2
 

భార‌తీయ సాహిత్య‌మున‌కు న‌వ‌ల నూత్న‌ము కాదు

ప్ర‌తి వాజ్మ‌య‌మునందు గద్య‌ముక‌న్న ప‌ద్య‌ము ముందు జనించున‌ని విమ‌ర్శ‌కులందురు. జ్ఞాప‌క‌ముంచుకొనుట‌కు వీలగున‌నియు, క్లుప్తుముగ నుండి వ్యాఖ్యానించుట‌కు తావుండున‌నియు మ‌న పూర్వికులు నీతి శాస్త్ర‌మును ప‌ద్య‌రూప‌మున వెలువ‌ఱ‌చియున్నారు. గట్టిద‌న‌ము కాద‌నో విన‌సొంపుగ నుండ‌ద‌నో జ్ఞాప‌క‌ముంచుకొనుట సుల‌భ‌ముకాద‌నో ప్రతి భాష‌లోను మొద‌ట ప‌ద్య‌కావ్య‌ములే చెప్ప‌బ‌డుచు వ‌చ్చిన‌వి. కావున ప‌ద్య‌ము ముందు పుట్టిన‌ద‌న‌వ‌లెన‌ని కొంద‌రి య‌భిప్రాయ‌ము.


న‌వ‌ల‌కు ప్ర‌ధాన ల‌క్ష‌ణ‌ము క‌థ‌ను త‌న‌లో నిమిడించుకొనుట‌. లేదా పెద్ద క‌థ‌యే న‌వ‌ల‌య‌నికూడ న‌న‌వ‌చ్చును. క‌థ్ అను ధాతువునుండి క‌థ‌య‌ను య‌దుమ‌త్ప‌న్న‌మైన‌ది. క‌థ‌య‌న‌గా చెప్పుట‌. ఇట్లు జ‌రిగిన‌ద‌ని చెప్పుట‌యే క‌థ‌. ఒకే సంఘ‌ట‌న‌మును ప‌లువురు చూచిన‌ను ఏ యిద్ద‌రు నొక్క విధ‌ముగ చెప్ప‌రు. ఎవ‌రి వ్య‌క్తిగ‌త భావ‌ముల‌నుబట్టి, సంస్కార‌మును బట్టి వారు వారికి తగిన‌ట్లుగ వ్యాఖ్యానింతురు.


ఇట్లు క‌థ‌లు చెప్పున‌వ‌స‌ర‌ము, త‌మ బిడ్డ‌ల‌కు చెప్ప‌వ‌ల‌సిన య‌గ‌త్య‌ము త‌ల్లుల‌కే గ‌ల‌దు. బిడ్డ‌ల‌కు క‌థారూప‌మున ధ‌ర్మ‌ముల‌ను నీతుల‌ను బోధించుట‌కు త‌ల్లుల‌కీ క‌థా క‌ల్ప‌న మ‌వ‌స‌ర‌మైయుండెన‌నుట హేతుబ‌ద్ధ‌మే య‌న‌వ‌చ్చును. ఒక్కడొక విష‌య‌మును మ‌ఱియొక‌నితో చెప్పున‌పుడు అప్ర‌య‌త్న‌ముగ‌నొక చిన్న క‌థ‌ను చెప్పుచునేయుండును. శిశువు మాట‌లు నేర్చినంత‌నే క‌థ‌ల‌ను విన‌గోరుచున్న‌ది ఇందువ‌ల‌న సాహిత్య క‌ల్ప‌న‌ము ప్ర‌ధ‌మ‌మున గ‌ద్య‌రూప‌మున‌నే యుండును.
క‌ల్ప‌నా చాతుర్య‌ము, వ‌ర్ణ‌నావైవిధ్య‌ము, ఛందోదృష్టి, అలంకారిక మ‌ర్యాద‌ల‌ను జోడించి కావ్య‌త్వ రూప‌మునందుట తదుప‌రి కార్య‌మే య‌నవ‌ల‌యును. ఇది స‌హ‌జ‌ము. క‌థ‌లు వ‌చ‌న‌రూప‌మున‌నుండును. వ‌చ‌న‌మ ప్ర‌య‌త్న‌ముగ వెలుప‌డున‌ది. ప‌ద్య‌మున‌కు కొన్ని నియ‌మ‌ములున్న‌వి. ఈ నియ‌మ‌ములు కృషిచేసి సాధింపద‌గిన‌వి. వాల్మీకిలోని శోక‌ము శ్లోక‌రూప‌మున వ‌చ్చుట‌నుబట్టి మొద‌ట ప‌ద్య‌రూప‌మున‌నే సాహిత్య‌ము వెలువ‌డిన‌ద‌న‌రాదు.

భార‌తీయ సాహిత్య‌మున‌కు న‌వ‌ల నూత్న‌మా ?

న‌వ‌ల అనెడి సాహిత్య ప్ర‌క్రియ ఆంగ్ల‌మునుండియే ప్ర‌పంచ‌మున‌కు వ్యాపించెన‌ని కొంద‌రందురు. మాన‌వ ప్ర‌కృతిని బట్టి ఇట్లూహింప‌రాదు. మాన‌వుడు ప్రాధ‌మికావ‌స‌ర‌ములు తీరిన త‌రువాత బుద్ధిని క‌ళ‌ల‌పై ప్ర‌వేశ పెట్టుట స‌ర్వ‌త్ర నొకేవిధ‌ముగ జ‌రుగ‌వ‌చ్చును. న‌వ‌ల అనే సాహిత్య ప్ర‌క్రియ స‌ర్వ భార‌తీయ ప్రాంతీయ సాహిత్యాల్లోనూ ఆంగ్ల సాహిత్య ప్ర‌భావంవ‌ల్ల ఉద్భ‌వించిందే గ‌ద్య కావ్య‌మును గూర్చి అగ్ని పురాణ‌మునిట్లున్న‌ది.

ఆఖ్యాయికాక‌థా ఖండ‌క‌థా ప‌రిక‌థా త‌థా

క‌థానికేతి మ‌న్యంతే గ‌ద్య‌కావ్యంచ పంచ‌థా


గద్య కావ్య‌మును పంచ‌విధ‌ములుగ విభ‌జించుట‌కు త‌గినంత‌గ గ‌ద్య సాహిత్య‌ము సంపూర్ణ‌త్వ‌ము నందియున్న‌ది. అగ్నిపురాణ ర‌చ‌నాకాల‌మునాటి కాంగ్లేయులు భార‌త భూమిపై కాలిడ‌లేద‌నుట నిర్వివాదాంశ‌ము. క‌థానికా ప్ర‌క్రియ‌ను దిగుమ‌తి చేసికొన‌వ‌ల‌సిన య‌గత్య మిచ్చ‌ట కాన‌వ‌చ్చుటలేదు. మ‌రియు ఖండ‌క‌థ అన‌గా నేడు పుంఖానుపుంఖ‌ములుగ కాన‌వ‌చ్చు స్ర‌వంతి (సీరియ‌ల్‌) క‌థ‌లుగ నూహింప‌వ‌చ్చును. అన‌గా క‌థ భాగ‌ములు భాగ‌ములుగ విభ‌జింప‌బ‌డి యుత్కంఠ‌ను రేకెత్తించుట‌కు కూర్చ‌బ‌డి యుండ‌వ‌చ్చును. క‌థ మొద‌ట చెప్పుట‌తోడ‌నే ప్రారంభ‌మ‌యిన‌ది. క‌నుక రాత్రి విశ్రాంతి స‌మ‌య‌ములో కొంత కొంత‌గ చెప్పుచు కొన్ని రోజుల వ‌ర‌కు సాగించుట‌కూడ‌నై యుండ‌వ‌చ్చును. ఇట్టి స‌మ‌య‌మున ఖండ‌క‌థ కూడ ఒక ర‌క‌మైన ఖండ‌ములుగ ప్ర‌క‌టింప‌బ‌డిన క‌థ‌గ‌ల న‌వ‌ల‌యేయై యుండ‌వ‌చ్చును. క‌థ‌కొల‌ది విస్తృత‌ము క‌ల‌దియు, క‌థానిక స్వ‌ల్ప విస్తృతి క‌ల‌దియు పరిక‌థ నేటి మినీక‌థ‌ల వంటిదియునునై యుండ‌వ‌చ్చును. ఆఖ్యాయిక య‌థార్ధ‌వృత్త‌ము క‌ల‌ది. ప‌రిక‌థ‌కును, క‌థ‌కునుగ‌ల భేద‌ము గ్రంధ విస్తృతిని బ‌ట్టి నిర్ణ‌యించుట‌చేత‌ను కొంద‌రాలం కారికులు ఉప‌క‌థ ను కూడ పేర్కొనుట‌చేత‌ను భార‌త‌దేశ సాహిత్య‌మున గ‌ద్య‌సాహిత్య‌ము వైవిధ్య‌మును సాధించిన‌దని రూఢియ‌గుచున్న‌ది.