జానకి మాటలను మనోహరము, శాంతమ్మయును విశ్వసించిరి. వారు నీలకంఠశాస్త్రి, రామక్కల సమాగమమును చూచి, వారి యొక్క భావసంఘర్షణమును అర్థముచేసికొన్నవారు. ప్రత్యక్ష సాక్షులు గనుక నమ్ముటకెట్టి యాటంకము కలుగలేదు. శాంతమ్మ నమ్మినను, నిర్ధారణము చేసికొనుటకై జానకిని నీలకంఠశాస్త్రి యొక్క తోబుట్టువులను గూర్చియు వారి సంసారములను గూర్చియు ప్రశ్నలువేసి సరియైన సమాధానమును రాబట్టుకొన్నది. రెండు దశాబ్దములకుపైగా కాపురము చేయుచున్నను తనకు తెలియని సంగతులనుకూడ జానకి చెప్పుటతో శాంతమ్మ పూర్తిగ విశ్వసించినది. నీలకంఠశాస్త్రికి ఉపనయనమైన తరువాత మరణించిన సోదరుడుండెనని శాంతమ్మకు తెలియదు. ఆ విషయమీమె చెప్పుట విని విస్తుపోయినది.

జానకి తాను మరల నీలకంఠశాస్త్రికి భార్య కావలెనని కోరి జన్మించితినన్నది. అందులకొక కారణముకూడ చెప్పినది. ...నేను మీకు భార్యనై మీయందురమించుటలో నాకొక ఏకాగ్రత సిద్ధించినది అన్నది. అతని సామీప్యమున ఆమెకొక ఏకాగ్రత సిద్ధించినందువలననా ఏకాగ్రతకు సాధనమై భర్తనే తిరిగి భర్తగా పొంది యా వ్రతసమాప్తి చేయదలచుకొంటినన్నది. జానకి తనకు భర్తపై ప్రేమయో లేకనా ఏకాగ్రతపై ప్రేమయో తెలియదన్నది. ఇంకెవరైన భర్తయైనచోనా ఏకాగ్రత కుదురునో, కుదురదోయని పూర్వజన్మలోని భర్తనే మరల పొందునట్లుగ వరము పొందినది. కేవలమామెకు శాస్త్రిపైకన్న వ్రతమునందే ప్రీతియన్నది వ్యక్తావ్యక్తముగ వెలిబుచ్చినది. ఆ పురుషుడికి భార్యనైగదా నేనంత దవ్వు ప్రయాణించాను. మళ్ళీ ఆయనకే భార్యనైతే తక్కిన ప్రయాణం మరికొంత సులభమవుతుందికదా ? అని దివ్యపురుషునితో పలికినది. కావున జానకి తన మార్గము సులభమగుటకొరకు కోరి నీలకంఠుని పెండ్లియాడుటకు జన్మించినదనవలెను. ఆమెకు గత యారు జన్మలనుండి యర్ధాయస్సుగల జన్మలేయన్నది. ఆ పురుషునికి భార్యయై మాత్రమే యంతదవ్వు రాలేదనుట స్పష్టముగ తనకు తెలిసినది. వెనకుటి జన్మ యొక్కటియే యన్నది. తత్పూర్య జన్మలు నాకు తెలియవు. ఈ వెనుక ఒక్క జన్మయే తెలుసును...మీ యందు నాకధికమైన ప్రేమయో, ఆ ఏకాగ్రతయందు నాకధిమైన ప్రేమయో నాకు తెలియలేదు అని జానకి భర్తతో పలికినది.
ఆమె సృష్టికర్తతో సంభాషణ జరిపి మరల జన్మనెత్తినది. జన్మనెత్తుట జీవుని కోరికకు సంబంధించియుండునా పురాకృత కర్మము ననుసరించియుండునా, సృష్టికర్త జీవునడిగి సృజించునా, అను ప్రశ్నలు చింత్యములు. జానకి యొకవిధముగ యమునితో సంభాషించిన సావిత్రి, యముని వలన విజ్ఞాపమును బడసిన నచకేతునివంటిదైనది. నిన్నడిగి నీచేత జన్మ ఎత్తించవలసిన స్థితిలోకి వచ్చావు అని సృష్టికర్త ఆమె యొక్క పాతివ్రత్య మహిమను కొనియాడెను. జీవుల ఇష్టానుసారము సృష్టి జరుగుటయసంగతముగ నున్నప్పటికిని మరణ సమయము జీవుని యొక్క కోరిక ప్రకారము పునర్జన్మమును పొందవచ్చునని శాస్త్రము.
|