51
 

ఆయేషా

 

అశ్వ‌మేధ మ‌ను న‌వ‌ల‌లో పుష్య‌మిత్రుని మేన‌ల్లుడు, పుష్య‌మిత్రుని య‌శ్వ‌మున‌కు చేసిన య‌ప‌కార‌మున‌కు మ్లేచ్ఛుల‌పై ప‌గ‌దీర్చికొనుట ప్ర‌ధానాంశ‌ము ప‌గ‌దీర్చుట‌లో సాయ‌పడిన మ్లేచ్ఛ స్త్రీ ఆయేషా. పుష్య‌మిత్రుని మేన‌ల్లుడు మ్లేచ్ఛుల‌చే న‌వ‌మాన‌ముపొంది ప‌గ‌దీర్చుకొనుట‌కు మ్లేచ్ఛుల‌లో క‌ల‌సిపోయెను. ఈయ‌న త‌న‌పేరును మిర్త‌పాయ‌నెను. మిర్త‌ఫాయ‌న‌గా పుష్య‌మిత్రుని మేన‌ల్లుడ‌ని య‌ర్ధ‌ము మిర్త‌ఫాగొప్ప జ్యోతిశాస్త్ర‌వేత్త‌. మిర్త‌ఫామ్లేచ్ఛ‌యైన అయేషాను పెండ్లిచేసికొనెను. ఈమ‌కిది మూడ‌వ పెండ్లి.

ఆయేషాకు మంత్ర‌తంత్ర‌ముల‌లో ప్రావీణ్య‌మున్న‌ది. సౌంద‌ర్య‌వ‌తి యుక్తిప‌రురాలు. ఈమెను పెండ్లియాడిన వారాదేశ‌మున‌కు బ‌ల‌వంతుల‌గుదురు. ఏల‌య‌న ఆయేషాకు ప‌దిమంది సోద‌రులు ఒక్కొక్క‌రి య‌ధీన‌మున వంద‌మంది క‌ఠారిగాండ్రుండెద‌రు ఆసోద‌రులంద‌రికిని ఆయేషా ఆనిన మిక్కిలి య‌భిమాన‌ము. ఇంత‌టి ప్ర‌భావ‌ముగ‌ల మిర్త‌ఫాను కోరుట మిర్త‌ఫాయొక్క య‌దృష్ట‌ము. అత‌ని ప‌గ‌తీర్చుకొనుట కామె సాయ‌ప‌డ‌గ‌ల‌ద‌ని మిర్త‌ఫాభావించి యంగీక‌రించెను.

ఆయేషా మొద‌టిభ‌ర్త‌ను జ‌ల‌యుధ్ద‌ముల‌లో నాదేశ‌పాల‌కుడు చంపించి వేసెను. అంత‌నామె ఠింఠాక‌రాళుడ‌న్న‌వానిని రెండ‌వ‌భ‌ర్త‌గ స్వీక‌రించిన‌ది. ఠింఠాక‌రాశుడీమెనుకోరి పెండ్లియాడెను. ఇత‌డు క‌నుమ‌మార్గ‌మున‌కు ర‌క్ష‌కుడు ఇత‌నినికూడ నాయ‌కుడు చంపించివేసెను. ఆస‌మ‌య‌మున మిర్త‌ఫాఠింఠాక‌రాళుని యింట సేవ‌లుచేయుచు అత‌ని పిల్ల‌ల‌ను సాకుచు. అత‌ని త‌ల్లికి చేదోడు వాదోడుగ నుండెను. ఆయేషా ఠింఠాక‌రాశుడు జీవించి యుండ‌గ‌నే మిర్త‌ఫాను ప్రేమించిన‌ది. మ్లేచ్ఛుల‌యాచార‌ము ప్ర‌కార‌ము భ‌ర్త బ్ర‌తికి యుండ‌గా నా స్త్రీ యిత‌రునితో నెట్టి శారీర‌క సంబంధ‌మును పెట్టుకొన‌రాదు. ఆయేషా గృహిణీ ధ‌ర్మ‌మున‌కు మ‌చ్చ‌రాకుండ భ‌ర్త‌క‌ను కూల‌వ‌తిగ నుండెడిది. ఆమెకు మిర్త‌ఫాపైగ‌ల మ‌క్కువ‌ను గృహిణీ ధ‌ర్మ‌ముగ‌నే యుండున‌ట్లు అత‌నికి సాయ‌ప‌డుచు నుండెడిది. మిర్త‌ఫాకు ఠంఠాక‌రాళుని పిల్ల‌ల‌న్న‌చో ప్రేమ‌యుండుట‌చే నామెకూడ న‌త‌నిని మంచి చేసికొనుట‌కు పిల్ల‌ల‌ను ప్రేమ‌గ జూచుచుండెడిది. అన‌గా అయేషాలోనున్న స‌వితి బిడ్డ‌ల‌పైగ‌ల మాత్ప‌ర్య‌ము నామె ప్రేమ జ‌యించిన‌ద‌ని చెప్ప‌వ‌చ్చును.

ఠింఠాకరాళుడు అభిసార రాజ్యాధిప‌తిచే హ‌తుడ‌యిన త‌దుప‌రి ఆయేషాకు త‌న ప్రేమ‌ను వెల్ల‌డి చేసికొనుట క‌వ‌కాశ‌ము వ‌చ్చిన‌ది. అత‌నిని లొంగ దీసికొన‌ద‌ల‌చి త‌న‌కుగ‌ల మంత్ర తంత్ర‌ముల‌ను ప్ర‌యోగించి మిర్త‌ఫాను ఆశ్చ‌ర్య‌చ‌కితుని గావించిన‌ది.

ఆయేషాకు జంతువుల‌ను వ‌శీక‌ర‌ణ మొన‌ర్చు కొన‌గ‌ల విద్య తెలియును. ఆమె తానొక పాట‌పాడును. ఆపాట‌కామె యెదుట‌నున్న జంతువేదియైన‌ను కుక్క‌గాని, గుఱ్ఱ‌ముగాని, ఎలుగుగాని, ల‌య‌తో క‌ద‌ము త్రోక్కును. ఒక్కొక్క చ‌ర‌ణ‌ము పాడు న‌ప్పుడా జంతు వొక్కొక్క దిక్కును మార్చుచుండును. చివ‌రి చ‌ర‌ణ‌మును త్వ‌రిత‌గ‌తిని పాడ‌గా నా జంతువు త‌న వెన‌క కాళ్ళు జాడించి త‌న్నును. అచ్చ‌ట నెవ‌రున్న‌ను ఆధాటి కాగ‌లేదు. ఇట్టి పాట నామె కుక్క‌పై ప్ర‌యోగించుట‌ను చూచిన మిర్త‌ఫా యోచించెను. ఈమె త‌న ప్రేమ‌ను మిర్త‌ఫాకు చెప్పిన‌ది. మిర్త‌ఫా మాత్ర‌మామెను ప్రేమించ‌లేదు. త‌న క‌క్ష‌ను తీర్చుకొనుట కామెను సాధ‌న‌ముగ చేసికొన‌వ‌చ్చున‌న్న త‌లంపుతో నామె నంగీక‌రించెను.

ఆయేషా చిన్న త‌న‌ముప్పుడామె నివ‌సించు వీధిలోనొక‌ ముస‌ల‌మ్మ మ‌ర‌ణించిన‌ది. ఆమె మంత్ర‌గ‌త్తెయ‌ని ప్ర‌తీతి. ఆయేషా ఆముస‌ల‌మ్మ స‌మాధి వ‌ద్ద‌కు వెళ్ళి స‌మాధిని పెక‌లించి ముస‌ల‌మ్మ నాహ్వానించిన‌ది. త‌న‌కేదైన మంత్ర‌ము చెప్పుమ‌ని కోరిన‌ది. అర్ధ‌రాత్రి శ్శ‌శాన‌మున‌నెంత‌టి యోధుడైన‌న‌ట్లు చేయ‌లేడు. ఆయేషా అట్లు చేసిన ద‌న‌గా నామె పిశాచియ‌ని మిర్త‌ఫా భావించెను. ఆముస‌ల‌మ్మ ఆమె క‌నేక తంత్ర‌ముల‌ను నేర్పిన‌ది. అందువ‌ల‌న ప్ర‌జ‌ల‌కు ఆయేషా య‌న్న‌చో భ‌య‌ము. ఆమె వెంట నెప్పుడు నొక కుక్క‌యుండును. ఇట్లు కుక్క‌యుండుట మంత్ర‌గ‌త్తెల ల‌క్ష‌ణ‌మ‌ని ప్ర‌జ‌లీమెను చూచి భీతిచెందెడివారు. పెండ్లికాని క్రిత‌మొక‌నాడు ఆయేషాకు మిర్త‌ఫా మీద కోప‌ము వ‌చ్చి ఒక తంత్ర‌మును ప్ర‌యోగించిన‌ది. కాని యాప్ర‌యోగ‌ము మిర్త‌ఫా యెడ‌ల విఫ‌ల‌మ‌గుట‌చే న‌త‌డామెక‌న్న శ‌క్తి మంతుడ‌ని భావించి య‌త‌నిని ప్రేమించుట మొద‌లు పెట్టిన‌ది. స్త్రీ మ్లేచ్ఛ‌యైన‌ను కులీన‌యైన‌ను దుష్టురాలైన‌ను త‌న‌క‌న్న ప్ర‌తిభావంతునిగాని ప్రేమింప‌ద‌న్న వాద‌మే ఆయేషా సూచించు చున్న‌ది. అంతకు ముందు ఇద్ద‌రి భ‌ర్త‌ల‌పైన నీమెకు ప్రేమ‌లేదు. తాను ప్రేమించుచున్న మిర్త‌ఫాకు త‌న‌పై ప్రేమ‌లేద‌ని తెలిసికూడ ఆయేషా అత‌నినే వాంఛించిన‌ది. అంతియ‌గాక ఠింఠాకరాళుని పిల్ల‌ల‌ను మిర్త‌ఫానిర్వ్యాణ‌ముగ ప్రేమించుట‌చేత న‌త‌ని స‌హృద‌య‌త‌కు కూడ ఆయేషా వ‌శంవ‌ద‌యైన‌ద‌న‌వ‌లెను. అత‌డు న‌డుమువంచి ప‌నిచేయుట‌, జ్యోతిశ్శాస్త్ర వేత్త‌య‌గుట‌, ధైర్య‌శౌర్యాదుల‌ను క‌లిగి యుండుట వ‌ల‌న కూడ నామె ముచ్చ‌ట ప‌డిన‌ది. ఆమె ప్రేమ‌ను మిర్త‌ఫా గ్ర‌హింప‌క తాను మంత్ర‌దేవ‌త‌యొక్క క‌రుణ‌కు దూర‌డైన‌ప్పుడామె త‌న‌ను ప్రేమింప‌ద‌ని త‌ల‌చెను. అదియొక పిశాచాకృతి య‌ని మిర్త‌ఫా ఆమె ప్రేమ‌ను గ‌ణించుట‌లో పొర‌బ‌డెను. అత‌డు మ్లేచ్ఛుల‌తో క‌ల‌సి మ‌త భ్ర‌ష్టుడైన‌వాడు. ఆహోరాత్ర‌ములు ప‌గ‌దీర్చుకొను విధాన‌మును గూర్చి యోచించిన‌వాడు. ఆయేషా సంపూర్ణ స‌హకార‌ముతో ప‌గ దీర్చుకొన‌ద‌ల‌చిన‌వాడు. అట్టి మిర్త‌ఫా ఆయేషాను పిచాచిగ పేర్కొనుట‌లో న‌త‌ని పైశాచిక‌త్వ‌మేద్యోత‌క మ‌గుచున్న‌ది.

మిర్త‌ఫా పుష్య‌మిత్రుని ప్రియ‌మైన అశ్వ‌మును దొంగ త‌న‌ముగ న‌ధిరోహించి య‌వ‌న‌దేశ‌ము వ‌చ్చిన‌ప్పుడా య‌వ‌నులు ఆ గుఱ్ఱ‌మును బంధించి, దానిని చిత్ర‌హింస‌లు పెట్టిరి. ఆహింస‌ను మిర్త‌ఫా మ‌దిలో ప‌దిల‌ముగ భ‌ద్ర‌ప‌ర‌చుకొని వారితో క‌లసి మెల‌సి జీవించువారిని విశ్వాస‌మును పొంది వారి చేతుల తోడ‌నే వారి కండ్ల‌ను పొడిపించుట‌కు సిద్ధ‌ప‌డిన‌వాడు. ప‌రిస్థితుల‌న్నిటిని త‌న‌క‌నుకూల‌ముగ కూడ‌గ‌ట్టుకొని లేఖ‌ల‌ద్వారా పుష్య‌మిత్రునిచే ఆశ్వ‌మేధ యాగ‌మును చేయింప ద‌ల‌పెట్టినాడు. య‌జ్ఞాశ్వ‌ము య‌వ‌నుల‌చే హింస‌లు ప‌డిన య‌శ్వ‌మున‌కు క‌వ‌ల‌. పుష్య‌మిత్రుని య‌జ్ఞాశ్వ‌ము మ‌వ‌న‌దేశ‌మున‌కు రాగా ఆయేషాచే జంతువ‌శీక‌ర‌ణ గాన‌మును చేయించెను. అశ్వ‌మును హింస‌లు పెట్టిన ముప్ప‌దియారు మందిని మిర్త‌ఫా మాయోపాయ‌మున నొక‌చోట బంధింప చేసెను. ఆయేషా పాట‌పాడ‌గా చివ‌ర చ‌ర‌ణ‌మున కాయ‌శ్వ‌ము వెనుక కాళ్ళ‌తో న‌చ‌ట బంధితులైన య‌వ‌నుల‌ను పాద‌తాడ‌న‌మున హ‌త‌మార్చిన‌ది. విచిత్ర గ‌తుల‌లో నాట్య‌ముచేసి శ‌త్ర‌తాడ‌న‌ము చేసిన‌ది. వారంద‌రి క‌నులు, ముక్కు, నోరు రక్త‌ముతో నేక‌ముకాగా మిర్త‌ఫా యానంద‌ప‌డెను. ఆస‌మ‌య‌మున శ‌త్రువుల న‌నేక భంగుల దూషించెను. ఈ సంఘ‌ట‌న‌మును వ‌ర్ణించుచు మేధావి భ‌ట్టున‌కొక లేఖ‌ను మిర్త‌ఫా వ్రాసెను. అందులో నాప్ర‌తీకార చ‌ర్య‌క‌యేషా యెంత సందోషించిన‌దో అని వ్రాసెను. ప‌గ మిర్త‌ఫాది. వార‌త‌ని శ‌త్రువులు. అశ్వ‌ము త‌న మేన‌మామ‌ది సంత‌సించిన‌ది కూడ‌తానే. కాని ఆయేషా యొక్క పిశాచాత్మ‌యెంత సంత‌సించిన‌దోయ‌ని మిర్త‌ఫా వాపోయినాడు.

అటువంటినీచ కార్య‌మున‌కొక హృద‌య‌ము సంతోషించున‌ని మిర్త‌ఫా యూహించెన‌న‌గా నిది స్వానుభ‌వ‌మును ప‌రుల కంట‌గ‌ట్టుట త‌న హృద‌య‌ము వంటిదే ఆయేషా హృద‌య‌మ‌ని మిర్త‌ఫా భావించెను.

మిర్త‌ఫా యొక్క ప్ర‌తీకార‌ము య‌జ్ఞార్ధ‌ము నిర్ధేశించిన ప‌ర‌మ ప‌విత్ర‌మైన హిర‌ణ్య‌గ‌ర్భ తుల్య‌మైన‌, దీక్షాబ‌ద్ధ‌మైన యాగాశ్వ‌ముచేత ముప్ప‌ది యారు హ‌త్య‌ల‌ను చేయించిన‌ది. భూప్ర‌దిక్షిణ‌ముచే ప‌విత్ర‌ము కావ‌ల‌సిన యాగాశ్వ‌ప‌ద‌ములు ర‌క్త పంకిల‌ములై న‌ప‌విత్ర‌ములైన‌వి.


మిర్త‌ఫా కావ‌ల‌సిన‌ది మామ‌క రాజ్యాధిప‌త్య‌ము వ‌చ్చుట త‌న ప్ర‌దీకార‌ము తీరుట మాత్ర‌మేగా య‌జ్ఞ‌నిర్వ‌హాణ‌ముకాదు. అందుచేత యాగాశ్వ‌ముచేత నీచ కార్య‌మును చేయించినాడు.

అయేషా కిందెట్టి దోష‌మును లేకుండ‌ట గ‌మ‌నార్హ‌ము. ఆమె యోచ్చ‌ట‌ను త‌న ధ‌ర్మ‌మును వీడ‌లేదు. శీల‌మును కోల్పోవ‌లేదు. ప్ర‌తిభ‌తో చాతుర్య‌ముతో భ‌ర్త నారు రాజ్య‌ముల క‌ధిప‌తిని చేసి త‌న సంగీత ప్ర‌భావముతో భ‌ర్త యొక్క ప్ర‌తీకార‌మును తీర్చిన‌ది. స్త్రీర‌త్నం దుష్కులాద‌పియ‌ను మ‌నుధ‌ర్మ సూత్ర‌ము నాధార‌ము జేసికొని చిత్రింప‌బ‌డిన ఆయేషా పాత్ర సంగీత ప్రాధాన్య‌మైన‌ది.