10
 


ద్రౌప‌ది భీముణ్ణి జ‌య‌ల‌క్ష్మి చేకొనుమ‌ని దీవించిన‌ది. సుధేష్ణ ఈపాటికి నా కోసం వెద‌కుతూ ఉంటుంది. ఇంక ఇక్క‌డ ఆల‌స్యం చేయ‌డానికి వీల్లేదు అంటూ వెళ్ళిపోయింది.

భీముడు కీచ‌కుణ్ణి త‌ల్చుకుంటూ రాత్రి రాబోయే న‌ర్త‌న‌శాల సంఘ‌ట‌న‌ల‌ను ఊహించు కొంటున్నాడు. సైరంధ్రి ఒంపుసొంపులు, అంద‌చందాలు కీచ‌కుని మ‌న‌స్సును క్ష‌ణ‌మైనా వ‌ద‌ల‌కుండా వేధిస్తున్నాయి. కీచ‌కుడు ద్రౌప‌దిని త‌ల్చుకుంటూ రాత్రి రాబోయే న‌ర్త‌న‌శాల సంఘ‌ట‌న‌ల‌ను ఊహించుకుంటున్నాడు. ఆమె అస‌లు వ‌స్తుందో రాదో ఐదుగురు గంధ‌ర్వ భ‌ర్త‌ల సంగ‌తి నిజ‌మో కాదో, అస‌లు ఆమె వ‌స్తాన‌న‌డ‌మే వింత‌. రాక‌పోతే త‌న ప్రాణ‌మూ త‌నువూ నిల‌వ‌ద‌న్న‌ది నిజ‌ము అని చింతించాడు.

జార‌చోరుల‌కు ఆనందం క‌లిగే చంద్రాస్తుమ‌యం అయింది. కాళ రాత్రి క‌టిక చీక‌ట్లు క‌మ్ముకొన్న‌వి. మిట్ట‌ప‌ల్లాలు క‌న‌ప‌డ‌డంలేదు. క‌న్నుతెరిచినా మూసినా ఒక్క‌లాగే ఉన్న‌ది. ఆ నిశీధిని ద్రౌప‌ది భీముని వ‌ద్ద‌కుచేరి స‌మ‌యం అయింది అన్న‌ది స‌న్న‌గా.

పెళ్ళికి త‌ర‌లి వెడుతున్నంత ఆనందంతో మేలిముసుగుతో భీముడు న‌ర్త‌న‌శాల‌వైపు న‌డ‌చాడు. అత‌ని వెనుక అల్లంత దూరంలో ద్రౌప‌ది న‌డిచింది. వివేక‌హీనుడి హృద‌యంవ‌లె త‌మోదూషిత‌యున్నూ, జారిణి ప్రేమ‌వ‌లె దుర్నిరూప‌మున్నూ, ఘోరాట‌నీ భాగంవ‌లె నిర్మానుష్య‌మున్నూ, దుర్మార్గుడి సిరివ‌లె అనుప‌యోగ‌మున్నూ, అభ్యాసం కాని శాస్త్రం వ‌లె దుర్గ‌మమున్నూ, క‌ల‌లో ల‌భించిన ప‌దార్థంవ‌లె అగోచ‌ర‌మున్నూ, క్లిష్ట‌మైన కావ్యంవ‌లె అస్ప‌ష్టాలంకార‌ములు క‌ల‌దిన్నీ, తుచ్చుడి రాజ్యంవ‌లె జార‌చోరుల‌కు ఆహ్లాద‌క‌ర‌మైన‌దిన్నీ అయిన న‌ర్త‌న‌శాల ముంగిట‌గ‌ల స్థ‌లం ప్ర‌వేశించి, శాల మ‌ధ్య‌భాగంలో విరాట రాజ‌కుమార్తె, ఉత్త‌ర విలాసార్థం అమ‌ర్చ‌బ‌డిన పాన్పుకు అన‌తి దూరంలో ద్రౌప‌దిని దాగుకొన నియమించి భీముడు పాన్పుపై ప‌వ‌ళించాడు.

సింహ‌గుహ చొచ్చే మ‌ద‌పుటేనుగులాగ కామంతో, క‌ల్లుతో మ‌త్తెక్కి ఉన్న కీచ‌కుడు ఆ న‌ర్త‌న‌శాల‌లోకి చొచ్చుకు వ‌చ్చాడు. పాన్పుపై మేలిముసుగుతో ప‌వ‌ళించి ఉన్న మాలినిని చేతితో అల్ల‌వ‌ల్ల‌న త‌డిమి చూసి ద్రౌప‌దిగా భ్ర‌మించి

ప్రియా ఏరికోరి అతి మ‌నోహరాలైన వ‌స్తువులు ఎన్నో నీ కోసం తెచ్చాను. రా ప్రేయ‌సీ ! లేచిరా ! న‌న్నుచూచి విర‌హ‌తాపం భ‌రించ‌లేని ఆడ‌వాళ్లు నాకు ఎన్నో విశిష్ట వ‌స్తువులు లంచం ఇస్తూంటారు. నా అందాన్ని చూసి న‌న్ను వంచిన త‌రుణి ఇత‌రుల‌ను ఏమీ లెక్క చేయ‌దు తెలుసా ?  నా లావ‌ణ్యం మెచ్చుకున్న అంగ‌న పైబ‌డ క‌క్ష‌ణం నిల‌బ‌డ‌లేదు ! నా విలాసం చూచిన ప‌డుచు మ‌ద‌న‌తాపంతో బ్ర‌త‌గ్గ‌ల‌దా ! నా వివేకానికి ఆనందించిన ఆడ‌ది విర‌హాగ్నిలో ద‌గ్థం కావ‌ల‌సిందే ! నేను మాట్లాడితే చాలు ఇంతుల మ‌న‌స్సులు నామీదే ల‌గ్న‌మైపోతాయి ! అటువంటి న‌న్ను ఈ ప్ర‌కారంగా ఏలుకొన్న‌ది నువ్వొక్క‌ర్తెవే అన్నాడు కీచ‌కుడు.

కీచ‌కుడు వ‌ద‌రుబోతు త‌నాన్ని భీముడు అస‌హ్యించుకొన్నాడు. అయినా అత‌నితో నిగూఢ‌మైన భావాల‌తో సంభాషించి త‌న ప్రియురాల్ని సంత‌ప‌పెట్టాల‌నిపించింది భీముడికి.

నువ్వు ఇటువంటి వాడ‌వు క‌నుక‌నే నిన్ను నువ్వే పొగుడుకోవాలి. అయ్య‌య్యో ఎంత మాట ఎరుగ‌క అలాగ అంటున్నావుగాని నిజంగా నాబోటి ఆడ‌దాన్ని ఎక్క‌డ వెదికినా నువ్వు పొంద‌గ‌ల‌వా ?   నీ ఒళ్లూ నా ఒళ్లూ క‌లిసిన‌ప్పుడు నీ ఒళ్లు ఏమ‌వుతుందో అనుభ‌వం మీద గాని తెలియ‌దు ! న‌న్ను ఏదో సామాన్య స్త్రీ లాగ ఎంచుతున్నావు చాలా గొప్ప పొర‌పాటు సుమా నువ్వు న‌న్ను పొందాక మ‌రి నీకు ఆడ‌వాళ్ల అవ‌స‌రం ఎంత మాత్రం ఉండ‌దు ! నిజంగా నేను జ‌న్మ ఎత్తినందుకు ఇవాళ సాఫ‌ల్యం అవుతోంది అని స్త్రీ గొంతుతో అంటూనే త‌టాలున పాన్పుపై నుండి ఉరికి కీచ‌కునిపై ప‌డ్డాడు.

త‌న‌పైబ‌డిన వాడు గంధ‌ర్వుడు అని కీచ‌కుడు త‌ల‌చాడు. భీమ కీచ‌కులు మ‌ల్ల యుద్ధం చేస్తున్నారు. పోరు ఘోర‌మైంది. త‌న దుర్ద‌శ నలుగురుకూ తెలిస్తే న‌గుబాట్లు అవుతామ‌నే భీతితో కీచ‌కుడూ, బీముడూ చ‌ప్పుడు చేయ‌కుండా నిగూఢంగా ఒకళ్ల‌నొక‌ళ్లు బాగా మ‌ర్దించుకొంటున్నారు.

పోర‌గా పోర‌గా భీముడి బ‌లం పెరుగుతున్న‌ట్లు కీచ‌కుడి బ‌లం త‌ర‌గుతున్న‌ట్లు అనిపించింది. చివ‌ర‌కు భీముడు పిడికిలి బిగ‌బట్టి మ‌హాబ‌లంతో కీచ‌కుడి గుండెల‌పై గ్రుద్దాడు. మొద‌లు న‌రికిన మ్రానులా కీచ‌కుడు నేల‌గూలాడు. అత‌ణ్ని వికృత‌పు చావు చంపాల‌ని భీముడికి కోరిక క‌లిగింది. కీచ‌కుడి శిర‌స్సు, కాళ్లు, చేతులు అన్నీ మొండెంలోనికి త్రోసి ఒక్క ముద్ద‌లాగ చేశాడు. అలాగ మూట‌లాగ అయిన కీచ‌కుడి క‌ళేబ‌రాన్ని నేల మీద ప‌డేశాడు.

త‌న బ‌ల‌సంప‌ద‌క‌న్న కీచ‌కుడి మ‌ర‌ణ‌మే ద్రౌప‌దికి ఎక్కువ ప్రీతి క‌లిగిస్తుంద‌ని భీముడికి తెలుసు. ఆమెతో కీచ‌కుడి చావు వార్త చ‌ల్ల‌గా చెప్పాడు. అతి ర‌హ‌స్యంగా క్ష‌ణంలో అగ్ని తెచ్చిచిన్న మంట చేసాడు. ఆ అగ్ని జ్వాల కాంతిలో ఆ పీనుగును ఆమె అతి ఆశ్చ‌ర్యంతో, భ‌యంతో, ప్రీతితో చూచింది. త‌ల పంకించి ముక్కు మీద వేలు వేసుకొన్న‌ది.

 

దీనికేనా కీచ‌కా ఇన్ని తిప్ప‌లు ప‌డ్డావు. ఇంత సుఖ‌ప‌డుదువుగాని ! అలాగ చేస్తే ఇలాటి ఫ‌లితం రాకుండా ఉంటుందా ! అంటూ విస్తుపోయింది.

 తాను ప్ర‌తిజ్ఞ నెర‌వేర్చి భార్య  అవ‌మానాన్ని, ప‌రితాపాన్ని పోగొట్టాడు. త‌నకిది ప‌ర‌మానందం స‌మ‌యం భీముడు ద్రౌప‌ది ద‌రిచేరి...

హృద‌యం శ‌ల్యం పోయిందా ?  నా భుజ‌బ‌లం బోద‌ప‌డిందా ?  రోషాగ్ని శాంతించిందా ?  ఈ తుచ్చుణ్ణి చూచి సంతోషించావా ?  చెడుత‌ల‌పుతో నీ ద‌గ్గ‌ర చేరేవారు నాచేతిలో ఇలాగ‌కాక‌, బ్ర‌తికి పోగ‌ల‌రా ?  అన్నాడు ఉత్కంఠ‌తో.

ద్రౌప‌ది హృద‌యంలో ఆనందం పొంగి పొర్లింది.

కొలువులోప‌, నిన్న నీకు వ‌చ్చిన మ‌హాకోపం అణ‌చుకోగ‌లిగిన నీ మ‌నోధైర్యం, నేడు నిర్వాకారంగా ఇక్క‌డ‌కువ‌చ్చి ప్ర‌జ‌ల క‌న్నులు గ‌ప్పిన నీ ప్ర‌జ్ఞ‌, మ‌న‌వారిలో ఒక‌ణ్ణ‌యినా పిల‌వ‌కుండా ఉత్సాహం చేసిన నీ సాహ‌సం, లోకంలో దుర్జ‌యుడ‌ని అనిపించుకొన్న కీచ‌కుణ్ణి చిటిక‌లో రూపుమాసిన నీ శౌర్యం, సొంపు మెచ్చుకోవ‌డం నా త‌ర‌మా ! నీ ఉత్త‌మ నాయ‌క‌త్వాన్ని గుర్తెరిగి కొనియాడ‌డానికి నేనెంత‌దాన్ని ! కాని ఒక్క విష‌యం మాత్రం నిశ్చ‌యింగా చెప్ప‌గ‌ల‌ను. నేను మ‌హా విస్మ‌యంలో మునిగిపోయాను ! అమిత ఆనందంలో తేలియాడుతున్నాను ! అంది. ద్రౌప‌ది ప‌లుకులు భీముడికి కర్ణ ర‌సాయ‌స‌మ‌య్యాయి. ఆత‌ని సంతోషానికి మేరు లేక‌పోయింది. ఇంక ఇక్క‌డ కాల‌విలంబ‌న కూడ‌దు అంటూ చ‌ర‌చ‌ర వంట‌శాల‌కు వెళ్ళిపోయాడు.

కీచ‌కుడు చ‌చ్చిపోయాక ఏం జ‌రిగిందో వినాల‌ని చాలా ఆతృత‌గా ఉంది. విపులంగా చెప్పు అని ఆతృత‌గా అడిగాడు జ‌న‌మేజ‌యుడు.