28
 


పున‌ర్జ‌న్మ‌


జాత‌స్య‌హి ధృవో వృత్యుర్థ్రువం జ‌న్మ‌మృత‌స్య‌చ అని గీత‌లో చెప్ప‌బడిన‌ట్టు పుట్టిన ప్ర‌తి వ్య‌క్తి యును గిట్ట‌క త‌ప్ప‌దు ఇది ప్ర‌త్య‌క్ష‌ము. కాని త‌త్త్వ‌వేత్త‌లు మ‌ర‌ణించిన‌వారు మ‌ర‌ల పుట్ట‌క త‌ప్ప‌ద‌ని ఘోఙంచుచున్నారు. జ‌న‌న మ‌ర‌ణ విష‌చ‌క్ర‌మునుండి త‌ప్పించుకొని విముక్తుల‌గుట బ‌హుదుర్ల‌భ‌ము. అని అనేక మ‌త‌ముల‌వారు న‌మ్ముచుండిరి. జీవికి పూర్వ‌జ‌న్మ‌లోని స్మృతులుండుట జ‌రుగ‌దు అట్ల‌కాక యెవ‌రికైన‌న‌ట్టి గ‌త స్మృతులున్న‌చోనావ్య‌క్తి స్త్రీయైన‌చో నామె ప్ర‌వ‌ర్త‌న‌ము, పున‌ర్జ‌న్మ‌లోని జాన‌కి పాత్ర ద్వారా చ‌ర్చించుట‌యైన‌ది. భ్ర‌మ‌ర‌వాసిని లోని అమృత ప్ర‌భ‌కు గ‌త‌స్మృతులు లేక‌పోయిన‌ప్ప‌టికి రెండు జ‌న్మ‌ల గాథ‌యుండుట‌చేనీ శీర్షిక క్రింద విమ‌ర్శింపబ‌డిన‌ది.

 

జాన‌కి


లోక‌మున పుట్టిన ప్ర‌తి జీవియు మ‌ర‌ణింప‌క త‌ప్ప‌దు. మ‌ర‌ణించిన ప్ర‌తి జీవియు మ‌ర‌ల జ‌న్మ‌మెత్త‌క త‌ప్ప‌దు. ఈ జ‌న‌న మ‌ర‌ణ చ‌క్ర‌మున ప‌రిభ్ర‌మించుట జీవుడు మోక్ష‌మును పొందిన‌ప్పుడు మాత్ర‌మే అంత‌మ‌గును. ఈ విష‌య‌మున గీత యిట్లు ప్ర‌వచించుచున్న‌ది. జాత‌స్య‌హిధృవో మృత్యుర్ధృవం జ‌న్మ మృత‌స్య‌చ ! కావున‌నీ సంసార చ‌క్ర‌ము నుండి త‌ప్పించుకొనుట య‌సాధ్య‌ము. చ‌నిపోయిన జీవికి మ‌ర‌ల పుట్టక త‌ప్ప‌దు. పుట్టిన త‌రువాత గ‌త‌జ‌న్మ స్మృతులుండుట త‌ట‌స్థించిన‌చో నావ్య‌క్తి యొక్క బాహ్యాభ్యంత‌ర సంఘ‌ర్ష‌ణ‌ములెట్లుండును అన్న విష‌య‌ము పున‌ర్జ‌న్మ న‌వ‌ల‌లో జాన‌కి పాత్ర ద్వారమున విశ్వ‌నాథ‌వారు చెప్ప‌బూనుకొనిరి. కావున‌నీ జాన‌కి పున‌ర్జ‌న్మ సిద్ధాంత‌మున‌కు ప్ర‌తీకయైన‌ది.

రామ‌క్క‌య‌ను యువ‌తికి పురాకృతి సుకృత‌మువ‌ల‌న గ‌త‌జ‌న్మ స్మృతులుండుట‌యు, నామె య‌నేక క‌ష్ట‌న‌ష్టుమ‌ల‌కోర్చి పూర్వ‌జ‌న్మ యంద‌లి ప‌తినే వ‌యోభేద‌మ‌ధిక‌ముగ‌నున్న‌ను వివాహ‌మాడి త‌న పాతివ్ర‌త్య మ‌హావ్ర‌త‌పూర్తిని గావించుకొన్న‌ది. పూర్వ‌జ‌న్మ‌మున నీమె పేరు జాన‌కి. ప్ర‌స్తుత జ‌న్మ‌మున‌కూడ రామ సంబంధ‌మైన నామ‌ము రామ‌క్క‌య‌ని పెట్ట‌బ‌డిన‌ది. జాన‌కి త‌న రెండు జ‌న్మ‌ల‌కు సంబంధించిన బంధువుల యందు గ‌న్బ‌ర‌చిన ప్రేమ య‌తి స‌హ‌జ‌ముగ వ‌ర్ణింప‌బ‌డిన‌ది. జాన‌కి జీవిత‌మున రెండు జ‌న్మ‌ల‌నాధార‌ముగ జేసికొని యొక నిర్ణయ‌మున‌కు వ‌చ్చుట కామె ప‌డిన సంఘ‌ర్ష‌ణ‌ము న‌వ‌ల‌యందంత‌ట నుత్క‌ర్ష‌కల్గు విధ‌ముగ చిత్రింప‌బ‌డిన‌ది.

 

జాన‌కి రామ‌క్క‌గ మ‌ర‌ల జ‌న్మ‌మెత్తుట కేవ‌ల‌మొక వ్ర‌త‌స‌మాస్తి కొర‌కు మాత్ర‌మే. ఆ వ్ర‌త‌ము పాతివ్ర‌త్య‌ము. ఈ న‌వ‌ల రెండు విమ‌ర్శ‌ల‌కు గురికావ‌ల‌సివ‌చ్చును. మొద‌టిది పాతివ్ర‌త్య‌మునున‌దొక వ్ర‌త‌మా ? వ్ర‌త‌ముయిన‌చో వ్ర‌త‌సాధ‌న‌మైన యా భ‌ర్త‌కుండ‌వ‌ల‌సిన ల‌క్ష‌ణ‌ములెవ్వి. ఫ‌లిత‌మెట్లుండును ? రెండ‌వ‌ది పున‌ర్జ‌న్మ సిద్ధాంత‌ము జీవి మ‌ర‌ల జ‌న్మించిన‌చో గ‌త స్మృతులుండునా ? య‌ని సంశ‌య‌ము క‌లుగును.


వ్య‌వ‌హార సౌల‌భ్య‌ముకొర‌కీ న‌వ‌ల‌లోని నాయిక‌కు రెండు నామ‌ములున్నందున జాన‌కియేయ‌నుట జ‌రిగిన‌ది.

జాన‌కి త‌న పూర్వ‌జ‌న్మ‌యందలి భ‌ర్త‌యైన నీల‌కంఠ‌శాస్త్రిని ఒక నాటి సాయం స‌మ‌య‌మున బ‌స్సులో చూచిన‌ది. ఇరువురు నొకరినొక‌రు చూచుకొనిరి. ఇరువురి హృద‌య‌ములు ఆశ్చ‌ర్యానందముతో చైత‌న్య‌ర‌హిత‌ముల‌వ‌లె దిమ్మెర‌పోయిన‌వి. నీల‌కంఠ‌శాస్త్రి మేన‌ల్లుడైన మ‌నోహ‌ర‌ము నీల‌కంఠ‌శాస్త్రిని, మ‌నోహ‌ర‌ము భార్య‌యైన శాంత‌మ్మ జాన‌కిని ప‌ట్టుకొన బ‌స్సునుండి దింపిరి. ఇద్ద‌రును క‌న్నీరు కార్చుచుండుట చూచి మ‌నోహ‌ర‌ము దిగ్భ్రాంతుడ‌య్యెను. అత‌డు జాన‌కితో నీల‌కంఠ‌శాస్త్రి మేన‌ల్లుడన‌ని చెప్పెను. ఆమె అత‌నిని ప‌రకాయించి చూచి నీవు మ‌నోహ‌రానివా గుర్త వ‌చ్చింది. నీ గొంతు గుర్తుప‌ట్టేను అంది. మ‌నోమ‌ర‌మున‌కు ప‌ది సంవ‌త్స‌ర‌ములు వ‌య‌సున్న‌ప్పుడు జాన‌కి మ‌ర‌ణించిన‌ది. రామ‌క్క‌గా పుట్టి ఇరువ‌ది సంవ‌త్స‌ర‌ములైన‌ది. న‌డుమ మ‌ణియొక ప‌ది సంవ‌త్స‌ర‌ముల వ్య‌వ‌ధియున్న‌ది అన‌గా ప్ర‌స్తుత కాల‌మున‌కు రామ‌క్క‌కు ఇరువ‌ది సంవ‌త్స‌ర‌ములు మ‌నోహ‌ర‌మున‌కు న‌లుబ‌ది సంవ‌త్స‌ర‌ములు. ఈ స‌మ‌య‌మున జాన‌కి మ‌నోహ‌ర‌ము గొంతు విని గుర్తుప‌ట్టితిన‌నుట య‌సందర్భ‌ముగ‌నున్న‌ది. మ‌గ‌పిల్ల‌ల‌కు ప‌దునాల్గు ప‌దునైదు సంవ‌త్స‌ర‌ములు వ‌చ్చున‌ప్ప‌టికి కంఠ‌స్వ‌ర‌ము మార్పుచెందుట స‌హ‌జ‌ము. ప‌ది సంవ‌త్స‌ర‌ముల‌ప్పుడు కంఠ స్వ‌ర‌ము కోమ‌లముగ‌నుండుట‌యును, యుక్త వ‌య‌స్సు వ‌చ్చిన‌ప్పుడు గంభీర‌ముగ‌నుండుట‌యును పురుషుల‌కు స‌హజ‌ము, మ‌ర‌ల బాలునికి మ‌ధ్య‌వ‌య‌స్కునికి పోలిక‌ల‌లోకూడ చాలా మార్పుండును. కావున నిచ‌ట కొంత త‌ర్క‌మున‌కు నిలుచుట లేద‌న‌వ‌లెను. కాని భ‌ర్త‌ను గుర్తుప‌ట్టుట‌లోనీ యిబ్బంది లేదు. ముప్ప‌ది యేండ్లప్పుడు చూచిన‌ది. మ‌ర‌ల న‌రువ‌ది యేండ్ల స‌మ‌య‌మున చూచిన‌ది. ఈ మ‌ధ్య‌ద‌శ‌యందు శారీర‌క మార్పులెక్కువ‌గ‌నుండ‌వు. శ‌రీర‌ము కుంచించుకొనిపోవుట‌, కేశ‌ములు నెర‌యుట మొద‌ల‌గు మార్పుల‌ను పోల్చుకొనుట‌కంత క‌ష్ట‌ప‌డ‌న‌క్క‌ర‌లేదు.

జాన‌కి నీల‌కంఠ‌శాస్త్రిని చూచిన సంభ్ర‌మ‌మునుండి య‌త‌ని క‌న్న ముందు తేరుకొనిన‌ది. నేనే. నేనే బ్ర‌తికివ‌చ్చాను అన్న‌ది. త‌మ‌ది గంజ‌న‌గిర‌య‌నియు తండ్రి జ‌మిందారుడ‌ని చెప్పిన‌ది. త‌న‌కు ఆరేండ్ల వ‌ర‌కు మాట‌లు రాలేద‌నిన‌ది. ప‌దేండ్ల వ‌య‌సులోనుండ‌గా నీమెకొక క‌ల‌వ‌చ్చిన‌ది. అందులో ఎవ‌రో ఒక‌రు క‌న‌బ‌డి నీ పేరు రామ‌క్క‌కాదు. నీ పేరు జాన‌కి య‌ని చెప్పిర‌నిన‌ది. ఆనాటినుండియు రామ‌క్క‌కు తాను రామ‌క్క‌ను కాననియు జాన‌కిన‌నియు భావ‌న క‌లుగ‌సాగిన‌ది. క్ర‌మ‌ముగ త‌న‌కు పెండ్లిఅయిన‌ట్లును పిల్ల‌లుకూడ నున్న‌ట్లుగ గుర్తున‌కు వ‌చ్చిన‌ది.

పూర్వ‌జ‌న్మ జ్ఞాన‌ముండుట కోటికొక్క‌రికైన‌ను సాధ్య‌ప‌డ‌దు. అట్లు జ‌రిగినప్పుడా వ్య‌క్తి యంద‌త‌స్సంఘ‌ర్ష‌ణ‌ముండ‌క త‌ప్ప‌దు. జాన‌కిలో కూడ‌న‌ట్లే జ‌రిగిన‌ది. త‌ల్లి త‌న త‌ల్లి కాద‌నియు త‌మ్ముడు త‌న త‌మ్ముడు కాడ‌నియు న‌నిపించిన‌ది. జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి త‌ల్లి కాక‌పోవుట‌యు రక్త‌ము పంచుకొని పుట్టిన తమ్ముడు త‌మ్ముడు కాకపోవుట‌యునుండ‌దు. కాని జాన‌కికి చిన్న‌త‌న‌మ‌గుట‌చే వారినికాక మ‌రియొక‌రిని చూడ‌వ‌లె క‌లిసికొన‌వ‌లెన‌న్న మ‌న‌సులోని యాతుర‌త‌వ‌ల‌న నిట్లు భావించియుండ‌వ‌లెను. మ‌రియు నీమెకు పూర్వ‌జ‌న్మ‌స్మృతులెంత దృఢ‌ముగ‌నున్న‌వో ఆపూర్వ‌జ‌న్మ సంబంధితుల‌గు బంధువుల‌పై ప్రేమాభిమాన‌ములుకూడ‌నంతే దృఢ‌ముగనున్న‌వి.