ఆమెకు తాను కోల్పోయిన శీలముయొక్క విలువనుచ మరల సన్మార్గమున నడచుటకు గల యవకాశములను గూర్చి ధర్మారావు పురాణేతిహాసముల కథల ద్వారా చర్చలద్వారా యెఱింగించెను. ఆమెకు సౌశీల్య సంపత్తిని గుఱించి ధర్మ శాస్త్రములను గుణించియు పరోక్షముగ వివరించిన వాడు ధర్మారావు. ధర్మారావుతో పరిచయము కానంతవరకు మనసునందు వివేచనకలిగినదే గాని వివేకము కలుగలేదు. పరోక్షముగ ననగ నలుగురు మిత్రులుచేరనపుడు ఉపన్యాసముల రూపమున బోధించెను.
పంకజమ్మ గారింట జరుగు సాహిత్యకాలక్షేప సమయములో మంగమ్మకు ధర్మారావును చూచుటయు నవకాశము కలిగినది. అచటవారు ప్రాసంగికమున శీలమును గూర్చియు పాతివ్రత్యమును గూర్చియు చర్చించుకొనిరి. మంగమ్మకు ధర్మారావు చెప్పిన మాటలు హృదయమున హత్తుకున్నవి. మనసుచంచలమైనది బుద్ధితోదానినదుపులో పెట్టవలెనని ధర్మారావు చెప్పెను. తానుచేసినపని సరియైనది కాదని వగచుసమయమున ధర్మారావు మాటలు ఔషధతుల్యములైనవి. ఆ మాటల నామె మననము చేసుకొనుటయేగాక తనమిత్ర బృందముతో నామాటలను గురించి చర్చించెడిది. కాలక్రమమున మంగమ్మ ధర్మారావును శిష్యురాలై గురువునకు ఖ్యాతి తెచ్చునట్టిది కాగల్గినది.
ధర్మారావుపై నా హృదయ కేదారములో నేర్పడిన గౌరవభావ బీజముకురించి క్రమముగ మహావృక్షమైనది.
రాధాపతి తోడి సహవాసమువలన లోకపు తీరును మనుష్యుల ఆలోచలన తెన్నులును గ్రహింపగలిగినది. సారంగధర నాటకములో చిత్రాంగి పాత్రను ధరించి ప్రేక్షకులను మెప్పించినది. మంగమ్మకు ధర్మారావు తరువాత కుమారస్వామి యన్న కుఱ్ఱవానిపై అభిమానము. అతడును భావములలో ధర్మారావును దమ్మునివంటివాడు. సంప్రదాయమున్న ప్రేమగలవాడు.
కాలము గడుచుసరికి మంగమ్మలో విమర్శనా జ్ఞాన మధికమైనది. విశ్వనాథ వారి పాత్రపోషణాత్మక ప్రతిభయేమనగా వారు వ్యక్తులలో మంచిగాని చెడుగాని మార్పు తేవలయునన్నపుడు, అందులకనుగుణముగ రంగమును సిద్ధముచేసి యామార్పు క్రమక్రమముగ వచ్చునట్లు చేసెదరు. అట్లే మంగమ్మ తనకు తానే సంప్రదాయములోని బాగోగులను గూర్చి యోచించి నిర్ణయించుకొన స్థితికి చేరుకొనినది. బాట్ మింటన్ షింగ్‌పాంగ్ వంటి పాశ్చత్య క్రీడలయందు ప్రావీణ్యమును సంపాదించినను భారతీయ క్రీడలకే ప్రాధాన్యమునిచ్చినది. బాట్‌మింటన్ వంటి క్రీడలకు ధనవ్యయమగుననియు నాధనముతో బీదలకుదర పోషణ చేయవచ్చుననియు నార్థిక వాదమును లేవనెత్తినది.
మంగమ్మ జీవితమును మూడుభాగములుగ విభజింప వచ్చును. మొదటిది అజ్ఞానదశ, రెండవది పరిణామదశ, మూడవది ప్రక్షానదశ. రెండవదైన పరిణామము మంగమ్మ యజ్ఞానదశకు ఫలితముగ వచ్చినది. పరిణాయదశాఫలితమే పశ్చాత్తాపము. ప్రక్షాళన కొరకీదళలో నీమెకృషిసల్పినది. మొదటిదశలోని పొరపొటునకు మూడు దశలలోననుభవించినది.
ధర్మారావు స్వయముగ నెట్టిఘనకార్యమును చేయకపోయినను కొందరవ్యక్తులను తన ప్రభావముచే జ్ఞానవంతులను చేసెను. ధర్మారావు యొక్క ముద్రపగిన స్త్రీలలో గిరిక మధురభక్తియును, అరుంధతి పాతివ్రత్య మార్గమునను, మంగమ్మ భక్తిజ్ఞానమార్గముల నవలంబించి యుత్తమ మార్గగామినులైరి. ఏ యొక్కరిని ధర్మారావు శాసకునివలె నిట్లుచేయమని శాసింపడు. మనసంప్రదాయమిదియని తెలియజెప్పుటయేనతడు చేసినది. అందులకే మంగమ్మ యితనిని గురభావముతో చూచెడిది.
మంగమ్మ పాపపుణ్యములు, ఉచితానుచితములు యోచింపమొదలిడిన తరువాతనామెలో నొకవిధమగు మార్పుకలుగజొచ్చినది. తాను చేసినపాపము ననుభవింపదలసినది.
మంగమ్మ తన మనస్సునకు ప్రతీకవంటి యొక కోతిని పెంచ మొదలిడినది. దానికి వాలయన్న పేరిడినది. వాలిసోదరుని భార్యయగు తారనుకోరి చివరకు శ్రీరామచంద్రుని చేతులలో మరణించినట్లుగ తాను ధనమును కోరినీతిబాహ్యురాలైనను కడకు రామనామ జపముతో విముక్తి నందదలచినది. తనవలెనే వాలి కూడ మొదట పాశ్చాత్యనాగరికతనను సరించి టోపి ధరించినాడు. తరువాత హైందవసంప్రదాయానుగుణముగ నామము లను పెట్టికొనినాడు.
మంగమ్మ చెలియని కట్టలోని రత్నావళి వంటిది. పతితురాలగుట పిదప పశ్చాత్తప్తురాలగుటలో రత్నావళి వంటిది. సరస్వతివలె విచక్షణగలిగి ఆర్థికసూత్రములను, సోషలిజము సూత్రములను సుగ్రాహ్యములు చేసికొనినది. రత్నావళి జ్ఞానమార్గమున నడచి పశ్చాత్తాపము తనను మించిపోగా నాత్మహత్యా సదృశముగ సముద్ర తరంగ భీకరగతి కెదురునడిచినది. మంగమ్మ పశ్చాత్తాపముతోపాటు భక్తిజ్ఞాన వైరాగ్యాదలను జీర్ణించుకొని యోగమార్గమున నడువదలచినది. తనప్రాణములను తీయుటకు కొందరు ప్రయత్నించుచుండిరని గ్రహించికూడ నిశ్చితంగా నుండ గల్గిన సుస్థిర వైరాగ్యమీమెకబ్బినది. అత్యంత చపలమైన హృదయకపిని బంధించుటకు మంగమ్మ యెట్టిసాధన చేసినదో యెంత తపన జెందినదో యనూహ్యము శంకరాచార్యులవారు హృదయకపి మిక్కిలి చపలమైనది. దానిని భక్తిచే బంధించి నీయధీనము చేసికొనుము పరమేశ్వరా యని ప్రార్ధించి హృదయకపి మత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివభవదధీనం కురువిఛో అనిరి. అట్టిమన కపిని మంగమ్మ క్రమశిక్షణలో నుంచగలిగినది. ఏకాదశులయందు పవాసము, స్నానము జపము వటి యాచారములను పాటించెడిది.
ఉపవాసములుండుట మొదలైన కార్యములు శరీరమును మనసును క్రమశిక్షణమున నుంచుటకుపయోగించును. మనసులో కల్గుసంకల్పమును కార్యాచరణమునందు పెట్టుసాధనము శరీరమేకాదా మనసును బంధింపవలె నన్న శరీరమును మనసు యొక్క యధీనములో నుంచవలయును. శరీరము యొప్పుడు మనసుకు లొంగునో అప్పుడు మనస్సు బుద్ధికి వశమగును. తరువత జ్ఞానమువలన నాత్మానుభూతి యందుండి చిరంతనానందము లభించును. జీవుడీ సంసారచక్ర పరిభ్రమణము నుండి విముక్తడగును. ఇట్టి యాధ్యాత్మిక పరిజ్ఞానముతో పెనవేసికొనయున్న సంప్రదాయముమనది. పతితయైనను మంగమ్మ సంప్రదాయాచారము చేసినది.
కుమారస్వామి సూటిపోటి మాటలతో మంగమ్మను మరింత బాధించుచుండెడివాడు. ఈతని వక్రోక్తులామెకు హృదయ శల్యములయ్యెడివి. ఆమెపశ్చాత్తాపాగ్నినిట్టి వక్రోక్తులనెడి సమిధలచేత మరింత ప్రజ్వలించునట్లుచేసి మంగమ్మకు పరోక్షముగ నుపకారముచేసినవాడు కుమారస్వామి. కుమారస్వామియెన్నను మంగమ్మ బాధజెందెడిదికాదు. లజ్ఞాభిమానములు వదలిన తరువాతనేమియన్నను మనసుకు కష్టముండదు అని మంగమ్మ పలికెడది. ఆమెపై రాగ్య మేస్థాయికి చెందినదో ఈ మాటలు వెల్లడిచేయుచున్నవి. కుమారస్వామి యనిన మంగమ్మకు పుత్రవాత్సల్యమును పెంచుకొన్నది.
మంగమ్మ తాను రామేశ్వరమునుండి పొందిన ధనమును సద్వినియెగపరచదలచినది. తననాశ్రయించుకొనిన చెంగల్రావునకు ఇల్లు వ్రాసినది.
మంగమ్మ జీవితమంతయు నొకయెత్తుగను కళ్యాణోత్సవసమయముననొకయెత్తుగను గడచినది. పరమభక్తురాలగు గిరిక కళ్యాణమునకై నెంత తల్లడిల్లి మోక్షమార్గము నందినదో పతితురాలైన మంగమ్మకూడ పశ్చాత్తాపముతో స్వామికై యార్తిజెంది ప్రక్షాళిత మనస్కయై పరమానందమను భవించినది.
కర్మ సిద్ధాంతముననుసరించి పాపకృత్యములు చేసిమరల పుణ్యము చేసి నంతమాత్రమున పూర్వము చేసిన పాపమునశింపదు. దేనికదియే యనుభూతము కావలయును. తెలియక పసిపిల్లవాడు నిప్పుముట్టుకొనెను. అదికాలకుండ మానునా ముట్టుకొనిన నిప్పు కాలకమాననట్లే తెలిసి చేసినను తెలియకచేసినను పాపమనుభవించపవలసినదే. పుణ్యమైననింతియే.
తన జీవితభాండమున పేరుకొనిన హాలాహలమును వేరుచేయలేనని మంగమ్మ తెలిసికొన్నది. తనకు గత్యంతరమొక్క భక్తి మార్గమే యని ధర్మారావు నాశ్రయించినది. ధర్మారావుతో నామె తనకొకమహామంత్రముపదేశించుమన్నది. అతడు బీజాక్షర విరహితమైనదియే నీవుపాసింపవలెను అని వాల్మీకి జెప్పినట్లు రామనామమే చెప్పెను. ఆమె దానినినే భద్రముగా జపించుచుండెను.
కోతిని ముద్దుమురిపెముగా పెంచినది . తరువాత అదియెంత కిచకిచలాడినను, దగ్గరకు రానీయక బంధించియుంచినది. అనగా మనసును బంధింపగల్గినదని భావము మొత్తానికి గోతిని బాగుచేసితిరి అని కుమారస్వామి మంగమ్మను మెచ్చుకొనెను. అసాధ్యమును సాధ్యముగా చేసిన స్త్రీ మంగమ్మ. ఆమెయీవిజయమునకు ధర్మారావు యొక్క ఉపన్యాసములు కారణము. కుమారస్వామి హేళనలు కారణము. ధర్మారావు ప్రతిదినమర్థ రాత్రమున నేన ధర్మారావుగారి శిష్యురాలను. మూడవకంటికి తెలియదు ధర్మారావు మాటలను మాలిమిచేత మనఃకపినామె వశీకృతము చేసికొని తుదకు సాధనచేత దాని చాంచల్యమును నిగ్రహింపగల్గినది. ధర్మారావర్ధరాత్రమున గురువనగానామె ధర్మారావు బోధించుటకామె యింటికి వచ్చెడి వాడుకాడు.
మంగమ్మ వాలికిని తనకును న భేదము కల్పించుకొన్నది. కుమారస్వామి తనను విరుపుమాటలనుచుండగా బయట వాలినెవరో బెడ్డలు పెట్టి కొట్టుచున్నట్లున్నది అనినది. కుమారస్వామియేమి అన్నను తనతప్పునే యెత్తిచూపుననుకొన్నది. మంగమ్మ మనస్సు కేవలము తానుచేసినపని నొక కేంద్రముగా జేసికొనియా కేంద్రపరిధి నుండి యామె మనస్సీవలకు రాలేదు. ప్రతిమాటయు తనదుశ్చర్యనే తలపింపగా బాధచెందెడిది. కుమారస్వామి సమిధలు వేయుటలో కడుకుశలుడు. వాలి కెవ్వున కేకపెట్టి వ్యాధిగ్రస్తుడైనట్లుగా మెలికలు తిరిగిపోగా కుమారస్వామి యదియేమని యడిగెను అప్పుడు మంగమ్మ మనస్సు పడుచున్న బాధ యన్నది. మంగమ్మ కడపతి జీతిమునామె చర్యలు వాలి రూపమున విదితమగునట్లు రచయిత వర్ణించిరి. కళ్యాణోత్సవములలో వాలి పార్ధసారధివారి రధకేతనముపై కూర్చొన్నది. అనగా పార్థసారధివెంటనే యున్నట్లును నాదివ్యపాదముల చెంతనే లగ్నము చేసినట్లును గ్రాహ్యము.
కుమారస్వామి భూ ప్రదిక్షిణము చేసి గిరికకు ధారపోయదలపగా మంగమ్మ కూడనట్లే చేసినది. ఇరువురు శక్త్యానుసారము భూ ప్రదక్షిణము చేసి తత్ఫలమును గిరికకు ధారపోసిరి. ఎవరి పాపము, ఎవరి పుణ్యమువారే యనుభవింప వలయునన్నప్పుడే ధారవోయుటలేల ? ప్రతి సత్కార్యమును కృష్ణార్పణముగ భావింపవలయుననుట సిద్ధాంతము. ప్రతి ఫలాపేక్షరహితమైన నిష్కామకర్మ చేయుట. గిరికను మంగమ్మ దైవతుల్యనుగు భావించినదని తెలియుచున్నది. భక్తి మార్గమున భగవంతున కొలుచుటయే గాకభక్తులను పూజించుట యన్నదొకమార్గము. రామానుజాచార్యులు, శంకరాచార్యులు, చైతన్యులు వంటి భక్తులను దైవతుల్యులుగ భావించుట పేర్కొనవచ్చును. మంగమ్మ సాధనవల్ల నట్టి పరిపూర్ణదశకు చేరుకొన్నది. ఆశయన్నది చాలచెడ్డది. దానిని జయించినవారులేదు. నీవొకవిధముగ దానిని జయించితివి. లక్షరూపాయలయాస్తి తృణప్రాయముగా వదలిపెట్టిన నిన్ను మనుష్యురాలి వనుకొననా దేవత మూర్తివను కొననా అని కుమారస్వామి మంగమ్మను పొగిడినాడు ఆస్తిని తృణప్రాయముగనెంచి పంచివైచినది. పుత్రతుల్యుడగు కుమారస్వామికి హెచ్చుభాగమిచ్చి తనకు తర్పణములు చేయమని కోరినది. పాతికవేలు గిరిక సాంవత్సరిక కోత్సవములకు వినియోగింపుమన్నది. పాతికవేలు వేణుగోపాలున కిచ్చినది. సినిమాహాలును పడగొట్టి యచట ధర్మారావు వేదశాల ప్రారంభింపుమన్నది. తాను దుర్మాగ్గయేగాని తన ధనము చెడ్డది కాదని ధర్మకార్యముల కుపయెగపడునట్లు చేసినది. రాధాపతియు చెంగల్రావును గలసి తనను హత్యచేయుటకు ప్రయత్నించుచుండిరని తెలిసియు చలింపలేదు. బ్రతికి ప్రయోజనము లేదని తలచినది. యోగులు ఉచ్ఛ్వాస నిశ్వాసములు నిలిపి ప్రాణము వృద్దిచేసుకొందురు. తక్కినవారి ప్రాణములు తీసికొందురు అని తలచి ప్రాణములను బిగపట్టినది. ఆసమయముననే చెంగల్రావు గుండెలపై కూర్చొని కత్తితో పొడిచెను. ఆమె జీవితమిట్లంతమయినది. ఆమెకు చివరిక్షణములలో వేణుగోపాలుడును, గిరికయను కనులకు గట్టినట్లు కానుపించిరి. దైవదర్శనముతో నామె జీవితము ధన్యమైనట్లే కాని వ్యర్థమైనట్లుకాదు.
మంగమ్మ పతితమయ్యు సన్మార్గమున నడిచి ధన్యజీవియైనది. ఆమెచేసిన పాపమునకామె చెంగల్రావుచే కత్తితో పొడువలబడినది.
జీవితములో వ్యక్తి పశ్చాత్తాప్తుడైనచో నెట్టివానకైన సన్మార్గమున నడచుటకవకాశమున్నది. చెడిపోతిని గదాయని జీవితమును మరింత దుష్టభూయిష్టముగ జేసికొనక పైకి వచ్చుటకు చేసిన ప్రయత్న మెన్నడును వృధాకాదని మంగమ్మ జీవితము తెలియకజేయుచున్నది.
|