1
 

జ‌య‌త్య‌సౌ శివ‌స్సాక్షాత్‌

విశ్వ‌నాథో మ‌హాగ్నిచిత్‌

జుహోతి స‌క‌లం విశ్వం

దృక్కుండేయః ప్ర‌దీప‌తే

సాక్షాచ్ఛివుడును మ‌హాచిద‌గ్ని స్వ‌రూపుడున‌గు విశ్వ‌నాధున‌కు జ‌య‌మ‌గు గాక ! అత‌ని దృక్కుండ‌మున ప్ర‌జ్వ‌లించుచున్న చిద‌గ్నియే విఖిల విశ్వ‌మును య‌జించుచున్న‌ది అనుభావ‌ముక‌ల ఋజ్మింత్ర‌తుల్య‌మైన ఈ శ్లోక‌ముతో శ్రీ ధూళిపాళ శ్రీ‌రామ‌మూర్తిగారు త‌న గురువులైన విశ్వ‌నాథ వారిని సంభావించియున్నారు. ఏగ‌తి ర‌చించిరేని స‌మ‌కాల‌మువార‌లు మెచ్చ‌రేక‌దా అని చేమ‌కూర వేంక‌ట క‌వి త‌మ విజ‌య విలాస‌ములో న‌న్నాడు. ఈ మాట‌ల న‌స‌త్య‌ము చేయుచు విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారి ర‌చ‌ల‌న క‌మిత‌మైన యాద‌ర‌ణ‌ము ఆయ‌న కాల‌మున‌కే ల‌భించిన‌ద‌నుట‌కీ శ్లోక‌మే తార్కాణ‌. అంతేయ‌గాక ఆయ‌న ద‌చ‌న‌ల‌లోని మాధుర్య‌మును గ్రోలిన కొంద‌రు వారికి ఆత్మీయుల‌గుట‌యేగాక భ‌క్తులు కూడ న‌గుట సంభ‌వించిన‌ది. విశ్వ‌నాథ‌వారికి బ‌ద్ధ శ‌త్రువులో భ‌క్తులో త‌ప్ప మాధ్య‌మికులు లేర‌ని నోరి వారి య‌భిప్రాయ‌ము. శ్రీ విశ్వ‌నాథ‌కు చాలామంది శిష్యులూ భ‌క్తులూ ఉన్నారు. వారాయ‌న ర‌చ‌న‌లు ప‌దే ప‌దే ఒక‌ర‌న్న‌ట్లుగా మ‌డి క‌ట్టుకునికూడా అధ్య‌య‌న‌ము చేస్తారు. ఆయ‌న మాట‌లు స్మ‌రిస్తూ పారాయ‌ణ చేస్తారు. అలాగే ఆయ‌న‌కు భ‌క్తులెంద‌రో శత్రువులుకూడ నందురుండిర‌నియు, శ‌త్రువులు పౌండ్ర‌క వాసుదేవుడు శిశుపాలుడువంటి వార‌నియు నోరివారు చ‌మ‌త్క‌రించిరి. శివాజ్ఞ‌ను నిర్వ‌ర్తించుట‌కు ఆంధ్ర భూమిలో న‌వ‌త‌రించి స‌హ‌స్ర బాహువులు స‌హ‌స్ర శిర‌ములుగ‌ల ప్ర‌మ‌థ మూర్తి శ్రీ విశ్వ‌నాథ‌య‌ని నోరివార‌భిభాషించియున్నారు.

విశ్వ‌నాథ కృతుల‌పై ప‌రిశోధ‌న చేసిన‌వారుకూడ విశ్వ‌నాథ నొక యంద‌జాల‌ని మేరుప‌ర్వ‌త‌మువ‌లెను త‌రిపంసాధ్య‌మైన స‌ముద్ర‌మువ‌లెను భావించుట‌యేగాక స‌ముద్ర‌ము నాపోశ‌ము ప‌ట్టిన అగ‌స్త్యునివంటివార‌ని పురాణ వైర గ్రంథ‌నూల‌పై ప‌రిశోధ‌న చేసిన శ్రీ రొంప‌చ‌ర్ల‌వారు భావించియున్నారు. సార్వ‌కాలిక‌మైన భార‌తీయ ధ‌ర్మ‌మునాటినుండి యాక‌ళింపు గావించుకొని దానికి హేతువులైన వేద‌శాస్త్ర పురాణేతిహాస‌ములందు సంపూర్ణ ప్ర‌మాణ‌బుద్ధి గ‌లిగిన యాధునిక సాహితీవేత్త‌ల‌లో ఆగ్రేస‌రులు శ్రీ విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారు...వీరు అగ‌స్త్యునివంటివారు అని వ్రాసిరి. శ్రీ ఎస్‌.వి.జోగారావుగారు విశ్వ‌నాథ పిలిస్తే శ‌బ్దాలు ప‌లుకుతాయి అని ప్ర‌శంసించిరి. శ్రీ విశ్వ‌నాథ క‌నంత‌మైన ప్ర‌తిభ సామ‌ర్ధ్య‌ము గ‌ల‌ద‌ని ప‌లువురు పండితుల య‌భిప్రాయ‌ము.

విశ్వ‌నాథ‌వారి ర‌చ‌న‌ల‌లో వ్య‌క్త‌మైన ఔన్న‌త్య‌ముగాని గాంభీర్య‌ముగాని ప్ర‌మాణ‌ముగ ధ‌ర్మ‌బుద్ధితో విమ‌ర్శింప‌వ‌లెన‌న్న‌చో విమ‌ర్శ‌కుడు కూడ ధ‌ర్మ‌శాస్త్ర ర‌హ‌స్య‌ముల‌ను, ఉప‌నిష‌ద్ర‌హ‌స్య‌ముల‌ను, ఇతిహాస పురాణాదుల‌నెఱింగి యుండ‌వ‌ల‌యును. ఒక పురాణ వైర గ్రంథ‌మాల‌ను విమ‌ర్శించుట‌కు డా. శ్రీ‌నివాసాచార్యుల‌గారికి అష్టాద‌శ పురాణ‌ముల‌ను మ‌ధింప‌వ‌ల‌సివ‌చ్చిన‌ది. వీరి ర‌చ‌న‌ల‌లో భార‌తీయ నాగ‌రిక‌త మౌలిక‌ముగ సువ్య‌క్త‌మ‌గుచుండును. అయిన‌ప్ప‌టికిని ఆంధ్ర‌ప్ర‌దేశ‌మును, ఆంధ్ర జాతిని, ఆంధ్రుల ఆచార వ్య‌వహార‌ముల‌ను త‌మ ర‌చ‌న‌ల కుచ్ఛ్వాస నిశ్వాస ప్రాయ‌ముగ చేసిన‌వారిలో శ్రీ‌నాధుని త‌రువాత విశ్వ‌నాథ నే చెప్ప‌వ‌ల‌యును. జీవుడు, సంస్కార‌ము, జ‌న్మ ప‌రంప‌ర‌. ఇదియొక ప్రావాహిక మైన యూహా స్ర‌వంతి. ఈ స్ర‌వంతి విశ్వ‌నాథ‌వారి హస్త‌మునుండి వియ‌ద్గంగ‌యై ప్ర‌వ‌హించిన‌ది. క‌రీంన‌గ‌రులో ఆశువుగ త‌న శార‌ద‌నుగూర్చి యిట్లు ప్ర‌వ‌చించియున్నారు.


త‌న లోతు ఎఱుగ‌ని జ‌మ‌ల పూజ‌కు దిర‌

స్కృతి జూపు మ‌త్స‌ర‌స్వ‌తి సుభ‌ద్ర‌

త‌న లోతు నెఱిగిన జ‌నుల పూజ‌కు న‌వా

దృతి జూపు మ‌త్స‌ర‌స్వ‌తి స‌మార్ద్ర‌


విశ్వ‌నాథ‌వారి ర‌చ‌న‌లెంత య‌సంఖ్యాక‌ములో వారిపై వ‌చ్చిన విమ‌ర్శ‌న గ్రంధ‌ములు, వ్యాస‌ములుకూడ నంత య‌సంఖ్యాక‌ములే. విశ్వ‌నాథ శార‌ద‌, బ్రాహ్మీమ‌య‌మూర్తి, విశ్వ‌శ్రీ‌వంటి ప్ర‌త్యేక సంచిక‌లు వీరి చ‌ర‌న‌ముల‌కు వ్యాఖ్యాన‌ముల‌న‌వ‌లెను.

న‌వ‌ల‌లో విశ్వ‌నాథ‌వారి శైలి జీవ‌నిష్ఠ‌మైన‌ట్టిది. భాష ఝ‌రీవేగ‌తుల్య‌ము. పెద్ద‌పెద్ద స‌మాస‌ముల నెట్ల‌ల‌వోక‌గ ర‌చింతురో చిన్న చిన్న వాక్య‌ములుకూడ‌న‌ట్లే న‌ప్ర‌తిభ‌ముగ ర‌చింతురు. సంస్కృతాంగ్ల‌, ఆంధ్ర భాష‌ల‌లోగ‌ల పాండిత్య‌మువ‌ల‌న వీరి ప్ర‌తి మాట‌యు అర్ధ గాంభీర్య‌ము క‌ల‌దిగ‌నుండునేగాని వ్య‌ర్ధ‌ముగ‌నుండ‌దు.

విశ్వ‌నాథ‌వారు న‌వ‌లా ప్ర‌క్రియ‌ను చేప‌ట్టుట యాప్ర‌క్రియ చేసికొన్న య‌దృష్ట‌మ‌ని డా.బి.వి. కుంటుంబ‌రాయ‌శ‌ర్మ‌గారు నుడివియున్నారు. విశ్వ‌శ్రీ ప‌త్రిక‌యందు దాశ‌ర‌థిగారిట్లు వ్రాసిరి. మ‌న‌ము నిన్న ఏమైయుంటుమి, నేడు ఏమైయున్నాము, రేపు ఏమి కాగ‌ల‌ము, చెప్పుట‌యే ఆయ‌న ధ్యేయ‌ము. కావున ఆయ‌న నిజ‌మైన జాతీయ క‌వి. గ‌తితార్కిక‌త ఆయ‌న‌యందు మూర్తీభ‌వించిన‌ది. ఆయ‌న వ‌య‌స్సును ప్ర‌భ‌వ విభ‌వాదుల‌తో కొలువ‌లేము. ఋగ్య‌జుస్సామాదుల‌తో, భార‌త భాగ‌వ‌తాదుల‌తో మాత్ర‌మే కొలువ‌గ‌ల‌ము. ఇట్లు విశ్వ‌నాథ‌ను కొలుచుచు, ఆయ‌న ప్ర‌తిభ‌ను కొలుచుట‌కు ప్ర‌య‌త్నించుచు పెక్కు విమ‌ర్శ‌న గ్రంథ‌ములు వెల‌సిన‌వి.