈ రాజు ఆ స్థానంలో ఇంతమందిలో ఒక్కరూ ఒక్కమాట అయినా మాట్లాడలేకపోతున్నారే ! ఇంతమంవీ చూస్తుండగా ఇక్కడ ఈ విధంగా ఆ కీచకుడు ఎన్నడూ ఎవరూ ఏ స్త్రీని అవమానించనంత ఘోరంగా నన్ను అవమానిస్తుంటే ఒక్కరికీ దయాదాక్షిణ్యం లేదే ! మత్స్యదేశానికి ఆయన రాజు కనుక నా దురదృష్టానికి ఈ రాజుఉ నిందించవచ్చు. ఎవరైనా అధర్మం చేస్తే ప్రభువన్నవాడు విచారించి దండించాలి. అటువంటపుడు రాజు సమక్షంలోనే నన్ను కీచకుడు తన్నుతే చూస్తూ ఊరుకోడం న్యాయం కాదు అన్నదామె గద్గద స్వరంతో.
విరాటుడు మనస్సులో మిక్కుటంగా బాధపడ్డాడు. కాని కీచకుణ్ణి మందలించే సత్తువ లేకపోయిందా తనకి రోషంతో కంపిస్తూ ఉన్న కీచకుణ్ణి మంచి మాటలతో శాంతపరిచి అక్కణ్ణుంచి పంపివేసాడు మహారాజు అప్పడు.
ఇంతటి శుభలక్షణాలు గల సుందరి సైరంధ్రి ఎలాగయిందా అని, కొందరు ఈమెకు ఎటువంటి పాట్లు కలిగించాడా మాయదేవుడు అని కొందరు, రాజు ఎదుటనే ఎంతటి పాపం చేశాడో ఆ పాపాత్ముడు అని కొందరు, రాణి ఉపేక్షవల్లనే ఈమెకు ఇన్ని పాట్లు వచ్చాయి అని కొందరు అనేక విధాలుగా ఆ సభలోని వారు గుసగుసలాడారు. వారి హృదయాలు దుఃఖపూరితాలయ్యాయి. మోములు వన్నె తరిగినవి.
ధర్మరాజు హృదయం కలగింది. నొసట ముచ్చెమటలుపోశాయి. మహాకోసం వచ్చినది. అయినా మనోధైర్యం చిక్కబట్టాడు. కోపం అణచుకొని పైకి నిర్వికారంగా సైరంధ్రితో ఇలా అన్నాడు.
ప్రభువు సభాసదులు నీ వృత్తాంతమంతా తెలుసుకొన్నారు. అందరకు బోధపడింది. ఇంక అధిక ప్రసంగం అనవసరం. నువ్వు సుదేష్ణ భవనానికి వెళ్లు. సమయం కాకపోవడంవల్ల కాబోలు నీ భర్తలు నీ పరాభవాన్ని సహించారు. నీకూ వాళ్లకూ అటువంటి ఏర్పాటు ఏదైనా జరిగి ఉన్న వాళ్లు ఇక్కడ రోషం తెచ్చుకోడానికి వీల్లేదు. అందుచేత నీ భర్తలను నిందించి ఫలితంలేదు. కాగా తాను ఎంతబాధలుపడినా పవిత్రమైన స్త్రీ నిండుసభలలో ఇంతసేపు నిస్సంకోచంగా నిలబడి ధిక్కరించడం పాడికాదు కదా ! ధర్మరాజు కంఠస్వరంలో శాంతం ప్రతిధ్వనిస్తోంది.
సైరంధ్రి మాత్రం అక్కడునుండి కదల్లేదు. పైగా ఏదో మాట్లాడబోతూన్న సమయంలో ధర్మరాజు అడ్డుతగిలాడు.
పలుపోకడలుపోతూ విచ్చలవిడిగా నాట్యం చూసేవాళ్లలాగ కులసతుల గౌరవం పోయేట్లా ఈ విదంగా ఇక్కడ నిలబడడం తగదు అన్నాడతడు.
ద్రౌపది అతనిని సాభిప్రాయంగా చూచినది.
ఓ కంకుభట్టూ ! నా భర్త నిజంగా నటుడె ! పెద్దవారిలాగే పిన్నలూ కనుక నా భర్తలాగే నేనూ నాట్యకత్తెనే. అందుచేత నాకు నాట్యమాడడం కూడా వచ్చు. నా భర్త ఒక్క నాట్యకాడే కాదు, ధూరుడు కూడాను ! జూదగాడి భార్యకు గౌరవం ఎక్కడిదీ ! అని ద్రౌపది విసవిస లాడుతూ వెళ్లిపోయింది.
ఆమె కన్నుల నీరు నిండినది. మోముదీనంగా ఉన్నది. ఆ దుర్మార్గుడి ఇంటికి వెళ్లమని పంపిన ఆ ధూర్తురాలికి ఈ సంగతి చెప్పిగాని వెళ్లను అని కుమిలిపోయింది.
తొట్రుపాటుతో సుదేష్ణ వద్దకు చేరింది. ఆమెను చూచి సుదేష్ణ లేచిసంభ్రమం తెచ్చుకొన్నది. ఏమీ ఎరుగని దానివలె నటించింది.
మాలినీ ! ఒళ్ళంతా ధూళి అయిందేమి ? మొగం చిన్నబోయిందే ! జుట్టు చెదిరిపోయి చెమటతో తడిసిందే ! కన్నీటి వెల్లువలతో కళ్లు కాంతితగ్గాయే ! ఏం ? ఏం జరిగింది ? ఎవరు నీకు ఏ కష్టం కలిగించారో చెప్పు. తక్షణం వాళ్లని శిక్షిస్తాను. చంపిస్తాను అన్నది. ఆమె కంఠస్వరంలో ఆతృత, ఆపేక్ష ధ్వనింపజేసింది.
అంతా తెలుసుండీ తెలియనట్లు నటిస్తే నేనేం చెప్పగలను ? అయినా చెపుతాను. నువ్వు కల్లు తెమ్మనమని నన్ను కీచకుడి ఇంటికి పంపిస్తే వెళ్లానా అతడు అవినీతి చేష్టలు ఆరంభించాడు. నేను తప్పించుకొని రాజు ఆస్థానంవైపు పారిపోయాను. అతడు నన్ను తరుముకువచ్చి ముట్టి పట్టుకొని తన్నాడు. ఇంకేం చెప్పను ? అన్నది సైరంధ్రి.
విచారించకమ్మా ! ఈ క్షణమే కీచకుడికి శిక్షవేయిస్తాను. నీ దుఃఖం పోగొడతాను అంటూ సుదేష్ణ ద్రౌపదిని మంచిమాటలతో సముదాయించ ప్రయత్నించింది. ఆమె అబద్ద ప్రగల్పాలను ద్రౌపదితోసిపుచ్చదలచి.
|