43
 

స‌రోజ‌లోచ‌న న్యాయ‌ముకొర‌కు ధ‌ర్మముకొర‌కు రాజునుకూడ త్య‌జింప‌గ‌ల వాంఛారాహిత్య‌స్థితిని చేరుకొన‌గ‌ల్గిన‌ది. వెంక‌న్న‌సెట్టియును దాయాదిచోళుడ‌ను త‌న‌నువాంఛించిర‌ని రాణిరాజుతో చెప్పిన‌ది. రాజు మాత్స‌ర్య‌గ్ర‌స్తుడై త‌న‌ను త్య‌జించిన త్య‌జించుగాక నిర్భ‌య‌ముగ సంగ‌తిని తెలియ‌జేసిన‌ది. వెంక‌న్న సెట్టి త‌న‌కొర‌కు త‌న‌యింట‌వ‌ద‌లిన ర‌త్న‌హార‌ము త‌ల్లిద‌గ్గ‌ర‌యుండెన‌ని దానిని తెప్పింపుమ‌నియు సెట్టినెవ్వ‌రుచంపిరో గ్ర‌హింప‌వ‌లెన‌ని రాజునుకోరిన‌ది. ఆర‌త్న‌హార‌ముతో సెట్ట‌కి స‌మాధి క‌ట్టింప‌వ‌లెన‌న్న‌ది.

జ్యోతిశాస్త్ర‌వేత్త్రియ‌గు నీల‌మ్మ స‌రోజ‌లోచ‌న‌కు ఆయుర్దాయ‌ము మిక్కుట‌ముగ‌లేద‌ని చెప్పిన‌ది. రాజున‌కేదియోనొక యాప‌త్తుక‌లుగున‌ని చెప్పుట‌చేత‌ను రాణియొక యోగ‌మున‌భ్య‌సించుట మొద‌లు పెట్టిన‌ది.

వెంక‌న్న‌సెట్టి తండ్రి క‌న్న‌సెట్టి సాయ‌ముతో దాయాదిచోళుడు కొంద‌రు దుర్గాధిప‌తుల‌ను కూడ‌గ‌ట్టుకొని రాజుపై తిరుగుబాటు చేయ‌బూనెను. యువ‌రాజు సాంప‌రాయుడీ తిరుగుబాటును బ‌హుస‌మ‌ర్థ‌త‌తో త్రిప్పికొట్టెను. కానిరాజున‌కు గాయ‌ములైన‌వి. రాజుగాయ‌ములెంత‌కు మానుట‌లేదు. రాణి త‌న‌యోగ‌సాధ‌న‌మున తానున్న‌ది. బ‌య‌ట‌కువ‌చ్చుట‌లేదు. యువరాజు రాణి యింటికేగిన‌ప్పుడామె క‌నులుమూసుకొని ప‌ద్మాస‌నాసీన‌యై ద్యాన‌మున మునిగియుండెను. సాంప‌రాయుడు గ‌డియ‌లెత్తించ‌గా నాచ‌ప్పుడుకామె క‌నులు తెర‌చిన‌ది. అత‌డు ఏమిచేయుచుంటివ‌ని ప్ర‌శ్నింప‌గానామె చ‌నిపోవుచుంటిన‌ని స‌మాధాన‌మును చెప్పిన‌ది. మ‌ల్ల‌న్న యువ‌రాజుకిట్లు చెప్పెను. మాకుల‌ములో నొక‌యోగ‌మున్న‌ది. కోరిన‌ప్ప‌డు చ‌నిపోవ‌చ్చును దానిక‌భ్యాస‌ము చేయ‌వ‌లెను. రాణిన‌న్న‌డిగెను. నేను నేర్పితిని అన‌గా యువ‌రాజు నిర్విణ్ణుడై వెడ‌లిపోయెను.

రాజుమ‌ర‌ణించెను. శ్శ‌శాన‌మున‌కు గొంపోయిరి. అంద‌రును దుఃఖించుచుండిరిగాని చంద‌వోలురాణి మాత్ర‌మ‌చ‌టికి వెళ్ళ‌లేదు. అంద‌రామెను దూషించ‌సాగిరి. క‌డ‌కుపూల‌తో ప‌సుపు కుంకుమ‌తో నోల‌లాడుచు శ్శ‌శాన‌మున‌కు న‌డ‌చివెళ్ళిన‌ది. అప్ప‌టికే చిన్న‌రాజు సాంరాయుడు రెండ‌వ‌కాష్ట‌మును కూడ‌నేర్పాటుచేసి యుండెను. రాజు మ‌ర‌ణించిన త‌రువాత రాణిజీవించియుండ‌ద‌ని తెలియును గ‌నుకన‌ట్లుచేసెను. రాణివ‌చ్చి కాష్ఠ‌ముల‌పై పండుకొన‌గా ప‌రిష‌త్స‌భ్యులు స‌హ‌గ‌మ‌న‌మున‌క‌డ్డుప‌డిరి. రాణియంత నివ‌త‌ల‌కువ‌చ్చి పాడెపై ప‌డుకొని క‌నులుమూసికొన్న‌ది. కొంత‌వ‌డికామె శ‌రీర‌ము శీత‌ల‌మైన‌ది. ప్రాణ‌ములేద‌నికొంద‌రు నున్న‌ద‌ని కొంద‌రువాదించిరి. ఇట్లురాణి నిష్ర్ర్క‌మించిన‌ది.

రాజురాణుల ప్ర‌థ‌మ స‌మాగ‌మ‌న‌మెంత పేల‌వ‌ముగ న‌డ‌చిన‌దో నిష్క్ర‌మ‌ణ‌వ‌ర్ణ‌న‌ము కూడ‌న‌ట్లే పేల‌వ‌ముగ‌నున్న‌ది. రాణియొక్క మ‌ర‌ణము రాణిచేతుల‌లో నున్న‌ప్పుడు ఆమె రాజు మ‌ర‌ణ‌వార్త వినినంత‌నే ప్రాణ‌త్యాగ‌ము చేయ‌వ‌ల‌సిన‌ది. లేదా అంత‌కుముందుగ‌నే యాప‌నిచేయ‌వ‌ల‌సిన‌ది. ప్రాణ‌ముండ‌గ‌నే రాణిని ప‌సుపుకుంకుమ‌తో నోల‌లాడించుచు బ‌లిప‌శువువ‌లె శ్శ‌శాన‌మున‌కు గొనిరావ‌ల‌సిన య‌వ‌స‌ర‌ము లేద‌న‌వ‌లెను. నిర్మ‌మురాలైన రాణికీయ‌లంక‌ర‌ణ‌ల‌పై మోజుగాని త‌న‌స‌హ‌గ‌మ‌న శీల‌మున‌కు మెచ్చి జ‌య‌జ‌య‌ధ్వాన‌ములు చేయ‌వ‌లెన‌న్న య‌భిలాష‌గానిలేవు. అట్టిత‌రి రాణి ప్రాణ‌ములు నిశ్శ‌బ్ద‌ములోగాక జ‌నుల హాహాకార‌ముల మ‌ధ్య‌, వ్య‌తిరేక నినాద‌ముల మ‌ధ్య‌పోన‌వ‌స‌ర‌ములేదు. ఇట్లు కేవ‌ల‌మామె యోగ‌మును రచ‌యిత నిరూపించుట‌కు చేయ‌బ‌డిన‌ట్లైన‌ది. ఆమెహృద‌య‌మును నాడిని వైద్యులు వ‌చ్చి ప‌రీక్షింప‌వ‌ల‌సిన య‌వ‌స‌ర‌మామె ప్రాణ‌ములంతఃపుర‌మున‌నే పోయిన‌చో నుండెడిదికాదు. లేదా చ‌నిపోయికూడ రాణిత‌న శ‌రీర‌భార‌మును ప‌రుల‌పై వేయ నిచ్చ‌గింప లేద‌న‌వ‌లెను. అట్లైన‌చో నేను, నాది, య‌న్న అహంభావ‌ము రాణిలోనింక న‌శింప‌లేద‌న‌వ‌ల‌సివ‌చ్చును.


ఒక‌వేశ్యా పుత్రిక‌లోనిన్ని సుగుణ‌ములుండుట‌చేత గుణ‌మున‌కే గాని కుల‌మున‌కు ప్రాధాన్య‌మీయ‌బ‌డ‌లేద‌నుట తెల్ల‌ము. మిగిలిన సుక్ష‌త్రియ క‌న్య‌ల‌క‌న్న నీమెలో పూజ‌నీయ‌ములైన గుణ‌ములుండుట‌చేత రాణియ‌న‌గ నీమెయేయ‌ని నుతులు బొందిన‌ది.