వసుంధర
స్వర్గానికి నిచ్చెనలు నవలలోని ప్రధాన స్త్రీ పాత్ర వసుంధర. వసుంధరకు బాల్యముననే వివాహమైనది. కాని యుక్త వయసురాకమునుపే నామె భర్త మరిణించెను. భర్త మరణించిన తరువాత కొన్ని సంవత్సరములు వైధవ్యమనుభవించిన తరువాత హేతువాద కుశలుడైన అన్నగారి ప్రోద్భలము వలన ఉమాకాంతుడను నొక యప్రయోజకుని రెండవ వివాహమాడినది. ఇంతలో నామె ప్రధమ భర్త పిశాచమై వచ్చి కొంత యింద్రజాలమును ప్రదర్శించెను. రెండవ భర్త వసుంధరకు తానక్కరలేదని భావించి వెడలిపోయెను. పిశాచము యొక్క మాయలో పడిన వసుంధర యోగినివలె నభినయించుచు ధనమును గడించుచు చిన్నచిన్న వ్యాధులను నిర్మూలించుచు ప్రజలకు దేవేరియైనది. ఆమెకు హరిజన బాలికయైన శశి సహాయకురాలైనది. కొంతకాలమున కొక యోగి మంత్రోపదేశ ఫలితముగ శశినిజమైన యోగినియైనది. వసుంధర పరిస్థితిని వామ దేవుడన్న నైం్రదజాలికుడు వచ్చి భర్తృపిశాచమును వెళ్ళగొట్టి మరింత జటిలమును చేసెను. కళాధరరావను లౌకికుడు వసుంధరపై నత్యాచారము చేయుటకు సంసిధ్ధుడై యుండెను. వామదేవుని వామాచార విధానముతో నాయూరిలో నెట్లు మేఘములను క్రమ్మించెనో అట్లే కాలవశమున మేఘములు చెదరిపోగా వసుంధర వామదేవుని బారినుండి రక్షింపబడి పశుపతి శాస్త్రియొక్క వీణావాదనములో దుఃఖసముద్రమున కొట్లాడి యావలనున్న యానందసీమను చేరుకొనగల్గినది. ఇది క్లుప్తముగ వసుంధర చరిత్ర. వసుంధర ఏయే తావుల నెట్లు ప్రవర్తించినదో విమర్శించినచో నామె వ్యక్తిత్వము వ్యక్తమగును.
వసుంధర పూర్వికులు పూర్వాచార పరాయణులు. సనాతనమైన ఆచార వ్యవహారములు క్రమక్రమముగ మారిపోయి వసుంధర నాటికాయింట మతాంతర వివాహములు విధవావివాహములు జరుగునంతవరకు వచ్చినది. ఆమె సోదరుడు భూషణము క్రైస్తవ మతస్థురాలిని వివాహమాడగా రెండవయన్న గోపాలము మళయాళ బ్రాహ్మణస్త్రీని వివాహమాడెను. ఉమాకాంతుడన్న సంఘసంస్కార ప్రియునితో ద్వితీయోద్వాహము నామె యన్నగారు జరిపించెను.
వివాహమైన తరువాత వసుంధర పక్షము దినములైనను భర్తతో సుఖించలేనదిలేదు. ఆమె ఏదో అవ్యక్తమైన భావములతో ననుభవములతో సతమతము కాసాగినది. ఎవరో తన గుండెలపై కూర్చుండినట్లును, ఏదియో మాట్లాడినట్లును వసుంధర యనుభూతినందినది. వసుంధర యనుభూతినందుట మాత్రమేగాక యామె యెవరికో అదృశ్యవ్యక్తికి చెప్పిన సమాధానములు ఉమాకాంతుడు కూడా విలగలిగెను. ఒకనాటి సాయంత్రము వసుంధర తన వదినతో కలిసి వ్యాహ్యాళికి వెళ్ళగా నచ్చట నీటిపాయ కవతలియొడ్డున ఒక తెల్లని, మెడపొడవుగల పక్షిని చూచి కళవెళపడినది. ఆ పక్షియాకృతిలో నామె కేదో తెలిసి తెలియని భావము కదలాడినది. ఆయా కృతిని చూడగనే తానెవనితోడనో మాటలాడుట యుమాకాంతుడు చెప్పినది గుర్తునకు వచ్చినది.
వసుంధర మిక్కిలి సౌమ్యురాలు. ఎవ్వరినీ చీదరించుకొన్నట్లుగ గాని కోపగించుకొన్నట్లుగ గాని మాటాడి యెరుగదు. శాంతమూర్తి అమాయకురాలు. ఇట్టి కన్య విధవయై ఇంటిలో తిరుగాడు చుండుట నామె యన్నగారు చూచి నహింపలేక మరల వివాహము చేసెను. వివాహము జరిగిన పది పదిహేను దినములకే విచిత్రమైన యనుభూతులకు లోనై భీతి చెందినది. వసుంధర మాటలాడునది ఆమె మొదటి భర్తతో అతడు పిశాచమైనాడు. ఆ భర్తృ పిశాచమునకు వసుంధర పురర్వివాహము చేసికొనుట కిష్టములేదు. ఆమె ధర్మపథము నుండి తప్పిపోవుచున్నదని యతని వాదన. వసుంధర అతనిని పదమూడు నాళ్ళ క్రింద నేల రాలేదని ప్రశ్నించినది. మరల వివాహము చేసికొనుటలో వసుంధర ధర్మబాహ్యురాలైనచో నది యెట్లును జరిగిపోయినది. జరిగిన వివాహు ఫలవంతము కానీయకుండ వసుంధర భర్తృ పిశాచముచేసిన పని ఫలించినది. ఉమాకాంతుడు వెడలి పోయినాడు. వసుంధర అటు సంప్రదాయమునకు ఇటు శరీర సౌఖ్యమునకును చెడినది.
పిశాచము ఆమె బ్రతికి ప్రయోజనము లేదనెను. ఆమెకొరకు తానెదురు చూచు చుంటిననెను. భార్యా భర్తలలో నొకరు ముందు చనిపోయినచో రెండవ వారికొరకు మొదటివారు ఎదురు చూచెదరనెను. తాను పిశాచము కావున నామెను పిశాచమును చేయవలెనన్నది అతని యూహవలెనున్నది. ఆమె నీ వలన నేను భ్రష్టురాలనైతినన్నది. వసుంధర మనస్సు నా పిశాచము వశము చేసికొన్నది. రెండవ వివాహము చేసికొనుటలోగాని, భ్రష్టురాలగుటలో కాని పిశాచగ్రస్తయగటలో గాని వసుంధర బాధ్యతలేదు. భర్తృ పిశారమును నెంత భీత్కిరించు కొనినను నది యామెకు వదలలేదు. దయ్యమైన భర్తకు వసుంధర రెండవ భర్తతో సుఖింపరాదను భావము మొదటిది. రెండవది ధనసంపాదన ! ప్రజలలో భక్తి భావమును పెంపొందింపవలెనన్న నద్భుద్ధి రేఖా మాత్రముగ నుండెనేమోగాని యది పిశాచోద్ధత పదఘట్టనముల క్రింద నలిగిపోయినది.
ిశాచియైన నీ వసుంధర ప్రథమభర్తపై పాఠకులకు సానుభూతి కలుగనేరదు. ఎందుచేతననగా అతని చేష్టలలో వసుంధరపై మాత్సర్యము దక్క ప్రేమ కనుపించదు. ప్రేమ కలుగుట కతడు పెద్దగా జివించినదియులేదు. అతడు చిన్నయవసుననే యెవనినో చేతబడిచేసి చంపెనని వాదమున్నది. కావున నతనిలో దుర్లక్షణములు పిశాచము కాక ముందు కూడా నుండగా, నయిన తరువాత మరింత క్రూరత నాపాదించుకొన్నవి. ఈ క్రూరతయే వసుంధర యొక్క జీవితమును నిర్థాక్షిణ్యముగ నలిపివచేయుటకు మూలకారణమైనది.
పిశాచము యొక్క బలిమిచేత మాత్రమే గాక వసుంధర యతని పట్టునుండి విడవడలేకపోవుటకు కారణముగ నామె యమామకత్వమును కూడ పేర్కొన వలసి యుండును. పది దినములామెను గదిలో బంధించి యా దయ్యము చదువు చెప్పినది. పిశాచమేమి చెప్పినదో వసుంధర యేమి నేర్చినదో దానివల్ల నామె కొరిగినదేమియునులేదు. అతడామెచేత స్వర్గానికి నిచ్చెనలను కట్టింతునన్నాడు. ఈ నిచ్చెనలు ధనవిషయముననే గాని యధ్యాత్మ విషయములలో కానరావు. పిశాచము చిన్న చిన్న మాయలు చేసిపూలవాసనలు వెదజల్లుట, చిన్న చిన్న వ్యాధులను నెమ్మదింపజేయుట మొదలైనవి చేసి ప్రజలలో వసుంధర యొక దేవతగ నమ్మునట్లు చేసెను. వసుంధర యన్నగారల మనస్సు నావేశించి వారికి కాని యూహలు వారిచే నూహింపజేసి వారిని భయముతో వశము చేసికొనెను. మరల వసుంధర వదినగారైన మేరియాపై పిశాచ ప్రభావమేమియును పడలేదు. హిందూమతస్థులు కాని వారి జోలికి పిశాచము పోదు. కాబోలు. వసుంధర వికృతముగ నవ్వగా నామె పద్దెన్న భూషణమునకు భయము వేసినది. అ భయముయొక్క పూర్వ పరములు స్థితి హేతువులు జనక స్థానములు మొదలైన వానిని గూర్చి కూలంకషముగా యోచింప మొదలిడెను. ఈ భయము వెలినున్న యీ ద్రవ్యములు గలిగించినదిలేదు. ఇది యాంతరమైనది. అచ్చముగా నాంతరమైనదికాదు. అనవ్వులోనున్న ఒక విపరీతపు సవ్వడి ఈ వెలినున్న సర్వద్రవ్యమలు యందు వ్యాపించి తన యాత్మకటాహమును తాడించెను. ఈ వెలినున్న ద్రవ్యములు కూడ భయపడినవా భూషణము తాను అంతరములైన పరిస్థితులను గూర్చి యెన్నడను విచారించినది లేదు. ఈ విచారణయంతయు తానే చేయుచుండెనా లేక ఎవరైనా తనచేత చేయించుచుండిరా అని భావించిన భూషణము తన భావము లను గూర్చి మలర భయపడెను.
భూషణము, మేరియా సింగరవేలును నదీతీరమునకు వాహ్యాళికి వెళ్ళిరి. అచట నదిలో మూడవ నీటి పెర యావలి యొడ్డున లీలగా నెదో పక్షివంటిదానిని భూషణమునకు మేరియా చూపించెను. భూషణముకూడ మేరియావలెనే నివ్వెరపోయెను. మొదట నా పక్షిని జూచి వసుంధర యెట్టి స్థితో నుండెనో భూషణ మాస్థితిలో నుండెను. ఇద్దరు నెదో భయపడినట్లు ఇద్దరు నెదో తాము పూర్వమెరిగియున్న యొక విషయమును మననము జేయుచున్నట్లు కన్పించిరి. భూషణము యొక్క వసుంధర యొక్కయు మనః ప్రవృత్తు లొక్క రకముగ నుండుట యిట విదితము. ఇరువురును శాంతస్వభావులు. ఇరువురును మితభాషులు. ఇరువురును పరులను నొప్పించుటకు చెరచుచుందురు. కావుననే యిరువురి హృదయములపై నొక్కక్క రకముగ నా పిశాచము కూర్చుండగల్గినది. వసుంధర యొక్క జీవితమును నాశనమొనర్చినట్లే భూషణము కూడ నిటు సుఖజీవనమునకు నటు ధనమునకు దూరడై పిశాచప్రభావమున నిస్సారమైన జీవితమును గడిపెను. భూషణము యొక్క సంఘసేవ సమాజ సంస్కరణాభిలాష, హేతువాదము, ఇవి యన్నియు పిశాచాగమనముతో మంటగలిసినది.
భూషణము యొక్క గృహము దేవాలయముగను, ఆ యూరొక శ్రీశైలముగనో వారణాసిగనో మారనున్నవనియు నా దేవళమునకు వసుంధరయే దేవత యనియు వసుంధరా ముఖమున పిశాచము పలికినది. ఆ దేవాలయము కొరకు గాను భూషణము యొక్క యాస్తి యంతయు వినయోగ పరచవలెననెను. అది యొక దేవాలయము. నేనిచట పూజారిణిని. భూషణముయొక్క యాస్తి యంతయు నీ మహా కార్యమునకు వినయోగ పడవలయును. దీని వలన వేలాది జనులు దుఃఖములు పోగొట్టుకొందరు. ఇది యొక వారణాసియో శ్రీశైలమో యగును. స్వర్గానికి నిచ్చెనలెత్తుట, యనగా నేమియో నీ వాక్యము తెలియజేయుచున్నది. అచగి ప్రజలకు వసుంధర వలన దుఃఖములుండవు. రోగములుండవు. అంతయు నానందమే. అన్నియు సుఖములే. పుణ్యము కొరకు శ్రీశైలాది యాత్రలు చేయనవసరము లేదు. ఆ యూరే శ్రీశైలము. పుణ్యము చేయునది స్వర్గము కొరకు. కాని యా స్వర్గము ఆకాశములో నున్నచో నిచ్చెలవసరమగును. అద్దానికి క్రిందికి తెచ్చి ప్రజలకరచేతనే స్వర్గము చూపెట్టగల ప్రయత్నము వసుంధర యొక్క భర్తృ పిశాచము చేయు దలపెట్టెను. ఇదియే వంచన. వసుంధర భర్త కట్టి శక్తిలేదు. అతడు పుణ్యశాలి గాకపోవుట చేతగాని, వసుంధరపై ప్రేమ చేతగాని బంధ విముక్తుడ కాలేదు. ఆమె సుఖించుటకు వీలులేకుండ తనకులేని శక్తులను ఆమెకంటగట్టి యమాయకురాలైన వసుంధరను ప్రజల మధ్య కీచ్చుకొని వచ్చెను. పిశాచము కన్న నీచుడైన వామదేవుడను కూహనాయోగి వసుంధరకు మరిన్ని యిడుములను తెచ్చి పెట్టెను. వంచనా శిల్పమున వీరిరువురునొకరిని మించిన వారొకరు.
వసుంధర యోగినిగ రూపాంతరము చెందిన తరువాత ఊరిలోనున్న స్త్రీలామెను చూచుటకు దేవాలయమునకు వచ్చినట్లు వచ్చిరి. వారులోనికి వచ్చుట కాలోచించు చుండగా హరిజన బాలికయైన శశి బయటికి వచ్చిన వారి నాహ్వానించినది. వారి రాక కెదురు చూచుచుంటిమని పలికినది. వారందరును కూర్చుండగా గదిలో నొకసారి సంపెంగ తావును, మరియొకసారి కేతకీ పరిమళ సుగంధ వాయువును మొగము మొత్తునంత మిక్కుటముగా వీచినది. అగరు ధూపముల తావితో గదియంతయు నిండిపోయినది. ఎచ్చటను అగరువత్తులు వెలిగింపబడకుండుట చూచిన ముత్తైదువులాశ్చర్యపోయిరి. మి కెప్పుడుతీరికైననప్పుడు వచ్చుచుండును. మీకేవైనగోరికలు కలవేని వత్రమో ఫలమో తెచ్చి యమ్మగారి పాదములయందుంచి ప్రాణాచారము పడి మీ మనసులో నున్న కోరికను గట్టిగా ధ్యానించినచో దేవీ ప్రసాదము మీకు లభించును. అని శశి ముత్తైదువులతో చెప్పినది. అనగా ధన సంపాదనమునకు ప్రథమ సోపానమిట్లు వేయబడినది. స్వర్గమనగా ధర సంపాదనమేయని యా పిశాచము భావించినచో నా స్వర్గమునకు కూడా నిదియే మొదటి మెట్టనవలయును. దేవీదయకు పాత్రులుగావలెనన్న తృణమో పణమో యీయవలెనన్న సూచన చేయుటయే గాక దేనిని నిదారణ చేయవద్దని శశి యనినది. నిరాదరణ చేయుటవలన నాపత్తికలుగునని ప్రజలలో బెదురు పెట్టినది. వసుంధర దేవతాత్వమును గూర్చి యెవ్వరును ప్రశించపరాదు. విమర్శించరాదు అని సూచించినది. ప్రజలను భయభ్రాంతులలో పెట్టి దేవతాత్వమును నిలుపు కొనవలెనన్న యోచలోని సైధ్ధాంతిక లోపయే వారి యోటమికి ముఖ్యకారణము.
|