మూడవ ప్రకరణము
ఆధిక్య భావము
భర్తకన్న తననధికురాలిగ భావించుకొని భర్తతోసన్నిహిత సంబంధమును మనస్ఫూర్తిగ కలిగియుండలేక సంసారమునునరక ప్రాయము చేసికొనిన వారిలో గంగూలీ ప్రేమకథ నవలలో బాలవర్ణాధిక్యమును భావించిన ధర్మచక్రములోని భట్టిదేవియును విశ్లేషింపబడిరి.
సంగీత ప్రభావము
గానమహిమచే లేనిశక్తికూడ వచ్చునని తనస్వానుభవమును మ్రోయుతుమ్మెదలో విశ్వనాథ ప్రవచించియున్నారు. వేదవతి లోని వేదవతి ఆర్షసంగీతమువలన శరీరము పుష్టినొందుచు యవనసంగీతము వలనక్షీణించు చుండును. అశ్వమేధములోని ఆయేషా సంగీతమునకు జంతువశీకరణ శక్తియున్నది. చిట్లీచిట్లని గాజులు లోని అచ్చరకు పురుషులలోని మోహమును రెచ్చగొట్టగల సంగీతమువచ్చును.
బాల
గంగూలీ ప్రేమకథ నవలలోని బాల తన యాధిక్య భావము (సుపీరియారిటీకాంప్లెక్స్) వలనసంసారమును సుఖవంతము గావించుకొన లేకపోవుట వర్ణితమైనది. ఆమెకున్న సుగుణములన్నియును యీయాధిక్య భావగాఢత్వము వలన తక్కువ ప్రయోజనకారులయినవి. ఆమెయీ భావముతో తనజీవితమును భర్త జీవితమును దుఃఖమయము చేసికొనినది. భార్యాభర్తలిరువురును ఉత్తరదక్షిణ ధృవములవెనుండి పొందికలేని సంసారమునుగడిపిరి. గంగూలీ న్యూనభావముతోడను బాల ఆదిక్యభావము తోడనుండుటవలన వారి బ్రతుకు నిత్యసంఘర్షణమునకు తలపొలమైనది.
గంగూలీయనబడు గంగయ్యతన చదువుకొరకు రైలులోధనమును యాచించుచు బాలతండ్రియైన నరహరి కంటపడెను.
నరహరి తరువాత గంగయ్యను తనయింటికి పిలిపించి బిడ్డవలెయాదరించెను. కొంతకాలమునకు గంగయ్య విశ్వాసపాత్రుడై నరహరి యొక్క ఆస్తి విషయములను వ్యాపారవిషయములను ఆకళింపుచేసికొని అతడు జబ్బుపడినపుడు సర్వ వ్యవహారములను తానే చూచెను. నరహరి గంగూలీ యొక్క ప్రయోజకత్వమును బుద్ధిమంత తనముచూచి బాలను గంగూలీకిచ్చి పెండ్లిచేసెను.
బాలకు మాత్రము పెండ్లికాకముందు గంగూలీయన్నచో నొక విధమైన యధికారభావమున్నది. బాలను తల్లితనతమ్ముని చేసికొనుమనియు తండ్రి తనయొక్క కొడుకును చేసిఈ విషయమై యామెతల్లిదండ్రుల నారతము వాదములు చేయుచు ఘర్షణ పడుచుండెడివాడు. బాలమాత్రము మేనమామను చేసికొందుననిగాని బావను చేసికొందుననిగాని చెప్పకభారమును తండ్రిపైవైచినది. తనను తండ్రి యెవనికి కట్టబెట్టినచో వానిని దైవముగ నెంతుననుకొనినది. కావున బాలకు వారిద్దరిపైననెట్టి భావము లేదనుటస్పష్టము.
గంగూలీని పెండ్లీయాడిన తరువాత నీమెలోనున్న గుంభనాభావము అతనిలో అనుమానములను రేకెత్తెంచుటకు తోడ్పడినది. బాలలో పెండ్లి కాకపూర్వము ధనవంతురాలిననియు, సౌందర్యవతిననియు నంతరంగములోన నున్న రేఖామాత్రపు భావమునకామె పెండ్లయిన తరువాత పతివ్రతనన్న భావముకూడ కలిసియాయాథిక్య భావము ద్విగుణీకృతమైనది. కొనుమనియు బలవంతము చేయసాగిరి. గంగూలీకి నరహరియన్న దైవమువంటివాడు. దిక్కులేని తన కాశ్రయమిచ్చుటకయేగాక కొడుకును చూచినట్లు చూచినాడు. నరహరిచూపిన ప్రేమకు ప్రతిగ తానేమిచేయగలడు. చేతనేగాని లేనినిర్ధనుడు. అయినప్పటికిని గంగూలీకొక మార్గముతోచినది. ఆమార్గముబాల. నరహరిసర్వ ప్రేమకు కేంద్ర స్థానము బాల. ఆ కేంద్రస్థానమును సురక్షితముగ కాపాడుచు పూవులలోపెట్టి పూజించదలచినాడు. ఆ మాటలనే నరహరికి కర్ణామృతముగ వినిపించినాడు. నేను బరాయివాడను మీకుభక్తుడను. మీ మేలుచూచుటతప్ప నాకింకొకకోరికలేదు. మీసర్వస్వముబాల. ఒడుదుడుకులులేకుండ బాల సుఖముగా బ్రతుకవలయునన్నచో నంతయు ధనరూపముగానుండుట మంచిది ! అని బాలక్షేమమును నరహరియెంత వాంఛించుచున్నాడో తానును నంతయే వాంఛించు చుంటినని నరహరి సూచించెను. కాని బాల తనక్షేమమును గంగూలీచతులలో నుంచలేకపోయినది. అతనిసమర్థతపై తండ్రికున్నంత నమ్మకమామెకు లేకపోయినది. బాల గంగూలీల వివాహమైన కొలదిరోజులకే నరహరి యారోగ్యస్థితి క్షీణించినది. బంధువులందరు కుట్రపన్ని ఆస్తికాజేయుటకు ప్రయత్నించుచుండగా బాల యీ విషయమును గంగూలీతో సంప్రదించక తనకు గంగూలీకికూడ గురువైన భీమశంకరమును లేఖవ్రాసిపిలిపించినది. గంగూలీని బంధువులందరు ఇంటియల్లునివలెగాక దిక్కులేక తమపంచన చేరినవానిని చూచినట్లుగా చూడాసాగిరి. బాల తల్లికూడ యిందులకు వ్యతిరేకించలేదు. బాల భీమశంకరమునకు లేఖవ్రాసి పిలిపించుటతో బాల గంగూలీ జీవనాయాత్రా రథముసాగకముందే మొదట యాటంకము కల్గినట్లైనది. గంగూలీకీవిషయమాగ్రహము తెప్పించుటయేగాక బాలకుతనను పెండ్లియాడుట యిష్టము లేదనియు తండ్రి చెప్పినందున చేసికొన్నదనయు నొకవ్యతిరేకభావము ముంటివలె పొడనూపినది. పెండ్లయిన క్రొత్తదినములయినంత మాత్రము నతలనతోనేల మాట్లాడరాదు అనుభావముకల్గినది. నేను నా భర్తతో మాటలాడుదును. కాదనుటకు మీరెవ్వరన్నచో వారేమియును చేయలేరు.
ఆమెకు నాయందు వైముఖ్యము కలదు. తండ్రిమాటలకు గట్టుపడిననుబెండ్లాడినది వివాహమైన కొలదికాలమునకే గంగూలీకిట్టి భావము కల్గుటకుకారణము బాలగంగూలీయొక్క కార్యనిర్వహణ సామర్థ్యమెరగక పోవుటచే సంభవించినది. భర్తయైనవాడు వారియాస్తి పాస్తులగురించి గత కొన్ని సంవత్సరములుగ చూచుచున్నవాడు తననుగాదని భీమశంకరమునకు లేఖవ్రాయుట యెందులకు ? అని గంగూలీకి కక్షకలిగినది. వీరినెట్లుసాధింపవలెనోయట్లు తాను సాధించితీరును అని నిశ్చయించుకొనెను. భీమశంకర మాస్తి విషయములో నేమిచేయలేడనుకొనిన గంగూలీభావనకు విరుద్ధముగ భీమశంకరము వ్యవహారమును తేల్చి వేయుటతో నొకరకమైన యుక్రోషము కలిగినది. గంగూలీ భీమశంకరమును పిలిపించితివికదా అతడేమిచేయగలిగెనని భార్యను హేళనచేయదలచెను. ఆయాశపోయినది. భీమశంకరము చేయించిన ఆస్తి విషయము గంగూలీకి కోపకారణమైనది.
ఆస్తిపైకూడ గంగూలీ కెట్టి స్వేచ్ఛలేకుండ భీమశంకరముచేసెను. అతడు గంగూలీకెట్టి స్వతంత్రము లేకుండాచేసితినని నరహరితో చెప్పుచునిట్లనెను. గంగూలీ బాలయిష్టములేకనేపని జేయరాదు. అతని చేతకాగితము వ్రాయించి బాలచేతిలో పెట్టితిని. ఆస్తియున్నను, స్వేచ్ఛయిచ్చినను, ధనమును నాశనము చేసెడిగుణమతనికిలేదు. ఈరకమైన వీలునామా గంగూలీయాత్మాభిమానమును దెబ్బతీసినది. ప్రేమపాలితురాలు కావలసిన భార్య ఆర్థికసూత్రము వలనతనకు పైచేయియైనది. ఈ యూమయే గంగూలీలోమేల్కొని యనేకమైనదురూహలకు పగలకు నిలయమైనది. ఇట్లుచేసినది భీమశంకరమేగాని బాలకాదని సరిపెట్టుకొనెడివాడేగాని బాల మాటలందులకు విరుద్ధముగలేవు. గంగూలీ భీమశంకరమును ద్వేషించుట ప్రారంభించినాడు. బాలకు తనకు మధ్యనొక రేఖయున్నది. వారి ప్రథమ సంభాషణమిట్లు నడచినది. మాయూరిలోనన్ను నాయింటివెలరాలేదు అనినది. భీమశంకరమునకు పెండ్లికివచ్చునప్పుడు దారిఖర్చులకు ధనమీయలేదనినది. భీమశంకరము గంగూలీకి పగవాడైనాడు. కావున నతని ప్రసక్తి భార్యయెత్తుటతో గంగూలీ మరింత బిగిసినాడు. మరియుబాల భర్తను డబ్బడిగినచో నిచ్చెడివాడోకాదో గానియామె నాడబ్బురాలదనుటతో నామాటలలోనున్న స్వపరబేధమును పట్టించుకొనినాడు. ప్రథమసమాగమము ధనవిషయమై వ్యాపారతుల్యముగ నడచినది. భార్యాభర్తల నడుమనేర్పడవలసిన మృదుభావమిచట లోపించినది. జీవితపరమావధిక నెంచెను. కానియామె గంగూలీకట్టి యవకాశమీయలేదు.
ఇంతటితో గంగూలీమనసు కరడుగట్టి స్వపరభేదము లేకుండ నందరిని ద్వేషింపమొదలిడెను. సంసారము కలతలతో సాగిపోవుచుండగా బాలప్రథమ సంతానమునుగన్నది. వీరికలహములిప్పుడైన వెనుకకు పట్టెడివేమో ? బాల పిల్లవానికేమి పేరుపెట్టవలెనని భీమశంకరమునకు లేఖ వ్రాముటతో మరింతబిగి వారి మధ్యనేర్పడినది. భీమశంకరము పెట్టుమని వ్రాసిన మురళి యనునామము పిల్లవానికి పెట్టుటతో గంగూలీ కొడుకును కూడదూరము చేసికొనవలెనని తలచెను. మేడపైన గంగూలీ క్రిందబాల యుండుటచే నతడు కుఱ్ఱవానకై క్రిందికి వచ్చుటగాని కుఱ్ఱవానిని పైకి తీసుకొనివెళ్ళుటగాని జరుగుటలేదు.
మరల మురళి యక్షరాభ్యాస ఘట్టమువచ్చినది. బాల భీమశంకరము చేతనక్షరాభ్యాసము చేయింతుననినది. గంగూలీకి భీమశంకరమన్నచో పడదనిబాలకు తెలియును. గంగూలీకి నచ్చచెప్పియొప్పించి భీమశంకరమును పిలిపించలేదు. భీమశంకరమును పెరటియింటిలోపెట్టి మురళి కతనిచేత చదువుచెప్పించ మొదలిడినది. ఎదురుగా భీమశంకరము మసలుచుండగా గంగూలీలోని ద్వేషాగ్నియు పగయునారుట కవకాశములేక రవరవలాడుచుండెను. బాలతాను గృహసామ్రాజ్ఞగ నధికారము చెలాయించుటలో గంగూలీని ప్రక్కకు నెట్టినదినియే చెప్పవలెను. సర్వవ్యవహారములు నామెయిచ్ఛప్రకారము జరిగిపోవుచున్నవి.
బాలతనను ప్రేమించుటలేదు. ప్రేమించదు అన్న భావము గంగూలీయందు గాఢముగనున్నది. వివాహమునకుముందే బాలచర్యల వలన నిట్లూహించినాడు. ఆ బాలకు నేనన్నచో నెట్లుండునో మీకు దెలియునా ? వారి వ్యవహారములను జక్క జెట్టుటలో నేనొకసాధనమును, నేనన్నచో నామెయభిప్రాయ మింతియే అంతకుమించి చిల్లిగవ్వంత పెచ్చులేదు అని భీమశంకరము తోననెను. అందులకు కారణముకూడ నిట్లుచెప్పెను. నరహరి దంపతులు తననుబిడ్డవలె జూతురుగాని బాలపెఱవానివలె జూచును. అప్పుడప్పుడామె గొంతులో యధికారము తొంగిచూచుననెను. అగౌరవము చేయదుగాని యాజ్ఞాపించినట్లుండుననెను.
|